![Two Arrested For Caging Parrots And Predicting Election Victories - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/10/parrotpedictions.jpg.webp?itok=Gxsv_Oww)
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది.
కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు.
దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.
ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment