సూరత్ : ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని వార్డ్‌నెంబర్ 30లో బీజేపీ మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.
అయితే, ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తన నివాసంలో దీపికా పటేల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్, కుటుంబసభ్యులు బాధితురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీపికా పటేల్ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
దీపికా పటేల్ మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న దీపికా పటేలా్ బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కాగా, దీపికా పటేల్ భర్త వ్యవసాయం చేస్తుండగా ఆమెకు ముగ్గురు పిల్లలు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment