అహ్మదాబాద్ : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఈ వీడియోనే నిదర్శనం అంటూ నెటిజన్లు ఓ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఝగాడియాలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్ కేంద్రంగా పని చేస్తున్న థెర్మాక్స్ గ్లోబల్ అనే సంస్థ అంక్లేశ్వర్‌లోని ఓ హోటల్‌లో 10 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూకి 1,800 మంది రావడం, వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హోటల్ రెయిలింగ్ ఊడిపోయి పలువురు కింద పడిపోయారు.
नरेंद्र मोदी का गुजरात मॉडल
गुजरात के भरूच में एक होटल की नौकरी के लिए बेरोजगारों की भारी भीड़ जुट गई.
हालात ऐसे बने कि होटल की रेलिंग टूट गई और गुजरात मॉडल की पोल खुल गई.
नरेंद्र मोदी इसी बेरोजगारी के मॉडल को पूरे देश पर थोप रहे हैं. pic.twitter.com/1GPXkqeMsk— Congress (@INCIndia) July 11, 2024
ఆ దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో..బీజేపీ పాలిత గుజరాత్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో చూడండి అంటూ కాంగ్రెస్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇదేనా గుజరాత్ మోడల్ అంటూ ప్రశ్నించింది.గుజరాత్ నిరుద్యోగాన్ని మోదీ దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని ఎద్దేవా చేసింది. దీంతో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెడుతూ గుజరాత్ బీజేపీ యూనిట్ స్పందించింది. ఈ కంపెనీలో జరిగే ఇంటర్వ్యూలో అనుభవం ఉన్నవారికే. కాబట్టి అక్కడి వచ్చిన వారంతా నిరుద్యోగులు కాదని ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చింది.
📽️ Watch | Railing Collapses As 1,800 Aspirants Turn Up For 10 Jobs In Gujarat https://t.co/Vy4eJUjq2b pic.twitter.com/87fdRurayS
— NDTV (@ndtv) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment