ముంబై: ఎన్సీపీ నేత,మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిఖీ హత్యకేసులో మరో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సిద‍్ధిఖీ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలో హత్య కేసులో నిందితులు రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్, కర్జాత్‌లలో ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నేరానికి సంబంధించిన కుట్ర, దాని అమలుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు అధికారి తెలిపారు.
అరెస్టయిన వ్యక్తులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా టచ్‌లో ఉన్నారని అన్నారు. కాగా, ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారని, తదుపరి విచారణ జరుగుతోంది’ అని అన్నారు.
కార్యాలయంలో ఉండగా కాల్పుల కలకలం
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబై బాంద్రాలో తన తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగా..ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment