crime branch police
-
బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ముంబై: ఎన్సీపీ నేత,మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిఖీ హత్యకేసులో మరో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిఖీ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలో హత్య కేసులో నిందితులు రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్, కర్జాత్లలో ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నేరానికి సంబంధించిన కుట్ర, దాని అమలుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు అధికారి తెలిపారు.అరెస్టయిన వ్యక్తులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా టచ్‌లో ఉన్నారని అన్నారు. కాగా, ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారని, తదుపరి విచారణ జరుగుతోంది’ అని అన్నారు.కార్యాలయంలో ఉండగా కాల్పుల కలకలంఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబై బాంద్రాలో తన తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగా..ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. -
పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్‌గా అవతారం ఎత్తి..
సాక్షి, గోవా: గత 15 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతన్న హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో పుర్బా మేదినీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఏప్రిల్ 23, 2005న గోవాలోని కరంజాలెం వద్ద అల్టినో నివాసి గాడ్విన్ డీఎస్‌లీవా అనే వ్యక్తిని రుడాల్ గోమ్స్, జాక్సన్ డాడెల్ అనే వ్యక్తులు హత్య చేశారు. అనంతరం వారిని పనాజీ పోలీసులు అరెస్టు చేసి సెషన్స్ కోర్టు ముందు హాజరుపర్చగా...కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఐతే ఆ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడక మునుపే జ్యుడిషియల్ కస్టడీ ఉన్న మిగతా 12 మంది ఇతర నిందితులతో కలిసి జైలు గేటును తెరిచి గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఐతే అప్పటి నుంచి ఆ నిందితుల్లో జాక్సన్ డాడెల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఐతే అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు బృందానికి కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ జాక్సన్ డాడెల్ ఉన్నట్లు సమాచారం అందింది. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా పట్టణంలోని ఓ హోటల్లో ఆఫీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఐతే నిందితుడు పేరు మార్చుకుని, తాను జైలు నుంచి తప్పించుకున్న తేదీనే పుట్టినరోజు తేదీగా మార్చకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ సూరజ్ నేతృత్వంలోని గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మార్గోవ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. (చదవండి: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలి: శ్రద్ధా తండ్రి) -
తీస్తా, శ్రీకుమార్లకూ రిమాండ్
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై అరెస్టయిన తీస్తా సీతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం వీరిద్దరి పోలీస్ కస్టడీ ముగియడంతో అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ పటేల్ ఎదుట హాజరుపరిచారు. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్ కేసులో బనస్కాంత్ జిల్లా పలన్‌పూర్ జైలులో జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకుమార్‌ను అహ్మదాబాద్‌కు తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. టీవీ నటి సహా ఇద్దరు మహిళలను..
పనాజీ: మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. కాగా, పోలీసుల దాడుల్లో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కావడం గమనార్హం. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంలో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో టీవీ నటితో సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. కాగా టీవీ నటి, మరో మహిళ ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన వారు కాగా.. మూడో మహిళను హైదరాబాద్‌కు చెందినట్టు నిర్ధారించారు. అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో భాగంగా హఫీజ్ సయ్యద్ బిలాల్.. సదరు మహిళలకు బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపినట్టు తెలిపారు. కాగా , వీరికి రూ. 50వేలు చెల్లించడానికి కస్టమర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడు వారిని గురువారం అక్కడికి తీసుకువచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. -
కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి! తుప్పల్లో మృతదేహం..
గరుగుబిల్లి (విజయనగరం) / ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): గత ఏడాది డిసెంబర్ 30న అదృశ్యమైన కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసనాయుడు విగతజీవిగా శనివారం కనిపించాడు. స్థానిక ఎస్ఐ ఎం.రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం... 2009 బ్యాచ్‌కు చెందిన డోకుల శ్రీనివాసనాయుడు(38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్న శ్రీనివాసనాయుడు గత నెల 30న స్వగ్రామం గరుగుబిల్లి మండలంలోని నందివానివలసకు వచ్చాడు. అక్కడి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం సమీపంలోని జోగిరాజుపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పెదమేరంగి జంక్షన్ నుంచి నందివానివలసలోని తన ఇంటికి వెళ్లకుండా అత్యవసర పని ఉందని తల్లి సింహాచలమమ్మకు చెప్పి రాత్రి 9.15 గంటలకు మోటారు సైకిల్‌పై వెళ్లిపోయాడు. తరువాత ఖడ్గవలస, ఉల్లిభద్ర జంక్షన్ వరకు వెళ్లినట్టు ఫోన్ సిగ్నల్స్ లభించాయి. తరువాత శ్రీనివాసనాయుడు ఆచూకీ లభించలేదు. దీనిపై డిసెంబర్ 31న కానిస్టేబుల్ తండ్రి సింహాచలంనాయుడు గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడు బృందాలు కానిస్టేబుల్ ఆచూకీ కోసం గాలించాయి. చివరకు శనివారం మధ్యాహ్నం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో తుప్పల్లో శ్రీనివాసనాయుడి మృతదేహం లభ్యమైంది. అక్కడే మోటారుసైకిల్ కూడా పడి ఉంది. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే కారణమా! శ్రీనివాసనాయుడు కానిస్టేబుల్‌గా పని చేస్తూ విశాఖ, నందివానివలసలో వ్యాపారాలు చేస్తున్నాడు. మృతునికి భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులు సింహాచలం, సింహాచలంనాయుడు ఉన్నారు. మోటారుసైకిల్‌పై వచ్చినపుడు అతివేగంతో సెల్ఫ్ యాక్సిడెంట్‌కు గురై చనిపోయాడా..? లేక వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతుని సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో పది రోజుల్లో మెడికల్ లీవ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరాల్సి ఉండగా ఇలా విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదవండి: Nellore: నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం.. -
లఖింపూర్ ఘటన: క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌కు అశిష్ మిశ్రా
లక్నో: లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది. చదవండి: (నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) -
తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నేరాలకు కేరాఫ్ అవుతోంది. అక్కడ ఓ ప్రదేశంలో రోడ్డు పక్కన మూత్రవిసర్జనకు వెళ్లిన ఓ పెద్దాయనకు యువతి చెయ్యి కనిపించింది. అయితే తను దానిని బొమ్మ చెయ్యి అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ చెయ్యి చుట్టూ ఈగలు ముసురుతూ నిజమైన చెయ్యి లాగే అనిపించింది. దాంతోపాటు దుర్వాసన కూడా రాసాగింది. ఇక దాంతో ఆ పెద్దాయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల గాలించగా కాళ్లు, చేతులు, మొండం, గుర్తు పట్టడానికి వీలుగా లేని ఓ యువతి ముఖం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నిందితుని పేరు సందకుమార్, పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను జాబ్ చేస్తున్న ఫ్యాక్టరీలో రెండేళ్ల కిందట బీహార్‌కి చెందిన ఓ యువతిని పేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆ యువతిని లొంగతీసుకున్నాడు. సందకుమార్ తనకు పెళ్లైన విషయం దాచిపెట్టాడు. ఆమెతో తరచూ శారీరక సంబంధం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోకుండా వాయిదా వెయ్యసాగాడు. అయితే ఓ రోజు ఆ యువతి గట్టిగా నిలదీసి అడగితే టైమ్ పడుతుంది అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. ఇక దాంతో తనను పెళ్లి చేసుకోకపోతే అతడిపై అత్యాచారం కేసు పెడతానని యువతి బెదిరించింది. ఈ నేపథ్యంలో అతను ఆ యువతిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.తన ప్లాన్ ప్రకారం సూరత్ రైల్వే స్టేషన్లో ఆ యువతిని రైలు ఎక్కించి ఆమెను నందర్బార్ అనే ఏరియాలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి అన్ని దిక్కులకూ విసిరేశాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఓ బండరాయితో గట్టిగా మోదాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం.. హత్య జరిగిన చుట్టుపక్కల సీసీ కెమెరాలు సీసీ కెమెరాల్ని పరిశీలించారు. యువతి, ఆమె పక్కన ఓ మధ్య వయస్కుడు వెళ్తున్నట్లు కనిపించినట్టు గుర్తించారు. దాంతో అతనే ఆమెను చంపి ఉండొచ్చు అని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అతను ఎవరో తెలుసుకునే క్రమంలో సూరత్ పోలీసులు ఓ టెక్నికల్ పర్సన్ సాయంతో యువతి పక్కన వెళ్తున్న వ్యక్తి మొబైల్ నంబర్ ట్రేస్ చేశారు. దాదాపు 15 రకాల మొబైల్ నంబర్లు ఆ ఏరియాల్లో అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. అయితే అందులో ఒక నంబర్ మాత్రం మూడు ప్రదేశాల్లో కనిపించింది. దాంతో ఆ నంబర్ గల వ్యక్తే ఆమె పక్కన ఉన్న వ్యక్తి అంటూ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తమ శైలిలో విచారణ చేయగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వాహన యజమాని థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదమరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్ఐఏ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందులో 5లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను సీజ్ చేసింది. వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న ఈ బెంజ్‌కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం లైసెన్స్ ప్లేట్‌ను కూడా సీజ్ చేయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సచిన్‌వాజేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్‌టాప్‌లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అలాగే సీసీటీవీలో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది. చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్‌తోనే పీపీఈ కిట్ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్ కారు అసలు యజమాని ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నామని ఎన్ఐఏ అధికారి అనిల్ శుక్లా తెలిపారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం) కాగా ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. తన స్కార్పియో కనిపించడం లేదంటూ మన్సుఖ్ హిరేన్ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్ శవమై తేలాడు. దీంతో హిరేన్ భార్య విమల సచిన్వాజేపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శివసేన ప్రభుత్వం వాజేను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాజేపై మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే. -
కానిస్టేబుల్ అదృశ్యం: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిస్సింగ్ కేసును ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మే 26 నుంచి కానిస్టేబుల్ వెంకట్రావు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సెలవు మంజూరు కోసం వెంకట్రావు ఢిల్లీ ధౌలాకువాలోని ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కానిస్టేబుల్ కనిపించకుండా పోవడంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేశారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) కాగా వెంకట్రావు అదృశ్యం వెనుక సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్‌కుమార్ హస్తం ఉందటూ ఆరోపణలు వస్తున్నాయి. వెంకట్రావు సెలవు కోరడంపై సంజీవ్‌కుమార్‌తో తరచుగా గొడవలు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్ఎఫ్, ఉస్మాన్‌పూర్ పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కానిస్టేబుల్ అదృశ్యంపై సమగ్ర, పారదర్శకత విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు హైకోర్టు కేసును అప్పగించింది. -
దోపిడీ ముఠా హల్చల్; పోలీసులు చెక్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠా ఆగడాలను పోలీసులు అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి బస్టాప్‌లో నిలిచిన ఇద్దరు యువతులను ఆటోలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విశాఖ నగరానికి చెందిన మైచర్ల గణేష్, నాగమల్లి ఎల్లాజీ, తాళ్లూరి కుమార్, కొమ్మనాడ పల్లిరాజుతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి దోపిడీ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం గాజువాకలో రోడ్డు పక్క ఆగివున్న ఆటో డ్రైవర్‌ను కొట్టి ఆటోను హైజాక్ చేసారు. (పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య) కూర్మన్నపాలెం వెళ్లే మార్గంలో శనివాడ వద్ద బస్సు దిగి మరో వాహనం కోసం వేచి ఉన్న దేవరపల్లికి చెందిన ఇద్దరు యువతులను బలవంతంగా ఆటో ఎక్కించి,. వారి వద్ద నాలుగు వేల నగదును దోచుకున్నారు. ఆపై ఆటోను ఆపకుండా వెళ్ళిపోతుండగా ఇద్దరు యువకులు ఆటో నుంచి దూకేశారు. ఈ విషయం రాత్రి బీట్ పోలీసులకు తెలియజేయడంతో అర్ధరాత్రి నిందితులను స్టీల్ ప్లాంట్ వద్ద పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆటోను వదిలి పరారయ్యారు. అనంతరం ఈ ఆరుగురిని తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలోనే ఈ రకమైన దారి దోపిడీలకు పాల్పడిన నిందితుల పై నిఘా కూడా కొనసాగిస్తామని క్రైమ్ బ్రాంచ్ డిసిపి సురేష్‌బాబు తెలిపారు. (ప్రియుడి మోజులో భర్త హత్య) . -
తెలిసిందే చెప్పా: కమల్ హాసన్
ఇండియన్–2 షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం నేపథ్యంలో ఆ చిత్ర హీరో కమల్‌హాసన్ మంగళవారం పోలీస్ ముందు హాజరయ్యారు. వాస్తవాలను పోలీసులకు చెప్ప డం నాధర్మం.. అదే చేశానని కమల్ మీడియాతో అన్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్ గత నెల 19న రాత్రి చెన్నై పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా భారీ క్రేన్ కుప్పకూలి అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ సహా ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నజరత్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్–2 చిత్రం కోసం ఈవీపీ స్టూడియోలో భారీసెట్ వేసే పనులు సాగుతుండగా ఇందుకు పోలీస్ నుంచి అనుమతి పొందలేదని విచారణలో బయటపడింది. చెన్నై నగర కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ కేసు నజరత్‌పేట పోలీసుల నుంచి క్రైం బ్రాంచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. సెంట్రల్ క్రైం బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి గత నెల 23వ తేదీన విచారణ ప్రారంభించారు. అనుమతి లేకుండా భారీ సెట్ నిర్మాణానికి సిద్ధమైన నిర్వాహకులను, క్రేన్‌ను బాడుగలకు ఇచ్చిన యాజమాన్యం, ఆపరేటర్ తదితర ఆరుగురిని విచారించారు. వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం చిత్ర దర్శకుడు శంకర్‌కు సమన్లు పంపారు. ఈ సమన్లు అనుసరించి గత నెల 27వ తేదీన హాజరైన శంకర్‌ను సుమారు ఒకటిన్నర గంటకు పైగా విచారించారు.(కమల్, శంకర్, కాజల్ విచారణకు హాజరు కావాలంటూ..!) ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత నిర్మాతలదేనని కమల్ చెబుతుండగా, శంకర్, కమల్లదే బాధ్యతని నిర్మాతలు వాదిస్తున్నారు. ఇలా ఇరువర్గాలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్న తరుణంలో విచారణకు హాజరుకావాల్సిందిగా గతనెల 29వ తేదీన క్రైంబ్రాంచ్ పోలీసులు కమల్‌హాసన్‌కు సమన్లు పంపారు. సమన్లు అందుకున్న కమల్ మంగళవారం ఉదయం 10 గంటలకు చెన్నై ఎగ్గూరులోని సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసు కార్యాలయానికి వచ్చారు. విచారణాధికారైన అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి ముందు హాజరైనారు. చిత్రం కోసం భారీసెట్‌ను వేయాలని ఆదేశించింది ఎవరు, ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు, పరిశ్రమల్లో వినియోగించే భారీ క్రేన్‌ను అనుమతి లేకుండా ఎందుకు తెచ్చారు, ప్రమాదం జరిగినపుడు మీరు ఎక్కడున్నారు, ప్రమాదాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా, ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటి..? వంటి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు కమల్ ఇచ్చిన సమాధానాన్ని వీడియో ద్వారా వాంగ్మూలంగా నమోదు చేశారు. విచారణ సమయంలో కమల్‌తోపాటు అతడి న్యాయవాది కూడా రావచ్చని పోలీస్‌శాఖ అనుమతి ఇచ్చింది. అన్ని విషయాలూ తానే చెప్పగలనని న్యాయవాదిని కమల్ నిరాకరిస్తూ ఒంటరిగానే లోనికి వెళ్లారు. సుమారు 2.30 గంటలకు పైగా కమల్‌ను పోలీసులు విచారించారు. (రూ. కోటి ప్రకటించిన కమల్ హాసన్) వాస్తవాలు చెప్పడం నా ధర్మం: కమల్‌హాసన్ విచారణ ముగించకుని బయటకు వచ్చిన కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు నన్ను పిలిపించారు. ప్రమాదం సమయంలో ఎలాంటి గాయాలకు గురికాకుండా బైటపడినవారిలో నేనూ ఒకడిని. అందుకే ప్రమాదం గురించి తెలిసిన విషయాలు చెప్పడం నా ధర్మం. అన్ని విషయాలు చెప్పాను. ఇకపై ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాను. ఇవి రాజకీయ వేధింపులే : కమల్ అభిమానులు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకే అన్నాడీఎంకే ప్రభుత్వం కమల్ ను వేధింపులకు గురిచేస్తోందని కమల్ అభిమానులు ఆందోళనకు దిగారు. కమల్ రాక ముందే పెద్ద సంఖ్యలో చెన్నై ఎగ్మూరులోని పోలీస్ స్టేషన్‌కు కమల్ అభిమానులు, మక్కల్ నీదిమయ్యం నేతలు చేరుకున్నారు. కమల్ రాగానే తోపులాట చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అనేక తమిళ సినిమా షూటింగుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఆనాడు ఎవ్వరినీ ఇలా పోలీస్ స్టేషన్‌కు పిలిపించలేదని వారు విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన లైకా ప్రొడక్సన్స్ అధినేతలు, ఇతర నిర్మాతలను విచారణకు పిలవకుండా కమల్, శంకర్‌ను మాత్రమే పిలవడం వెనుక రాజకీయ కక్షసాధింపు ధోరణి ఉందని ఆరోపించారు -
హనీట్రాప్: ఎమ్మెల్యేలు, మాజీల రహస్య వీడియోలు
ఎమ్మెల్యేలు, బడా నాయకులతో పరిచయాలు పెంచుకుని రహస్య వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా హనీ ట్రాప్ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం. కొందరు అధికారులు కూడా వలపు ముఠాకు చిక్కడం గమనార్హం. బనశంకరి: రాష్ట్రంలో పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్ దందాలో సీరియల్ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసు లేకుండా పరిష్కరించుకోవడానికి పోలీస్‌శాఖను ఆశ్రయిస్తున్నారు. ట్రాప్ చేసేవారిలా కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. పరారీలో ముఠా సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన హనీట్రాప్ ముఠా తమ బృందంలోని ప్రముఖులు అరెస్ట్ కావడంతో కొందరు పరారీలో ఉన్నారు. వీరి అరెస్ట్‌చేయడానికి ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీసీబీ పోలీస్ వర్గాలు తెలిపాయి. నిందితులు వీడియో రికార్డింగ్, మొబైల్ కాల్స్ వివరాలు, సంబాషణలను నాశనం చేశారు. వాటి డిజిటల్ సాక్ష్యాల కోసం విచారణ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గదగ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనీట్రాప్ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు. చివరకు రూ.1 లక్ష చెల్లించారు. ఏదో వంకతో పరిచయం పెంచుకుని నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్యాంప్ నిర్వహించాలని, వారం రోజుల పాటు ఉండటానికి వ్యవస్థ కల్పించాలని అని గదగ్ జిల్లా ఎమ్మెల్యే వద్ద హనీట్రాప్ ముఠా సభ్యులు విన్నవించారు. ప్రారంభంలో మహిళ పట్ల అసక్తి చూపని ఎమ్మెల్యే అనంతరం మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఎమ్మెల్యే రాసలీలను సీరియల్ నటి రహస్యంగా చిత్రీకరించి తన అనుచరులకు అందజేశారు. ఆ సీడీని ఎమ్మెల్యేకు చూపించి రూ.50 కోట్లకు డిమాండ్ పెట్టారు. అంత డబ్బు తన వద్దలేదనడంతో కనీసం రూ.10 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉడుపి జిల్లా, ఉత్తర కన్నడ జిల్లా ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటపడ్డాయి. రహస్య కెమెరా కలిగిన హ్యాండ్‌బ్యాగ్‌ల సాయంతో రికార్డింగ్ చేసేవారని తెలిసింది. సమాచారం ఇవ్వండి: పోలీసులు హనీట్రాప్ వలలో పడిన వ్యక్తులు ఎవరైనా తమకు సమాచారం అందించి విచారణకు సహకరించాలని పోలీస్‌శాఖ కోరింది. ఫిర్యాదుదారుల సమాచారం రహస్యంగా ఉంచి విచారణ చేపడతామని చెబుతున్నారు. హనీట్రాప్ కేసులో చిక్కుకుని కంగారుపడిన అనేకమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. వీడీయోలు, సమాచారం ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కొందరు కోర్టులో పిల్ వేశారు. -
సీబీఐ ఆఫీసర్‌నంటూ లక్షలు కాజేశాడు
సాక్షి, బెంగళూరు : సీబీఐ ఆఫీసర్‌నంటూ వ్యక్తులను భయపెట్టి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ ఇచ్చిన వివరాల ప్రకారం.. అభిలాష్ (34) అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్‌గా చలామణి అవుతూ తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించి ఇటీవల ఓ వ్యక్తి దగ్గర రూ. 24 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత కూడా పలువురిని మోసం చేయడానికి ట్రాక్‌లో పెట్టాడు. సమాచారమందుకున్న పోలీసులు అభిలాష్‌ని పట్టుకొని అతని వద్దనున్న రెండు బెంజ్‌కార్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుని సోషల్ మీడియాలోని ఖాతాలు చూడగా, అందులో తను ఇంజనీర్, బిజినెస్‌మేన్ అని ఉంది. కాగా, అభిలాష్ మీద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో లగ్జరీ ‘లయన్’
సాక్షి, చెన్నై: ఖరీదైన బంగ్లా, చుట్టూ అంగరక్షకులు, నిఘానేత్రాలు, ఐదారు సంస్థల పేరిట బోర్డులు, చిటికేస్తే చాలు క్షణాల్లో పనులు ముగించే రీతిలో చుట్టూ అధికారులు అంటూ లగ్జరీగా చెన్నైలో తిరుగుతూ వచ్చిన ముత్తువేల్ పోలీసులకు టార్గెట్ అయ్యాడు. పారిశ్రామిక వేత్తగా చెలామణిలో ఉంటూ రాజకీయ పలుకుబడితో లగ్జరీ మోసాలకు ఇతగాడు పాల్పడుతుండడం వెలుగులోకి రావడం గమనార్హం. విల్లివాక్కం రాజమంగళంలో ఖరీదైన బంగ్లా, చుట్టూ వందకుపైగా నిఘా నేత్రాలు, ముఫ్పై, నలభై మంది ప్రైవేటు అంగరక్షకులతో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్న పారిశ్రామిక వేత్త ముత్తువేల్. తన పేరుకు ముందు లయన్ అని చేర్చుకున్న ఇతగాడు, పోయెస్ గార్డెన్లో బావా, ముత్తువేల్, వారాహి పేర్లతో ఐదారు సంస్థల బోర్డులను తగిలించుకుని కార్యాలయం నడుపుతున్నాడు. రాజకీయ ప్రముఖులతో, పోలీసు ఉన్నతాధికారులు, అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఇతగాడి వద్దకు పలు రకాల పనుల నిమిత్తం అధికారంలో ఉన్న పెద్దవాళ్లు సైతం వచ్చి వెళ్తుంటాయని చెప్పవచ్చు. పోలీసు, ప్రభుత్వ, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల్లో చిటికేస్తే చాలు...క్షణాల్లో పనులు అవుతాయని నమ్మబలకడంతో తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సైతం ఆ బంగ్లాచుట్టూ తిరుగుతుంటారు. ఇలా..చిక్కాడు... డీఎంకేలో రాజకీయ ప్రముఖుడి కూడా చెలామణిలో ఉన్న లయన్ ముత్తువేల్ అనేక మందికి బ్యాంక్ రుణాలు, మరెన్నో పనులు చేసి పెట్టి అందుకు తగ్గ కమిషన్లు పొందుతూ రావడం తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ. వంద కోట్ల మేరకు ఇతగాడి మోసాలు ఉన్నట్టుగా బయట పడింది. రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ æఅనే పారిశ్రామిక వేత్త తమిళనాడులో తన నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం, అందుకు తగ్గ అనుమతుల వ్యవహారాలన్నీ ముత్తువేల్ చేసి పెట్టే రీతిలో డీల్ కుదుర్చుకుని ఉన్నారు. అలాగే, బ్యాంక్‌లో రూ.వంద కోట్ల రుణం ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టి ఉన్నారు. బ్యాంక్ రుణం సిద్ధమైన సమాచారంతో కమిషన్‌గా రూ. 2.5 కోట్లను ముత్తువేల్‌కు నిఖిల్ ముట్ట చెప్పి ఉన్నాడు. అయితే, రుణం అన్నది రాని దృష్ట్యా, పలుమార్లు ప్రశ్నించగా, అంగరక్షకులు నిఖిల్‌ను భయపెట్టి రాజస్తాన్‌లో వదలి పెట్టి వచ్చి ఉన్నారు. పలుమార్లు ప్రశ్నించినా, కేవలం బెదిరింపులే. ఇక్కడి అధికారులు, కొందరు పోలీసు బాసులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా ముత్తువేల్ వెన్నంటి ఉండడంతో రాజస్తాన్ రాజకీయాన్ని నిఖిల్ ప్రయోగించినట్టున్నాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలో ఏమోగానీ చెన్నై క్రైంబ్రాంచ్ విభాగంకు చెందిన ప్రత్యేక బృందం లగ్జరీ మోసగాడి కోసం మాటేసింది. సోమవారం తన బర్త్‌డే వేడుకల్లో మునిగి తేలుతున్న ఈ లగ్జరీ మోసగాడ్ని పథకం ప్రకారం తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ బర్త్‌డే వేడుకకు పలువురు మాజీ అధికారులు సైతం వచ్చి ఉన్నా, వారితో తమకేంటి అన్నట్టుగా ముత్తు వేల్‌ను ఆ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నది. ఇతగాడి చేతిలో మోసపోయిన వాళ్లు మరెందరో ఉన్నట్టు, తమకు ఫిర్యాదు చేస్తే, విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆ బృందం ప్రకటించి ఉన్న దృష్ట్యా, ఈ మోసగాడి చిట్టా చాంతాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతడ్ని కోర్టులో హాజరు పరిచి, కస్టడీకి తీసుకునేందుకు ఆ ప్రత్యేక బృందం పరుగులు తీస్తున్నది. -
చలికాలంలో చెమటలు.. అతన్ని పట్టించాయి
కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్‌కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్‌ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు. ‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్‌లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు) -
క్రైం బ్రాంచి పోలీసా.. మజాకా!
ఆయన ఢిల్లీ క్రైం బ్రాంచిలో పేరుమోసిన పోలీసు. ఆరు నెలల క్రితం ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఎట్టకేలకు ఆయన ఎక్కడున్నారో తెలిసింది. తీరా తెలిసిన తర్వాత పోలీసులు తల పట్టుకోవాల్సి వచ్చింది. అస్లుప్ ఖాన్ అనే ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో ఏటీఎం దోపిడీ గ్యాంగుకు నాయకుడని తేలింది. కేరళకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొన్నీమధ్య ఆ గ్యాంగులోని ఓ సభ్యుడైన సురేష్‌ను ఢిల్లీలో అరెస్టు చేసింది. సురేష్ స్విఫ్ట్ కారులో వెళ్తుండగా కస్తూర్బా గాంధీ మార్గ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అళప్పుళ జిల్లా ఎస్పీ వీఎం మహ్మద్ రఫీక్ తెలిపారు. అతడిని విచారించగా అస్లుప్ ఖాన్ విషయం కూడా తెలిసింది. ఢిల్లీ క్రైం బ్రాంచిలో ఆర్కే పురం స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఖాన్.. డిసెంబర్లో నెల రోజుల సెలవు పెట్టారు. ఆ తర్వాత సెలవును మరో నెల పొడిగించారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఏమైపోయారో ఎవరికీ తెలియలేదు. సురేష్‌ను అరెస్టు చేసిన తర్వాత వాళ్ల గ్యాంగు దోపిడీ వ్యవహారం మొత్తం బయటపడింది. సురేష్ మొదట్లో ఒక ఇన్ఫార్మర్గా ఖాన్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా అంతా కలిసి ఏటీఎంల దోపిడీకి శ్రీకారం చుట్టారు. కేరళలోని చెరియనాడు, కాళకూటం, రామాపురం, కంజికుళ్ ప్రాంతాల్లో పలు ఏటీఎంలను ఈ గ్యాంగు దోచుకుంది. సురేష్ ముందుగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ, సెక్యూరిటీ లేని ఏటీఎంలు ఎక్కడున్నాయో గమనిస్తాడు. ఆ తర్వాత ఖాన్, సురేష్ కలిసి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తారు. ఏటీఎంల గురించి బాగా తెలిసిన ఇతర గ్యాంగుసభ్యులు గ్యాస్ కట్టర్‌తో మిషన్లను కట్ చేస్తారు. అదే సమయంలో లోపలున్న నోట్లు కాలిపోకుండా వాళ్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సీసీ టీవీల దృష్టిలో పడకుండా ఇదంతా చేయడం వీరి ప్రత్యేకత. వీళ్లు ఉపయోగించే కారు నంబర్.. ఒక అంబులెన్స్ పేరు మీద రిజిస్టర్ అయింది. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ దోపిడీ గ్యాంగు నడిపాడు. మరి పోలీసా.. మజాకా! -
20 కిలోమీటర్లు వెంబడించి.. పట్టేశారు!
వేగంగా వెళ్లిపోతున్న నేరస్తులను పోలీసులు వెంబడించడం.. వాళ్లను పట్టుకోవడం ఇవన్నీ సాధారణంగా సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి. కానీ, గుర్గావ్ శివార్లలోని బాద్షాపూర్ వద్ద ఇలాంటి ఘటనే అచ్చంగా చోటుచేసుకుంది. విశ్వసనీయంగా అందిన సమాచారంతో క్రైం బ్రాంచి బృందం మంగళవారం తెల్లవారుజామున రెండు పికప్ వ్యాన్లను ఆపింది. వాటిలో పది మంది నేరస్తులు ప్రయాణిస్తున్నారు. పోలీసులను చూడగానే ఒక్కసారిగా వాళ్లు కాల్పులు ప్రారంభించారని డిప్యూటీ కమిషనర్ బల్బీర్ సింగ్ తెలిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో, నేరస్తులు సోహ్నా వైపు వేగంగా పారిపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు వాళ్లను వెంబడించారు. వాళ్లలో నలుగురిని అరెస్టు చేయగా, ఆరుగురు మాత్రం తప్పించుకున్నారు. ఈ ఛేజింగ్ సమయంలో ఒక వ్యాన్ తిరగబడి ఇద్దరు నేరస్తులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులకు కూడా కొద్దిగా గాయాలయ్యాయి. నేరస్తుల నుంచి నాలుగు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్
టీనగర్: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51). ఈయన సన్‌టీవీలో నెట్వర్క్ అధికారి. ముంబైకి చెందిన దీపి శివన్ (38) సూర్య టీవీలో ప్రోగ్రామ్ అధికారి. తరువాత ప్రవీణ్ విధుల నుంచి రిలీవ్ అయి ముంబై వెళ్లారు. దీప్తిశివన్ నాలుగు నెలల క్రితం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తనకు రావాల్సిన వేతన బకాయిలు 36లక్షలు ఇవ్వకుండా మోసగిస్తున్నారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్ లో చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం దీపిశివన్ చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్‌లో మళ్లీ ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ జరపాలని పోలీసు కమిషనర్ జార్జ్ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆధ్వర్యంలో డెప్యూటీ కమిషనర్ జయకుమార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ శ్యామల దీని గురించి విచారణ జరిపారు. విచారణ తరువాత గురువారం రాత్రి అన్నానగర్ ఇంటిలో ఉన్న ప్రవీణ్‌ను సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన్ను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు. -
కటకటాలపాలైన కార్లదొంగ
సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తాళాలను స్మార్టుగా తీసి వాటిని కాజేస్తున్న ఓ దొంగను అరెస్టు చేయడంతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచి పోలీసులు. భేషరమ్ సిమాలోమాదిరిగా ఏకారుకు అవతలి వ్యక్తి నుంచి డిమాండ్ ఉంటే ఆ కారును ఎంపిక చేసుకుని మరీ వాటినే కాజేస్తున్నట్టు క్రైం బ్రాంచ్అదనపు కమిషనర్ రవిందర్‌యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. యూపీలోని మీరట్ జిల్లా శ్యామ్నగర్కి చెందిన మెహతాబ్ అనే వ్యక్తి కార్లు దొంగిలించి ఇతర రాష్ట్రాలకు వాటిని తరలిస్తున్నట్టు క్రైం బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు. నిందితుడు ఇటీవల చోరీ చేసిన ఓ కారును హైదర్పురాలోని మ్యాక్స్ ఆసుపత్రి సమీపంలో విక్రయించేందు వస్తున్నట్టు స్థానిక వేగుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడే మాటువేసి ఉన్నపోలీసులు నిందితుణ్ని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. జావెద్ అనే మరో వ్యక్తితో కలిసి తాను కార్లు చోరీ చేస్తున్నట్టు మెహతాబ్ తెలిపాడు. ఎలక్ట్రానిక్ తాళాలను పగులగొట్టడంతో వీరిద్దరూ ఆరితేరారు. ముందుగా ఎంపిక చేసుకున్న కారు తాళాలను తెరచి తాపీగా అక్కడి నుంచి జారుకుం టారు. ఎదుటివారు సైతం గుర్తించలేనంతలా వీరు ప్రవర్తింస్తారని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం మూడు చోరీ కేసులు పరిష్కారం అయినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఓ టయోటా క్వాలిస్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. జావెద్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగిలిన కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఏసీపీ ధీమా వ్యక్తం చేశారు. -
షిండే సొంతూరులో బాంబుల కలకలం
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సొంత ఊరైన షోలాపూర్ పట్టణంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం సృష్టించింది. ఈ కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఉగ్రవాదులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని మహ్మద్ సాదిక్ అబ్దుల్ వహబ్ (32), ఉమర్ అబ్దుల్ హఫీజ్ దండోతి (35)లుగా గుర్తించారు. ఈ కేసు వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్తో పాటు ఔరంగాబాద్ ఏటీఎస్ చీఫ్ నవీన్ చంద్రారెడ్డి వివరించారు. తగిన సమాచారం మేరకు సాదిక్ ఇంటిపై దాడిచేయగా 81 జిలెటిన్ క్యాండీలు, 102 డిటోనేటర్లు, రివాల్వర్, ఏడు బుల్లెట్లు, కంప్యూటర్, స్కానర్ ప్రింటర్, మెమరీకార్డులు, 200 సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు దొరికాయన్నారు. తర్వాత ఉమర్ దండోతి ఇంటిపై దాడి చేయగా, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. మరో ముగ్గురి ఇళ్లపై కూడా దాడులు చేసినా అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వివరించారు. ఇదిలావుండగా ఉగ్రవాదుల కోసం ఏటీఎస్ బృందం దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారం మేరకు అబ్దుల్ ఫజల్, పట్టణానికి చెందిన సిమి కార్యకర్త ఖలీద్ ముచాలేలను ఖండ్వా బార్డర్లో ఈ బృందం అరెస్టు చేసింది. ఖలీద్‌కు ఒక నేరం విషయంలో ఇండోర్ న్యాయస్థానం గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఖలీద్ విడుదలయ్యాడు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చి తన సోదరులతో నహిజిందగి ప్రాంతంలో ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఖండ్వా బార్డర్ సమీపంలో ఏటీఎస్‌కు పట్టుబడ్డాడని కమిషనర్ వివరించారు. అతడిని విచారించగా ఉగ్రవాదులకు సాయం చేసేవారు పట్టణంలో ఇంకా ఉన్నారని తేలడంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల పాటు పట్టణంలో ఉన్న ఖలీద్‌కు సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. బోగస్ డ్రైవింగ్ లెసైన్సులు, ఎన్నికల గుర్తింపు కార్డులు అందజేస్తూ ఖలీద్‌కు సాదిక్ సాయం చేసేవాడని పోలీసులు తెలిపారు.