20 కిలోమీటర్లు వెంబడించి.. పట్టేశారు! | Four criminals caught after 20-km Bollywood-style chase in Gurgaon | Sakshi
Sakshi News home page

20 కిలోమీటర్లు వెంబడించి.. పట్టేశారు!

Published Tue, Dec 8 2015 5:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:07 PM

20 కిలోమీటర్లు వెంబడించి.. పట్టేశారు! - Sakshi

20 కిలోమీటర్లు వెంబడించి.. పట్టేశారు!

వేగంగా వెళ్లిపోతున్న నేరస్తులను పోలీసులు వెంబడించడం.. వాళ్లను పట్టుకోవడం ఇవన్నీ సాధారణంగా సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి. కానీ, గుర్‌గావ్ శివార్లలోని బాద్షాపూర్ వద్ద ఇలాంటి ఘటనే అచ్చంగా చోటుచేసుకుంది. విశ్వసనీయంగా అందిన సమాచారంతో క్రైం బ్రాంచి బృందం మంగళవారం తెల్లవారుజామున రెండు పికప్ వ్యాన్లను ఆపింది. వాటిలో పది మంది నేరస్తులు ప్రయాణిస్తున్నారు. పోలీసులను చూడగానే ఒక్కసారిగా వాళ్లు కాల్పులు ప్రారంభించారని డిప్యూటీ కమిషనర్ బల్బీర్ సింగ్ తెలిపారు.

పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో, నేరస్తులు సోహ్నా వైపు వేగంగా పారిపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు వాళ్లను వెంబడించారు. వాళ్లలో నలుగురిని అరెస్టు చేయగా, ఆరుగురు మాత్రం తప్పించుకున్నారు. ఈ ఛేజింగ్ సమయంలో ఒక వ్యాన్ తిరగబడి ఇద్దరు నేరస్తులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులకు కూడా కొద్దిగా గాయాలయ్యాయి. నేరస్తుల నుంచి నాలుగు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement