లఖింపూర్‌ ఘటన: క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌కు అశిష్‌ మిశ్రా | Ashish Mishra Arrives at UP Crime Branch Office | Sakshi
Sakshi News home page

లఖింపూర్‌ ఘటన: క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌కు అశిష్‌ మిశ్రా

Published Sat, Oct 9 2021 11:51 AM | Last Updated on Sat, Oct 9 2021 12:50 PM

Ashish Mishra Arrives at UP Crime Branch Office - Sakshi

లక్నో: లఖింపూర్‌ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్‌ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది.   చదవండి: (నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement