
న్యూఢిల్లీ : సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిస్సింగ్ కేసును ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మే 26 నుంచి కానిస్టేబుల్ వెంకట్రావు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సెలవు మంజూరు కోసం వెంకట్రావు ఢిల్లీ ధౌలాకువాలోని ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కానిస్టేబుల్ కనిపించకుండా పోవడంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేశారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!)
కాగా వెంకట్రావు అదృశ్యం వెనుక సీఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్‌కుమార్ హస్తం ఉందటూ ఆరోపణలు వస్తున్నాయి. వెంకట్రావు సెలవు కోరడంపై సంజీవ్‌కుమార్‌తో తరచుగా గొడవలు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్‌ఎఫ్, ఉస్మాన్‌పూర్ పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కానిస్టేబుల్ అదృశ్యంపై సమగ్ర, పారదర్శకత విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు హైకోర్టు కేసును అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment