Delhi High Court
-
Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం
2024 ముగింపు దశకు వచ్చింది. 2024లో దేశంలోని రాజకీయాలతో పాటు సామాన్యుల జీవితాలను కూడా కుదిపేసే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, విమానాలకు బాంబు బెదిరింపులు, పలుచోట్ల కాల్పులు వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇవి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆందోళన కలిగించాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..1. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జైలుఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2024, మార్చి 21న అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఈ కేసులో జైలుకు వెళ్లారు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారించాయి. అయితే సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.2. కోచింగ్ సెంటర్లో ప్రమాదం2024, జూలై 27న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఇక్కడి రావు కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోని లైబ్రరీలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్లోకి నీరు ప్రవేశించింది. ముగ్గురు విద్యార్థులు ఆ నీటిలో మునిగి మృతిచెందారు. ఈ దుర్ఘటన అనంతరం పలువురు విద్యార్థులు కోచింగ్ సెంటర్ ముందు నిరసనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కోచింగ్ సెంటర్ భవన యజమానులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు అధికారులు ఈ లైబ్రరీకి సంబంధించిన సమాచారాన్ని దాచినందుకు వారిని సస్పెండ్ చేశారు.3. ఓట్ల లెక్కింపుపై నిషేధంఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును హైకోర్టు నిషేధించింది. ఎన్నికల సమయంలో యూనివర్శిటీ క్యాంపస్‌లో అపరిశుభ్రతతో పాటు అరాచకాలు చోటుచేసుకోవడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ క్యాంపస్ మొత్తాన్ని విద్యార్థి నాయకులు శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కోర్టు అనుమతించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి నేతలను కోర్టు హెచ్చరించింది.4. తరచూ ఫేక్ బాంబ్ కాల్స్దేశ రాజధాని ఢిల్లీలో 2024 మే నుండి ఫేక్ కాల్స్, మెయిల్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవి డిసెంబరు వరకూ కొనసాగాయి. మేలో తొలిసారిగా ఢిల్లీలోని 200 పాఠశాలలు, విద్యాసంస్థలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తరువాత ఆస్పత్రులు, పాఠశాలలు, విమానాశ్రయాలకు వివిధ సమయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మర తనిఖీలు జరిపారు.5. కాల్పులు, దోపిడీలుఈ ఏడాది ఢిల్లీలో పలు నేర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బహిరంగంగా కాల్పులు జరిగాయి. ఇటువంటి ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జైలుకెళ్లిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ల పేరుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాల్పులు, దోపిడీ ఘటనలు జరిగాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
వాళ్లకు ఉచిత వైద్యం అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచారం, యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) కేసుల బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందేందుకు అర్హులని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించారు. మంగళవారం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ దాఖలైన పోక్స్ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. అత్యాచారం, యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం అందించాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు నర్సింగ్‌హోమ్‌లు తప్పని సరిగా ఈ ఆదేశాలను పాటించాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అలాగే పోక్సో సంబంధిత కేసుల్లో.. బాధితులకు తక్షణ వైద్య సంరక్షణ, అవసరమైన సేవలు అందించాలని సూచించింది.బాధితులకు అందించే ఉచిత వైద్యంలో ప్రథమ చికిత్స, రోగ నిర్ధారణ, ఇన్‌పేషెంట్ కేర్, ఔట్ పేషెంట్ ఫాలో అప్లు, రోగనిర్ధారణ, సంబంధిత పరీక్షలు, అవసరమైతే శస్త్రచికిత్సలు, ఫిజకల్,మెంటల్ కౌన్సెలింగ్,ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైతం వస్తాయని కోర్టు స్పష్టం చేసింది.#DelhiHighCourt has mandated that all govt & private hospitals must provide free medical treatment to survivors of rape, acid attacks, & POCSO cases. This includes first aid, diagnostic tests, surgery, & counseling, ensuring victims do not face financial or procedural hurdles. pic.twitter.com/k2sln7J1fG— Informed Alerts (@InformedAlerts) December 24, 2024 -
ఈనాడు, ఆంధ్రజ్యోతికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ సవాల్!
ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్ఈ 2022 రూల్స్‌లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.పూజా ఖేద్కర్ కేసు ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరదనీరు చేరి ముగ్గురు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోచింగ్ సెంటర్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై జరిపించాలని కోరుతూ ఓ ఎన్జీఓ దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బన్ ప్లానింగ్ లోపాలపై వివరణ కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా రాజింద్రనగర్ ప్రాంతంలో మురికి కాల్వలను ఆక్రమించి కట్టిన అన్ని కట్టడాలను శుక్రవారం నాటికి కూల్చివేయాలని ఆదేశించింది. ఇక ఢిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై కూడా మండిపడింది. ప్రభుత్వాల ఉచితాల సంస్కృతి కారణంగా పన్నులు వసూలు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని తెలిపింది. యూపీఎస్సీ కోచింగ్ హబ్ అయిన రాజిందర్ నగర్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నిర్వహించడానికి అనుమతిస్తున్నారని పేర్కొంది.మరోవైపు ఇప్పటి వరకు ఎమ్సీడీ(MCD) అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బిల్డింగ్ యజమాని, కోచింగ్ సెంటర్ యజమాని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, అరెస్టయినవారిలో వరదలున్న వీధి గుండా వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపింది. అయితే తమ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ దుర్ఘటనకు మున్సిపల్ అధికారులను ఒక్కరినైనా అరెస్టు చేసి జైలుకు పంపారా అని అని ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులో ఢిల్లీ పోలీసులను కూడా ప్రతివాదిగా చేర్చింది ధర్మాసనం.ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడంలో విఫలమైతే కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని సూచిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. -
ఢిల్లీ హైకోర్టుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అంజలి బిర్లా తన తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ పరీక్షల్ని తొలి ప్రయత్నంలో పాసయ్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజలి బిర్లా.. తన పరువు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court. She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father's influence.…— ANI (@ANI) July 23, 2024అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో పోస్టుల్లో అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లాఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. -
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.కాగా తన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసుతో తన పిటిషన్‌ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.ఇక 28న జైన్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్‌పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను 2022లో మే 20న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
స్వాతి మలివాల్ కేసు: హైకోర్టుకు సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ భివవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనను స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అక్రమగా అరెస్ట్ చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బిభవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిభవ్ తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశం అయింది. బీజేపీ కుట్రంలో భాగంగా స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణులు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. -
భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.ఈ సందర్భంగా వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్‌ఫాంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.ఎన్క్రిప్షన్ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్,మెటా ఆరోపించాయి.ముఖ్యంగా మెసేజ్ సెండర్ వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరాయి. విచారణ సందర్భంగా వాట్సాప్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మెసేజ్‌ల గోప్యత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని మేం అమలు చేస్తున్నాం.సీక్రెసీ(రహస్యభద్రత) ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల్లోని 4(2) సెక్షన్‌తో మేం ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు గనుక చెబితే మేం ఇండియా నుంచి వెళ్లిపోతాం’అని కోర్టుకు స్పష్టం చేశారు. -
నేను బాధితురాలిని.. ఇందులో నా ప్రమేయం లేదు: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా హక్కులకు భంగం కలగకుండా, ఈ కేసులో పేర్కొన్న విషయాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని చెప్పాలనుకుంటున్నా. రెండున్నరేళ్లుగా ఈడీ/సీబీఐ దర్యాప్తు ముగింపు లేని దర్యాప్తుగా సాగడం ప్రపంచమంతా చూస్తోంది. ఈ విషయంలో మహిళా రాజకీయ నాయకురాలిగా ఇతరులకన్నా ఎక్కువ బాధితురాలిని నేనే. ఈ కేసు నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసింది. నా వ్యక్తిగత ఫోన్ నంబర్ అన్ని టీవీల్లో ప్రసారం చేయడం నా గోప్యతకు భంగం కలిగిస్తోంది. నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాను. వారి ముందు నాలుగుసార్లు హాజరయ్యాను. నాకు తెలిసినంత వరకూ వారికి సమాధానమిచ్చాను. నా బ్యాంకు, వ్యాపార వివరాలు తెలియజేశాను. నా ఫోన్లు దర్యాప్తు సంస్థకు ఇచ్చి పూర్తిగా సహకరించినా వాటిని ధ్వంసం చేశానని నిందిస్తున్నారు. రెండున్నరేళ్లలో దర్యాప్తు సంస్థలు అనేక మంది విషయంలో పలుసార్లు దాడులకు పాల్పడటంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించి, బెదిరించి అరెస్టు చేశాయి. అయినప్పటికీ తమ ప్రకటనలను, రాజకీయ పొత్తులను మారుస్తూ వచ్చిన వారి నుంచి కొన్ని స్టేట్మెంట్లు సేకరించాయి. ఈ కేసు మొత్తం వాంగ్మూలాల మీదే ఆధారపడి ఉంది. కేసులో డబ్బు లావాదేవీలు ఎక్కడా లేవని... అవినీతికి సంబంధించిన ఆధారాలు లేవనడాన్ని తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సాక్షుల్ని తారుమారు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్నెందుకు అరెస్టు చేయలేదు. రెండున్నరేళ్ల దర్యాప్తు విఫలమైన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. నాపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈడీ/సీబీఐ కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే ఉన్నాయి. నిందితులు బీజేపీలో చేరితే దర్యాప్తు ఆకస్మికంగా నిలిచిపోతోంది. నోరుమెదపకండి లేకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నాయకులు పార్లమెంటు వేదికగానే బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పారీ్టలు ఏదైనా ఉపశమనం లభిస్తుందని న్యాయస్థానాలు వైపు చూస్తున్నాయి. నేను ఈడీ ప్రక్రియ విధానాలకు సహకరించడం తప్ప ఏమీ చేయలేను. ఆ విధంగానే కొనసాగుతున్నాను. అందుకే నాకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నా. నా జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే బాధ్యాతయుతమైన తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చాలా అర్హతలు కలిగిన వ్యక్తిని. అందుకే కుమారుడు బోర్డు పరీక్షలు, ఆప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు నా పాత్ర ఏమిటో అర్థం చేసుకున్నాను. నేను ప్రపంచానికి దూరంగా ఉండే వ్యక్తిని కాదు. నేనేమీ ఒకే సంతానం కలిగిన తల్లిని కాదు. తల్లి స్ధానాన్ని భర్తీ చేయగలమా? చదువు విషయంలో నా కుమారుడుకి ఇది చాలా క్లిష్టమైన సంవత్సరం. నేను గైర్హాజరు కావడం కుమారుడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నా. అందుకే నా బెయిల్ అభ్యర్థన పరిశీలించాలని మళ్లీ కోరుతున్నా’ అని కోర్టులో స్వయంగా ప్రస్తావించేందుకు రాసుకొచ్చిన 4 పేజీల లేఖలో కవిత పేర్కొన్నారు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకోనందున కోర్టు అనుతించకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందన్న అభియోగాలకు సంబంధించిన కేసులో ఈడీ అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఆమెను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆదేశించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో కవితను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. చార్జిషిటులో కవిత పాత్రపై స్పష్టత ఇవ్వడానికి మరో 14 రోజుల గడువు కావాలని కోరారు. అయితే కస్టడీ పొడిగింపు ద్వారా ఈడీ తెలుసుకోవాల్సిన విషయాలేవీ లేవని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదించారు. ఈ కేసులో రెండేళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్నా ఈడీ అధారాలేవీ చూపలేదన్నారు. కవితకు స్వయంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నిందితులకు నేరుగా మాట్లాడే హక్కు ఉందని కవిత న్యాయవాది తెలపగా అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. వాదనల అనంతరం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో కవితను ఆమె భర్త, మామ కలిసి కాసేపు మాట్లాడారు. అంతకుముందు కవిత స్వయంగా వాదించుకొనే అవకాశం వస్తుందని భావించి న్యాయమూర్తి ముందు ఏయే అంశాలు ప్రస్తావించాలో నాలుగు పేజీల్లో రాసుకొని కోర్టుకు వచ్చారు. అయితే న్యాయమూర్తి నిరాకరించడంతో వాటిని మీడియాకు విడుదల చేశారు. -
భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. విడిపోయిన భార్యనుంచి ఢిల్లీ హైకోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. భార్య తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందనే వాదనను సమర్ధించిన కోర్టు కునాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కునాల్ జీవిత భాగస్వామి ప్రవర్తన అగౌరపరిచేలా ఉందని, సానుభూతి లేని విధంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రతి వివాహంలో విబేధాలు అనివార్యమే అయినప్పటికీ, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకంలేనపుడు ఆ వేదనను భరిస్తూ సహజీనం చేయాల్సిన అవసరం లేదని, కపూర్ కేసులో బాధల్ని భరిస్తూ భార్యతో కలిసి ఉండేందుకు అతని ఒక్క కారణం కూడా లేదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్ కృష్ణతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. (ఇక ఆ బాధలు నావల్ల కాదు..చిన్న వయసులోనే కఠిన నిర్ణయం) తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కపూర్ చేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు తాజాగా అతనికి విడాకులు మంజూరు చేసింది. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని ఇది క్రూరత్వానికి సమానమని కోర్టుపేర్కొంది. అంతేకాదు పెళ్లయిన రెండు సంవత్సరాలలోపే, అప్పీలుదారు తనను తాను సెలబ్రిటీ చెఫ్‌గా నిలబెట్టుకోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందనీ, ఇది అతని కృషి సంకల్పానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. కాగా 2008, ఏప్రిల్‌లో కునాల్, నటి ఏక్తా కపూర్ జంట వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య తన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదని, తనను అవమానించిందని ఆరోపిస్తూ టెలివిజన్ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ న్యాయనిర్ణేతగా ఉన్న సమయంలో కపూర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కునాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఏక్తా వాదించింది. తన నుంచి విడిపోయేందుకు కునాల్ కట్టుకథ అల్లాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
లిక్కర్ స్కాం: ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఇవాళ(బుధవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన ఐదుగురిలో బినోయ్ బాబు ఒకరు. ఆయన బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. పెర్నోడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో బినోయ్ జనరల్ మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే.. లిక్కర్ స్కాంకు సంబంధించి కిందటి ఏడాది నవంబర్‌లో ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) బినోయ్ బాబుతో సహా నిందితులందరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. వాళ్లు తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినట్లు, కేసు తీవ్రత దృష్ట్యా ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం కుదరని పేర్కొంది. ఈ తరుణంలో బినోయ్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో జస్టిస్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. బినోయ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ఇవాళ వినిపించారు. మద్యం పాలసీ విధానంలో బినోయ్ ఎలాంటి పాత్ర పోషించలేదని, పైగా సీబీఐ ఆయన్ని ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే పేర్కొందన్న విషయాన్ని ఆయన బెంచ్‌కు వినిపించారు. ఈడీ దురుద్దేశపూర్వకంగానే ఆయనపై అభియోగాలు నమోదు చేసిందని వాదించారు లాయర్ రోహత్గి. దీంతో స్పందించాల్సిందిగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈడీ సైతం తమ అభియోగాలకు బలపర్చే సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టుకు విన్నవించింది. ఈ తరుణంలో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
వాట్సాప్‌ను తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక వేదిక వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీని ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. యూజర్లను ‘స్వీకరించండి లేదా వదిలేయండి’ అనే పరిస్థితిలోకి నెట్టేలా ఈ విధానం ఉందని పేర్కొంది. ఎండమావుల వంటి చాయిస్‌లతో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకునేలా యూజర్లను ఒత్తిడి చేస్తోందని, వారి వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటోందని తప్పుపట్టింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీపై దర్యాప్తు జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేసింది. -
‘వైవాహిక అత్యాచార’ పిటిషన్ల విచారణ.. కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని సోమవారం సున్నితంగా తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. పిటిషన్లపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10వ తేదీనే అభిప్రాయసేకరణకు సమాచారం అందించామని, అయితే ఇంకా స్పందన రాలేదని తెలిపారు. అయితే కోర్టు మాత్రం కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘‘త్రిశంకు’’ లాంటిదంటూ పేర్కొంది. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని గుర్తు చేసింది. Marital Rapeను నేరంగా పరిగణించాలంటూ పలు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. భారతదేశం పరిస్థితుల నేపథ్యంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేందుకు సిద్ధంగా లేమని గతంలో కేంద్ర ప్రభుత్వం ఓసారి పేర్కొంది. ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా అనుభవించడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా లేమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ‘‘అంతర్జాతీయ నిర్వచనం వేరు, భారత సమాజ స్థితిగతులు వేరు. లా కమిషన్ కూడా నివేదికలు సమర్పించే సమయంలో ఈ అంశాన్ని సిఫారసు చేయలేదు. ’’ అని కేంద్రం తరపున ఆ సందర్భంలో ప్రకటన వెలువడింది. సంబంధిత వార్త: మారిటల్ రేప్.. డబుల్ గేమ్ ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కోర్టుల్లో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. 2017లో కేంద్రం స్టాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఆ తర్వాత కొత్తగా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనను తీసుకోలేదు. మరోవైపు.. ఈ వ్యవహారంపై కేంద్రం ఈ ఏడాదిలో వాదనలు వినిపించకపోవడం గమనార్హం. సెక్షన్ 375 భారతీయ శిక్షాస్మృతి (IPC) మినహాయింపు 2 ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకూడదు. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని తన భార్యతో.. భర్త లైంగిక సంబంధం కలిగి ఉన్నా కూడా అది అత్యాచారం కాదని నిర్దేశిస్తుంది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని చాలా మంది న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పౌరుల నుండి భారీ డిమాండ్ ఉంది. ఏది ఏమైనప్పటికీ, నేరీకరణ అనేది సామాజిక-చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని కేంద్రం వాదిస్తోంది. -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
సంచలన నిర్ణయం..ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’ లాయర్ !
న్యూ ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయ స్థానం సంచలన నిర్ణ యం తీసుకుంది. సీనియర్ న్యాయవాది, గే అయిన సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియం సిఫార్సును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ వార్తలకెక్కనున్నారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో ‘లా’లో అండర్ అండర్‌గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన సౌరభ్.. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి అని తెలుస్తోంది. -
జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై గత సంవత్సర కాలంగా జైళ్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తాన్హా గురువారం బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తక్షణమే వారిని విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే హైకోర్టు వారిద్దరితో పాటు ఆసిఫ్ తాన్హాకు బెయిల్ మంజూరు చేసింది. వారి పూచీకత్తులను పరిశీలించడంలో జాప్యం జరగడంతో వారిని విడుదల చేయడం ఆలస్యమైంది. ఈ ముగ్గురు విద్యార్థి నేతలను గత సంవత్సరం మేలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం( యూఏపీఏ– ఉపా)’ కింద అరెస్ట్ చేశారు. వెరిఫికేషన్‌లో జాప్యం వారి విడుదలను నిరోధించడానికి సరైన కారణం కాదని గురువారం నాటి ఆదేశాల్లో హైకోర్టు మండిపడింది. బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ముగ్గురు నిందితులు తమను విడుదల చేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ విచారణ కోర్టును ఆశ్రయించారు. అయితే, వారి పిటిషన్‌ను విచారణ కోర్టు గురువారానికి వాయిదా వేయడంతో వారు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. విచారణ కోర్టు తీరును తప్పుబడుతూ ఈ అంశాన్ని వెంటనే, వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. ఆ అల్లర్లలో 53 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ముగ్గురు విద్యార్థి నేతలకు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యతిరేకతను అణచాలన్న అత్యుత్సాహంతో నిరసన తెలిపే హక్కుకు, ఉగ్ర చర్యలకు మధ్య ఉన్న రేఖను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు నాడు పేర్కొంది. కాగా, ఆ విద్యార్థినేతలకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చదవండి: దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్ -
వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం!
ఢిల్లీ: మే 15 నుంచి అమల్లోకి వచ్చిన తమ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపింది. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు తమ కొత్త విధానాలను అంగకరించకపోతే.. దశల వారిగా వారి ఖాతాలను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ దిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. "మా గోప్యతా విధానం ఐటి నిబంధనలను అతిక్రమించలేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, మేము అన్నీ నిబందనల ప్రకారం వెళ్తున్నాం" అని సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లు యాప్‌ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదనలను వాట్సాప్ ఖండించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని చెప్పారు. అలాగే దీనిపై కేంద్రం సంస్థ వాట్సాప్ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. మే 15 నుంచి అమల్లోకి వచ్చిన వాట్సాప్ కొత్త విధానంపై న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వైఖరిని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు గతంలో నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉంటే..వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటిషనర్లు కోరగా.. ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. చదవండి: అలర్ట్: నెఫ్ట్ సేవలకు అంతరాయం -
Delhi High Court: పోలీసులపై ఢిల్లీ ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినా వైరస్ బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య తగ్గట్లేదు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరతతో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకల, ఆక్సిజన్ కొరత నెలకొనడంతో.. సకాలంలో వైద్యం అందక అధిక సంఖ్యలో కరోనా రోగులు మరణించారు. ఒక్క సర్ గంగారాం ఆస్పత్రిలోనే 20 పైగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తుండటంతో ఆస్పత్రుల్లో కొరత ఏర్పడింది. ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కి తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఆక్సిజన్ సిలిండర్ అక్రమంగా నిల్వ చేసిన కేసుకు సంబంధించి.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌తో సహా.. మరో తొమ్మిది మంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపై సోమవారం ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. "మీరు బాధ్యతతో వ్యవహరించాలి. ఆక్సిజన్, కరోనా మందులు.. నిల్వచేసుకుని వ్యాపారం చేయడానికి ఇది సమయం కాదు. రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారంగా ఎలా మార్చుకుంటాయి? ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు ఆక్సిజన్ ఎలా కొనుగోలు చేయవచ్చు? నిజం ఏంటో..బయట పెట్టే ఆసక్తి మీకు లేదు అనిపిస్తోంది." అంటూ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ధర్మాసనం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "కొంతమంది రాజకీయ ప్రముఖులు దీనిలో ఉన్నందున, ఈ విధంగా దర్యాప్తు చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయడం మీ విధి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా మందుల కొరత కారణంగా ఎంత మంది మరణించారో గ్రహించారా అని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై సరైన విచారణ జరపాలని ఢీల్లీ ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. పేద ప్రజల అందించే ఔషధాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు అప్పగించాలని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి) -
‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్ ట్యూన్ ఎందుకు?’’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. టీకా వేయించుకోవాలని ప్రజలను కోరుతూ సెల్ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న డయలర్ ట్యూన్ సందేశంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలర్ ట్యూన్ చికాకు కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. అసలు టీకాలే లేనప్పుడు దాన్ని వేయించుకోవాలని కోరడం అర్థం లేని పని అని స్పష్టం చేసింది. ఎవరికైనా ఫోన్ చేసిన ప్రతిసారీ ఈ డయలర్ టోన్ వినిపిస్తోందని.. ఇది జనాల సహనాన్ని పరీక్షిస్తోందని కోర్టు ఆపేక్షించింది. వ్యాక్సిన్ తీసుకొండి అని చెబుతున్నారు.. అసలు టీకానే లేనప్పుడు ఎవరైనా ఎలా తీసుకోవాలి అసలు ఈ సందేశంతో ఏం చెప్పదల్చుకున్నారు అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లితో కూడిన ఢిల్లీ హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అలానే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి. డబ్బులు తీసుకునైనా సరే జనాలకు టీకా ఇవ్వండి. చిన్న పిల్లలు కూడా ఇదే చెబుతారు అని కోర్టు స్పష్టం చేసింది. ఇక కోవిడ్‌పై జనాలకు అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వాలు మరింత సృజనాత్మకంగా ఉండాలని కోర్టు సూచించింది. ఒక్క డయలర్ ట్యూన్‌నే పదే పదే వినిపించే కంటే.. ఎక్కువ సందేశాలు రూపొందించి.. మార్చి మార్చి వాటిని వినిపించాలని.. దీని వల్ల జనాలకు మేలు కలుగుతుందని తెలిపింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, సిలిండర్ల వాడకం, టీకాలపై జనాలకు అవగాహన కల్పించడానికి టీవీ యాంకర్లు, నిర్మాతలను ఉపయోగించుకుని కార్యక్రమాలను రూపొందించాలని.. అమితాబ్ వంటి పెద్ద పెద్ద నటులను దీనిలో భాగస్వామ్యం చేసి అన్నీ చానెల్స్‌లో వీటిని ప్రసారం చేయాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. గతేడాది కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటి అంశాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేశారని.. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మందులు మొదలైన వాటి వాడకంపై కూడా ఇలాంటి ఆడియో-విజువల్ కార్యక్రమాలు రూపొందించాలని కోర్టు తెలిపింది. ప్రింట్ మీడియా, టీవీ ద్వారా కోవిడ్ నిర్వహణపై సమాచారాన్ని ప్రచారం చేయడానికి వారు ఏ చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన, అలానే డయలర్ ట్యూన్ల విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నారనే దాని గురించి మే 18 లోగా తమ నివేదికలను దాఖలు చేయాలని కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. చదవండి: టీకా కొరత.. మేం ఉరేసుకోవాలా ఏంటి: కేంద్ర మంత్రి -
చేతకాకపోతే చెప్పండి.. కేంద్రాన్ని దించుతాం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆక్సిజన్ బ్లాక్మార్కెట్లో అమ్మడంపై ఢిల్లీ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని చక్కదిద్దలేకపోతే గ్యాస్ రీఫిల్లర్ యూనిట్లను కేంద్రం స్వాధీనంలోకి పంపుతామని, అంతేకానీ ప్రజలు చచ్చిపోతుంటే చూస్తూ కూర్చోలేమని హెచ్చరించింది. మూడు గంటల పాటు జరిగిన విచారణలో సమస్యంతా ఢిల్లీ ప్రభుత్వం వల్లనే వస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. రీఫిల్లింగ్ యూనిట్లను టేకోవర్ చేయాలని, ఆస్పత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించింది. మరోవైపు అశోకా హోటల్లో హైకోర్టు జడ్జిలు, సిబ్బంది కోసం వందరూములతో కోవిడ్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇలాంటి సదుపాయాన్ని తాము కోరలేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఈ ఆదేశాలు ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులకు తెలియకుండా వచ్చాయని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆదేశాలు తప్పని, ఇలాంటివి ప్రభుత్వానికి మేలు చేసినందుకు జడ్జిలకు సమకూరాయన్న తప్పుడు సందేశాన్నిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే? -
Delhi High Court: ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరి తీస్తాం!
న్యూఢిల్లీ: రికార్డుస్థాయిలో కోవిడ్ మరణాలు సంభవిస్తుండడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పెరిగిపోతున్న కేసులతో కరోనా సునామీలాగా విరుచుకుపడుతోందని వ్యాఖ్యానించింది. రాజధానికి సరఫరా చేసే ఆక్సిజన్‌ను ఎవరైనా అడ్డుకుంటే ఉరి తీస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. రాజధానిలో పెరిగిపోతున్న ఆక్సిజన్ కొరతపై జస్టిస్ విపిన్ సింగ్, రేఖా పల్లిల ధర్మాసనం విచారణ జరిపింది. ‘ఇది సెకండ్ వేవ్ కాదు, సునామీ. మే మధ్యనాటికి కరోనాను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నాం’ అని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం సరఫరా చేసే టాంకర్ల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారిని ఉపేక్షించమని, వారిని ఉరితీస్తామని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులెవరైనా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే తమకు నివేదించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొరత లేకుండా యత్నిస్తున్నాం కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు ప్రాణవాయువును దిగుమతి చేసుకోవడం, సాధ్యమైనంత మేర ఉత్పత్తి పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెమతా కోర్టుకు వివరించారు. చదవండి: ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు -
‘నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు’
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్‌పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్‌పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్సాల్వ్డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చదవండి: సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
మర్కజ్లో ప్రార్థనలకు అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 50 మంది ప్రజలు రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(డీడీఎంఏ) జారీ చేసిన నోటిఫికేషన్లో లేదని వివరించింది. చాలా వరకు ప్రార్థనాస్థలాలు తెరిచే ఉంటున్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. డీడీఎంఏ ఈనెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, ఇతర ప్రామాణిక కార్యాచరణ నిబంధనలకు లోబడి తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ రంజాన్ నెలలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంగణంలోని బంగ్లేవాలీ మసీదులోని బేస్మెంట్ పైనున్న మొదటి అంతస్తులో 50 మందికి రోజుకు 5 పర్యాయాలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని జస్టిస్ ముక్తా గుప్తా నిజాముద్దీన్ పోలీసులను ఆదేశించారు. డీడీఎంఏ ఉత్తర్వులతోపాటు, సామాజిక, మత, రాజకీయ, ఉత్సవ సంబంధ సమావేశాలను, ప్రజలు గుమికూడటాన్ని అనుమతించే విషయంలో అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, మరింత మందిని అనుమతించాలనీ, మసీదులోని ఇతర అంతస్తుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది రమేశ్‌గుప్తా కోరగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిజాముద్దీన్ ఎస్‌హెచ్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇలా ఉండగా, కరోనా లాక్డౌన్ అమల్లో ఉండగా వేలాదిమందితో తబ్లిగీ జమాత్ నిర్వహించిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 31వ తేదీ నుంచి మూతబడి ఉన్న నిజాముద్దీన్ మర్కజ్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూలై 15వ తేదీన విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు
మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. ఆ తర్వాత ఫేస్బుక్ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. ఈమధ్య ‘బ్రాస్ నోట్‌బుక్’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది. దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్ చేసిన వాదనను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. -
రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ సంస్థకు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేకులు వేసింది. అమెజాన్ హక్కుల పరిరక్షణకు తక్షణ మధ్యతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ సంస్థ వాదనలతో కోర్టు సంతృప్తి చెందుతున్నట్లు జస్టిస్ జేఆర్ మిద్రా పేర్కొన్నారు. “ఎఫ్‌ఆర్‌ఎల్‌సహా ఇతర ప్రతివాదులు అందరూ మంగళవారం సాయంత్రం 4.49 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇస్తున్నాం” అని జడ్జి రూలింగ్ ఇచ్చారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) వరుసగా నాలుగురోజుల నుంచీ ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదంటున్న అమెజాన్, ఇంతక్రితమే ఇందుకు సంబంధించి తమ తొలి కొనుగోలు హక్కులకు వీలు కలిగిస్తున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తోంది. తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్. ఆర్బిట్రల్ ఉత్తర్వుల అమలుకు ప్యూచర్ రిటైల్‌ను ఆదేశించాలని అమెజాన్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై అమెజాన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే చట్టబద్దంగా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు ఫ్యూచర్ రిటైల్ వెల్లడం. -
నచ్చకపోతే వాట్సాప్‌ను తొలగించండి
న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్దీ రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి మనకు తెలిసిందే. నేడు హైకోర్టు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసు ఇవ్వడానికి నిరాకరించింది. వాదనల సందర్భంగా హైకోర్టు వాట్సాప్ ఒక ప్రైవేట్ యాప్ అని ప్రజలు దీనిని ఉపయోగించకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత) విచారణ ప్రారంభంలోనే జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా పిటిషనర్‌తో మాట్లాడుతూ.. వాట్సాప్ ఓ ప్రైవేట్ యాప్ అని యూజర్లకు ఇష్టమైతే వాడుకోవచ్చునని లేదా తీసేయొచ్చునని స్పష్టం చేసారు. మ్యాప్స్, బ్రౌజర్ వంటి ఇతర యాప్స్ కూడా ఇలాంటి ప్రైవసీ విధానాలను తీసుకొచ్చాయి అని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ఒక వాట్సాప్ యాప్ నే ఒక్క వాట్సాప్‌నే నిందించడం సరికాదని సూచించింది. వినియోగదారులు ఇతర యాప్స్ యొక్క నిబంధనలు, షరతులను చదివితే వాట్సాప్ తరహా నిబంధనలే కనిపిస్తాయని పేర్కొంది. అనంతరం ఈ విచారణను జనవరి 25కు కోర్టు వాయిదా వేసింది. -
భారత్‌లో షియోమీ ఫోన్లను బ్యాన్ చేయండి
న్యూఢిల్లీ: ఫిలిప్స్ కంపెనీ షియోమీ మీద కేసు వేసింది. షియోమీ తమ పేటెంట్ల సహాయంతో రూపొందించిన మొబైల్ ఫోన్లలను అమ్మకుండా నిషేధించాలని కోరుతూ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. షియోమి ఇండియాపై చర్యలను తీసుకోవాలని కోరుతూ కంపెనీ పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన షియోమి ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని కంపెనీ హైకోర్టును కోరింది. తమ టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులను షియోమి సొంత, థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా జరిగే అమ్మకాలను నిషేధించడం మాత్రమే కాకుండా వాటి తయారీ, దిగుమతి మరియు ప్రకటనలను కూడా నిలిపివేయాలని టెక్ దిగ్గజం హైకోర్టును కోరింది. షియోమి నుండి హెచ్‌ఎస్‌పిఎ, హెచ్‌ఎస్‌పిఎ +, ఎల్‌టిఇ టెక్నాలజీలను కలిగి ఉన్న కొన్ని ఫోన్లను పేటెంట్ల ఉల్లంఘన కారణంగా వీటిని నిషేదించాలని కోర్టును కోరింది. (చదవండి: ఇన్స్టాగ్రాం: ఒకేసారి నలుగురితో లైవ్) ఫిలిప్స్ తన అభ్యర్ధనలో "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు ఆదేశాలు ఇచ్చి పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన మోడళ్లతో సహా, షియోమి మొబైల్ హ్యాండ్సెట్ల దిగుమతిని అనుమతించకుండా ఉండటానికి భారతదేశంలోని ప్రతి ఓడరేవు వద్ద కస్టమ్ అధికారులకు అధికారం ఇవ్వమని కోర్టును కోరింది". ఈ కేసు తదుపరి విచారణను 20 జనవరి 2021 తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంపై మరింత స్పష్టత ఆ రోజు లభించనుంది. ఈ విషయంపై టెక్ దిగ్గజం షియోమి నుండి ఎటువంటి అధికారికంగా స్పందన రాలేదు. -
కరోనా విజృంభణ.. రాజధాని ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,178 కరోనా కేసులు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత వరకు ఢిల్లీలో 7000 కరోనా కేసుల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. గత మూడు రోజుల నుంచి రోజుకి 6000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండో అత్యధిక కేసులు నవంబర్ 4న 6842 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,23,831కి చేరింది. గత 24 గంటల్లో 64 మరణాలు సంభవించాయని, మరణాల రేటు 1.6 శాతంగా ఉందని, రికవరీ రేటు 89 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సీతాకాలం సమీపించడంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాయు కాలుష్యం పెరగడం మూలంగానూ ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం శీతాకాలంలో వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చేస్తుందని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో రోజువారీగా కరోనా సోకే సగటు రేటు 12.2 శాతంగా ఉంటే జాతీయ సగటు రేటు 3.9 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు విజ్క్షప్తి చేస్తుంది. నగరంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ గురువారం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ సోకిన వారికి మెరగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. యాంటిజెన్ పరీక్షలలో కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్నట్లనిపిస్తే తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయాలన్నారు. ఢిల్లీలోని ఉత్తర, మధ్య, ఈశాన్య, తూర్పు, వాయువ్య ఆగ్నేయ ఆరు జిల్లాల్లో కరోనా పెరుగుదల రేటు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ కరోనా రాజధాని నగరంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం విమర్శించడమే గాక నగరం త్వరలోనే "దేశ కరోనా రాజధాని"గా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గత వారం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వ అధికారుల సమావేశంలో కరోనా కేసులు పెరగడానికి పండుగలు, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలు కాగా, 1,24,985 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య 5.2 లక్షలు. రికవరీ అయిన వారి సంఖ్య 77.66 లక్షలకు చేరింది. శుక్రవారం ఒక రోజే 54,157 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్ పలు రాష్ట్రల్లో కేసుల విపరీతంగా పెరగడంతో మళ్లీ లాక్డౌన్ ప్రకటించాలనే చర్చకుడా సాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్, ఇతర దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇదే విధంగా దేశంలో కరోనా ప్రభావం ఎక్కువైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించక తప్పదు. ఇక నుంచైనా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవనం కొనసాగించకపోతే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కోవిడ్–19 చికిత్స: సెప్టెంబర్‌లో పెరిగిన బీమా క్లెయిమ్స్
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్‌లో పెరిగింది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిశీలిస్తే, వీటిలో కోవిడ్–19 చికిత్స సంబంధిత క్లెయిమ్స్ 40 శాతానికి ఎగశాయని తమ గణాంకాల విశ్లేషణలో వెల్లడైనట్లు ఈ రంగంలో దిగ్గజ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ పేర్కొంది. నెలల వారీగా ఈ శాతాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం, మేలో ఈ రేటు కేవలం 8 శాతం ఉంటే, జూలై, ఆగస్టుల్లో వరుసగా 23, 34 శాతాలకు చేరింది. పాలసీబజార్ డాట్ కామ్‌లో ఆరోగ్య బీమా విభాగం చీఫ్ అమిత్ ఛబ్రా వివరించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... ► కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ దాఖలు చేసిన వారిలో అత్యధికులు 60 సంవత్సరాలవారు ఉన్నారు. తరువాతి శ్రేణిలో 41 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు్కలు ఉన్నారు. చదవండి: ఆ నష్టం రూ.1.25 లక్షల కోట్లు ►కరోనా కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లోనే భారీగా పెరిగింది. రికవరీ కూడా అధికంగా ఉంది. ►ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య చూస్తే, మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ వాటా 26 శాతంగా ఉంది. నాన్–కోవిడ్–19 విషయంలో ఈ రేటు 74 శాతంగా ఉంది. ఈ విభాగంలోకి గుండె, ఊపిరితిత్తులు, నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి. ►క్లెయిమ్‌లకు సంబంధించి విలువ సగటున రూ.1,18,000గా ఉంది. అయితే ఒక్క 46–50 మధ్య వయస్సువారి విషయంలో క్లెయిమ్ విలువ గరిష్టంగా రూ.2.19 లక్షలుగా ఉంది. ►బీమా రెగ్యులేటరీ సంస్థ– ఐఆర్డీఏఐ కోవిడ్–19 ప్రత్యేక పాలసీలకు అనుమతినిచ్చిన తొలి నెలల్లో వీటి కొనుగోలుకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు సమగ్ర హెల్త్ కవర్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్–10 బీమాల వైపు నుంచి మరింత సమగ్ర ప్రణాళికలవైపు మారడానికి ప్రజలకు అనుమతినిస్తూ, ఐఆర్డీఏఐ ఇచి్చన అనుమతులు హర్షణీయం. ►నెలవారీ ప్రీమియం పేమెంట్ విధానానికి అనుమతించడం హర్షించదగిన మరో కీలకాంశం. ఇప్పుడు 35 సంవత్సరాల ఒక వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,500 నెలకు చెల్లించి కోటి రూపాయల వరకూ బీమా కవర్ పొందగలుగుతున్నాడు. ►నాన్–కోవిడ్–19 క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఆసుపత్రుల్లో బెడ్ల వినియోగం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన రోగులు ఇప్పుడు చికిత్స, ఆపరేషన్లకోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండడమే దీనికి కారణం. ►పెద్దల్లో కంటి సంబంధ ఇబ్బందులు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లలో దాదాపు 20 శాతం కంటి సంబంధ చికిత్సలకు బీమా సౌలభ్యతను వినియోగించుకుంటున్నారు. తగ్గనున్న ఆసుపత్రుల లాభం :క్రిసిల్ కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ లాభం సుమారు 35–40% తగ్గనుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వైరస్ భయంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళకపోవడం,చికిత్సలను వాయిదా వేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. ఏజెన్సీ.. రేటింగ్ ఇచి్చన 36 ఆసుపత్రులతో కలిపి మొత్తం 40 హాస్పిటల్స్‌ను విశ్లేషించి రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులు ఎక్కువగా వచి్చనప్పటికీ వీటి ద్వారా పొందిన మార్జిన్ తక్కువగా ఉంది. అయితే ఈ కేసుల నుంచి అదనంగా 15–20 శాతం ఆదాయం సమకూరింది. లాక్డౌన్, ప్రయాణ సడలింపులతో జులై నుంచి రోగుల రాక క్రమంగా మెరుగు పడుతూ వచి్చంది. -
కానిస్టేబుల్ అదృశ్యం: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిస్సింగ్ కేసును ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మే 26 నుంచి కానిస్టేబుల్ వెంకట్రావు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సెలవు మంజూరు కోసం వెంకట్రావు ఢిల్లీ ధౌలాకువాలోని ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కానిస్టేబుల్ కనిపించకుండా పోవడంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేశారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) కాగా వెంకట్రావు అదృశ్యం వెనుక సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్‌కుమార్ హస్తం ఉందటూ ఆరోపణలు వస్తున్నాయి. వెంకట్రావు సెలవు కోరడంపై సంజీవ్‌కుమార్‌తో తరచుగా గొడవలు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్ఎఫ్, ఉస్మాన్‌పూర్ పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కానిస్టేబుల్ అదృశ్యంపై సమగ్ర, పారదర్శకత విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు హైకోర్టు కేసును అప్పగించింది. -
‘పంటల బీమాపై రైతులదే తుది నిర్ణయం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 25 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటి వరకు 7.49 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. బల్క్ ఇండస్ట్రీకి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే పథకం కింద విశాఖపట్నంలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకు 25 కోట్ల సాయం అందించే అంశానికి కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ మొత్తంలో 30 శాతం నిధులను ఏఎంటీజెడ్‌కు విడుదల చేసినట్లు తెలిపారు. (త్వరలో జలశక్తి మంత్రి పోలవరం పర్యటన) నాలుగేళ్ళుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుపై రైతులు ఇతర భాగస్వామ్య పక్షాలతో జరిపిన చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అందులో భాగంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా 2020 ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. పంటల బీమాపై దీర్ఘకాలికంగా రైతులు చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో చేరాలా, వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను రైతులకే విడిచిపెట్టినట్లు మంత్రి తెలిపారు. 2020 ఖరీప్ సీజన్లో పంటల బీమాకు సంబంధించి అందిన వివరాల ప్రకారం పంటలు బీమా చేసుకునే రైతుల సంఖ్య గత ఖరీప్ సీజన్ మాదిరిగానే ఉందని చెప్పారు. (ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన) -
రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు. క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించి.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్ కౌర్‌కు నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడలా భూదేవి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 96 ఏళ్ల కాత్యాయని అమ్మ, భగీరతి అమ్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన కవలలు తషీ మాలిక్, మన్ కౌర్‌తోపాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ మోహన జితర్వాల్, అవని చతుర్వేది, భావన కాంత్, బీహార్‌కు చెందిన (మశ్రూమ్ మహిళ) బినా దేవికి నారీ శక్తి పురస్కారాలు అందజేశారు. -
ఢిల్లీ అల్లర్లు : రాహుల్, ప్రియాంకలపై పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : డిల్లీ అల్లర్లకు సంబంధించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసనల వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిగౌతమ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఢిల్లీ ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక సామాజిక కార్యకర్తలు హర్ష్ మందర్, ఆర్జే సయేనా, నటి స్వర భాస్కర్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సంజీవ్ కుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సోనియా, రాహుల్, ప్రియాంక, ఓవైసీ సోదరులు, వారిస్ పఠాన్, మనీష్ సిసోడియా, అమనతుల్లా ఖాన్, మహ్మద్ ప్రచాలు ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ లీగల్ సెల్ సభ్యులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. చదవండి : ఢిల్లీ పోలీసులపై మాలివాల్ అసంతృప్తి -
నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార ఘటనలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసులో ఒక దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్ కోసం వెయిట్ చేయాల్సి అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది. మరణ శిక్షరద్దుపై ముకేశ్, వినయ్ శర్మ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ముందుస్తుదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ మధ్యాహ్నానికి (భోజన విరామం తరువాత) వాయిదా పడింది. 2012 నిర్భయ కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) ల ఉరి శిక్ష జనవరి 22న అమలు చేయలేమని, ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల స్టాండింగ్ కౌన్సెల్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22 న ఉరితీయలేమని వారు తేల్చి చెప్పారు. చదవండి : నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు -
నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..!
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్‌కుమార్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఏపీ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తన క్లైంట్ పవన్‌కుమార్ నిర్భయ ఘటన జరిగిన సమయంలో (2012, డిసెంబర్ 16) మైనారిటీ (జువైనల్) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కుమార్‌ను జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఏపీ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు చూపకుండా పిటిషన్ వేయడం.. విచారణ సమయంలో గైర్హాజరు కావవడంపై మండిపడింది. కోర్టుకు నివేదించిన సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్‌కుమార్ జువైనల్ కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే లాయర్ ఏపీ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. ఇక నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్, తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. -
ఉన్నావ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. -
సరెండర్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
-
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఊరట
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్లో పేర్కొంది. సెక్షన్ 416 ప్రకారం ఒక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని పిటిషన్లో తెలిపింది. ఢిల్లీ హై కోర్టు సోమవారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు.. మన్మోహన్ సింగ్ నుంచి కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్‌ను, సినిమాను నిషేధించండి’ అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు పిటిషనర్ పూజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్ డిజైనర్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చారు. అసలు పిటిషన్ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ట్రైలర్‌ను నిషేధించడానికి వీల్లేందంటూ తీర్పునిచ్చారు. యూపీఏ - 1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ దర్గాలో మహిళల ప్రవేశంపై నేడు హైకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని హజ్రత్ నిజూముద్దీన్ దర్గాలోనికి మహిళ ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనుంది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకుని దర్గాలో మహిళలను అనుమతించాలని పూణేకు చెందిన న్యాయ విద్యార్ధినులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 27న తాము దర్గాను సందర్శించేందుకు వెళ్లగా దర్గా వెలుపల మహిళలకు ప్రవేశం లేదని నోటీసు అతికించారని పిటిషన్లో వారు పేర్కొన్నారు. దర్గాలోనికి మహిళల ప్రవేశాన్ని అనుమతించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులతో పాటు దర్గా నిర్వహణ కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయాలని కోరారు. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, మసీదులోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షగా పరిగణించాలని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ముంబైలోని హజి అలీ దర్గా, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాల్లో మహిళలను అనుమతిస్తున్న ఉదంతాలను పిటిషన్లో వారు ప్రస్తావించారు. -
దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు
సాక్షి, న్యూఢిల్లీ : స్వామీజీగా చెప్పుకునే దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసును సీబీఐకి బదలాయించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు విచారణను చేపట్టారు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్ధలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఓ మహిళా శిష్యురాలు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లిందని, తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను లొంగదీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బాధితురాలు కోర్టును కోరారు. దాతీ మహరాజ్‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులను, దర్యాప్తు సంస్ధలను కోర్టు తీవ్రంగా మందలించింది. -
కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ‘ఐఎన్ఎక్స్ మీడియా’ అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు చూపాలని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే సీబీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిల్‌పై బయట ఉన్న సమయంలో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు రూ.4.5 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న కార్తీని సీబీఐ అరెస్టు చేసింది. ఆ మేరకు కోర్టు విధించిన 12 రోజుల జ్యూడీషియల్ కస్టడీ శనివారంతో ముగియనుంది. -
కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందానా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి తయారైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం గండం నుంచి బయటపడుదామనుకున్న ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 20మంది తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ ఆప్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈసీ సిఫారసుపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడేం చేయాలోనని ఆప్ పార్టీ తలబద్దలు కొట్టుకొనే పరిస్థితి తయారైంది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింన విషయం తెలిసిందే. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి ఈ మేరకు నివేదికను పంపింది. దీంతో ఈసీ నిర్ణయంపై స్టే తెచ్చేందుకు ఆప్ కోర్టుకు వెళ్లగా ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆప్‌ను ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ పిలిచినప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లలేదని, ఈసీ ప్రొసీడింగ్స్‌కు ఎందుకు హాజరుకాలేదని నిలదీసింది. -
శరద్ సభ్యత్వం రద్దుపై స్టే కుదరదు’
న్యూఢిల్లీ: జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ సభాధ్యక్షుడు ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయని జడ్జి జస్టిస్ విభు బఖ్రు స్పష్టం చేశారు. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవనుంది. -
తలసేమియా విద్యార్థికి ఎంబీబీఎస్ సీటివ్వండి
న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడుతున్న విద్యార్థిని వైకల్యం కేటగిరీ కింద ఎంబీబీఎస్ కోర్సులో చేర్చుకోవాలని ఇంద్రప్రస్థ వర్సిటీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది. వర్సిటీ పరిధిలోని కళాశాలలో చేర్చుకోవాలంది. తలసేమియాతో బాధపడుతున్న తనను వైకల్యం కేటగిరీ కింద వర్సిటీలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జడ్జి జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని జనరల్ కేటగిరీ నుంచి వైకల్యం కేటగిరీకి 2017, జూలై 16న మార్చినట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ యాక్ట్ 2016’ ప్రకారం వైకల్యం ఉన్న వారి రిజర్వేషన్‌ను 3 నుంచి 5కు పెంచిందని ఆ కేటగిరీలో సీటు కేటాయించాలని సూచించింది. -
'ఇంట్రెస్ట్ లేనట్లుంది మీకు'.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనిపించకుండాపోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్‌ను కనిపెట్టే విషయంలో పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నట్లుందని వ్యాఖ్యానించింది. ఏబీవీపీ విద్యార్థుల దాడి అనంతరం తమ కుమారుడు కనిపించకుండాపోయాడని నజీబ్ అహ్మద్ తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును విచారించే బాధ్యతను సీబీఐకి ఐదు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు అప్పగించింది. అయితే, ఇన్ని రోజులైనప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. 'ఎలాంటి పురోగతి లేదు.. కనీసం పేపర్పైనైనా ఎలాంటి ఫలితాలు లేవు. ఈ కేసుపై సీబీఐకి ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. అసలు ఆ విద్యార్థి జాడ తెలుసుకుంటారా లేదా' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. -
రేప్ కేసులో కో డైరెక్టర్‌కు విముక్తి!
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'పీప్లీ లైవ్' సినిమా సహ దర్శకుడు మహమూద్ ఫరుఖీకి ఢిల్లీ హైకోర్టులో విముక్తి లభించింది. ఈ రేప్ కేసులో ఆయనను నిర్దోషిగా హైకోర్టు తేల్చింది. ఈ కేసులో కింది కోర్టు ఆయనకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైకోర్టు కొట్టివేసింది. భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలు ఫిర్యాదు మేరకు జూన్ 19, 2015న ఢిల్లీ పోలీసులు ఫరూఖీపై కేసు నమోదు చేశారు. కొలంబియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని అయిన సదరు మహిళ 2015 మార్చి 28న సుఖ్‌దేవ్ విహార్‌లోని నివాసంలో ఫరూఖీ తనపై అత్యాచారం జరిపాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, సంశయలాభం కింద ఢిల్లీ హైకోర్టు ఈ అభియోగాలను కొట్టివేయడంతో ఫరూఖీకి విముక్తి లభించింది. -
మున్సిపల్ సంస్థలకు నిధులపై సర్కారుకు హైకోర్టు నోటీసు
మే 13లోగా జవాబివ్వాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ : మున్సిపల్ సంస్థలకు నిధుల కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరింది. మున్సిపల్ సంస్థలకు నిధులు సమానంగా మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణీ, న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనపై వాదనలు విన్న అనంతరం ఢిల్లీ సర్కారుతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్, మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు, భారత ఫైనాన్స్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు మే 13లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సరిగ్గా తమ విధులను నిర్వర్తించేందుకు తక్ష ణం నిధులు విడుదల చేసేలా ఢిల్లీ సర్కారును, లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ‘క్యాంపెయిన్ ఫర్ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ డెవలప్మెంట్ ప్లానింగ్’ అనే ఎన్జీవో సంస్థ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సర్కారుకు నోటీసు నమిలే పొగాకు ఉత్పత్తులపై నగరంలో విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆప్ సర్కారుకు నోటీసు జారీచేసింది. మే 20న తదుపరి విచారణ జరిపేంత వరకు పొగాకు ఉత్పత్తుల అమ్మకందారులపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని సర్కారును ఆదే శించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్షక్దర్ బుధవారం విచారించారు. వాదనలు విన్న అనంతరం ఢిల్లీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు న్యాయమూర్తి నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరారు. ఆహారభద్రత, ప్రమాణాల చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదని పిటిషనర్ సుగంధీ స్పఫ్ కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. -
అడ్మిషన్లకు కొత్త షెడ్యూలు
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అంతర్రాష్ట్ర బదిలీ కేసుల్లో ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేసి గురువారం కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) హైకోర్టుకు బుధవారం తెలిపారు. ఎల్జీ తాజా ప్రకటనతో ప్రస్తుతం అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీలకు ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేయడంతోపాటు పాయింట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం న్యాయమూర్తి మన్మోహన్‌కు తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతర్రాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయిస్తారు. 75 నుంచి 100 మధ్య పాయింట్లు వచ్చిన వారి పేర్లు మాత్రమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయిన తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సుధాంశు జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎల్జీ పైవిధంగా వివరణ ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని బెంచ్‌కు కూడా ఇదే తరహా కేసు వచ్చింది. అంతర్రాష్ట బదిలీలకు పాయింట్లు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదిలా ఉంటే వికలాంగుల కోటాల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఎంతో చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం సీట్లలో మూడుశాతం సీట్లను వారికి కేటాయించా ల్సిందేనని హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది.