
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు. క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించి.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్ కౌర్‌కు నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడలా భూదేవి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 96 ఏళ్ల కాత్యాయని అమ్మ, భగీరతి అమ్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన కవలలు తషీ మాలిక్, మన్ కౌర్‌తోపాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ మోహన జితర్వాల్, అవని చతుర్వేది, భావన కాంత్, బీహార్‌కు చెందిన (మశ్రూమ్ మహిళ) బినా దేవికి నారీ శక్తి పురస్కారాలు అందజేశారు.








Comments
Please login to add a commentAdd a comment