రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment