సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వనపర్తి జిల్లా పెద్దగూడేనికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అత్యధిక (59,997) ఓట్లు సాధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) అధికారికంగా ప్రకటించింది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు లభించిన ఓట్లు, వారు పొందిన పోస్టుల వివరాలను శుక్రవారం ఐవైసీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ మేరకు ఎం.రాజీవ్‌రెడ్డి (52,203) ఓట్లతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు పోరిక సాయిశంకర్ ఎస్టీ కోటాలో మరో ఉపాధ్యక్షుడిగా 21,862 ఓట్లతో ఎన్నికయ్యారు.
ఇటు సామా రామ్మోహన్‌రెడ్డి, వర్రి లలిత్, నాగిరెడ్డి సందీప్‌రెడ్డి, కె.దేవిక, ఎం.అరవింద్‌కుమార్, సామ్రాట్ వంశీ, టి.రాకేశ్ యాదవ్, ఆర్.గోపీకృష్ణ, కీసర దిలీప్‌రెడ్డి, వనం హర్షిణి, వాద్యాల రాఘవేందర్‌రెడ్డి, నల్లా ప్రతాప్‌రెడ్డి, ఆర్.శ్రవణ్‌రావు, రాకేశ్, రాథోడ్ సేవాలాల్, గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇషాక్, కె.రాణి, విద్యారెడ్డి, ఆమీర్ జావెద్, ఎన్.ప్రభాకర్, టి.మౌనిక, సీహెచ్.ధనలక్ష్మి, కూరపాటి మౌనిక, పి.నిర్మల, గోపరాజు రవి, టి.సాగరికారావులు ప్రధాన కార్యదర్శులుగా గెలుపొందారు. ఇక, మహిళా కోటాలో ఉపాధ్యక్షురాలిగా నేనావత్ ప్రవల్లిక గెలుపొందినట్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment