youth congress
-
గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ గొడవపై అధ్యక్షుడు శివ చరణ్ స్పందించారు. ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ‘‘ఎన్నికైన వారినే ఇవాళ సమావేశానికి ఆహ్వానించాం. ఎన్నిక కానీ వారు మీటింగ్‌లోకి వచ్చి డిస్ట్రబ్ చేశారు. ఓడిపోయిన వారు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వయసుకు సంబంధించిన అంశాలన్నీ చెక్ చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించారు. బయట జరిగిన గొడవ గురించి నాకు తెలియదు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపై సమీక్ష చేసుకుంటాం’’ అని శివచరణ్ చెప్పారు. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి కోసం తీవ్ర పోటీ
-
యూత్ కాంగ్రెస్ ‘నారాజ్’
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్‌పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. నేడు ‘బుజ్జగింపు’ భేటీ? యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్‌కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
టీ కాంగ్రెస్‌లో సొంత నేతలపైనే ట్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటి దొంగల కదలికలు బయటపడుతున్నాయా?. సొంత నేతలను, అదీ సీనియర్లను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ రగడ వెలుగుచూసిన తరుణంలో ప్రస్తుతం ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. తనతో పాటు ఇతర నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తనపైనా, ఓ సీనియర్‌పైనా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మే 5వ తేదీన ఉత్తమ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెంబర్ నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ నెంబర్ భీమవరానికి చెందిన ఓ మహిళ పేరు మీద ఉందని గుర్తించారు. కానీ, ఆ నెంబర్ వాడిన లొకేషన్ మాత్రం ఉత్తమ్ ఇంటి సమీపంలోనే ఉంది. ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఓ ప్లాట్ నుంచి ఈ తతంగం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆ ప్లాట్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పేరు మీద ఉండడం, ఆ విభాగపు ఇంఛార్జి జయల ప్రశాంత్ తన టీంతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, డేటా సేకరించారు. ఐదు కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. ప్రశాంత్‌పై కేసు నమోదు మరోవైపు భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్ కాంగ్రెస్ మీటింగ్‌లో కూడా ఆయన.. తనపైనా ఇదే తరహా ప్రచారం జరుగుతోందని అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి. తమ విచారణలో ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ క్యాంపెయిన్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తేల్చారు. అనుచిత పోస్టులతో ట్రోలింగ్‌కు పాల్పడినందుకుగానూ ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రశాంత్‌పై వేటు.. ఉత్తమ్‌కుమార్‌తో పాటు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క్, మరికొందరు నేతలపైనా ఈ ట్రోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టలు చేసినందుకుగానూ ప్రశాంత్‌పై పార్టీ వేటు వేసింది. అయితే.. ఈ పరిణామంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివనసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే.. వార్‌రూమ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన. ఈ వ్యవహారం ఇక్కడితోనే చల్లారుతుందా? లేదంటే ఇంకా ఎక్కడిదాకా అయినా వెళ్తుందా? అనే వేచిచూడాలి. -
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండలో యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడి ఉత్కంఠ, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దాడిలో గాయపడ్డ పవన్‌ను హనుమకొండలోని ఏకశిల ఆస్పత్రిలో మంగళవారం పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ముందు బైటాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే వినయ్భాస్కర్పై హత్యా నేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్‌ని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు. ‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీతోనే వివాదం.. రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఓరుగల్లులో అలజడి సృష్టించింది. హనుమకొండలో సోమవారం రాత్రి జరిగిన పాదయాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యేపై విడుదల చేసిన చార్జిషీట్‌తో ‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీని యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముగియగానే దారికాచి పవన్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలతో పవన్ స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొద్ది గంటలకు స్పృహలోకి వచ్చిన పవన్ తనను హతమార్చేందుకే బీఆర్ఎస్కు చెందిన రంజిత్ రెడ్డి, రాజ్‌కుమార్, అభిలతోపాటు సుమారు 15 మంది దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అపోలోకు పవన్.. పోలీసుల అదుపులో ఐదుగురు...? పవన్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని డాక్టర్లు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న ప్రత్యేక బృందాలు పవన్‌పై దాడి ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలకు వివరించారు. చట్టపరంగా విచారణ జరిపి త్వరలోనే నిందితులందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు రేవంత్ రెడ్డి పిలుపు.. పోలీస్ కమిషనరేట్ ఎదుట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాడి వెనుక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. హత్యాయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను సీజ్ చేయాలని, రక్త నమూనాలు సేకరించి గంజాయి మత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దాడులతో రాజకీయం చేయాలంటే డేట్ డిసైడ్ చేయండంటూ సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. పాదయాత్ర దగ్గర దాడి అంటేనే... కాంగ్రెస్ పార్టీపై, నేతలపై జరిగిన దాడిలా చూడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలు ఈ దాడిని సీరియస్‌గా తీసుకుని గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో నిరసన, ధర్నాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చదవండి: బెల్ట్ షాపులుంటే బట్టలూడదీసి బొక్కలో వేయిస్తా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం
-
రాహుల్ పర్యటన వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హస్తం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం.. గుజరాత్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం అధిష్టానానికి లేఖ రాశారు. ఆ లేఖలో తాను కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం చెప్పలేదు. మరోవైపు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సోమవారం(సెప్టెంబర్ 5న) గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ చీఫ్ వాఘేలా పార్టీని వీడటం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ పాల్గొంటారు. అలాగే సెప్టెంబర్ 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో బూత్ స్థాయి కార్యకర్తల ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఇక, వాఘేలా రాజీనామాపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ‘రాహుల్ గాంధీ రేపు గుజరాత్‌కు వస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది’ అని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, గుజరాత్ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేలు సైతం ఆప్ గెలుస్తుందని చెబుతున్నాయని కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా చేశారు. Ahead of @RahulGandhi 's Gujarat Visit, a Big blow for #Gujarat #Congress , @IYCGujarat President Vishwanath Singh Vaghela resigned from the Primary member Ship of @INCGujarat , he may join @BJP4Gujarat soon.@NewIndianXpress@TheMornStandard@santwana99 pic.twitter.com/80niFKbvbI — Dilip Singh Kshatriya (@Kshatriyadilip) September 4, 2022 -
గెస్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వచ్చే సోమవారం కల్లా వారిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని, లేదంటే మంగళవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేసింది. అతిథి అధ్యాపకుల (గెస్ట్ లెక్చరర్లు)ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేసేవారని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారిని విధుల్లోకి తీసుకోలేదని ఆ వినతిపత్రంలో తెలిపారు. కళాశాలల్లో అధ్యాపకులే లేరని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఎలా చేరతారని ప్రశ్నించారు. అలాగే గత విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చరర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. అంతకుముందు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కూడా కలిసిన శివసేనారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. -
HYD: హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చే సమయంలో ఆయనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించినట్టు సమాచారం. దీంతో, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం -
యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతోష్
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధా న కార్యదర్శిగా వికారా బాద్‌కు చెందిన సంతోష్ కోలుకుండను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కొత్తగా 10 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 49 మంది జాతీయ కార్యదర్శులు, 9 మంది సం యుక్త కార్యదర్శులు, 8 భిన్న విభాగాలకు చైర్మన్లను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. నల్లగొండకు చెందిన మమత నాగిరెడ్డి, మంచి ర్యాలకు చెందిన శ్రవణ్‌రావు, వరంగల్‌కు చెందిన సాగరిక రావులతో పాటు ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బి.రమేశ్ బాబులను జాతీయ కార్యదర్శులుగా నియమించారు. -
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్
-
విరిగిన లాఠీ.. అసెంబ్లీ ముట్టడి భగ్నం
భువనేశ్వర్: పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని పలు సమస్యలపై శాసనసభ ముట్టడికి ప్రయత్నించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, అసలైన నిందితుల గుర్తింపు, ఇదే ఘటనలోని ప్రధాన సూత్రధారి మంత్రి దివ్యశంకర మిశ్రా మంత్రి మండలి బహిష్కరణ వంటి డిమాండ్లతో అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో మాస్టర్ క్యాంటీన్ ఛక్ ప్రాంతంలో ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలపై ఖాకీలు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో పలువురికి తీవ్రగాయాలు కాగా, మరికొంతమంది తలలు పగిలాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం, పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సర్కారు చర్యలు ఉన్నాయని విమర్శించాయి. నగరంలోని కాంగ్రెస్ భవన్ నుంచి మాస్టర్ క్యాంటీన్ ఛక్, లోయర్ పీఎమ్‌జీ మీదుగా శాసనసభ ముట్టడించేందుకు వెళ్తుండగా, ఈ దాడి చోటుచేసుకుంది. ఇదే తరహాలో గురువారం బీజేపీ యువ మోర్చా చేపట్టిన ఆందోళనను సైతం పోలీసులు లాఠీచార్జ్‌తో అడ్డుకోవడం గమనార్హం. సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్.. యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, పోలీసుల జులం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పోలీస్ యంత్రాంగాన్ని చట్టాలకు విరుద్ధంగా వినియోగించుకుంటోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ భవన్‌లోకి చొరబడి మరీ పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషంగా కాంగ్రెస్ చీఫ్ విప్ తారాప్రసాద్ బాహిణీపతి పేర్కొన్నారు. దీనిని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇకనైనా నవీన్ సర్కారు ఈ చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం ఈనెల 17వ తేదీ సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని నిర్ణయించారు. అయితే మోదీ పాలనతో యువతకు ఒరిగిందేమీ లేదనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధం యువజన కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ తరహాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ఏడున్నరేళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చేముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే దేశంలో నిరుద్యోగిత 2.4 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగిందని తెలిపారు. చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ Let's Celebrate the birthday of PM Modi as #NationalUnemploymentDay. The Man who pushed India towards record-breaking unemployment & made the whole of India Unemployed. #HallaBol pic.twitter.com/cmZYLairF2 — Srinivas BV (@srinivasiyc) September 15, 2021 -
కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా
సాక్షి, హైదరాబాద్: ‘నేను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డిని, నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమి వ్వండి.. యూత్ కాంగ్రెస్ వాళ్లకు టికెట్లు ఇవ్వరా? ఆ కోటాలో మాకు టికెట్లివ్వండి అంటే ఇచ్చేది లేదు’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడి మోకాలిచిప్పలు పగులగొట్టుకుంటే రాహుల్‌పక్కన కూర్చునే అవకాశం దక్కిందని, అలా కష్టపడి పనిచేసే నాయకులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేస్తే ఇంటికే వచ్చి బీఫారం ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం శంషాబాద్‌లోని మేఫెయిర్ కన్వెన్షన్ హాల్లో శివసేనారెడ్డి అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, ఈ దేశానికి, రాష్ట్రానికి ఎంతో మంది నాయకులను అందించిన చరిత్ర యూత్ కాంగ్రెస్‌కు ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. అయితే, వారంతా ఎంతో కష్టపడి నాయకులుగా ఎదిగారని, ప్రస్తుత యూత్ కాంగ్రెస్ నాయకత్వం కూడా క్రియాశీలకంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో అయినా సంక్షోభ సమయంలోనే నాయకులు తయారవుతారని, ఆ స్థితి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉందని, అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓనర్లు ఎవరూ లేరని, ఎవరు కష్టపడి పనిచేస్తే వారే నాయకులని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సవాల్‌గా తీసుకుని పోరాడాలి: మాణిక్యం రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడమే మన లక్ష్యం. ఇంకా 20 నెలల సమయమే ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మనం గెలిచి తీరాలి అనే కసితో పనిచేయాలి’ అని వ్యాఖ్యానించా రు. సమావేశానికి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, రాష్ట్ర ఇన్చార్జి కృష్ణ అల్లవారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, మల్లురవితో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
కాంగ్రెస్ నేత శివసేనారెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఇటీవల ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో శివసేనారెడ్డి గాయపడిన విషయం తెలిసిందే. మోకాలు ఫ్రాక్చర్ కావడంతో చికిత్స తీసుకున్న ఆయనను యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో రాహుల్ ప్రత్యేకంగా కలిసి ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. తనకు అండగా ఉంటానని రాహుల్ భరోసానిచ్చారని శివసేనారెడ్డి తెలిపారు. -
అనవసర వివాదం
సంక్షోభకాలంలో సంయమనం పాటించడం, దాన్నుంచి గట్టెడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించటంలో నిమగ్నం కావడం కీలకం. అనవసర వివాదాల్లో తలదూర్చి వాటికోసమే శక్తి యుక్తుల్ని వెచ్చిస్తే అందువల్ల ఒరిగేదేమీ వుండదు సరికదా...నష్టపోతాం. ఈమధ్య ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడినవారికి యువజన కాంగ్రెస్ ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని మొదలెట్టింది. పలు ఇతర సంస్థలు కూడా ఈ విషయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. పలుకుబడిగల కొందరు వ్యక్తులు సైతం రోగులను ఆదుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటా ఈ భోగట్టా కనబడుతూనేవుంది. ఇలాంటి సంస్థలనూ, వ్యక్తులనూ అందరూ ప్రశంసించాల్సిందే. ఎందుకంటే కష్టకాలంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. సమాజంలో చొరవ, స్థోమత వున్న ప్రతి ఒక్కరూ పూనుకున్నప్పుడే సంక్షోభాల నుంచి సురక్షితంగా బయటపడగలం. కానీ నాలుగైదు రోజులనాడు కేంద్రానికీ, కాంగ్రెస్‌కూ మధ్య జరిగిన చిన్నపాటి వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై మన దేశం ప్రతిష్టను మసకబార్చింది. ఢిల్లీలోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం తమకు ఆక్సిజన్ సిలెండర్ అవసరమైందంటూ ట్విటర్ ద్వారా యువజన కాంగ్రెస్‌ను కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఆ విభాగం అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ బృందం వెంటనే కదిలి ఆ కార్యాలయానికి సిలెండర్ అందించింది. సహజంగానే కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కేంద్రాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి విపక్ష విభాగం వెనువెంటనే స్పందిస్తుంటే, విదేశాంగ శాఖ కార్యాలయం నిద్రపోతోందా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే... మృదువుగా మాట్లాడే విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఎందుకనో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది అయాచితంగా చేసిన సాయమంటూ చురక అంటించారు. దాంతో ఆగక ఆ రాయబార కార్యాలయాన్ని తాము సంప్రదించామని, వారివద్ద కరోనా కేసులే లేవని వెల్లడైందంటూ ముక్తాయించారు. నగరంలో అనేకమంది పౌరులు ఆక్సిజన్ కోసం ఆత్రపడుతున్న తరుణంలో చవకబారు ప్రచారం కోసం ఫిలిప్పీన్స్ కార్యాలయం కోరకుండానే సిలెండర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. యువజన కాంగ్రెస్ ఊరుకోలేదు. అడిగాకే ఇచ్చామంటూ ఈ విషయంలో జరిగిన సంభాషణల ట్వీట్లను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ దౌత్య కార్యాలయం కూడా ఆ మాదిరే అడిగింది. కానీ జరుగుతున్న జగడాన్ని చూసి చడీచప్పుడూ లేకుండా తన ట్వీట్‌ను తొలగించి సారీ చెప్పింది. ఆక్సిజన్ అవసరమై ‘అన్ని విధాలా’ తాము ప్రయత్నించామని, దీనికి పెడర్థాలు తీయడం వల్ల ఉపసంహరించుకుంటు న్నామని తెలిపింది. నిజానికి వివాదం అయింది ఫిలిప్పీన్స్ విషయంలో మాత్రమే. కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన వేళ ఉద్వేగాలు పెరగడం సహజం. దేశ పౌరులకే ఆక్సిజన్ విషయంలో రకరకాల అనుభవాలు ఎదురవుతుంటే, వేరే దేశాలవారికి ఎలాంటి భయాలుంటాయో సులభంగానే గ్రహించవచ్చు. కరోనా బారిన పడుతున్న సహచరులకు వైద్యసాయం అందించ డానికి వారు ఆత్రపడటాన్ని అర్థం చేసుకోవచ్చు. టాంజానియా హైకమిషన్‌లోని కల్నల్ మోజెస్ బీటస్ మ్లూలా గత నెల 28న ఢిల్లీ ఆసుపత్రిలో మరణించాక దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిలో ఆందోళన బయల్దేరింది. అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, స్వీడన్, నేపాల్ దౌత్య కార్యాలయాలల్లో పనిచేసేవారిలో ఈమధ్య కరోనా కేసులు బయటపడ్డాయి. అమెరికా రాయబార కార్యాలయంలో సిబ్బంది, వారి బంధువులతోసహా వందమందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మన పౌరుల్లా వారు బాహాటంగా అన్నీ బయటకు చెప్పలేరు. సమస్యలెదురైనా దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నిస్తారు. విదేశాంగ శాఖలో వుండే ప్రోటోకాల్ చీఫ్, వివిధ దేశాల దౌత్య సిబ్బంది వ్యవహారాలను చూసే డివిజన్ల చీఫ్‌లు అనారోగ్య సమస్యల విషయంలో చురుగ్గా స్పందిస్తారు. వారిని ఆసుపత్రుల్లో చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటారు. ఇదంతా సక్రమంగా జరిగితే దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందిలో కరోనా తలెత్తిందన్న విషయం కూడా బయటకు తెలిసే అవకాశం వుండదు. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఏర్పడిన లోపంవల్ల ఫిలిప్పీన్స్ దౌత్య కార్యాలయం యువజన కాంగ్రెస్‌ను సంప్రదించివుండొచ్చు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎలా స్పందించినా ప్రభుత్వం అక్కడితో దాన్ని వదిలి, లోటుపాట్లేమైనా వుంటే సరిదిద్దుకుని వుంటే బాగుండేది. అందుకు భిన్నంగా బహిరంగ వేదికలపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవటంతో రచ్చ అయింది. స్విట్జర్లాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా ఈ విషయంలో స్పందించక తప్పలేదు. తమ దౌత్య సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడిన విషయం నిజమేనని తెలిపారు. మావాళ్లు సరైనమార్గంలో ప్రయత్నించలేదని, అందుకు క్షమాపణ చెప్పారని అన్నారు. ఆమె ఇతరత్రా అంశాల జోలికి పోకుండా ఒక్కమాటలో ముగించారు. సాధా రణ సందర్భాల్లో అయితే దౌత్యంలో తలపండిన జయశంకర్ కూడా ఇలాగే మాట్లాడేవారు. కానీ ఆయన నోరు జారి అంతా అబద్ధమని, చవకబారు ప్రచారయావ మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేసి వివాదాన్ని పెంచారు. సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరిగిన ప్రస్తుత దశలో ప్రతిదీ రచ్చకెక్కి మనల్ని నలుగురిలో పలుచన చేస్తుందని అందరూ గుర్తించడం మంచిది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వనపర్తి జిల్లా పెద్దగూడేనికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అత్యధిక (59,997) ఓట్లు సాధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) అధికారికంగా ప్రకటించింది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు లభించిన ఓట్లు, వారు పొందిన పోస్టుల వివరాలను శుక్రవారం ఐవైసీ వెబ్సైట్లో ఉంచారు. ఈ మేరకు ఎం.రాజీవ్‌రెడ్డి (52,203) ఓట్లతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు పోరిక సాయిశంకర్ ఎస్టీ కోటాలో మరో ఉపాధ్యక్షుడిగా 21,862 ఓట్లతో ఎన్నికయ్యారు. ఇటు సామా రామ్మోహన్‌రెడ్డి, వర్రి లలిత్, నాగిరెడ్డి సందీప్‌రెడ్డి, కె.దేవిక, ఎం.అరవింద్‌కుమార్, సామ్రాట్ వంశీ, టి.రాకేశ్ యాదవ్, ఆర్.గోపీకృష్ణ, కీసర దిలీప్‌రెడ్డి, వనం హర్షిణి, వాద్యాల రాఘవేందర్‌రెడ్డి, నల్లా ప్రతాప్‌రెడ్డి, ఆర్.శ్రవణ్‌రావు, రాకేశ్, రాథోడ్ సేవాలాల్, గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇషాక్, కె.రాణి, విద్యారెడ్డి, ఆమీర్ జావెద్, ఎన్.ప్రభాకర్, టి.మౌనిక, సీహెచ్.ధనలక్ష్మి, కూరపాటి మౌనిక, పి.నిర్మల, గోపరాజు రవి, టి.సాగరికారావులు ప్రధాన కార్యదర్శులుగా గెలుపొందారు. ఇక, మహిళా కోటాలో ఉపాధ్యక్షురాలిగా నేనావత్ ప్రవల్లిక గెలుపొందినట్టు వెబ్సైట్లో పేర్కొన్నారు. -
ట్రాక్టర్ దగ్ధం : పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన ఘటనలో పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బృందర్ ధిల్లాన్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ దగ్థం కేసులో దర్యాపు కొనసాగుతోందని, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసి వీరిపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఇండియా గేట్ వద్ద ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా వారు ట్రాక్టర్‌కు నిప్పంటించడం కలకలం రేపింది. చదవండి : భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం -
ఉద్యోగాలేవీ?: రాహుల్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్ కాంగ్రెస్ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్ కాంగ్రెస్ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్ పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. -
రేవంత్, కోమటిరెడ్డి వైపు మొగ్గు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికకు రెండు రోజులపాటు ఇక్కడ నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 28 మంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవారు, యువజన కాంగ్రెస్ జాతీయ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి జేబీ మాథుర్ వీరిని ఇంటర్వ్యూ చేశారు. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మీరు ఏరకంగా సమర్థులు? పదవి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీకు కాని పక్షంలో ఎవరిని ఈ పదవికి సూచిస్తారు? వంటి సాధారణ ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కొత్తగా పీసీసీ అధ్యక్ష పదవికి మీరు ఎవరిని సూచిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల పేర్లను సూచించినట్లు తెలిసింది. (ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రేవంత్) -
ఎన్నార్సీకి నిరసనగా జాతీయ నిరుద్యోగ రిజిస్టర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్నార్సీ)కి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ (ఎన్యూఆర్) ప్రక్రియను ప్రారంభించారు. తమకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమేనని ఎన్నార్సీ కాదని గురువారం గాంధీభవన్‌లో నిరుద్యోగ పట్టభద్రులు తమ నిరసన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గురజాల వెంకట్ల ఆధ్వర్యంలో ఇడ్లీలు, చాయ్‌లు అమ్ముతూ, చెప్పులు కుడుతూ, టైర్లు రిపేర్ చేస్తూ ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ తయారీ కోసం జాతీయ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న మిస్డ్ కాల్ క్యాంపెయిన్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకునేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగులు 81519 94411 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ వ్యవహారశైలికి నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. కేంద్రం అవలంబిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఈనెల 30న ఏఐసీసీ ఆధ్యర్వంలో నిర్వహించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం గాంధీభవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి మాథెర్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
‘మహా’ యువతకు కాంగ్రెస్ వరాలు
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువతకు భారీ హామీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలోని సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇస్తామని హామీ ఇచ్చింది. ఉన్నత విద్య చదివే యువతకు, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్షిప్లు ఇస్తామని ప్రకటించింది. వికలాంగ యువత ఉన్నత విద్యకు అయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని తెలిపింద. ‘మేలుకో మహారాష్ట్ర.. రేపటి కోసం ఇప్పుడే పనిచేయి’ అన్న ప్లాట్‌ఫాం కింద మూడు కోట్ల మంది యువత పాల్గొన్నారని, వారి ఆలోచన ప్రతిబింబమే తాము ప్రకటించిన యూత్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే తెలిపారు. యువతాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద యువతకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కఠినమైన డ్రగ్ చట్టాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం వంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్, సివిక్స్ వంటి సబ్జెక్టులను విద్యలో భాగం చేస్తామన్నారు. -
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
-
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో భారీ ట్రాఫిక్ జరిమానాలు విధిస్తుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ గురువారం వినూత్న నిరసనను చేపట్టింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసం ఎదుట కొన్ని మోటారు బైక్‌లను వదిలేసింది. ఈ బైక్‌ల ధరల కన్నా చలాన్ల రుసుమే ఎక్కువగా ఉందని, నమ్మశక్యంగానీరీతిలో విధించిన ఈ చలాన్లను భరించలేక బైక్‌లను వదిలేసి పోతున్నామని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ నివాసం ఈ బైక్‌లతో ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్త చట్టంలో సామాన్య ప్రజలు భరించేలేనిరీతిలో జరిమానాలు విధిస్తున్నారని, చాలా కేసుల్లో బైక్‌ల ధరల కన్నా.. జరిమానాల మొత్తం అధికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పౌరుల వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ నోటీసుల పేరిట తమ వెబ్సైట్లో వాహనదారుల పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని, కేవలం బండి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే చాలు.. వాహనదారుల పూర్తి వివరాలు వెబ్సైట్లో తెలుసుకునేవిధంగా ఉన్నాయని, ఇది పౌరుల వ్యక్తిగత ప్రైవసీపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి చేరే అవకాశముందని బీ. శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కేరళలో ఇద్దరు కాంగ్రెస్ నాయకుల హత్య
తిరువనంతపురం: కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు హత్యకు గురికావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నాయకులైన క్రిపేశ్, శరత్ లాల్ ఆదివారం బైక్‌పై వెళ్తుండగా.. కొందరు దుండగులు దాడి చేయడంతో వారు మృతి చెందారు. ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఓ బృందం కాంగ్రెస్ నాయకుల బైక్‌ను ఆపి కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు. క్రిపేశ్, శరత్‌లు తమ ఇంటికి దగ్గర్లోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ హత్య వెనక సీపీఎం నాయకుల హస్తం ఉందని ఆరోపించింది. క్రిపేశ్, శరత్‌ల హత్యకు నిరసగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి(యూడీఎఫ్) తరఫున కేరళలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా కాసరగోడ్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రమేశ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. రౌడీల ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని సీపీఎం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను సీపీఎం జిల్లా కార్యదర్శి ఎంవీ బాలకృష్ణన్ ఖండించారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ హత్య రాజకీయాలకు వ్యతిరేకమని.. ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురికావడం బాధ కలిగించిందన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్యకు పాల్పడిన వారికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. -
ట్రైలర్‌తోనే రేగిన దుమారం
సాక్షి, ముంబై : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై రూపొందుతున్న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ వివాదాస్పదమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదల కావడంతో సినిమా విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్రను పోషించిన ఈ సినిమాపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు తమకు ప్రీ రిలీజ్ షో వేయాలని, లేకుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతామని హెచ్చరించింది. ఈ సినిమాలో వాస్తవాలు వక్రీకరించి రూపొందించిన సన్నివేశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర యూత్ విభాగం చిత్ర రూపకర్తలకు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రంలో ఎలాంటి అవాస్తవ సన్నివేశాలు చొప్పించలేదని వెల్లడించేందుకు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమ కార్యవర్గ సభ్యులకు ముందస్తుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు తాము ఇతర మార్గాలను అనుసరిస్తామని ఆ ప్రకటనలో యూత్ కాంగ్రెస్ చిత్రబృందాన్ని హెచ్చరించింది. -
యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా కేశవ్ చంద్
సాక్షి, ఢిల్లీ : యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేశవ్‌చంద్ యాదవ్ ఎంపికయ్యారు. అలాగే తెలంగాణకు చెందిన బీవీ శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అమరీందర్ సింగ్ రాజా స్థానంలో కేశవ్ చంద్‌ను నియమించారు. ఈ మేరకు జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీకి అమరీందర్ సింగ్ అందించిన సేవలను ప్రశంసించింది. -
ఎన్ఎస్యూఐకి మార్గదర్శక మండలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి మార్గదర్శనం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పార్టీ సీనియర్ నాయకులతో ఓ మండలిని ఏర్పాటుచేశారు. రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, మానిక్ టాగోర్‌లు అ మండలిలో ఉన్నారు. ‘ఐవైసీ, ఎన్ఎస్యూఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఈ మార్గదర్శక మండలి భర్తీచేస్తుంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ చీఫ్, ఎన్ఎస్యూఐ ఏఐసీసీ ఇన్చార్జిలు ఈ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మండలితోపాటుగా 37 మంది కార్యదర్శులతో యూత్ కాంగ్రెస్‌ను కూడా రాహుల్ విస్తరించారు. అమరీష్ రంజన్ పాండేను యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించారు. -
బేటీ బచావో.. బేటీ పడావో ఇదేనా
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులుపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నేతలు సామూహిక శిరోమండనంతో నిరసన తెలిపారు. విద్యార్థులను అక్రమంగా నిర్భంధించి పలు రకాలు ఆంక్షలు విధించడాన్ని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బేటీ బచావో బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పబ్‌ల ముందు యూత్ కాంగ్రెస్ నిరసన
-
కేంద్ర మంత్రిపై గుడ్లతో దాడి
భువనేశ్వర్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పర్యటన పట్ల ఒడిశాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్లు రువ్వి నిరసన ప్రదర్శించారు. రాష్ట్ర అతిథి గృహం నుంచి బయల్దేరేందుకు బయటకు వచ్చిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా చేరుకుని మంత్రి కారు వైపు గుడ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సంఘటనపై జంట నగరాల పోలీసు కమిషనరేటు తక్షణమే స్పందించింది. మంత్రిపై గుడ్లు రువ్విన ఆరోపణ కింద ఐదుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వీరిలో రాష్ట్ర యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్‌నాథ్ మహారథి ఒకరుగా జంట నగరాల పోలీసు కమిషనరు వైబి ఖురానియా పేర్కొన్నారు. నిందితుల వ్యతిరేకంగా స్థానిక క్యాపిటల్ ఠాణాలో ఫిర్యాదు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు. జట్నీలో ఏర్పాటు చేసిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరిన సమయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేసి అరెస్టు అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి ఆరోపించారు. -
నిరసన పేరిట బర్రెను పబ్లిగ్గా నరికేశారు!
యూత్ కాంగ్రెస్ కార్యర్తల తీరుపై ఆగ్రహం తిరువనంతపురం: ఆవుల అమ్మకాలపై ఆంక్షలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఒక బర్రెను బహిరంగంగా నరికి చంపిన ఘటన కేరళలో దుమారం రేపుతోంది. ఈ ఘటనలో పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఆదివారం కేసు నమోదుచేశారు. కబేళాలకు ఆవుల అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగంగా ఓ బర్రెను వారు తెగనరుకుతున్న వీడియోను కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనాం రాజశేఖరన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ఇది అత్యంత అమానుషమని, సామాన్య వ్యక్తులెవరూ ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. సీపీఎం సైతం ఈ నిరసనను తప్పుబట్టింది. ఇలాంటి మూర్ఖమైన నిరసనలను మానుకోవాలని, ఇలా చేయడం సంఘ్ పరివార్‌కే మేలు చేస్తుందని సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్ తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనను ఖండించింది. ఈ నిరసన ప్రదర్శనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఇలా చేయడం అనాగరికం, తనకు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఆమోదయోగ్యం కాదంటూ ఖండించారు. మరోవైపు ఈ నిరసన ప్రదర్శనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ చర్యపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయడం లేదు. -
కేటీఆర్‌కు, కవితకు ఎండ దెబ్బ తగిలింది
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. యువతను మోసం చేస్తోందని విమర్శించారు. గాంధీ భవన్లో ఆదివారం జరిగిన ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మనవడికి కూడా ఒక ఉద్యోగం దొరికిందని, కేసీఆర్‌కు ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనే తీరిక లేకుండాపోయిందని దుయ్యబట్టారు. కేటీఆర్‌కు, కవితకు ఎండ దెబ్బ తగిలి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను అడిగితే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తారని కేటీఆర్, కవితలకు ఆయన హితవు పలికారు. కేటీఆర్ దిగే సెల్ఫీ టెక్నాలజీ ఎక్కడ నుండి వచ్చిందో తెలియదా అని ప్రశ్నించారు. తాను ఎంపీనన్న విషయాన్నికవిత మర్చిపోయిందని, రాష్ట్రంలో మినిస్టర్ ,సీఎం కావాలనుకుంటోందని చురకలంటించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అనిల్‌కుమార్ అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా
-
బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నం
రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. దీనిని గమనించిన పోలీసులు గాంధీభవన్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం గాంధీభవన్ నుంచి బయటకు వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేయర్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలో నరక ప్రాయంగా మారిన రహదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా చాంబార్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనీల్ కుమార్ యాదవ్ పుట్టిన రోజు వేడుక శుక్రవారం ఘనం గా జరిగింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సంఘీరెడ్డి ఆధ్వర్యంలో కేట్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నవ్నీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అదిల్ పాషా, మహేష్, యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనగామ జిల్లా ఇక్కడి ప్రజల హక్కు
నర్మెట : జనగామ జిల్లా ఈ ప్రాంత ప్రజల హక్కు అని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జనగామను జిల్లా చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొత్తలపర్రె–బొంతగట్టునాగారంలోని ఏడుపోచమ్మ దేవాలయం వద్ద నుంచి నర్మెట వరకు సోమవారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామను 11వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి మాట తప్పుతున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ లో ఎంసెట్–2 లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చారని చెప్పారు. అనంతరం తహసీల్దార్ నర్సయ్యకు పలు వినతులతో కూడినపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బనుక శివరాజ్‌యాదవ్, కీసర దిలీప్‌రెడ్డి, మంసంపల్లి లింగాజీ, తేజావత్ గోవర్ధన్, బొక్క సుజయ్, మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కళ్యాణం లలిత ము రళి, ఎంపీటీసీ సంపత్, గాదర సందీప్, వేముల అంజయ్య తదితరులు ఉన్నారు. -
‘హోదా’ కోసం యువజన కాంగ్రెస్ ర్యాలీ
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుంటే యువత భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో కొవ్వొత్తుల, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. విభజన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదు. పదేళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. నాయకులు మీసాల రాజేశ్వరరావు, ఐతా కిషోర్, దండమూడి రాజేష్, కొరివి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
యూత్‌కాంగ్రెస్ ర్యాలీని జయప్రదం చే యాలి
రామన్నపేట : యూత్ కాంగ్రెస్ జాతీయఅధ్యక్షుడు రాజుబార్ అమరేందర్‌సింగ్ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లానుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్ కోరారు. ఆదివారం రామన్నపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ర్యాలీ సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు వరకు కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ఆర్టీసీ కల్యాణమండపంలో కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆయనవెంట నాయకులు ఎండీ.జమీరుద్దిన్, మిర్యాల మల్లేశం, మినుముల సందీప్, ఎండీ.ఎజాజ్, దొడ్డి అజయ్, ఎండీ.జాని, రవి, మోహన్‌లు ఉన్నారు. -
ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదు
నెల్లూరు సిటీ: కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమైన అంశాల్లో మేయర్ అజీజ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కౌన్సిల్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపోరుబాటలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని మేయర్ విస్మరించారని మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి, సంగం షఫీ, సూర్యనారాయణ, సురేష్, నవీన్, సుధ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
నల్గొండ జిల్లా: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధరలు పెంచడం దారుణమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. -
కాంగ్రెస్ నాయకుని హత్య
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకడు సునీల్ కుమార్ (28) మంగళవారం హత్యకు గురయ్యారు. ఉదయం ఆయన ఇంటిపై దాడిచేసిన వామపక్ష పార్టీ కార్యకర్తలు కత్తులతో నరికి చంపారు. రాజధానికి కూతవేటు దూరంలోని అలెప్పూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సునీల్ ఆయన నివాసంలో ఉండగా సీపీఎం మద్దతుదారులు ఆయనపై దాడికి దిగ కత్తులతో పొడిచి చంపారు. సునీల్ కుమార్ ఇటీవల సీపీఎం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమచారం. దానికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులుగా సీపీఎం మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోత్వరలో జరగనున్నఎన్నికల నేపథ్యంలోగత రెండు నెలలకాలంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య దాడులు, హత్యలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి బీజేపీ కార్యకర్త ఇటీవల హత్యకు గురిగాకా, ఇరువర్గాలు కార్యకర్తలు దాడికి గురయ్యారు. -
'దివాళీలో అలీ, రంజాన్ లో రామ్'
న్యూఢిల్లీ: బీజేపీ వల్లే దేశంలో మత అసహనం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. మత అసహనానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చాయ్ పే చర్చ అవసరం లేదని, ఆవుపై చర్చ కావాలన్నారు. మనదేశంలో జరుపుకొనే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాళీలో అలీ, రంజాన్ లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోరాదని చెప్పారు. లోక్ సభలో మత అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. -
మట్టి వద్దు.. హోదాకావాలి
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రధానికి మట్టి, నీరు పంపించిన వైనం విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది గుప్పెడు మట్టి, చెంబుడు నీరు కాదని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) పిలుపు మేరకు వందలాది మంది విద్యార్థులతో సోమవారం ప్రత్యేక హోదా కోరుతూ టిక్కిల్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మట్టిముంతలతో మట్టి, నీరును చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. మొగల్రాజపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకూ ప్రదర్శన సాగింది. అనంతరం వాటిని ప్రధానికి పంపించేందుకు ప్యాక్ చేశారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన రోజు ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఎదురుచూసిన ఆంధ్రులకు నిరాశేమిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు అన్నిపార్టీలతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. -
అసెంబ్లీ ముట్టడికియత్నం, నేతల అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కమార్ యాదవ్ సహా పలువురు నేతలను అరెస్టుచేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతు రుణమాఫీ, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా అసెంబ్లీ ముట్టడించడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పోటీకి జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందాడు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ ఎన్నికల్లో భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌పై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ 1,800 ఓట్ల తేడాతో గెలుపొందాడు. -
యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ!
రాష్ట్ర అధ్యక్ష పదవి బరిలో నేతల వారసులు * గెలుపు కోసం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తనయుల ఢీ * ఇరువర్గాలు పరస్పరం బెదిరింపులు, కిడ్నాప్‌లకు దిగుతున్న వైనం * వారసులతో పోటీ పడలేమంటున్న సాధారణ యువనేతలు * ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్నికలు, 12న ఫలితాలు సాక్షి, హైదరాబాద్ : యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో హల్చల్ సృష్టిస్తోంది. నేతల వారసులు రంగంలోకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంఎల్ఏ భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే గ్రామ, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ఎన్నికలు ముగిసిపోగా, 9, 10 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని సుమారు తొమ్మిదివేల మంది ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. తమ కుమారుల విజయం కోసం మాజీ ఎంపీ అంజన్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌లు కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల సాయం కోరుతుండటంతో పార్టీలోని ముఖ్య నాయకులంతా రెండు వర్గాలుగా చీలిపోయి వేర్వేరుగా రెండు ప్యానెల్లకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. బెదిరింపులు, అడ్డదారులు ... : ఈ ఎన్నికలను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ ఇరు ప్యానెళ్లు పరస్పరం కిడ్నాప్‌లు, భౌతిక దాడులు, బెదిరింపులకు దిగాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన న రేశ్ను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నించారన్న అభియోగంతో మాజీ ఎంపీ అంజన్ తనయుడిపై గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఇదే తరహాలో మహబూబ్‌నగర్, సనత్‌నగర్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. రవికుమార్సైతం తమను బెదిరించారని ఓ యువజన కాంగ్రెస్ నేత సైబరాబాద్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గం తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు. ఇదే విషయంపై రవికుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్గదర్శకాలకు విరుద్ధంగా బెదిరింపులు, కిడ్నాప్లతో ఎన్నికలను గెలవాలని చూడటం దారుణమన్నారు. కాగా, దాడులు, బెదిరింపుల వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లిందని కొందరు పార్టీ నేతలు వెల్లడించారు. 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలయ్యే ఓట్లను 12వ తేదీన హైదరాబాద్‌లో లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. జిల్లాల్లోనూ నేతల వారసులు.. ఇక జిల్లాల్లో కూడా పలువురు నేతల వారసులు రంగంలో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం స్థానం నుంచి మేఘనారెడ్డి (మాజీ మంత్రి జె.గీతారెడ్డి కుమార్తె), మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంతోష్‌రెడ్డి(మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి దగ్గరి బంధువు) పోటీ పడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవికోసం మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనయుడు చరణ్‌రెడ్డి రంగంలో ఉన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికోసం మాజీమం త్రి డి.కె.అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయినాథ్ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకర్గ అధ్యక్ష పదవికోసం రేసులో ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత రత్నాకర్‌రెడ్డి తనయుడు రమాకాంత్‌రెడ్డి వరంగల్ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌లో మా పరిస్థితేంటి? పార్టీకోసం అంకితభావం కలిగిన నాయకత్వాన్ని యువజన స్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న ఎన్నికలను సీనియర్ నేతల వారసులు తమ అధిపత్యం కోసం వాడుకుంటున్నారని సాధారణ యువజన నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి వారసత్వం, ఆర్థిక బలం లేని తాము వెనకబడిపోవాల్సి వస్తోందని, పార్టీలో ఎప్పటికీ దిగువస్థాయిలోనే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం
భీమవరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్టు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం భీమవరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యమ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న విజయవాడలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. తిరుపతి, పామర్రులో యువకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆత్మహత్య చేసుకోవటానికి బీజేపీ, టీడీపీలే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రధాని మోడీ కాళ్లముందు పెట్టారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతులకు అండగా నిలిచేందుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వారిని మోసం చేస్తున్నారన్నారు. ఆవినాష్ మావుళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు -
యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. పంచాయతీ, నగర డివిజన్, అసెంబ్లీ సెగ్మెంట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల 18న నామినేషన్లు వేసేందుకు తేది ఖరారు చేశారు. వీటికి ఈ నెల 22 నుంచి 25 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక లోక్ సభ సెగ్మెంట్లు, రాష్ట్ర స్థాయి కార్యవర్గానికి ఈ నెల 28న నామినేషన్లు వేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ నిర్వహించనున్నారు. -
టీ యూత్ కాంగ్రెస్ కమిటీ రద్దు
హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కొత్త కమిటీ ఎంపిక కోసం రద్దు చేసినట్టు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఎంపిక చేయనున్నట్టు వంశీచంద్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 10 నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని వంశీచంద్ రెడ్డి చెప్పారు. -
అరాచకశక్తుల పట్ల అప్రమత్తత అవసరం
సీఎం సిద్దరామయ్య బెంగళూరు(బనశంకరి) : సమాజాన్ని చీల్చే అరాచకశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనవిచేశారు. రంజాన్ సందర్బంగా శనివారం ఉదయం చామరాజపేటెలోని ఈద్గా మైదానానికి వెళ్లి ముస్లింలతో కలిసి ప్రత్యేక పార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో నివసిస్తున్న అందరూ భారతీయులేనని మొదట దేశం అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అని అన్నారు. రంజాన్ ఉపవాసం మంచి ఉద్దేశం కలిగి ఉందని చెడ్డవారిని దూర ం చేసి అందరికీ మంచి చేయడం రంజాన్ సందేశమని తెలిపారు. హిందూ, ముస్లిం ఒకే తల్లి పిల్లలని అందరూ సోదర భావంతో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత తీసుకురావాలనే కారణంతో తమ ప్రభుత్వం అన్నభాగ్య పథకం అమలు చేసిందన్నారు. ఆకలిలేని కర్ణాటక తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్హర్షద్, నేత జీఏ బావా తదితరులు పాల్గొన్నారు. -
‘సూటు బూటు సర్కారుకు శుభాకాంక్షలు’
కోజికోడ్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ‘ఏదో కారణం వల్ల’ భూసేకరణ బిల్లును హడావుడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రభుత్వం ఈ తరహాలో తన విధానాలను కొనసాగించేట్లయితే.. అది పూర్తికాలం కొనసాగబోదని, ఐదో జన్మదినాన్ని జరుపుకోబోదని హెచ్చరించారు. మంగళవారమిక్కడ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ‘ప్రభుత్వ పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సూటు బూటు సర్కారుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా’ అని ఎద్దేవా చేశారు. వేడుకలు ప్రభుత్వానికి గల కొద్దిమంది శక్తివంతులైన స్నేహితులకేనన్నారు. -
యూత్ కాంగ్రెస్‌లో తన్నులాట
రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గాల బాహాబాహీ రఘునాథపల్లి వద్ద ఘటన రఘునాథపల్లి: యూత్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నారుు. సభ్యత్వ నమోదు సందర్భంగా ఆధిపత్య పోరు అగ్గిరాజేసింది. పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి రఘునాథపల్లిలో గురువారం సభ్యత్వ నమోదుకు సమాయత్తమయ్యూరు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కీసర దిలీప్‌రెడ్డి అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. వివరాలు.. హన్మకొండకు చెందిన రమాకాంత్‌రెడ్డి ఖిలాషాపురంనకు చెందిన తన వర్గీయుడు మంద రమేష్, అనుచ రులతో రఘునాథపల్లి ఆర్యవైశ్య భవన్లో యూత్ సభ్యత్వ నమోదు కోసమని గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాము ఇప్పటికే మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టామని, సమాచారం లేకుండా ఇక్కడ ఎలా సమావేశం పెడుతావంటూ దిలీప్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అందరి ఆమోదంతోనే సమావేశం పెట్టాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కడారి నాగేశ్వర్ కూడా పేర్కొన్నారు. కానీ రమాకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గలేదు. వాగ్వాదం జరగడంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పి వెళ్లారు. కొద్ది సేపటికి రమాకాంత్‌రెడ్డి తన వర్గీయులతో విలేకరులతో మాట్లాడుతుండగా దిలీప్వర్గీయులు తోపులాటకు దిగారు. రమాకాంత్రెడ్డిపై దాడిచేసి తరిమారు. రమాకాంత్‌రెడ్డి, ఆయన వర్గీయుడు ముప్పిడి శ్రవణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత ఠాణాలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో అధ్యక్షస్థానానికి మాజీ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. దిలీప్ సైతం పోటాపోటీగా సభ్యత్వాలు చేరుుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘర్షణ జరిగింది. తనను రాజకీయంగా ఎదుగకుండా కుట్ర పన్నుతున్నారని రమాకాంత్‌రెడ్డి ఆరోపించారు. కాగా, రమాకాంత్‌రెడ్డి పార్టీలో చిచ్చు పెడుతున్నాడని దిలీప్‌రెడ్డి ఆరోపించారు. -
యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి
సాక్షి, ముంబై: రైతుల సమస్యలపై సోమవారం శాసనసభ భవనంవైపు దూసుకొచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ తొలుత వీరంతా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరంతా శాసనసభ వైపు దూసుకువస్తుండడాన్ని గమనించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు పోలీసులను పక్కకునెట్టేసి బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తమని అణిచివేసే ప్రయత్నం చేసిందని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వజిత్ కదం ఆరోపించారు. అయితే బారికేడ్లను చేధించుకుని ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించినందువల్లనే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు సమర్ధించుకున్నారు. -
యువజన కాంగ్రెస్‌లో ఎన్నికల రగడ
* సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రోజుకో వివాదం * గురువారం నల్లకుంటలో మాజీ ఎంపీ అంజన్ కుమారుడు, మరోవర్గం బాహాబాహీ * ఎన్ కన్వెన్షన్ ఘటనకు సంబంధించి విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్ట్‌కు పోలీసుల యత్నం * అజ్ఞాతంలోకి వెళ్లి.. ముందస్తు బెయిల్‌కు యత్నం సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త జగడానికి వేదికవుతోంది. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఘర్షణకు దారితీయగా... గురువారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోకజవర్గంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు అంశంలో స్థానిక నాయకుడు విజయ్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. దీనిపై సమాచారం అందిన నల్లకుంట పోలీసులు.. అనిల్‌కుమార్ సహా మరికొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హడావుడి, హంగామా నెలకొంది. నేతలతో పాటు పోలీసులు కూడా ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి అక్కడే తాత్కాలికంగా రాజీ కుదిర్చారు. లోకాయుక్తలో కేసులు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. యువజన కాంగ్రెస్‌లో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ రెండు వేర్వేరు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో జరిగే యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసే లక్ష్యంతో అనిల్‌కుమార్ తన అనుచరులతో సభ్యత్వ నమోదు చేపట్టారు. మరోవైపు వంశీచంద్‌రెడ్డి తనవైపు నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌ను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ వర్గీయులు విష్ణువర్ధన్‌రెడ్డి, అంజన్ అనిల్‌కుమార్‌యాదవ్‌ల వ్యతిరేక శిబిరాలను చేరదీసి సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ వ్యతిరేకులను వంశీచంద్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో.. విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనపైనే దాడికి పాల్పడ్డారని, నల్లకుంటలోనూ విజయ్, అనిల్ వర్గాల మధ్య ఘర్షణకు కారణమని యువజన కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య ఘర్షణలో తప్పు విష్ణుదేనని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విష్ణు... ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
యువతకు ప్రాధాన్యం ఇవ్వండి
దిగ్విజయ్‌సింగ్‌కు నల్లగొండ యూత్ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్‌కు నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు రవీందర్‌రెడ్డి, ఉదయ్‌చందర్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిసి నల్లగొండ జిల్లా పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక అందజేశారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలతో రోజురోజుకు పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతుందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ సంస్థాగత పదవుల్లో యువతకు తగిన ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పిలుపునిచ్చి యువతను భాగస్వాములు చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన బృందలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు నందన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పవన్ ఉన్నారు. -
మోదీ ప్రభుత్వంపై నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆలిండియా యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు గురువా రం జంతర్‌మంతర్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధానంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకోస్తామని బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని ఆలిండియా యువజన కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అమిత్మాలిక్ ద్వజమెత్తారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని ఆయన బీజేపీ ప్రభుత్వానికి సూచిం చారు. దేశ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువజన అక్రోష్ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 2,000 మంది నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాఠీచార్జ్: ‘జన అక్రోష్ ర్యాలీ’ పేరుతో ర్యాలీగా పార్లమెంట్ వైపు దూసుకెళ్తుండగా యూత్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. పార్లమెంట్ ముందు ఉన్న పోలీస్ బారికేడ్లను ఛేదించుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణకు దిగారు. కొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆందోళన ఉద్రిక్తగా మారడంతో బలప్రయోగానికి పాల్పడాల్సి వచ్చిం దని, కొందరు నాయకుల కూడా అదుపులోకి తీసుకొన్నామని అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి చెప్పారు. -
కాశ్మీర్ బాధితులకు యూత్ కాంగ్రెస్ విరాళం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కాశ్మీర్‌కు భారీగా ఆర్థిక సహాయం, ఇతర సహాయక చర్యలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కోరారు. -
మోడీ వందరోజుల పాలనకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: మోడీ వందరోజుల పాలనలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా యూత్‌కాంగ్రెస్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆందోళనలు నిర్వహించింది. ఆందోళనకు ‘వందరోజుల్లో మోడీ వైఫల ్యం’ పేరు కూడా పెట్టింది. ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలేవి? మోడీ ప్రభుత్వం ఎన్ని హామీలను నెరవేర్చింది? అనే విషయాలను ఆందోళన ద్వారా ప్రజలకు వివరించి చెప్పాలని నిర్ణయించింది. అంతేకాక హామీలను నెరవేర్చని సంబంధిత నేతల కార్యాలయలను ముట్టడిస్తామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతావ్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం ముందు, కృషి భవన్ ఎదుట, రైల్‌భవన్ ఆవరణలో యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిం చారు. మరో రెండ్రోజులపాటు కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సతావ్ తెలిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని 20 రోజుల క్రితమే అనుమతి కోరామని, అందుకు అధికారులు తిరస్కరించడంతో రోడ్లపైకి రావాల్సి వచ్చిందని సతావ్ చెప్పారు. ట్విటర్ ద్వారా కూడా మోడీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైల్‌భవన్ వద్ద ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీల తో విరుచుకుపడ్డారని, వందలమంది కార్యకర్తలను గాయపర్చారని, దీనిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. వందరోజుల్లో మోడీ చేయలేకపోయిన వంద పనుల గురించి మరింత ప్రచారం చేస్తామని చెప్పారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్
►ఉప ఎన్నికల సమయంలో.. ►పార్టీని వీడుతున్న నేతలు సంగారెడ్డి మున్సిపాలిటీ : ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూత్ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అధ్యక్షుడు వి.ఆదర్శ్‌రెడ్డి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం సంగారెడ్డిలో ప్రకటించారు. ఓ వైపు మెదక్ ఎంపీ పదవి కోసం ఉప ఎన్నిక సమీపిస్తుండటం... అభ్యర్థిని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్న అధిష్టానానికి ఆదర్శ్‌రెడ్డి షాక్ ఇచ్చారు. పటాన్చెరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశ్విన్‌గౌడ్ ఇప్పటికే రాజీనామా చేశారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో రెండింటి మాత్రమే గెలిచి గుడ్డిలో మెల్ల అన్నా చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడమే కాకుండా టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. గత 3 నెలలుగా డీసీసీ అధ్యక్షుడు లేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు లేకపోయారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర నేతలు హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు డీసీసీ అధ్యక్షుడి నియామకంపై చర్చించారు. ఎట్టకేలకు ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని జాతీయ నేతలకు సిఫార్సు చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు జిల్లాలో గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. -
వివాదస్పద వ్యాఖ్యలకు సురేశ్ గోపి క్షమాపణ!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి క్షమాపణలు తెలిపారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బందికి గురిచేసి ఉంటే, అందుకు నా క్షమాపణలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యమంత్రిని విమర్శించడం తన వ్యాఖ్యల ఉద్దేశం కాదు. ఏ ప్రాజెక్ట్ కైనా అనుమతి తెలిపే ముందు సంప్రదింపులు జరుపాల్సి ఉండాల్సింది అని యూఎస్ నుంచి ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో సురేశ్ గోపి అన్నారు. గత వారం ఓ బహిరంగ సభలో సురేశ్ గోపి మాట్లాడుతూ.. ప్రతిపాదిత అరన్ములా ఎయిర్ పోర్టు పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారని, ఉమెన్ చాందీకి కొన్ని విషయాల అవగాహన లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా కేరళలో దుమారం రేగుతోంది. మంత్రులు డయస్పోరా, కేసీ జోసఫ్, రాధకృష్ణన్ లు సురేష్ గోపిపై విమర్శల్ని ఎక్కుపెట్టారు. అంతేకాకుండా సురేశ్ గోపి ఇంటిని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించి.. దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. -
అడ్డుకునే దమ్ముందా
అడ్డుకునే దమ్ముందా సాక్షి, చెన్నై: కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే అడ్డుకునే దమ్ముందా అని పెరియార్ ద్రవిడ కళగం నాయకులకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సవాల్ విసిరారు. రాజీవ్ హంతకుల విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో శుక్రవారం చెన్నైలో నిరసన దీక్ష చేప్టారు. అలాగే రాజీవ్ గాంధీతో పాటు హత్యకు గురైన 17 మంది తమిళులు కాదా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కరపత్రాలు విడుదల చేశారు. రాజీవ్‌గాంధీ హంతకుల్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనికి సుప్రీంకోర్టు ద్వారా కేంద్రం కల్లెం వేయించడం తెలిసిందే. ఈలం తమిళుల్ని విడుదల చేయనీయకుండా అడ్డుకున్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు ఖండిస్తున్నాయి. పెరియార్ ద్రవిడ కళగం ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో అడుగు పెడితే అడ్డుకుంటామంటూ కేంద్ర మంత్రులను హెచ్చరించింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మినహా ఇతర పార్టీల నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ అన్నాసాలైలోని విద్యుత్ భవన్ వెనుక నిరసన దీక్ష నిర్వహించింది. ఈ నిరసనకు యూత్ కాంగ్రెస్ నేత ఎన్.రాజేష్ నేతృత్వం వహించారు. ఇందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, ఈవీకేఎస్ ఇళంగోవన్, కుమరి ఆనందన్, పాల్గొన్నారు. జ్ఞానదేశికన్ మాట్లాడుతూ దమ్ముంటే తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల్ని అడ్డుకోండని, అప్పుడు తామేమిటో తెలుస్తుందంటూ పెరియార్ ద్రవిడ కళగం నాయకులను హెచ్చరించారు. రాజీవ్ హంతకుల శిక్షను సుప్రీం కోర్టు తగ్గించిందేగానీ, విడుదల చేయమని ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. కోర్టు తీర్పు ఇలా ఇచ్చిందో లేదో, మరుసటి రోజే రాజకీయ లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో వారిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఇతర కేసులకంటే రాజీవ్ హత్య కేసు భిన్నమైనదని పేర్కొన్నారు. ముంబైలో నరమేధం సృష్టించిన కసబ్‌కు రాజీవ్ హంతకులకు తేడా లేదని, వారిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. తామేదో తమిళులకు ద్రోహం తలపెడుతున్నట్టు కొందరు చిత్రీకరిస్తున్నారని, ఈలం తమిళులకు మద్దతుగా తామూ పోరాడుతున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజీవ్ హంతకుల వ్యవహారంలోకి ఈలం తమిళుల ప్రస్తావన తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ మీద దాడులకు దిగితే ప్రతిదాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. కోయంబత్తూరులో తమ పార్టీ నేత ప్రభు ఇంటిపై చేసిన పెట్రో బాంబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వ తీరును నిరసిస్తూ కరపత్రాల పంపిణీకి కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు. రాజీవ్ హత్యా ఘటన జరిగిన రోజున 17 మంది మరణించారని, వీరంతా తమిళులు కాదా...? వీరికి న్యాయం చేయరా..? అన్నప్రశ్నల్ని సంధిస్తూ ఈ కరపత్రాల పంపిణీలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. -
మరోసారి బలపరచండి: జయసుధ
సికింద్రాబాద్: పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీని మరోసారి ప్రజలు బలపరచాలని ఎమ్మెల్యే జయసుధ అన్నారు. సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం మెట్టుగూడ డివిజన్లో రాహుల్ యువజనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్‌రాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసుధ, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎంఆర్ శ్రీనివాస్‌రావు, జాతీయ యూత్ కాంగ్రెస్ షామిలి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కాలనీలు, బస్తీల్లో పర్యటించిన యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి అనేకానేక సంక్షేమ పథకాలను అందుబాటులోనికి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. -
సిద్ధు పదవికి ఎసరు!
ఖర్గే ఆవేదన = సిద్దయ్య పాలన బాగుంది = అతన్ని పదవీచ్యుతున్ని చేసేలా కుట్రలు = నేను ఎవరిపైనా ఆరోపణలు చేయను = అయితే.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి = ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఉత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని హితవు పలికారు. యువజన కాంగ్రెస్ శుక్రవారం ఇక్కడ తన నివాసంలో సన్మానించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని అడిగినప్పుడు, ఆయన నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. పాలక, ప్రతిపక్షాల్లోని వారు ఆయనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిర్దుష్టంగా తాను ఎవరి పైనా ఆరోపణలు చేయలేనని అన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు మంచివి కావన్నారు. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి తన పరిధిలో ఉత్తమ పనులు చేస్తున్నారని, మంచి పాలనను అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. కాగా మంత్రి సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్‌పై తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైల్వే పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాష్ర్టం వాటా 50 శాతం నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ప్రత్యేక హోదా పొందిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి సంతకం చేసినందున, ఆ ప్రాంత అభివృద్ధికి పచ్చ జెండా ఊపినట్లయిందని ఆయన అన్నారు. -
నేడు యూత్ కాంగ్రెస్ బైక్‌ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న బైక్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు పశ్చిమ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ శర్మ తెలిపారు. బీజేపీ వికాస్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయానికే కాంగ్రెస్ పార్టీ యూత్ ర్యాలీ చేపట్టడం గమనార్హం. ర్యాలీలో ఐదు వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఉత్తమ్‌నగర్ నియోజకవర్గంలోని విపిన్ గార్డెన్ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్‌లపై కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకుని ర్యాలీగా బయలుదేరనున్నారని చెప్పారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళతామని రాహూల్ శర్మ అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్యర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న వికాస్ ర్యాలీ ఓ నాటకమన్నారు. ఢిల్లీలోని యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విధాన సభ ఎన్నికల్లో ఉత్తమ్ నగర్ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందన్నారు. ఆదివారం నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో గుజరాత్ నుంచి సైతం ఎన్ఎస్యూఐ సభ్యులు పాల్గొంటున్నట్టు తెలిపారు. -
నేడు తెలంగాణ విజయోత్సవ సభ
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి తెలి పారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హన్మకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభ జరుగుతుం దని, అంతకుముందుగా ఉదయం 10 గంటలకు కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్రగా వెళ్తామని తెలిపారు. సభలో కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్ల వంశీధర్‌రెడ్డి పాల్గొంటారని, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రమాకాంత్‌రెడ్డి కోరారు. సమావేశంలోయూత్ కాంగ్రెస్ నాయకులు జన్ను నవీన్, చీకటి కీర్తికుమార్, జన్ను సతీష్, రాజారపు శ్రీనాథ్ తది తరులు పాల్గొన్నారు. -
పాకిస్థాన్ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: పాకిస్థాన్ సైన్యం భారత సైనికులపై జరుపుతున్న దుశ్చర్యను నిరసిస్తూ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బిజెపి, యువజన కాంగ్రెస్ వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ నారాయణగూడలో బిజెపి అధ్వర్యంలో పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరిహద్దుల్లోకి పొరుగుదేశం చొచ్చుకు వస్తున్నా దాడులను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో భారత జవాన్లపై పాకిస్థాన్ ముష్కరుల దాడిని ఖండిస్తూ ఏపీ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ జెండాను, దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్థాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.