హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులుపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నేతలు సామూహిక శిరోమండనంతో నిరసన తెలిపారు.
విద్యార్థులను అక్రమంగా నిర్భంధించి పలు రకాలు ఆంక్షలు విధించడాన్ని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బేటీ బచావో బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.