న్యూఢిల్లీ: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆలిండియా యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు గురువా రం జంతర్‌మంతర్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధానంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకోస్తామని బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని ఆలిండియా యువజన కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అమిత్‌మాలిక్ ద్వజమెత్తారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని ఆయన బీజేపీ ప్రభుత్వానికి సూచిం చారు. దేశ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువజన అక్రోష్ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 2,000 మంది నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లాఠీచార్జ్: ‘జన అక్రోష్ ర్యాలీ’ పేరుతో ర్యాలీగా పార్లమెంట్ వైపు దూసుకెళ్తుండగా యూత్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. పార్లమెంట్ ముందు ఉన్న పోలీస్ బారికేడ్లను ఛేదించుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణకు దిగారు. కొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆందోళన ఉద్రిక్తగా మారడంతో బలప్రయోగానికి పాల్పడాల్సి వచ్చిం దని, కొందరు నాయకుల కూడా అదుపులోకి తీసుకొన్నామని అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎస్‌బీఎస్ త్యాగి చెప్పారు.
మోదీ ప్రభుత్వంపై నిరసన
Published Thu, Sep 25 2014 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement