మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం | Narendra Modi Led NDA Alliance MPs Meeting | Sakshi
Sakshi News home page

మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం

Published Fri, Jun 7 2024 11:22 AM | Last Updated on Fri, Jun 7 2024 12:00 PM

Narendra Modi Led NDA Alliance MPs Meeting

న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆరంభమైంది.  ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ భేటీలో మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నితిశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేలతో పాటు, .బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,బీజేపీ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

క్యాబినెట్‌ కూర్పుపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చింనున్నారు. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో  గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర సీనియర్‌ నేతలు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.

ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచ్చినందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ  పార్టీలు  నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్‌ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్‌ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement