Black Money
-
‘నల్ల’ ఖజానా
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ బాగోతం అంతా మేడిపండు చందమేనన్నది స్పష్టమైంది. నిగనిగలాడే మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులే ఉంటాయి. నీతులు వల్లించే రామోజీ కుటుంబానికి చెందిన ‘మార్గదర్శి’ డిపాజిట్ల గుట్టు విప్పితే నల్లధనం బట్టబయలవుతుంది. అక్రమార్జనను మార్గదర్శిలో గుట్టు చప్పుడు కాకుండా దాచిన టీడీపీ పెద్దల బండారం గుట్టు వీడుతుంది. అందుకే తాము సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెల్లడించేందుకు రామోజీ కుటుంబం మొండికేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు సహకరిస్తోంది. భారీగా నల్లధనం దందా...మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు భారీస్థాయిలో నల్లధనం దందా సాగించారు. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. ఆ అక్రమ డిపాజిట్ల ముసుగులో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. అందులో సింహభాగం టీడీపీ పెద్దలవేనని స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే నిధులు ఎలా వచ్చాయో వెల్లడించాల్సి ఉంటుంది. భూములు, ఇతర స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టినా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తే వారి అక్రమార్జన బట్టబయలవుతుంది.అందుకే నల్లధనాన్ని రామోజీరావుకు చెందిన ‘మార్గదర్శి’లో డిపాజిట్లుగా పెట్టారు. కేంద్ర ఆదాయపన్ను చట్టం సెక్షన్ 269 ప్రకారం రూ.20 వేలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో తీసుకోకూడదు. కానీ, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే సేకరించడం గమనార్హం. ఆ నిధులను తమ కుటుంబ వ్యాపార సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు వాడుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులుగా పెట్టారు.తద్వారా తమ ఫిల్మ్ సిటీ భూముల విలువ, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో తమ పెట్టుబడులు భారీగా పెరిగేలా చేసుకుని తమ అక్రమ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేలా కథ నడిపించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా సాగించిన ఈ దందాతో అటు టీడీపీ పెద్దలు, ఇటు రామోజీరావు కుటుంబం భారీగా అక్రమ ఆస్తులను వెనకేసుకున్నారు.రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి?రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రూ.2,610.38 కోట్ల డిపాజిట్లలో రూ.1,864.10 కోట్లు తిరిగి చెల్లించేశామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి? ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు. ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని, బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలకు కొమ్ముకాస్తోంది. -
Rahul Gandhi: మోదీజీ... భయపడ్డారా?
న్యూఢిల్లీ: అంబానీ– అదానీలతో కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ‘నమస్కారం మోదీజీ.. మీరు భయపడ్డారా?’ అని రాహుల్ ఓ వీడియో సందేశంలో ప్రశ్నించారు. ‘సాధారణంగా మీరు అంబానీ, అదానీల గురించి అంతర్గతంగా, తెరవెనుక మాట్లాడుతారు. కానీ మొదటిసారిగా ఇవాళ మీరు అంబానీ, అదానీల పేర్లను బహిరంగంగా తీసుకున్నారు’ అని రాహుల్ అన్నారు. ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్‌కు ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ– అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ బుధవారం వేములవాడ సభలో ప్రశ్నించారు. ప్రధాని విమర్శలకు బదులిస్తూ ‘వారు టెంపోల నిండా డబ్బులిస్తారని కూడా మీకు తెలుసు. అంటే మీకు వ్యక్తిగతంగా ఇది అనుభవమేనా?’ అని రాహుల్ నిలదీశారు. ఒక పనిచేయండి.. అంబానీ, అదానీలపైకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ)ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి వారు నల్లధనమిచ్చారనే దానిపై సాధ్యమైనంత త్వరగా లోతైన దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారిపైకి ఈడీని పంపడానికి భయపడొద్దన్నారను. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో మొత్తం దేశానికి తెలుసన్నారు. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉండాల్సింది.. అమిత్ షా
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేయకుండా ఉండాల్సిందని, మార్పులు చేస్తే బాగుండేదని అమిత్ షా అన్నారు. ఒక వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మట్లాడుతూ అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌవరవిస్తానని తెలిపారు. భారత రాజకీయాల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ‘ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.20 వేల కోట్ల రాజకీయ పార్టీల ఖాతాలకు చేరాయి. వీటిలో కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే బీజేపికి విరాళంగా వచ్చాయి. మిగిలిన డబ్బులు ప్రతిపక్షాలకు వెళ్లాయి. 303 ఎంపీ సీట్లకు రూ.6 వేల కోట్లు వస్తే 242 సీట్లకు ఏకంగా రూ.14 వేల కోట్లు వెళ్లాయి’అని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఎన్నికల కమిషన్ (ఈసీ)కి బాండ్ల వివరాలు అందజేసింది. ఈ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఏయే కంపెనీలు బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చాయి, ఏ పార్టీకి ఎంత సొమ్ము చేరిందనేది ఈ వివరాల్లో బహిర్గతమైంది. ఇదీ చదవండి.. చంద్రబాబుకు బుద్ధొచ్చింది.. అమిత్ షా -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్‌కు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు. లెక్కా పత్రాలు లేవు.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు. దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్లధనం కేరాఫ్ ‘నోవా’ నోవా అగ్రిటెక్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్‌లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్‌లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్‌లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్‌లీక్ సొమ్ము రాజస్తాన్‌లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్‌లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్‌లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్‌వర్క్‌ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్‌స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి విచిత్ర భాష్యం
-
బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్‌లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్ చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 2017లో బాబు మయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్షీట్లు, కీలకమైన మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్మెంట్ ఇచ్చారు. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా? -
పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా?
పేదరికం అంచునకు చేరుకున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు నల్లధనం సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్లో నల్లధనం విపరీతంగా పెరిగిపోవడంతో దానిని అరికట్టడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. పాకిస్తాన్లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన పోలీసు అధికారులు తమ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్లో నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా విఫలం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. పాక్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై మాట్లాడేందుకు ఏ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరని సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పాకిస్తాన్లో నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇది మొదట్లో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసిరింది. కానీ తరువాతి కాలంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచిందని ఆ పత్రిక పేర్కొంది. నగదు నిల్వలను అరికట్టేందుకు పాకిస్తాన్లో రూ.5000 నోటును దశలవారీగా రద్దు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. అయితే దీనిపై పాక్ అధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్‌లోనే అతిపెద్ద నోటు దక్షిణాసియా దేశాల్లో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన నోటు మరే ఇతర ఆసియా దేశంలోనూ లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గత ఏడాదిలో నగదు ప్రవాహం గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ మొత్తంమీద భౌతిక నగదు మారకం 29 శాతం వరకూ ఉంటుంది. పాకిస్తాన్లో జీడీపీలో 40 శాతం నల్లధనం పాకిస్తాన్లో నల్లధనంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ 341.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐపీఎస్ఓఎస్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం మేరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి సంవత్సరం 6 శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా నెట్టివేస్తున్నది ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..! -
మార్గదర్శిలో ‘నల్ల’ ఇంధనం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్‌ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రూ.కోటికిపైగా డిపాజిట్‌దారులకు నోటీసులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయ వివరాల పరిశీలన.. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్‌దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ఫండ్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు. మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు. మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్‌లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
మార్గదర్శి బ్రాంచీల్లో ఫేక్ చందాదారులు, జాడలేని రికార్డులు
-
మార్గదర్శి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ
-
నల్ల ‘మార్గం’లో! పయనించిన మార్గదర్శి.. గుర్తించిన సీఐడీ
సాక్షి, అమరావతి: భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించింది. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ (సీతంపేట), రాజమహేంద్రవరం (శ్యామల థియేటర్ బ్రాంచి), ఏలూరు (నర్సింగరావుపేట బ్రాంచి), విజయవాడ (లబ్బిపేట బ్రాంచి), గుంటూరు (అరండల్ పేట), నరసరావుపేట (సత్తెనపల్లి రోడ్ బ్రాంచి), అనంతపురం (లక్ష్మీనగర్ బ్రాంచి)లోని మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల సోదాల సందర్భంగా గుర్తించినట్లు సమాచారం. ఏటా దాదాపు రూ.600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్లు గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఏటా మార్చి 31న వచ్చినట్లు చూపిస్తున్న దాదాపు రూ.500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచి కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రశీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు మార్గదర్శి చూపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచి కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్లు తెలుస్తోంది. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం, బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ సోదాలు మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. -
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ధనవంతుడిగా చంద్రబాబు
-
విదేశాల్లో చంద్రబాబు నల్లధనం రూ.5 లక్షల కోట్లు
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి దుబాయ్, స్విట్జర్లాండ్‌లో దాచిన రూ.5 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. తిరుపతిలోని అకాడమీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిన చంద్రబాబుపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమార్జనలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ, ఒక్కచోట కూడా గెలవలేని లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం కామెడీగా ఉందన్నారు. ప్రజాపాలన సాగుతున్న రాష్ట్రంలో విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ వారు ఫ్ర్రస్టేషన్‌లో బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, పెంపుడు కుక్కల్ని పోషిస్తూ మహిళలను సైతం కించపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం హామీలను అమలు చేసినందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆదరించాలని కోరుతున్నారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలకు కూడా అర్థం కాదు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడుతారో ఆరునెలలకు కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదువుతున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాసంక్షేమం ఎందుకు కనపించడంలేదని ప్రశ్నించారు. కనిపించే అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం విమర్శిస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో సైతం ఆయన్ని రెండు కాదు.. మూడుచోట్ల పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన సైకో చంద్రబాబు అని, ఎల్లో మీడియా అండతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయతి్నస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పాపాలు పండిపోయాయని, ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తెలుగు అకాడమీకి పూర్వవైభవం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిర్విర్యం చేసిన తెలుగు అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మిడియట్ పుస్తకాలను ముద్రిస్తున్నామని, త్వరలో డిగ్రీ పుస్తకాలను, పోటీ పరీక్షలకు అవసరమయ్యే 17 రకాల పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల మాండలిక పుస్తకాలు ముద్రిస్తామన్నారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసి, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు చేస్తుండటంపై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటికోసం ప్రయతి్నస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై హైకోర్టులో పోరాడుతున్నామని ఆమె చెప్పారు. -
‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తాజాగా తేలింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఎన్‌స్పైర’ కార్యాలయంలో మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందం 45 హార్డ్ డిసు్కలు, బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక పత్రాలను స్వాదీనం చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తమ కుటుంబ వ్యాపార సంస్థ ‘ఎన్‌స్పైర’ ద్వారా సాగించిన అక్రమాల బాగోతం ఇలా ఉంది. కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా.. మాజీ మంత్రి నారాయణ తమ కుటుంబం నిర్వహించే నారాయణ విద్యా సంస్థల కోసమంటూ ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థను లాభాపేక్షలేని సంస్థగా ఏపీ సొసైటీల చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థ నిధులను నారాయణ తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్లించేందుకు వీలులేదు. దీంతో నిధుల మళ్లింపు కోసం ఎత్తుగడ వేసిన నారాయణ తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర అనే కంపెనీని నెలకొల్పారు. నల్లధనం భారీగా మళ్లింపు.. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపడం గమనార్హం. రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఆ నిధులు రామకృష్ణ హౌసింగ్‌లోకి.. వివిధ మార్గాల్లో ఎన్‌స్పైరలోకి మళ్లించిన నిధులను నారాయణ తమ సమీప బంధువైన కేవీపీ అంజనికుమార్ ఎండీగా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి తరలించారు. దీంతోపాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు మళ్లించడం గమనార్హం. అనంతరం ఆ చిరుద్యోగుల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. తమ వద్ద పనిచేసే చిరుద్యోగులను బినామీలుగా మార్చుకుని 169.27 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. మొత్తం రూ.5,600 కోట్ల అసైన్డ్ దందా అమరావతిలో రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో చక్రం తిప్పిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. రాజధాని కోసం సమీకరించే అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేశారు. ఇదే అదనుగా దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను అయినకాడికి అమ్ముకోకుంటే ప్రభుత్వ పరమైపోతాయని పేదలను బెదిరించి కారుచౌకగా కాజేశారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. రిజిస్ట్రేషన్ చట్టం 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు, రాయపూడి తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం తాపీగా ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. అక్రమాలు బహిర్గతం.. అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 34, 35, 36, 37, 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని గతంలో అరెస్టు చేశారు. కాగా అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు ఎన్‌స్పైర కంపెనీ ద్వారా నల్లధనాన్ని మళ్లించి అక్రమాల కథ నడిపించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా బహిర్గతమైంది. -
దేశంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ...రూ.31.92 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో చెప్పారు. ‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం(1950) వంటివి రద్దవుతాయి. చదవండి: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్ -
నల్ల డబ్బు మార్చే యత్నం!
చిత్తూరు అర్బన్: ‘మావద్ద లెక్కలో చూపించని బ్లాక్‌మనీ (నల్లడబ్బు) రూ.40 కోట్ల వరకు ఉంది. దీన్ని కొంచెం కొంచెం మీ బ్యాంకు ఖాతాలో వేస్తాం. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని వైట్ మనీ (లెక్కల్లో చూపించేది)గా ఇస్తే చాలు..’ అంటూ రైస్ పుల్లింగ్ నేరం తరహాలో బురిడీకొట్టించే ప్రయత్నం చేసి.. తీరా పోలీసులకు తెలిసిపోవడంతో ఓ ముఠా పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన గిరీష్ అనే పారిశ్రామికవేత్తకు చెన్నైకి చెందిన సత్య ఇటీవల పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ఓ బడా పారిశ్రామికవేత్త వద్ద రూ.వందల కోట్ల నల్ల డబ్బు ఉందని, దీన్ని బ్యాంకులో వేసుకుని లెక్కల్లో చూపించి తమకు బదిలీ చేస్తే కమీషన్ రూపంలోనే రూ.కోట్లు సంపాదించవచ్చని గిరీష్‌ను నమ్మించాడు. ఢిల్లీకు చెందిన వినోద్‌గుప్త అనే వ్యక్తిని గిరీష్‌కు ఫోన్లో సత్య పరిచయం చేశాడు. గిరీష్, సత్య, వినోద్‌గుప్త ముగ్గురూ ఫోన్లో పలు దఫాలుగా మాట్లాడుతుకున్నారు. తొలుత రూ.50 లక్షలను సత్య వద్దకు చేరిస్తే.. రూ.5 కోట్లను గిరీష్ బ్యాంకు ఖాతాలో వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అమలు చేయడానికి చిత్తూరు నగరాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీ నుంచి వినోద్‌గుప్తను చెన్నైకు పిలిపించి, అక్కడి నుంచి కారులో బయలుదేరిన సత్య.. గిరీష్‌ను చిత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఉండాలని చెప్పాడు. బుధవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న గిరీష్ బృందాన్ని ప్రశ్నించారు. తనను మోసం చేయడానికి సత్య, వినోద్‌గుప్త ప్రయత్నించారని గ్రహించిన గిరీష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అప్పటికే సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సత్య, వినోద్‌కుమార్ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే పారిపోయారు. చిత్తూరు సీసీఎస్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్, వజ్రాల ఆభరణాల వ్యాపార సంస్థలపై దాడుల్లో రూ.100 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని నల్లధనం బయటపడింది. ఈ నెల 17న బిహార్, ఢిల్లీల్లో 30 ప్రాంతాల్లో ఈ సొత్తును గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన రూ.5 కోట్ల నగదు, నగలను స్వా«దీనం చేసుకుని, 14 బ్యాంకు లాకర్లకు సీల్ వేసినట్లు తెలిపింది. ‘‘కస్టమర్లకు అడ్వాన్సుల పేరుతో మరో రూ.12 కోట్ల లెక్క చూపని ధనం, రూ.80 కోట్ల మేర వెల్లడించని నగదు లావాదేవీలను గుర్తించాం’’ అని పేర్కొంది. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం -
‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2016 నవంబర్ 8న దేశంలో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు ఉన్నపళంగా రద్దయిపోయాయి. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు (డిమానిటైజేషన్) చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల రద్దు దుష్ఫలితాలు బయటపడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆరేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటే నిరాశే మిగులుతుంది. 115 మంది బలి! అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంలో వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు జనసందోహంతో కిటకిటలాడాయి. క్యూలో నిల్చొని 115 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం మాత్రం మరోలా ఉంది. 2016 నవంబర్ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు కాగా, 2022 అక్టోబర్ 21 నాటికి రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ‘మాస్టర్‌స్ట్రోక్’తర్వాత 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరగడం గమనార్హం. పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బడా బాబులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. సామాన్య జనం మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ 2016 నవంబర్ 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషన్లు పేర్కొన్నారు. వివేక్ నారాయణ్ శర్మ పిటిషన్‌పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. హైకోర్టుల్లోనిపిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే నిర్ణయం తీసుకున్నారు. నేడు సుప్రీంకోర్టు విచారణ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్‌పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. చదవండి: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం