IT Officials Detected Rs 3,200 Crore Black Money In Pharma As Well As Real Estate Company At Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీగా బయటపడుతున్న బ్లాక్‌మనీ

Published Thu, Apr 1 2021 2:31 PM | Last Updated on Thu, Apr 1 2021 5:07 PM

IT Has Identified Huge Black Money In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీగా బ్లాక్‌మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్‌ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్‌మనీ గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు గుర్తించారు. తాజాగా రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో బ్లాక్‌మనీ లావాదేవీలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌కు చెందిన స్పెట్రా, సన్‌సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది. బ్లాక్‌మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు తయారుచేసుకున్నాయి. యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.
చదవండి:
మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్‌! 
బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్‌పై ఎక్కించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement