న్యూఢిల్లీ: దేశంలో, విదేశాల్లో భారతీయుల నల్లధనం వివరాలపై మూడు అధ్యయన నివేదికల్ని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. నల్లధనం వివరాల అంచనా బాధ్యతల్ని యూపీఏ హయాంలో మూడు సంస్థలకు అప్పగించారు.
ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ ఫరీదాబాద్‌లు నల్లధనం లెక్కల్ని రూపొందించి 2013, 2014ల్లో ప్రభుత్వానికి సమర్పిం చాయి. ఆ నివేదికల్నే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం పంపింది. భారత్‌లో నల్లధనంపై ప్రభుత్వం తరఫున ఇంతవరకూ అధికారిక నివేదికల్లేవు. అమెరికా సంస్థ జీఎఫ్‌ఐ అధ్యయనం ప్రకారం 2005–14 మధ్య రూ.48.28 లక్షల కోట్ల నల్లధనం భారత్‌లోకి వచ్చింది.