నల్లధనం కేసుల విచారణకు కొత్త సాఫ్ట్‌వేర్
న్యూఢిల్లీ: అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణలో సీబీఐకి సాయపడేలా కొత్త సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకులు, ఆదాయపు పన్నుశాఖ, ఫైనాన్షి యల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో పాటు మరికొన్ని సంస్థల నుంచి అవసరమైన సమాచారం సేకరించేందుకు, సరిచూ సుకునేందుకు సీబీఐకి ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నియమించిన కమిటీ సూచన మేరకు ప్రస్తుతం అనుసరిస్తున్న విచారణ పద్ధతుల్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుత విధానంలో సమా చార సేకరణ పరిధి చాలా తక్కువగా ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. అక్రమాస్తుల కేసుల్లో నిర్ణీత కాల వ్యవధిలో ఆదాయం, ఖర్చుకు సంబంధించి అన్ని అంశాల్ని నమోదు చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతో పాటు, మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని సీవీసీ అధికారి ఒకరు వెల్లడించారు.