CVC
-
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది. సీవీసీ సురేశ్ ఎన్ పటేల్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు. సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన శ్రీవాస్తవ అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. సీవీసీ సారథ్యంలో విజిలెన్స్ కమిషన్‌లో గరిష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు. ఐబీ మాజీ చీఫ్ అర్వింద్ ఒక్కరే ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్నారు. మరో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. -
సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
IPL 2022- Hardik Pandya Record: అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 విజేతగా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి సమిష్టి విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచి.. నాకౌట్ దశలోనూ సత్తా చాటి ట్రోఫీని ముద్దాడింది. మెగా ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్‌కు ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2021లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో వైఫల్యం సహా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘సీవీసీ క్యాపిటల్స్’ అతడిని నమ్మి గుజరాత్ కెప్టెన్‌గా అతడికి అవకాశం ఇచ్చింది. యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హర్దిక్. అంతకు ముందు కెప్టెన్సీ అనుభవం లేకపోయినా సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించి తొలి సీజన్లోనే టైటిల్ అందించాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ కెప్టెన్‌గా అతడు గుర్తింపు పొందాడు. గతంలో ఎంఎస్ ధోని (4 సార్లు–చెన్నై సూపర్ కింగ్స్; 2010, 2011, 2018, 2021), గౌతమ్ గంభీర్ (2 సార్లు–కోల్‌కతా నైట్‌రైడర్స్; 2012, 2014), రోహిత్ శర్మ (5 సార్లు–ముంబై ఇండియన్స్; 2013, 2015, 2017, 2019, 2020) ఈ ఘనత సాధించారు. ఇక గుజరాత్ గెలవడంలో సారథిగానే కాకుండా ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చదవండి 👇 Hardik Pandya: సాహో హార్దిక్.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు.. అయినా ఐపీఎల్ చరిత్రలో యజ్వేంద్ర చహల్ సరికొత్త రికార్డు .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
IPL 2022 Auction: మెగా వేలానికి తేదీలు ఖరారు చేసిన గవర్నింగ్ కౌన్సిల్
IPL 2022 Mega Auction Date And Venue: క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) ఆదివారం నాటి సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది. అదే విధంగా ఈ సమావేశంలో భాగంగా లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ ఎంట్రీకి సంబంధించి బీసీసీఐ నియమించిన కమిటీ అందించిన నివేదికను పాలక మండలి పరిశీలించినట్లు తెలుస్తోంది. రిపోర్టును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పదో జట్టుగా సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ లీగ్‌లో చేరేందుకు జీసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటికే 8 ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టు సమర్పించగా.. రానున్న సీజన్లో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త జట్లు ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు డిసెంబరు 25ను తుది గడువుగా నిర్ణయించారు. చదవండి: IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి గుడ్‌న్యూస్.. ఆ సమస్యలన్నీ తొలగినట్లే.. ఇక! అయితే, అహ్మదాబాద్‌కు సంబంధించిన చట్టపరమైన చిక్కులు వీడిపోనున్న నేపథ్యంలో తాజాగా కొత్త డేట్లను జీసీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా మీడియా రైట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అంతేగాక కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్లాన్ బిని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! -
IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి గుడ్‌న్యూస్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!
IPL 2022 Season: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్‌కు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. ఈ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేసిన అహ్మదాబాద్ జట్టు వచ్చే సీజన్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ సీవీసీ క్యాపిటల్ లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే లక్జెంబర్గ్‌కు చెందినది. అయితే, వీటికి అనుబంధంగా సిసల్, టిపికో కంపెనీలు ఉన్నాయి. వీటిలో సిసల్ బెట్టింగ్ గేమింగ్, పేమెంట్స్ కంపెనీ కాగా... టిపికో స్పోర్ట్స్' బెట్టింగ్, ఆన్లైన్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ... సీవీసీ క్యాపిటల్‌ను లీగ్‌లోకి అనుమతించడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘‘బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొత్త రూల్ అనుకుంటా. పెద్ద బెట్టింగ్ కంపెనీ ఒకటి ఐపీఎల్లో అడుగుపెడుతోందట. బీసీసీఐ అసలు ఏం చేస్తోంది? అవినీతి నిరోధక విభాగం ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది’’ అని ట్విటర్ వేదికగా అసహనం వెళ్లగక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్‌కు సంబంధించి బీసీసీఐ విచారణ చేపట్టింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్-2022లోకి ఆ కంపెనీకి చెందిన అహ్మదాబాద్ జట్టు ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. సీవీసీకి యూరోపియన్ ఫండ్, ఏసియన్ ఫండ్ రెండూ ఉన్నాయని.. ఇందులో కేవలం యూరోపియన్ ఫండ్ మాత్రమే బెట్టింగ్ కంపెనీలతో అనుసంధానమై ఉందని.. ఏసియన్ ఫండ్‌కు వీటితో ఏమాత్రం సంబంధం లేదని తేలినట్లు సమాచారం. దీంతో ఏసియన్ ఫండ్ నుంచి సీవీసీ ఐపీఎల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపినందున.. చట్టప్రకారం ఈ మేరకు ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు... బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అవును... ముగ్గురు సభ్యులతో కూడిన లీగల్ కమిటీ సీవీసీ క్యాపిటల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పంద పత్రం(లెటర్ ఆఫ్ ఇంటెంట్) సమర్పించిన తర్వాత తదుపరి ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి’’ అని పేర్కొన్నారు. కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి సంబంధించిన సమస్య కారణంగానే మెగా వేలం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు అడ్డంకులు తొలగడంతో త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఇక కొత్త జట్లు లక్నోకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా రూ. 5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: "గంగూలీ నీ పని నువ్వు చూసుకో.. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు" -
ఆ గ్రూప్ వారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇకపై 18–44 ఏళ్ల వయసు వారు ఆన్సైట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు నమోదులేకుండానే ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వచ్చి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే ఈ ఆన్సైట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం కేవలం ప్రభుత్వ సీవీసీల్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ డోస్‌ల వృథాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 18–44 ఏళ్ల వయసు వారికి ఆన్సైట్ సదుపాయం కల్పించడం, వారికి అపాయింట్‌మెంట్‌తోపాటు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తుది నిర్ణయం తీసుకోవాలని, వారిదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ గ్రూప్ వారికి సరిపడ డోస్‌లు లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో చాలా వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. డోస్‌లు లేకున్నా ఆన్సైట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశమిస్తే ఈ గ్రూప్ వారు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పోటెత్తే ప్రమాదముంది. రాష్ట్రాలకు భారీగా డోస్‌లు పంపకుండానే, ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఈ గ్రూప్ వారి వల్ల పెరిగే భారీ రద్దీని అరికట్టేందుకే గతంలో కేంద్రప్రభుత్వం ఆన్లైన్ అపాయింట్మెంట్ను మాత్రమే అమలుచేసిన సంగతి తెల్సిందే. ప్రైవేట్ ఆధ్వర్యంలో నిడిచే సీవీసీల్లో గతంలో మాదిరి∙ముందస్తుగా ఆన్లైన్ అపాయింట్‌మెంట్స్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను అమలుచేయాలి. వేరే గ్రూప్ వాళ్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని డోస్‌లు తీసుకోవాల్సిన రోజున కొందరు రాకపోవడంతో డోస్‌లు వృథా అవుతున్నాయి. డోస్‌ల వృథాకు సంబంధించిన నివేదికలను కేంద్రం పరిశీలించింది. వృథాను అరికట్టేందుకే పరిమిత సంఖ్యలో 18–44 వయసు వారికీ ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ నిబంధన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్‌ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
రిలయన్స్ బోర్డులోకి మాజీ సీవీసీ
సాక్షి, ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి కేవీ చౌదరి చేరారు. ఈ మేరకు రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం అందించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో చౌదరిని నాన్ ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్ గా నియమకానికి ఆమెదం లభించినట్టు తెలిపింది. అలాగే ఆయన బాధ్యతలు సంస్థలో ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం లేదని పేర్కొంది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి . 1978-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) బ్యాచ్‌కు చెందినవారు. కేవీ చౌదరి ఆగస్టు 2014 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ఛైర్మన్‌గా బాధ్యలను నిర్వహించారు. ఆ తరువాత, సమస్యలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగాను, జూన్ 2015నుంచి 2019 జూన్ వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) గాను పనిచేశారు. కాగా సీవీసీగా అతని నాలుగేళ్ల పదవీకాలంలో, ముఖ్యంగా 2018 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అంతర్గత పోరును పరిష్కరించే క్రమంలో కేవీ చౌదరి వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్‌పాల్‌కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్‌పాల్‌కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్‌లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్‌లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
కేంద్ర మంత్రి లంచం తీసుకున్నారు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు. అజిత్ దోవల్ అడ్డుకున్నారు.. రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు. కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్ఎస్ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు. సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు. కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ.. సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చౌదరిని సతీశ్ కలిశాడు అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు. -
‘సీబీఐ వార్’లోకి కాంగ్రెస్
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం(డీఎస్‌పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు అలోక్ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా. డైరెక్టర్ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్‌పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తికి బెయిల్ నిరాకరణ సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ప్రసాద్ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్‌పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్ పిటిషన్‌తో కోర్టు విభేదించింది. అక్టోబర్ 17న అరెస్టయిన ప్రసాద్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్‌కు అక్టోబర్ 31నే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
రాకేష్ ఆస్ధానాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాకు ఊరట లభించింది. ఆస్ధానాపై అవినీతి ఆరోపణల కేసులో నవంబర్ 1 వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని, అప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం దర్యాప్తు ఏజెన్సీని ఆదేశించింది. మరోవైపు కేసుకు సంబంధించి సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని సీబీఐ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. కేసును పర్యవేక్షిస్తున్న బృందంమారిపోయిందని, ఆరోపణలపై దృష్టిసారించిన విజిలెన్స్ కమిషన్ వద్ద ఫైళ్లు ఉన్నాయని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. కాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా విచారణ ముగించాలని గత వారం సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుగుణంగా అలోక్ వర్మపై దర్యాప్తుకు సంబంధించి అవసరమైన పత్రాలు, ఫైళ్లను సీవీఈసీకి దర్యాప్తు ఏజెన్సీ అందిస్తోంది. తనపై ముడుపుల కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ రాకేష్ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆస్ధానా హైకోర్టును ఆశ్రయించారు. -
అవినీతి ఫిర్యాదుల్లో టాప్ రంగాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి. ఈ కోవలో ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలపై పెద్ద ఎత్తున అవినీతి ఫిర్యాదులు రావడం ఆందోళన పుట్టిస్తోంది. అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో రైల్వేలు, ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్‌లో నిలిచాయి. తాజాగా సీవీసీ అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను సీవీసీ పార్లమెంట్‌కు సమర్పించింది. 2017 సంవత్సరానికి గానూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఈ సంచలన విషయాలను పార్లమెంటుకు నివేదించింది. అవినీతి నిరోధక విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సీవీసీ ఈ రిపోర్టును వెల్లడించింది. ఈ ఏడాది రైల్వే ఉద్యోగులపై 12,089, బ్యాకింగ్ ఉద్యోగులపై 8,018 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదికలో పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్టు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు చెందిన ఉద్యోగులపై 2,730 ఫిర్యాదులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అందుతున్న ఫిర్యాదుల్లో చాలా వరకు అస్పష్టంగా ఉంటున్నాయని సీవీసీ తెలిపింది. 2016తో పోలిస్తే 2017లో మొత్తం ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గడం విశేషం. ప్రపంచంలోనే భారతీయ రైల్వేలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క ఇటీవల దేశంలో కుంభకోణాలన్నీ కొందరు బ్యాంకింగ్ ఉద్యోగుల సహాకారంతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో వారిపై ప్రజలు ఈ స్థాయిలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
అప్రమత్తం కాలేకపోయిన పీఎన్బీ..
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,600 కోట్ల నీరవ్ మోదీ-మెహుల్ చోక్సీ బ్యాంక్ స్కామ్ వెలుగుచూసే ఏడాదికి ముందే జెమ్స్, జ్యూవెలరీ రంగంలో అక్రమాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) హెచ్చరించింది. గత ఏడాది జనవరి 5న జ్యూవెలరీ కంపెనీల అకౌంట్స్‌లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకోవడంపై చర్చించేందుకు సీబీఐ, ఈడీ, పది బ్యాంకుల చీఫ్ విజిలెన్స్ అధికారులతో విజిలెన్స్ కమిషన్ భేటీ అయిందని సీవీసీ 2017 వార్షిక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జతిన్ మెహతాకు సంబంధించిన విన్సం గ్రూప్‌లో అవకతవకలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సీవీసీ ఏర్పాటు చేసిన ఈ కీలక భేటీకి పీఎన్బీ అధికారులు కూడా హాజరయ్యారు. అప్పటి సమావేశంలో జ్యూవెలరీ కంపెనీలు పాల్పడుతున్న అక్రమాలు, బంగారం దిగుమతుల్లో మోసాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లపై చర్చించామని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి వెల్లడించారు. జతిన్ మెహతా విన్సం గ్రూప్ అవకతవకలపైనా ఈ భేటీలో ప్రస్తావించామని చెప్పారు. పీఎన్బీ స్కామ్ అప్పటికి వెలుగు చూడకపోయినా జతిన్ మెహతాకూ పీఎన్బీ రుణాలిచ్చింది. మెహతాకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు పీఎన్బీ లీడ్ బ్యాంకర్‌గా వ్యవహరించడం గమనార్హం. బ్యాంకర్లకు టోకరా ఇచ్చిన జతిన్ మెహతాకు పీఎన్బీ రూ 1658 కోట్లు రుణాలు మంజూరు చేసింది. మెహతా ప్రస్తుతం సెయింట్కిట్స్లో తలదాచుకున్నట్టు సమాచారం. రూ 6200 కోట్లు రుణాలు తీసుకున్న మెహతా విదేశాలకు పారిపోయారు. జ్యూవెలరీ సంస్థల దిగుమతులు, ఇతర విదేశీ లావాదేవీలపై బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సీవీసీ ఆర్బీఐతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖనూ కోరింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోటుపాట్లను అధిగమించేందుకు కీలక సూచనలు చేసినట్టు సీవీసీ నివేదిక స్పష్టం చేసింది. ఏడాది ముందే జ్యూవెలరీ సంస్థల అవకతవకలపై సీవీసీ హెచ్చరించినా నీరవ్ మోదీ, చోక్సీల భారీ స్కాం వెలుగుచూసేంత వరకూ పీఎన్బీ అప్రమత్తం కాలేకపోయింది. -
ఆర్బీఐపై సీవీసీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ. చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సరైన ఆడిట్స్ నిర్వహించలేదని పేర్కొన్నారు. సీబీఐ విచారణను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎన్బీ స్కాం విషయంలో తప్పు ఆర్బీఐదే అంటూ సీవీసీ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆడిటింగ్ విధానాన్ని పటిష్టపరచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పీఎన్బీ బ్యాంకులో కుంభకోణం జరిగిన సమయంలో రిజర్వు బ్యాంకు సరైన ఆడిట్స్ నిర్వహించలేదని, కాబట్టి తప్పు ఆర్బీఐదే అని ఆయన విమర్శించారు. ఆర్బీఐ మరింత పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరముందన్నారు. బ్యాంకుల్లో రిస్క్‌లను గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆడిటింగ్ చెయ్యాలి. కానీ పీఎన్బీలో సమయానుసారంగా ఆర్బీఐ అలా స్పష్టంగా ఆడిటింగ్ చేయలేదని చౌదరి ఆరోపించారు. కాగా దాదాపు 13వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇప్పటికే భారీ మోసాన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటూ రెగ్యులేటర్స్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
గతవారం బిజినెస్
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు (ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను ఆదేశించింది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు ప్రైవేటు బ్యాంకులు, వాటిల్లో పనిచేసే ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ తెలిపారు. అవినీతి నిరోధక చ ట్టం 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అ ధికారులు ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటుచేసుకున్నాయి. ఓఎఫ్ఎస్ నిబంధనల్ని సడలించిన సెబీ ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) నిబంధనల్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. కంపెనీ మార్కెట్లో ఓఎఫ్ఎస్ లావాదేవీ జరిపిన తర్వాత రెండు వారాల్లోనే ఓఎఫ్ఎస్లో భాగంగా తన ఉద్యోగులకు షేర్లను విక్రయించవచ్చు. ప్రస్తుతం ఇటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు 12 వారాల వరకూ ప్రమోటర్లు చేయకూడదన్న నిబంధన ఉంది. ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్‌ను ఓఎఫ్ఎస్లో భాగంగానే పరిగణిస్తారని, ఓఎఫ్ఎస్ ఇష్యూ ధరకంటే డిస్కౌంట్‌తో ఉద్యోగులకు జారీచేయవచ్చని సెబీ తాజా సర్క్యులర్‌లో వివరించింది. ఎఫ్ అండ్ ఓ విభాగంలోకి మరో 5 షేర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో కొత్తగా ఐదు షేర్లను ప్రవేశపెట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించా యి. ఇటీవల లిస్టయిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు మణప్పురం ఫైనాన్స్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, శ్రేయీ ఇన్ఫ్రా, రెప్కో హోమ్ ఫైనాన్స్ షేర్లకు సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు జూన్ 30 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ భారీ అప్పుల భారంతో నెట్టుకొస్తున్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. కాగా ఎయిర్ ఇండియా కొనుగోలుపై ఇండిగో ఆసక్తి కనబరుస్తోంది. రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2.3 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లు పెట్టుబడులు పెట్టామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దేశీ మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీ చైనా ఆటోమొబైల్ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ తాజాగా భారత్ మార్కెట్లో అడుగుపెడుతోంది. ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) వాహనాలను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్ల తయారీ కోసం భారత్‌లో సొంత ప్లాంటు ఏర్పాటు చేయనుంది. తయారీ ప్లాంటుకు అనువైన ప్రదేశంపై కసరత్తు జరుగుతోందని, 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా పేరిట పూర్తి అనుబంధ సంస్థ ద్వారా భారత కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కాగా టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది. అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తి జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంటు టేకోవర్ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐ సీఐ బ్యాంక్ ప్రకటించింది. జైప్రకాశ్ అసోసియేట్స్ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్) ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్ చరిత్రాత్మకమైనదని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ వ్యాఖ్యానించారు. మౌలిక రంగం వృద్ధి డౌన్! ఎనిమిది కీలక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోలిస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4% స్థాయిలోనే ఉంచింది. పెరగనున్న మొండిబకాయిల భారం! బ్యాంకింగ్ మొండిబకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రమాద ఘంటికలు మ్రోగిం చింది. 2017 మార్చి నాటికి 9.6%గా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి నాటికి 10.2%కి చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2016 సెప్టెంబర్‌లో ఎన్పీఏల రేటు 9.2% కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీ యోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3%గా ఉంటుందని పేర్కొంది. -
రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు
బ్యాంకులకు సీవీసీ ఆదేశం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.లక్షలోపు మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కోరింది. బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే తప్పిస్తే దానిపై పోలీసులను ఆశ్రయించనవసరం లేదని స్పష్టం చేసింది. రూ.10,000కు పైన రూ.లక్షలోపు విలువగల మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉంది. అయితే, ఈ కేసులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఆర్బీఐతో సంప్రదించిన అనంతరం సీవీసీ తాజా నిర్ణయం తీసుకుంది. రూ.10,000కుపైన రూ.లక్షలోపు మోసాల్లో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే మాత్రం వాటిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన ఆదేశాల్లో సీవీసీ పేర్కొంది. -
మరణానికి ముందు పాల్వాయి చివరి అభ్యర్థన
సాక్షి, న్యూడిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణానికి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరారు? అనేక సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై ప్రశ్నించిన పాల్వాయి.. తాను చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతి, అక్రమాలపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ) తో విచారణ జరిపించాలన్నది పాల్వాయి గోవర్ధన రెడ్డి చివరి కోరికగా మిగిలింది. జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో విచ్చలవిడి అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, అందువల్ల సీవీసీ విచారణ జరిపి ప్రభుత్వ ధనాన్ని రాబట్టాలని, అవినీతికి బాద్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాల్వాయి గోవర్ధన రెడ్డి గత నెలలో సీవీసీకి ఫిర్యాదు రాశారు. ఆ ఫిర్యాదు పై స్పందించిన సీవీసీ, ఫిర్యాదు తానే చేశానని ధృవీకరించాలని పాల్వాయి కి ఈ నెల 2 వ తేదీన లేఖ రాసింది. ఆ ఫిర్యాదును తానే చేశానని ధృవీకరిస్తూ మరణించడానికి ఒక రోజు ముందు పాల్వాయి గోవర్ధనరెడ్డి సీవీసీ కి మరో లేఖ రాశారు. కేంద్ర జల సంఘం,కేంద్ర పర్యావరణ మంత్వ్రిత్వ శాఖల అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు అక్రమంగా చేపట్టారని పాల్వాయి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం కాంట్రాక్టర్ కు దాదాపుగా రూ. 400 కోట్లను అదనంగా చెల్లించారని, తద్వారా ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పాల్వాయి సీవీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ పద్దతులను అనుసరించలేదని, కొన్ని పనులను నామినేషన్ పద్దతిలో కేటాయించారని పాల్వాయి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ. 41 వేల కోట్ల కు పెంచారని ప్రస్తావించారు. పోలవరం కుడి కెనాల్, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల అమలులో బాధితులైన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో వివక్షత ప్రదర్శించారని పాల్వాయి అరోపించారు. ప్రాజెక్ట్ పనుల కోసం వినియోగించాల్సిన సిమెంట్ ను కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని,కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రాజెక్ట్ పనులలో కొన్ని అంశాలను మార్చారని పాల్వాయి గోవర్ధన రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, కాగ్ నివేదిక ను తమ ఫిర్యాదుకు జత చేశారు. పోలవరం అవినీతి, అక్రమాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇప్పటికే సీబీఐ,సీవీసీ లకు ఫిర్యాదు చేశారని తెలిసిందని పాల్వాయి ఆ లేఖ లో పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా కులులో పర్యటిస్తున్న సందర్భంలో పాల్వాయి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మరణానికి ముందు చేసిన ఫిర్యాదుపై సీవీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. -
సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్‌తో పంచుకోనున్నారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్ తెలిపింది. -
నల్లధనం కేసుల విచారణకు కొత్త సాఫ్ట్వేర్
-
నల్లధనం కేసుల విచారణకు కొత్త సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణలో సీబీఐకి సాయపడేలా కొత్త సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకులు, ఆదాయపు పన్నుశాఖ, ఫైనాన్షి యల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో పాటు మరికొన్ని సంస్థల నుంచి అవసరమైన సమాచారం సేకరించేందుకు, సరిచూ సుకునేందుకు సీబీఐకి ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నియమించిన కమిటీ సూచన మేరకు ప్రస్తుతం అనుసరిస్తున్న విచారణ పద్ధతుల్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత విధానంలో సమా చార సేకరణ పరిధి చాలా తక్కువగా ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. అక్రమాస్తుల కేసుల్లో నిర్ణీత కాల వ్యవధిలో ఆదాయం, ఖర్చుకు సంబంధించి అన్ని అంశాల్ని నమోదు చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతో పాటు, మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని సీవీసీ అధికారి ఒకరు వెల్లడించారు. -
అవినీతిలో రైల్వేశాఖ ఫస్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 2016లో నమోదైన అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పార్లమెంటుకు సమర్పించిన తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతేకాకుండా అవినీతి కేసుల సంఖ్య అంతకు ముందేడాది కంటే 67 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2015లో ప్రభుత్వాధికారులపై మొత్తం 29,838 అవినీతి కేసులు ఉండగా, 2016 నాటికి అవి 67 శాతం పెరిగి 49,847కు చేరుకున్నట్లు కమిషన్ పేర్కొంది. రైల్వేల్లో అత్యధికంగా 11 వేల కేసులు నమోదు కాగా 8,852 కేసులు పరిష్కారమయ్యాయని, 2,393 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సీవీసీ స్పష్టం చేసింది. రైల్వేల్లో దాదాపు 1,054 కేసులు ఆరు నెలల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాతంలో 2015తో పోలిస్తే అవినీతి కేసుల సంఖ్య భారీగా 5,139 నుంచి 969కి తగ్గినట్లు కమిషన్ వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో 6,513, ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులపై 6,018, పెట్రోలియం మంత్రిత్వ శాఖలో 2,496 అవినీతి కేసులు నమోదైనట్లు సీవీసీ పేర్కొంది. ఆదాయపు పన్నుశాఖలో 2016లో 2,646 కేసులు నమోదవగా, పట్టణాభివృద్ధి శాఖలో 2,514 కేసులు నమోదైనట్లు కమిషన్ స్పష్టం చేసింది. టెలీ కమ్యూనికేషన్ ఉద్యోగులపై 2,393 కేసులున్నట్లు వెల్లడించింది. కార్మిక శాఖ, ఆహారం, వినియోగ దారుల వ్యవహారాల శాఖల్లో వరుసగా 1,746, 1,668 కేసులు ఉన్నట్లు సీవీసీ తెలిపింది. కస్టమ్స్, ఎక్సైజ్ శాఖలో 1,420, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో 1,376, ఉక్కు మంత్రిత్వ శాఖలో 1,369 కేసులు నమోదైనట్లు కమిషన్ నివేదికలో పేర్కొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ, సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖల్లో వరుసగా 759, 724 కేసులు ఉన్నట్లు వెల్లడించింది. రక్షణ శాఖలో 689, కుటుంబ మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 571, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగులపై 479 కేసులు నమోదైనట్లు సీవీసీ తెలిపింది. -
20న చెన్నైలో ఐసీఏఐ అవార్డుల కార్యక్రమం
న్యూఢిల్లీ: ఐసీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 10వ పురస్కారాల కార్యక్రమం ఈ నెల 20న చెన్నైలో జరగనుంది. సీఏ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించేందుకు గత 9 సంవత్సరాలుగా ఐసీఏఐ ఈ అవార్డులు ఇస్తోంది. ప్రధానంగా 3 విభాగాల్లో ఈ ఏడాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర నిఘా కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జరిగిన జ్యూరీ సమావేశంలో ఈ ఏడాది విజేతలను ఎంపిక చేశారు. మొత్తం 21 మంది సభ్యుల జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసింది.