న్యూఢిల్లీ: సీబీఐ అధికారులపై 56 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ తెలిపింది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వె ల్లడించింది. డిసెంబర్ 31, 2015 నాటికి మొత్తం 56 కేసులకు గాను గ్రూప్ ఏ అధికారులపై 31 కేసులు, గ్రూప్ బి, సి అధికారులపై 25 కేసుల పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.
19 కేసులు నాలుగేళ్లుగా, 3 కేసులు మూడేళ్లుగా, ఐదు కేసులు రెండేళ్లుగా, ఏడు కేసులు ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ తెలిపింది. 2015లో సీబీఐ 1,135 కేసులు నమోదు చేసిందని, వీటిలో 185 లంచం కేసులు, 67 అక్రమాస్తుల కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడించింది.
సీబీఐ అధికారులపై 56 కేసులు: సీవీసీ
Published Fri, Aug 5 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
Advertisement
Advertisement