న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది.
వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment