Bank officials
-
,,,వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్లవి ఏం తీసుకెళ్తార్సార్
-
లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు
కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్ బ్రాంచ్ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు. అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు డిఫాల్టర్లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల బ్రాంచ్ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్ కాగా బ్యాంక్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు జనగామ - పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు pic.twitter.com/NA0yGAjSPq— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025 -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో టీడీపీ నేత బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 8 కోట్లకుపైగా రుణం తీసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రామచంద్రాపురం మండలానికి చెందిన బీఎన్ రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు నవీన్‌రెడ్డి, కోడలు ప్రియాంకా చౌదరి కొంత కాలం క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు. 2016, మే 28న నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సమక్షంలో ప్రియాంక చౌదరి రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ద్వారా అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 జూలై 8న తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్బీఐ ఎస్ఎంఈ బ్రాంచ్‌లో ఓసారి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. కొంతకాలం తర్వాత మరలా రూ. 3.5 కోట్లు రుణం తీసుకున్నారు. 9 ఎకరాలు తమదేనంటూ.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పీర్లగూడలో చిన్నశ్రీరాములు పేరుతో సర్వే నంబర్ 157, 159, 160లో ఉన్న 9 ఎకరాల భూమి, అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న నారియా ఎంటర్ప్రైజెస్ గ్రానైట్ ఇండస్ట్రీ రికార్డులను ఎస్బీఐకు స్యూరిటీగా సమరి్పంచి ఎస్బీఐ నుంచి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లా పుత్తూరు పాలమంగళంలోని సిరీనా రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో రూ. 3.5 కోట్లను రుణంగా పొందారు. ఆ రుణం పొందిన వెంటనే బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నారియా ఎంటర్‌ప్రైజెస్‌ను అమ్మేశారు. ఆ తరువాత ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఎన్పీఏగా గుర్తించి స్యూరిటీగా పెట్టిన ఆస్తుల అమ్మకానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పీర్లగూడలో ప్రియాంకా చౌదరి, నవీన్‌రెడ్డి పేరుతో ఎలాంటి భూములు లేవని, బ్యాంకుకు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ డాక్యుమెంట్లని నిర్ధారించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో గతేడాది అక్టోబర్ 3న తిరుపతి ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రూ. 4.90 కోట్లకు సంబంధించిన కేసుకు సంబంధించి మాత్రమే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని, ఇది సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిన కేసు అని బ్యాంకు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
బ్యాంకుకి టోపీ పెట్టిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఫ్యామిలీ
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు నిర్వాకం బయటపడింది. తపస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఉమామహేశ్వరరావు సోదరులు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని చెల్లించలేదు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఉమామహేశ్వరరావు పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలానికి ఫ్లెక్సీలు అతికించారు. చదవండి: (చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి) -
అప్పు తీర్చే మార్గం కనిపించడంలేదు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!
జోగిపేట(అందోల్): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధి కంసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు. రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది కన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. – రాజు, మేనేజర్ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్ -
చెక్కు బౌన్స్ కేసులో కోర్టుకు టీడీపీ నేత అనిత
విశాఖ లీగల్: బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధుల్లేకుండా చెక్కులు జారీ చేసిన (చెక్ బౌన్స్) కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నగరంలోని 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వంగలపూడి అనిత ఎన్నికలు, వ్యక్తిగత ఖర్చుల కోసం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు వద్ద 2015 అక్టోబర్ 1న రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 18 శాతం వడ్డీ చెల్లించడానికి కూడా అంగీకరించారు. మూడేళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. శ్రీనివాసరావు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె 2018 జూలై 30న రూ.70 లక్షలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెక్కు ఇచ్చారు. దానిని శ్రీనివాసరావు 2018 ఆగస్టు 13న ఐసీఐసీఐ బ్యాంక్‌లోని తన ఖాతాలో జమ చేశారు. అది నిరాదరణకు గురైంది. చెక్‌ను ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంక్ అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసరావు నగరంలోని 1వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన న్యాయవాది పంపిన లీగల్ నోటీస్‌ను అనిత తిరస్కరించారు. అనంతరం కేసు 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయింది. ఇటీవల బ్యాంక్ అధికారులు తమ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. అందులో బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు లేని కారణంగా చెక్ నిరాదరణకు గురైనట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అనిత సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. మధ్యలోనే కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో కేసును మేజిస్ట్రేట్ ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు. -
లోన్ డబ్బులు కట్టలేదని ఇంటికి తాళం
-
‘మెప్మా’.. కేసు కదలదేమి చెప్మా!
సాక్షి, హైదరాబాద్: అది కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్.. నలుగురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఓ టీఎంసీ, మరికొందరు రిసోర్సు పర్సన్లు... బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 64 నకిలీ మహిళా సంఘాలను సృష్టించారు. రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా పెట్టారు. దీనిపై మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు విచారణ జరిపి రూ.3.20 కోట్ల రుణ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. ఒక టీఎంసీని, సీవోను సస్పెండ్ చేసి, మరో ముగ్గురు సీవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. బ్యాంకుల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత యథావిధిగా స్థానిక కార్పొరేటర్లు, పెద్ద నాయకులు రంగ ప్రవేశం చేయగా... ఓ సీవోను అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలు లేవు. ఏడాది దాటినా రికవరీ లేదు. కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. ఈ బోగస్ రుణాల కుంభకోణం ఒక్క కరీంనగర్ కార్పొరేషన్తోనే ఆగలేదు. వరంగల్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లతోపాటు నల్లగొండ, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట తదితర మునిసిపాలిటీల్లోనూ సాగింది. అన్నిచోట్లా భారీస్థాయిలో రుణ కుంభకోణం సాగినట్లు తెలుస్తోంది. సంఘానికి రూ.7.50 లక్షల వరకు రుణం నకిలీ మహిళా సంఘాల పేరిట దందాలు 2015లో మొదలైనా 2018, 2019లలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తతంగం సాగింది. కరీంనగర్లో 64 సంఘాల ద్వారా 3.20 కోట్లు రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరు, రికవరీలపై దృష్టి పెట్టగా.. చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తేలింది. రిసోర్స్ పర్సన్ల ద్వారా ఒక బోగస్ సంఘాన్ని ఏర్పాటు చేయించి, బ్యాంకు అధికారులతో కలిసి మహిళల ఫొటోలు, పేర్లతోపాటు ఆధార్ నుంచి బ్యాంకు అకౌంట్ వరకు నకిలీవి సృష్టించి ఒక్కో సంఘం పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు రుణాలు పొందినట్లు తేలింది. కరీంనగర్లో మూడు సంఘాల నుంచి మాత్రమే రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేయడంతో బోగస్ రుణాల కేసులు దాదాపుగా క్లోజయ్యాయి. ఇక్కడ ఏకంగా సీవోలను సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించారు. సస్పెండ్ అయిన వాళ్లు రికవరీ చేసే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినప్పటికీ ప్రజాప్రతినిధుల సిఫారసుతో యథావిధిగా కొనసాగుతున్నారు. మంచిర్యాలలో ముగ్గురు సీవోలను జిల్లాలోని వేర్వేరు మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో 43 సంఘాల ద్వారా రూ.80 లక్షల రుణాలను తీసుకొని పత్తాలేకుండా పోయారు. సిద్ధిపేటలో రూ.18 లక్షల అక్రమ రుణాలు మంజూరయ్యాయి. ఖమ్మంలో జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మహిళ ఏకంగా ఏసీబీకే చిక్కారు. ప్రతి ఆర్పీ నుంచి ఆమె నెలకు రూ.1,500 మేర లంచంగా తీసుకుంటారు. రామగుండంలో మెప్మా అధికారిగా ఉన్న మహిళ ఏడెనిమిదేళ్ల క్రితమే సస్పెండ్ అయి ఏడాదిన్నర తరువాత రాజకీయ పరపతితో తిరిగి మంచి పోస్టును దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరిపైనా చర్యల్లేవ్... రాష్ట్రంలో మెప్మా పరిధిలో 5,765 మహిళా సమాఖ్యలున్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 20–30 మహిళా సంఘాలు ఉంటాయి. ప్రతి సమాఖ్యకు ఒక రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) బాధ్యురాలిగా ఉండి ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించి, రికవరీ చేయించాలి. ప్రతి సమాఖ్యలోకి కొత్తగా సంఘాలను తీసుకునే అవకాశం ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని బోగస్ సంఘాలను సృష్టించి, రుణాలు పొందారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టీఎంసీలు, బ్యాంకు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారు. అయితే విషయం బయటకు పొక్కగానే ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేసి తమను తాము రక్షించుకుంటున్నారు. దందాలో భాగస్వాములైన బ్యాంకు అధికారుల గురించి అడిగేవారే లేరు. బోగస్ సంఘాల అంశం వెలుగు చూడటంతో ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి కనపరచడం లేదు. -
18 లోగా రుణాలు చెల్లించకుంటే... ఇళ్లకు తాళం.. వస్తువుల వేలం
ఇల్లెందు: కరోనా కష్టాల్లోంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గిరిజన రైతులకు బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. రుణాలు చెల్లించాలంటూ కనికరంలేకుండా డెడ్‌లైన్ విధించారు. రుణం చెల్లించకపోతే తాము ఎంత దారుణంగా ప్రవర్తించదలిచామో డప్పుకొట్టించి మరీ చెప్పారు. గిరిజన రైతుల ఇళ్ల ముందు చాటింపు వేయించి వారిలో భయాందోళన కలిగించారు. ఇల్లిల్లూ జీపుల్లో తిరుగుతూ మైకుల్లో హెచ్చరించారు. ఇంకా దారుణమేమిటంటే... ఈ నెల 18వ తేదీలోగా రుణాలు చెల్లించలేకపోతే తమ ఇళ్లలోని విలువైన వస్తువుల వేలం, ఇళ్లకు తాళం వేసుకోవచ్చని గిరిజన రైతులు ఒప్పుకున్నట్లుగా వారితో అంగీకారపత్రాలు రాయించుకొని సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.3.50 లక్షల చొప్పున 35 మంది రైతులు 2017– 18లో చేపల చెరువుల నిర్మాణం కోసం గిరిజన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల, పూబెల్లి గ్రామాలకు చెందిన 35 మంది గిరిజన రైతులు రూ.3.50 లక్షల చొప్పున డీసీసీబీ ద్వారా రుణం తీసుకున్నారు. ఇందులోంచి రూ.1.50 లక్షలను బ్యాంకర్లు డిపాజిట్ చేయించుకున్నారు. అయితే, రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ డిపాజిట్ డబ్బులను రుణం కింద జమ చేసుకున్నారు. ఇంకా ప్రతి రైతు రూ.2 లక్షల వరకు బకాయి ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతుండగా, రైతులు మాత్రం రుణంగా ఇచ్చిన నగదు కంటే బ్యాంకు అధికారులు కమీషన్ల కింద తీసుకున్న వాటానే అధికంగా ఉందంటూ చెల్లింపునకు నిరాకరించారు. ప్రస్తుతం అప్పటి అధికారులు అక్కడ విధుల్లో లేరు. రైతుల రుణాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పాలకవర్గం, అధికారులు రుణాల వసూళ్లకు రంగంలోకి దిగి గిరిజన రైతులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఇందులో కొందరు మాత్రం ఎంతోకొంత రుణం తిరిగి చెల్లించారు. పూర్తిస్థాయిలో ఏ రైతు కూడా తిరిగి చెల్లించకపోవడంతో ఇళ్లు, సామగ్రిని వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం డీసీసీబీ ఇల్లెందు, టేకులపల్లి బ్రాంచ్ మేనేజర్లు నాగరాజు, కృష్ణ, ఇతర ఇబ్బంది సుదిమళ్లకు మందీమార్బలంతో జీపుల్లో చేరుకున్నారు. రుణాలు చెల్లించాలని, లేనిఎడల ఇళ్లలోని వస్తువులను వేలం వేస్తామని, ఇళ్లకు తాళాలు వేస్తామని మైకుల్లో హెచ్చరించారు. రైతుల ఇళ్ల ముందు డప్పు చాటింపు వేయించారు. ఇళ్లలోని విలువైన సామగ్రిని గుర్తించి నమోదు చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీలోగా రుణాలు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేసుకోవచ్చని, సామగ్రిని వేలం వేసుకోవచ్చని రైతులు, వారి కుటుంబీకుల నుంచి అంగీకారపత్రం రాయించుకున్నారు. గిరిజనులం కావడంతోనే అధికారులు తమతో ఇలా వ్యవహరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులను పట్టించుకోకపోవడంతోనే... ఈ విషయమై డీసీసీబీ ఇల్లెందు బ్రాంచ్ మేనేజర్ నాగరాజును ‘సాక్షి’వివరణగా కోరగా అప్పు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో డప్పు చాటింపు వేయించాల్సి వచ్చిందని తెలిపారు. గిరిజన రైతుల పేరిట మధ్యవర్తులు రుణాలు తీసుకున్నారని, ఈ క్రమంలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. -
'చెక్కు' చోరుడు
కందుకూరు: కొరియర్ సర్వీసుల్లో వచ్చే బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు, డీడీలు వంటివి దొంగిలించడం, వాటిని మాన్యుపులేట్ చేసి బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో నగదు కొట్టేయడం అలవాటుగా చేసుకున్న మోసగాడు చివరికి కటకటాల పాలయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసం ఉంటున్న తిరుపతికి చెందిన గాలి చేతన్చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. కందుకూరుకు చెందిన రమాదేవి అనే మహిళ తనకు తెలిసిన వి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కెనరా బ్యాంకు చెక్‌బుక్ నుంచి రూ.2 లక్షలకు చెక్కు రాసి ఇచ్చింది. ఈ చెక్కును వెంకటేశ్వర్లు తన యూనియన్ బ్యాంకు అకౌంట్ ద్వారా మార్చుకునేందుకు స్థానిక బ్యాంకులో ఇచ్చాడు. ఆ చెక్కును వెరిఫికేషన్ చేసి పాస్ చేసేందుకు కందుకూరు బ్రాంచ్ అధికారులు ఒంగోలు బ్రాంచ్‌కు ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా గత నెల 28న పంపారు. కొరియర్ బాయ్ డెలివరీ చేసే సమయంలో చేతన్ చౌదరి ఆ చెక్కును దొంగిలించాడు. చెక్కులో వి.వెంకటేశ్వర్లు పేరును మిస్టర్ వెంకటేశ్వర్లుగా మార్పు చేశాడు. తర్వాత తనకు తెలిసిన అల్లరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చేత ఒంగోలు కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి, రూ.2 లక్షల చెక్కును మార్చి నగదు డ్రా చేసుకున్నాడు. మరోవైపు వి.వెంకటేశ్వర్లు యూనియన్ బ్యాంకులో తాను చెక్కు ఇచ్చి పది రోజులైనా తన అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించాడు. దీంతో మేలుకున్న బ్యాంకు అధికారులు ఈ నెల 14న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగడంతో చేతన్చౌదరి మోసాలు వెలుగుచూశాయి. చేతన్‌ను అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.40 వేల నగదు, పెద్ద ఎత్తున చెక్కుబుక్‌లు, డీడీలు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో చేతన్ గత రెండేళ్లలో చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ఒంగోలులలో మోసాలకు పాల్పడి దాదాపు రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
బెడిసికొట్టిన బడా మోసం
-
బెడిసికొట్టిన బడా మోసం
సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్ఎఫ్ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి.. మూడు చెక్‌లు.. రూ.117.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్ఎఫ్ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్బీఐ చెక్‌ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్‌ను పాస్ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను.. వారు సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్ ఇవ్వలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్‌ను పాస్ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ అప్రమత్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్‌లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్ఎఫ్ ఖాతా నుంచి ఎస్బీఐ చెక్‌ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్‌ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్‌ను కూడా పాస్ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు. ఇక కోల్‌కతలోని మోగ్రాహట్ ఎస్బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్‌ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్‌ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. ప్రొఫెషనల్ ముఠా పనే? కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్‌లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్బీఐ, సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్‌లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. -
బ్యాంకు అధికారులపై వ్యక్తి దాడి
చెన్నై: రుణం (లోన్) మంజూరు చేయలేదనే కారణంతో ఓ వ్యక్తి బ్యాంక్ అధికారులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూర్ కెనరా బ్యాంక్ శాఖలో వెట్రివేల్ అనే వ్యక్తి తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకని వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు. కానీ బ్యాంక్ అధికారులు ఆయన లోన్ దరఖాస్తును తిరస్కరించడం వెట్రివేల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన కత్తి, తుపాకితో బ్యాంక్ మేనేజరుపై దాడికి దిగాడు. బ్యాంకు మేనేజరును రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడి చేసినట్లు అక్కడున్నవారు తెలిపారు. తాను అప్పుల్లో ఉన్నానని, రుణం మంజూరు కాకపోతే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు వెట్రివేల్ తెలిపాడు. ప్రస్తుతం అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు స్పందిస్తూ .. వెట్రివేల్ దరఖాస్తు చేసుకున్న మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల రుణం మంజూరు కాలేదని తెలిపారు. అతను మరి కొన్ని ఆస్తులు తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రుణం మంజూరు బాధ్యత తమది కాదని, అది బ్యాంక్ ప్రధాన కార్యాలయం నిర్ణయమని బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. -
మీ కార్డును స్విచాఫ్ చేయండి
రమణమూర్తి మంథా శ్రీధర్‌కు రెండు డెబిట్ కార్డులు... మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్ కార్డు, ఓ డెబిట్ కార్డు బిల్లులో... తాను వాడకపోయినా ఏకంగా రూ.45,000 వాడేసినట్లుంది. ఎక్కడ వాడానని చూస్తే... అంతర్జాతీయ ఈ–కామర్స్ సైట్లలో వాడినట్లు ఉంది. తనకస్సలు ఆ వెబ్సైట్ల పేర్లే తెలియవంటూ బ్యాంకుకెళ్లాడు. బ్యాంకు అధికారులు పరిశీలించారు. కార్డుల డేటా సేకరించి... ఓటీపీ అవసరం లేని సైట్ల ద్వారా ఆ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యమన్నారు. చేసేదేమీ లేక శ్రీధర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇది శ్రీధర్ ఒక్కడికే పరిమితమైన గొడవ కాదు. చాలామంది ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులతోనే పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే చాలా విదేశీ ఈ–కామర్స్ వెబ్సైట్లు తమ ద్వారా లావాదేవీలు జరిపినపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అడగటం లేదు. ఓటీపీ అక్కర్లేకుండానే కార్డు నంబరు, పేరు, ఎక్స్పైరీ తేదీ, సీవీవీ వంటి వివరాలిస్తే లావాదేవీ పూర్తయిపోతోంది. దీంతో లావాదేవీ పూర్తయ్యాకే ఫోన్లకు మెసేజీ వస్తోంది. కొన్ని బ్యాంకుల నుంచైతే ఆ మెసేజీ కూడా రావటం లేదు. దీంతో డబ్బులు పోగొట్టుకోవటం కస్టమర్ల వంతవుతోంది. మరి దీన్ని అడ్డుకోవటం ఎలా..? ఆ చర్యల వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా వినియోగదారుల డేటా రక్షణకు అత్యాధునిక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఒకటి... మన లావాదేవీల్ని మనమే నిలిపేసుకోవటం. మన కార్డును మనమే నియంత్రించుకోవటం. మనకు కావాల్సినపుడు మన కార్డును స్విచాన్ చేసుకోవటం... అక్కర్లేనపుడు ఆఫ్ చేసుకోవటం. ఇలా గనక చేస్తే... మన కార్డుపై మనకు తెలియకుండా లావాదేవీలు జరపటం ఎవ్వరి తరమూ కాదు. అదెలాగో చూద్దాం... ఇప్పుడు ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ (యాప్) ఉంది. ఆ అప్లికేషన్ ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవటం, నగదు బదిలీ చేసుకోవటం, చెక్బుక్కు అభ్యర్థన పంపటం, ఈ–డిపాజిట్లు తెరవటం, బిల్లులు చెల్లించటం... ఇలా చాలా పనులు చేసుకోవచ్చు. దీంతోపాటే.. మన ఆన్లైన్ లావాదేవీల్ని, కార్డు ద్వారా జరిపే లావాదేవీలను నియంత్రించుకోవచ్చు కూడా. - దీనికోసం ‘మేనేజ్ యువర్ కార్డ్’ విభాగంలోకి వెళ్లాలి. దాదాపు అన్ని బ్యాంకుల యాప్‌లలోనూ ఈ సౌలభ్యం ఉంటుంది. కాకపోతే దీని శీర్షిక ఒక్కో యాప్‌లో ఒకోలా ఉండొచ్చు. - ఆ విభాగంలోకి వెళ్లినపుడు అక్కడ మీరు వాడుతున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అదే బ్యాంకు నుంచి ఒకటికన్నా ఎక్కువ కార్డులు వాడుతున్నట్లయితే ఆ కార్డులన్నీ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన కార్డును సెలక్ట్ చేసుకోవాలి. - ఆ కార్డును సెలక్ట్ చేసుకున్న తరవాత దానికి సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. ఆ ఆప్షన్లలో... మొత్తం లావాదేవీలన్నిటినీ నిలిపేయటం... విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం... స్వదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం వంటివి ఉంటాయి. వాటిలో మనం దేన్నయినా సెలక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేశామనుకోండి. విదేశాల నుంచి ఎవ్వరు మీ కార్డు నంబరుతో లావాదేవీలు చేసినా అది తిరస్కరణకు గురవుతుంది. దాంతో విదేశీ లావాదేవీల నుంచి మీ కార్డును కాపాడుకున్నట్లేనన్న మాట. - విదేశీ లేదా స్వదేశీ ఆన్లైన్ లావాదేవీలకు, విదేశీ లేదా స్వదేశీ పీఓఎస్ మెషీన్ల ద్వారా (స్వైపింగ్) జరిగే లావాదేవీలకు పరిమితులను కూడా మీరే నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ, స్వదేశీ లావాదేవీలు రెండింటికీ ఆన్లైన్ ద్వారా రూ.5,000 పరిమితిని పెట్టుకున్నారనుకోండి... అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా ఆ లావాదేవీని బ్యాంకు అనుమతించదు. మీ అంతట మీరు లావాదేవీ జరిపినా అంతే. అలాగే పీఓఎస్‌ల ద్వారా కూడా. మీరు గనక ఒక పరిమితిని నిర్దేశిస్తే... దాన్ని మించిన మొత్తానికి లావాదేవీ జరిగితే అది తిరస్కరణకు గురవుతుంది. ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు... ఆన్లైన్ లావాదేవీలకు, పీఓఎస్ లావాదేవీలకు యాప్ ద్వారా నిర్దేశించుకునే పరిమితులను గానీ... అనుమతించటం, స్విచాఫ్ చేయటం వంటివిగానీ యాప్‌లో ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదే సెకన్లో... అంటే రియల్‌టైమ్‌లో అది అప్డేట్ అవుతుంది కూడా. అంటే... మీరు ఆన్లైన్ లావా దేవీల్ని పూర్తిగా నిలిపేసుకున్నారనుకోండి. ఆన్లైన్లో పేమెంట్ చేసే ముందు మీ యాప్‌లోకి వెళ్లి నియంత్రణను తొలగించుకోవచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే మళ్లీ నిలిపేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ కార్డులు, మీ ఖాతాలు పూర్తిగా మీ అధీనంలో ఉంటాయి. నకిలీ లావాదేవీలకు ఎలాంటి ఆస్కారం ఉండదు. కార్డును ఇలా కూడా కాపాడుకోవచ్చు... చాలామంది పెట్రోలు బంకుల్లో, రెస్టారెంట్లలో పలు సందర్భాల్లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్ని అక్కడి సిబ్బంది చేతికి ఇస్తుంటారు. ఆ సిబ్బంది వాటిని క్లోన్ చేయొచ్చు. లేకుంటే వివరాలు రాసుకున్నా... మొబైల్ ఫోన్‌తో రెండువైపులా ఫొటోలు తీసుకున్నా సరిపోతుంది. మన వివరాలన్నీ తన చేతికి చిక్కేసినట్లే. అందుకే పీఓఎస్ యంత్రాన్ని మన దగ్గరకే తీసుకురమ్మని చెప్పి... కార్డు మన కళ్లెదురుగానే ఇన్సర్ట్ చేయించి... మనమే పిన్ నంబరు నొక్కితే సరిపోతుంది. అంటే మన కళ్ల నుంచి ఎలాంటి చర్యా తప్పించుకోకుండా చూసుకోవాలన్న మాట. -
నిర్షా అడవుల్లో ‘ఓటీపీ కేటుగాళ్లు’..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాంకుల్లో పని చేస్తున్న అధికారుల మాదిరిగా ఫోన్లు చేసి వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సైతం సంగ్రహించి అందినకాడికి దోచుకునే ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇవి ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలే కాదు... చివరకు అడవుల్నీ అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నాయి. జార్ఖండ్‌లోని నిర్షా అడవుల కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. శనివారం వీరికి చిక్కిన ఓ ముఠా సభ్యుడు తాము హైదరాబాద్‌కు చెందిన వారినీ ముంచినట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయంపై ఇక్కడి పోలీసులను సంప్రదించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. డార్క్ నెట్ నుంచి నెంబర్లు... జార్ఖండ్‌కు చెందిన ముఖేష్ ప్రసాద్ నేతృత్వంలో అజయ్ శర్మ, మిథున్‌కుమార్ ఓ ముఠాగా ఏర్ప డ్డారు. బోగస్ చిరునామాలు, ధ్రువీకరణలతో వివిధ సిమ్‌కార్డులు తీసుకున్నారు. వీటి ఆధారంగా దేశ వ్యాప్తంగా ‘ఓటీపీ క్రైమ్స్’చేయడం మొదలెట్టారు. అయితే జనం మధ్యలో ఉండి ఈ వ్యవహారం నడిపితే బయటకు పొక్కుతుందని భావించారో ఏమో... నిర్షా ప్రాంతంలో ఉన్న చిట్టడవిని తమ అడ్డాగా మార్చు కున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందే ఏరియాలో కొందరు టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అథోజ గత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి ప్రసాద్ వివిధ బ్యాంకులకు చెందిన వినియోగదారుల ఫోన్ నెంబర్లు ఖరీదు చేశాడు. ఆయా ఖాతాదారులకు ఫోన్లు చేసే ఈ కాలర్స్ బ్యాంకు అధికారులు, ఎగ్జిక్యూటివ్స్‌గా పరిచయం చేసుకుంటారు. ఒక్కొక్కరు డజను ఈ–వాలెట్స్... ఇలా చేయడానికి ముందే ఈ ముగ్గురు సూత్రధా రులు బోగస్ వివరాలతో ఒక్కొక్కరు దాదాపు డజను వరకు ఈ–వాలెట్ అకౌంట్లు తెరిచారు. తమ టెలీకాలర్లు వాడుతున్న ఫోన్ నెంబర్లను ట్రూ కాలర్ యాప్‌లో ఆయా బ్యాంకులకు చెందిన హెడ్– ఆఫీస్‌లు అంటూ సేవ్ చేశారు. ఓ బ్యాంకు ఖాతాదా రుడికి ఫోన్ చేయడానికి ఆ బ్యాంకు పేరుతో సేవ్ చేసిన సిమ్కార్డునే వినియోగించేవారు. ఈ ఫోన్లు అందుకున్న వారికి ఆధార్ లింకేజ్ అని, వివరాలు అప్డేట్ అని, సాంకేతిక కారణాలతో ఖాతా ఫ్రీజ్ అవుతోందని చెప్పి భయపెట్టేవాళ్లు. ఇలా తమ దారి కి వచ్చిన ఖాతాదారుడి నుంచి వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని సంగ్రహించేవారు. ఆ వెంటనే ఈ వివరాలు వినియోగించి అతడి ఖాతాలోని డబ్బును తమ ఈ–వాలెట్స్‌లోకి మళ్లించి కాజేసేవారు. రోజు కో సిమ్‌కార్డు మార్చేసే వీరిని మళ్లీ సంప్రదించాలని బాధితుడు యత్నించినా ఫలితం ఉండేది కాదు. రెండేళ్లుగా వేటాడిన ఢిల్లీ కాప్స్... ఈ గ్యాంగ్ 2017లో ఢిల్లీకి చెందిన సీబీఎస్ఈ రిటైర్డ్ అధికారి సుభీర్సింగ్ను టార్గెట్ చేసింది. అతడికి ఫోన్ చేయించిన ఈ కేటుగాళ్లు బ్యాంకు ఖాతా క్లోజ్ అయిపోతోంది అంటూ భయపెట్టారు. ఆయన నుంచి ఓటీపీ సహా ఇతర సమాచారం సంగ్రహించి ఆయన ఖాతాలోని రూ.2 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక ఆధారాలను బట్టి ఆ నగదు కొన్ని ఈ–వాలెట్స్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించి ఆరా తీశారు. ఎట్టకేలకు జార్ఖండ్‌కు చెందిన ప్రసాద్, మిథున్, అజయ్ సూత్రధారులుగా గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని పంపినా వీరు చిక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి కదలికలపై కన్నేసి ఉంచిన ఢిల్లీ పోలీసులు శనివారం మిథున్ అక్కడకు వచ్చిన విషయం తెలుసుకుని పట్టుకున్నారు. విచారణలో హైదరాబాద్ వివరాలు... మిథున్‌ను విచారించిన పోలీసులు స్కామ్ మొత్తానికి ప్రసాద్ సూత్రధారిగా తేల్చారు. దీంతో అతడితో పాటు అజయ్ కోసమూ గాలిస్తున్నారు. ఈ పంథాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వారికీ టోకరా వేశామని మిథున్ బయటపెట్టాడు. అయితే నగరంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఇలా 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు ఏ కమిషనరేట్ పరిధికి చెందిన వారో స్పష్టంగా తెలియట్లేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. దీంతో 3 కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మిథున్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాతే ఇక్కడి పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. -
‘ఎనీ డెస్క్’తో.. ఎనీ టైమ్ లాగేస్తారు!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అధికారులమంటూ ఖాతాదారుడికి ఫోన్లు చేసి డెబిడ్ కార్డు వివరాలతోపాటు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)ని సైతం సంగ్రహించి అకౌంట్ నుంచి డబ్బులు దండుకునే జమ్‌తార ఓటీపీ సైబర్ నేరగాళ్లు పంథా మార్చి కొత్త దందా షురూ చేశారు. ఓసారి బోల్తాపడ్డ బాధితుడినే పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి ఓటీపీ చెప్పి భంగపడ్డ బాధితుడు మరోసారి చెప్పేందుకు సాహసించడు. దీంతో మళ్లీమళ్లీ అడగకుండా ఓటీపీని సంగ్రహించేందుకు ఖాతాదారుడికి ఫోన్ చేసి ‘ఎనీ డెస్క్’అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోమని చెబుతున్నారు. ఒక్కో క్రైమ్‌కు ఒక్కో సిమ్ వాడుతున్న ఈ నేరగాళ్లు పోలీసుల దర్యాప్తునూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. 7 గ్రామాల్లోనూ అదే పని.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ జిల్లా దాటి జార్ఖండ్‌లో ప్రవేశించిన వెంటనే వచ్చేదే జమ్‌తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న 7 గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ల్యాప్టాప్స్, సెల్ఫోన్లతో కూర్చునే అక్కడ యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కార్డు వివరాలు సహా ఓటీపీ కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు అనేక ప్రాంతాల్లోని కాల్ సెంటర్లలో జమ్‌తార యువత పనిచేసి వచ్చారు. ఈ అనుభవంతో వారే సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాల దందాలోకి దిగారు. ఫోన్లలో ఎదుటివారితో ఎలా మాట్లా డాలి అనే అంశంపై అక్కడ శిక్షణ కూడా ఇస్తుంటారు. బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరగాళ్లు ఉన్నారు. బ్యాంకుల నుంచే డేటా.. ఆయా బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల సమాచారం ఈ సైబర్ నేరగాళ్లకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటా లోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నంబర్లకు కాల్ చేస్తుంటారు. అందరూ తమ ఫోన్లలో ‘ట్రూకాలర్’తరహా యాప్స్ వాడుతున్నారు. దీంతో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న వీళ్లు ముందుగానే తమ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్ నుంచి కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచే వస్తున్న భావన కలిగి బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేసేస్తున్నారు. పదేపదే అడగకుండా.. ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునేలోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. ప్రతి లావాదేవీకీ ఓటీపీ కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే చెప్పకుండా ఉండే ఆస్కారం ఉంది. అందుకే టార్గెట్ చేసుకున్న వారిలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్ నుంచి ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన దీనికి ఓ పాస్వర్డ్ చెప్పి యాక్టివ్ చేసుకోమంటున్నారు. ఈ యాప్‌తో భవిష్యత్‌లో బ్యాంకుకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, అప్డేట్స్, లింకేజ్లు ఆటోమేటిక్‌గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని యాక్టివ్ చేయగానే ఖాతాదారుడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఫలితంగా ఫోన్‌కు వచ్చిన ప్రతి ఓటీపీని అడగాల్సిన పనిలేకుండా ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇదంతా గ్రహించి తెరుకునేలోపే బాధితుల బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. దర్యాప్తులో ఎన్నో సవాళ్లు.. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్‌కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్‌గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, సొమ్ము రికవరీ చేయడం అంత కష్టమని అధికారులు చెప్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడేషన్ కోసం బ్యాంకు నుంచి ఎలాంటి యాప్‌లు రావనే విషయాన్ని ప్రతీ ఖాతాదారుడు గుర్తుంచుకోవాలని, అపరిచితులు సూచించే ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. -
కాసులు లేక..కదలని రోడ్ల పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు నిధుల సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం తక్షణావసరంగా ఆర్ అండ్ బీకి కనీసం రూ.2000 కోట్లయినా అవసరమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కాంట్రాక్టర్లు గందరగోళంలో పడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అయినా తమకు నిధుల కొరత తీరుతుందని అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు భావించారు. అయితే వాటిపై ఎలాంటి కదలికా లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కాంట్రాక్టర్లు బ్యాంకర్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం నోటీసులు వస్తున్నాయని బెంబేలెత్తున్నారు. ఈ కారణంగా వారు పలు చోట్ల రోడ్డు పనులను నిలిపేస్తున్నారు. తమ వద్ద తారు కొనుగోలుకు కూడా డబ్బులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి పెండింగు బిల్లుల విషయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సకాలంలో డబ్బులు కట్టకపోతే టిప్పర్లు, లారీలు ఇతర సామగ్రిని సైతం సీజ్ చేసి తీసుకెళతామని బ్యాంకు అధికారులు తమను హెచ్చరిస్తున్నారని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. రుణానికి ప్రభుత్వమే పూచీకత్తు.. వాస్తవానికి 2018–19 బడ్జెట్లో ఆర్ అండ్ బీకి వాస్తవానికి రూ.5,600 కోట్లు కేటాయించింది. ఆ మేరకు నిధులు విడుదల జరగలేదు. సంక్షేమ పథకాల నిర్వహణకు ఆ శాఖ నిధులను ప్రభుత్వం మళ్లించిందని సమాచారం. మరోవైపు దాదాపు ఈ శాఖ పరిధిలో దాదాపు రూ.20వేల కోట్లకుపైగా పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో వీరికి బిల్లులు విడుదల జరగలేదు. దీంతో ఒక దశలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో రూ.3000 కోట్లు అప్పు తీసుకోమని ప్రభుత్వం సూచించింది. తానే పూచీకత్తు ఇస్తానని కూడా చెప్పింది. దీనికోసం పలు బ్యాంకుల చుట్టూ తిరిగిన ఆర్ అండ్ అధికారులు ఎట్టకేలకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను ప్రసన్నం చేసుకోగలిగారు. మొత్తానికి రూ.వెయ్యి కోట్లు వచ్చాయి. కానీ, ప్రభుత్వ రద్దుతో ఆ రూ.2000 కోట్లు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..రోడ్లు భవనాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అప్పుపై బ్యాంకు లు మీమాంసలో పడ్డాయని సమాచారం. తక్షణం రూ.2వేల కోట్లు అవసరం... ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పు పుడుతుందనుకున్న అధికారుల ఆశలపై బ్యాంకులు నీళ్లు చల్లాయి. శాఖ ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు వెనకాముందు ఆడుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లు విడుదల చేస్తే కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. మరోవైపు బ్యాంకులు కనీసం వెయ్యి కోట్లు విడుదల చేస్తేనే పనులు ముందుకు కదులుతాయని స్పష్టంచేస్తున్నారు. గతంలో నూ పలుమార్లు చర్చలు జరిపినా.. గతంలో ప్రభుత్వం తరఫున అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ పలుమార్లు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. వారికి నిధులు విడుదల చేస్తామని ప్రతీసారి హామీలైతే ఇవ్వగలిగారు గానీ, అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖకు మంత్రి కూడా లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇటు అధికారులు, అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు. -
స్కూలు స్థలం... సొంత‘లాభం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించే వాళ్లను తరచూ చూస్తుంటాం. అయితే రెండు కంపెనీలకు చెందిన వారు మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.4 కోట్లు ‘లాభం’ పొందారు. ఆ స్థలంపై నకిలీ పత్రాలను సృష్టించి వాటి ఆధారంగా మహారాష్ట్ర బ్యాంకు కు టోకరా వేశారు. ఈ రెండు సంస్థలూ ఒకే ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని దర్జాగా తనఖా పెట్టడం విశేషం. వాయిదాల చెల్లింపులు నిలచిపోవడంతో విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు రెవెన్యూ, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న గోల్కొండ క్రాస్‌రోడ్స్ చిరునామాతో బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. దీనికి పి.నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, రాయపూడి రమాదేవి డైరెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం రుణం కోసం ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకును ఆశ్రయించారు. దీనికోసం హామీగా బీకే గూడలోని సర్వే నెం.155లో 500 గజాల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లు, అది తమ కంపెనీకి చెందినదేనని.. చూపే రిజిస్ట్రేషన్ సేల్‌డీడ్‌ను (నెం.435/2013) చూపించారు. దీని ఆధారంగా ఆ ఆస్తిని తనఖా పెడుతూ 2013 ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల రుణం తీసుకున్నారు. మరో వ్యవహారం కూడా... బేకీస్ ఫుడ్స్ బాటలోనే... అన్నా ఇకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇలాంటి వ్యవహారమే నడిపింది. ఈ సంస్థ శానిటరీ నాప్కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తదితరాలు తయారు చేసి అమ్ముతుంది. వీటితో పాటు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్, ఉమెన్ ఎన్పవర్మెంట్, చిల్డ్రన్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంది. దీని డైరెక్టర్లు జి.శ్రీకర్, వై.వెంకటేశ్‌లు రుణం పొందాలని భావించారు. వీరూ ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకు శాఖనే ఆశ్రయించారు. ఎస్ఆర్నగర్ బీకేగూడలో 500 గజా ల స్థలంలో ఉన్న ఇల్లు తమదేనంటూ అందుకు చెంది న డాక్యుమెంట్స్ (నెం.437/13) దాఖలు చేశారు. దీన్ని తనఖా పెట్టి ప్యానల్ అడ్వకేట్‌తో న్యాయ సలహా కోసం బ్యాంకునకు అందించారు. దీంతో బ్యాంకు వారికీ 2013లో ఫిబ్రవరిలోనే రూ.2 కోట్లు మంజూరు చేసింది. రూ.4 కోట్ల రుణం పొందిన రెండు సంస్థలూ వాయిదాలు చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారు తమ బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ల వివరాలతో అమీర్‌పేట తహసీల్దార్‌కు లేఖ రాశారు. ఆ ఆస్తులకు చెందిన పూర్తి రికార్డులు కోరుతూ డీమార్క్ చేయాలని అభ్యర్థించారు. ఈ రెండు కంపెనీలు బ్యాంకునకు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లలోని స్థలాలు రహమాన్ మంజిల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు, సయ్యద్ పటేల్ భాషాలకు చెందిన స్థలాలుగా రికార్డులో ఉన్నాయని బ్యాంకుకు తెలిపారు. దీంతో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేశారని గుర్తించిన బ్యాంకు జోనల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చిన్ననోట్ల కోసం తెలంగాణ నేతలు పాట్లు!
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలు కావడంతో రాజకీయ నేతలు ‘చిల్లర’ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం భారీగా నిల్వ చేసిన రూ.2,000 నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకునేందుకు బ్యాంకులు, పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.500, రూ.200 నోట్లకు గిరాకీ ఏర్పడింది. నోట్లు మార్పిడి చేసినందుకు 2 నుంచి 5 శాతం దాకా కమీషన్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా వేయటంతో నోట్ల మార్పిడికి తెలంగాణ నేతలు పక్క రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలోని ప్రైవేట్ బ్యాంకులను సైతం ఎంచుకుంటున్నారు. తనిఖీల్లో తెలం గాణలో పట్టుబడుతున్న నగదులో రూ.500 నోట్లే అత్యధికంగా ఉండటం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారనేది రుజువు చేస్తోంది. భారీ లావాదేవీలపై ఐటీ, ఆర్బీఐ నిఘా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో భారీ నగదు లావాదేవీలపై ఐటీ శాఖ, ఆర్బీఐ నిఘా వేశాయి. రూ.2 లక్షలకు మించి నగదు తీసుకునే వారి వివరాలను సేకరిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.5 లక్షలకు మించి నగదు తీసుకుంటే కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాలని తమకు మౌ ఖికంగా ఆదేశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులు చిన్న నోట్ల కోసం విశాఖ, విజయవాడల్లోని తమ కార్యాలయాలను సంప్రదిస్తున్నట్లు ప్రైవేట్ బ్యాంకు అధికారులు ధృవీకరించారు. -
నిందితులుగా బ్యాంకు అధికారులు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాపై అభియోగ పత్రాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో నెలలో దాఖలు చేసే అవకాశం ఉంది. మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్ఫిషర్కు రుణాలు మంజూరు చేయడంలో పాత్ర వహించిన బ్యాంకు అధికారులు, కింగ్‌ఫిషర్ ఉన్నతస్థాయి అధికారులను అభియోగపత్రంలో నిందితులుగా పేర్కొననున్నారని తెలుస్తోంది. కింగ్ఫిషర్కు ఆరువేల కోట్ల రూపాయల రుణాల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ మొత్తాన్ని ఎస్బీఐ నేతృత్వంలో మొత్తం 17 బ్యాంకులు కలిసి మంజూరు చేశాయి. -
పంట రుణాలు రూ.42,494 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.42,494 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. గతేడాది లక్ష్యం కంటే ఇది రూ.2,741 కోట్లు అదనం. ఈ మేరకు 2018–19 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా 42.47 శాతం, అంటే రూ.58,063 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇస్తారు. ఇందులో పంట రుణాలు రూ. 42,494 కోట్లు. ఇందులో 60 శాతం ఖరీఫ్‌లో, 40 శాతం రబీలో ఇస్తారు. రూ.15,569 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,798 కోట్ల విద్యా రుణాలు, రూ.6,011 కోట్ల గృహ రుణాలు కూడా ఇస్తారు. పంట రుణాల్లో అధికంగా వరికి 19.52 లక్షల రైతులకు రూ.18,796 కోట్లిస్తారు. 8.09 లక్షల మంది పత్తి రైతులకు రూ.8,279 కోట్లు, 1.44 లక్షల మిరప రైతులకు రూ.1,141 కోట్లు, 3.86 లక్షల మొక్కజొన్న రైతులకు రూ.3 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 96 వేల మందికి రూ.2,639 కోట్లు, ఉద్యాన పంటల సాగు, మొక్కల పెంపకానికి రూ.1,140 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.846 కోట్లు ఇస్తారు. గత యాసంగిలో 65 శాతమే గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025 కోట్లు (88.15 శాతం) ఇచ్చాయి. 88 శాతం, రబీలో 65 శాతం రుణాలిచ్చినట్టు వెల్లడించారు. గతేడాది వానాకాలం కానీ యాసంగిలో మాత్రం రూ.15,901 కోట్లకు గాను రూ.10,384 కోట్లే (65 శాతం) రైతులకు అందినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. దాంతో రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. రూ.10,714 కోట్ల వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.7320.07 కోట్లు (68.32 శాతం) ఇచ్చారు. వ్యవసాయ మౌలిక వసతుల రుణాల లక్ష్యం రూ.1,323.03 కోట్లయితే రూ.391 కోట్లతో బ్యాంకులు సరిపెట్టాయి. రాష్ట్రానికి అగ్రస్థానంలో బ్యాంకర్లకూ పాత్ర: ఈటల రైతుబంధు పథకంతో రైతులందరినీ బీమా పరిధిలోకి తెచ్చామని ఈటల అన్నారు. రుణ ప్రణాళికను విడుదల చేశాక ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామాల్లోని గీత కార్మికులు, ఇతర వర్గాలకూ బీమా ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లోని ఇతర పేదలకూ జీవిత బీమా అందేలా మరో పథకాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ‘‘రైతు బంధుతో బ్యాంకుల్లో నగదు కొరత కాస్త తగ్గింది. దేశంలో ఈ పథకం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కొత్త రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించి నంబర్‌వన్‌గా నిలవడంలో బ్యాంకర్ల పాత్ర కూడా ఉంది. వారికి ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు. రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచాలని కేందాన్ని కోరితే రూ.3 వేల కోట్లే ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఢిల్లీకి పోతే స్పందన ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అనేవారు. ఇప్పుడు ఆ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందుందని కాగ్ కూడా ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల స్థిర ఆయకట్టు ఇస్తాం. గతంలో రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అనేవారు, ఇప్పుడు తెలంగాణ అంటున్నారు. ఏపీలో 43 లక్షల టన్నుల వరి పండితే, తెలంగాణలో 55 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది’’అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను పెంచాలని బ్యాంకర్లను కోరారు. వాటిల్లో ఉద్యోగుల సంఖ్యనూ పెంచాలన్నారు. ‘‘గ్రామీణ యువతకు గ్యారంటీ లే కుండా రుణాలివ్వండి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలివ్వండి. కుల వృత్తులకు రుణాలివ్వండి. చిన్న వృత్తులకు రూ.1,500 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతున్నాం. వారి కి బ్యాంకులు రూ. 2–3 వేల కోట్లివ్వాలి’’అని కోరారు. మోకాలి చికిత్స వల్ల ఆస్పత్రిలో ఉన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడా రు. ‘రైతుబంధు’లో సహకరించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
అన్నదాతలపై బ్యాంక్ అధికారుల కక్షసాధింపు!
చిలకలూరిపేట రూరల్: ఆరుగాలం పండించిన పంటను బ్యాంక్‌కు కుదువ(హామీ)గా ఉంచి రుణాన్ని తీసుకున్నా, బ్యాంక్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి నిల్వ ఉన్న సరుకుని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌లో ఆదివారం రైతులు, బ్యాంక్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసుకున్న నువ్వుల పంటను రైతులకు తెలియకుండా బ్యాంక్ అధికారులు గోప్యంగా వేలం వేసి కోల్డ్ స్టోరేజ్ నుంచి రవాణా చేయటంతో సమాచారం తెసుకున్న రైతులు స్టోరేజ్ వద్దకు చేరుకున్నారు. ఇదేమని ప్రశ్నించటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఆక్షన్ నిర్వహించి బిడ్ చేసిన వారికి సరుకు అందించామన్నారు. రైతులు బ్యాంక్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఇది.. ముప్పాళ్ల మండలం కందూరివారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది రైతులు 2016లో నువ్వులు సాగు చేయగా 10,125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు స్థానిక బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేశారు. పంట హామీతో నరసరావుపేటలోని కరూర్ వైశ్య బ్యాంక్‌లో రుణాలు తీసుకున్నారు. ఐదుగురు రైతులు రూ.84.80 లక్షలు రుణం పొంది ఇప్పటి వరకు రూ.98.10 లక్షలు చెల్లించారు. 20 మంది రూ. 4.37 కోట్లు రుణం తీసుకుని నేటి వరకు రూ. 66.10 లక్షలు చెల్లించారు. మొత్తం 25 మంది రూ.5. 22 కోట్లుకు రూ. 1.64 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించారు. బ్యాంక్ అధికారులు రైతులకు సమాచారం అందించకుండా 1,941 క్వింటాళ్ల (2,754 బ్యాగులుకు చెందిన) నువ్వులకు ఆన్లైన్లో ఈ ఆక్షన్ నిర్వహించారు. బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రెండు మాసాలు గడువు ఇవ్వాలని రైతులు కందుల జగన్నాథం, కె.వెంకటేశ్వర్లు, శీలం సుబ్బారెడ్డి, రావిపాటి వెంకటేశ్వరావు, ఆంజనేయులు, పూర్ణయ్య, నాగేశ్వరరావు, వీరభద్రరావు, చంద్రశేఖర్, నారాయణ, పెద్దన్న, మధుబాబు, రామారావు, వీరయ్య, రామిరెడ్డి, బ్రహ్మానందం, లింగేశ్వరరావు తదితరులు బ్యాంక్ అధికారులకు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ బి.గోవర్థన్ మాట్లాడుతూ రుణాల చెల్లింపునకు ఆరుమాసాల గడువు మాత్రమే ఇచ్చామన్నారు. సకాలంలో వడ్డీలు, అసలు పూర్తి స్థాయిలో చెల్లించక పోవటంతో కొంతమంది రైతులకు చెందిన 194 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ ఆక్షన్ నిర్వహించి వాటిని స్టోరేజ్ నుంచి రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చామని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. -
ప్రతీ ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులే
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులే ఉన్నాయని, ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు లేదని చెప్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్య ప్రజల కష్టాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసి మురిసిపోయిన మోడీ నేడు ముఖం చాటేయడం దారుణమన్నారు. నగదు లావాదేవీలను పెంచడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ డిమాండ్ చేస్తుందని బుధవారం తెలిపారు. -
పీఎన్బీ స్కాం : మరో ఇద్దరు అధికారులకు ఉచ్చు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణం రూ.11,400 కోట్లు మాత్రమే కాదని, అంతకుమించి కుంభకోణం జరిగినట్టు బ్యాంకు తేల్చింది. గీతాంజలి గ్రూప్‌కు సంబంధించి మరో రూ.1,251 కోట్ల స్కాం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే మొత్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం రూ.12,636 కోట్లకు పెరిగిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఈ కుంభకోణంపై ఇప్పటికే పలుమార్లు పీఎన్బీ అధికారులను విచారించిన సీబీఐ, కుంభకోణం మరింత పెరిగిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఎస్ కన్నన్ను కూడా ప్రశ్నిస్తోంది. ఈయన గీతాంజలి గ్రూప్‌కు అందించే నగదు విషయంలో కన్సోర్టియం ఆఫ్ ది బ్యాంకుకు అధినేతగా ఉన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయముందనే ఆరోపణలతో పీఎన్బీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత్‌ను కూడా విచారిస్తున్నారు. మరో ఇద్దరి అధికారులకు కూడా విచారణకు హాజరుకావాలని పిలుపు అందింది. మరోవైపు ఈ కుంభకోణ నేపథ్యంలో విదేశీ బ్రాంచుల్లో సరియైన ఆడిట్ జరుపాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక మోసం జరిగే ఉద్దేశ్యమున్న రూ.50 కోట్లకు పైన ఉన్న మొండిబకాయిలను, నిరర్థక ఆస్తులను పరిశీలించాలని, వీటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. -
రెవెన్యూ, బ్యాంకు అధికారుల హస్తం..?
♦ ‘నకిలీ పట్టా పాసుపుస్తకాల వ్యవహారంలో అనుమానాలు ♦ నగరంలోని బ్యాంకుల్లో పోలీసుల సోదాలు సంగెం(పరకాల) : నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో బ్యాంకు, రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పాసుపుస్తకాల కేసులో ప్రధాన నిందితుడు బిచ్చా దొరికితే ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందో వెల్లడయ్యే అవకాశముంది. కాగా బుధవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం ఎస్సై.. వరంగల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ చేపట్టారు. సంగెం, నెక్కొండ మండలాల నుంచి రుణాల కోసం సుమారు 20కి పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో గుగులోత్ తారాచంద్(ఎల్గూర్ స్టేషన్), ధరావత్ రాంజీ, బానోత్ సరోజన(తీగరాజుపల్లి), లావుడ్యా వినోద (చంద్రుగొండ), ధరావత్ రాజు, ధరావత్ సురేష్, భూక్యా రేణుక(బంజరపల్లి)ల దరఖాస్తులను నకిలీవని గుర్తించి తిర స్కరించామని బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు ఎస్సై దీపక్ తెలిపారు. మిగిలినవి నకలీవని చెప్పలేమని వారు చెప్పినట్లు ఎస్సై దీపక్ తెలిపారు. అధికారులకు వాటాలు? ఈ ‘నకిలీ’ వ్యవహారం తెలిసి కూడా బ్యాంకు అధికారులు.. నిందితులతో కుమ్మక్కై తమ వాటాగా 15 శాతం తీసుకుని రుణాలు మం జూరు చేసినట్లు తెలుస్తోంది. సంగెం సొసైటీ, ఆంధ్రా బ్యాంకుతో పాటు గీసుకొండ మండలం ఊకల్‌లోని కార్పొరేషన్ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తెలిసంది. నిందితుడు బిచ్చా.. పాసుపుస్తకాలు తయారు చేసి ఎకరాకు రూ.10వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే, బ్యాంకుల వద్ద కొందరు ఏజెంట్లుగా వ్యవహరించి రుణాలు ఇప్పించారని, అందులో 15 శాతం అధికారులకు, 15 శాతం ఏజెంట్లు వసూలు చేయగా మిగిలిన మొత్తం సంబంధిత రైతులకు ఇచ్చేవారని సమాచారం. కాగా నిజమైన రైతులు వెళ్లి రుణం కావాలని బ్యాంకు అధికారులను అడిగితే ఎన్నో కొర్రీలు పెట్టే బ్యాంకు అధికా>రులు.. అక్రమార్కులతో చేతులు కలిపి అడ్డగోలుగా రుణాలు మంజూరు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా నిందితుడి ఇంటిలో భారీ మొత్తంలో ఖాళీ పాసుపుస్తకాలు లభించడంతో రెవెన్యూ శాఖ లోని సిబ్బంది హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పాసుపుస్తకాలు సైతం నకిలివా లేదా కార్యాలయం నుంచే నిందితుడికి అందాయా అని చర్చించుకుంటున్నారు. నిందితుడు చదివింది పదో తరగతే.. వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, సబ్రిజిస్టార్ల సంతకాలను ఫోర్జరీ చేసిన నిందితుడు బిచ్చా చదివింది కేవలం పదో తరగతే. నకిలీ పాసుపుస్తకాల తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే నిందితుడికి కొందరు విద్యావంతులు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సహకరించిన అధికారులు.. తమ బండారం బయటపడుతుందేమోనని భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బిచ్చాను పట్టుకుని విచారిస్తే ఈ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారుల వివరాలు వెలుగులోకి వస్తాయి. -
అంబేడ్కర్ వర్సిటీలో వేతనాల స్కాం
భార్య పేరిట ఉద్యోగం సృష్టించిన డేటాఎంట్రీ ఆపరేటర్ - ఆమె ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున మళ్లింపు - ప్రాథమికంగా రూ.30 లక్షలకుపైగా స్వాహా చేసినట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేతనాల స్కాం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్ విభాగంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న రాజేశ్వర్‌రావు తన భార్యను వర్సిటీలో ఉద్యోగిగా సృష్టించి, ఆమె ఖాతాలోకి భారీగా నిధులను మళ్లించాడు. ఒక వ్యక్తి ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున డబ్బు జమ అవుతుండటం, మొన్నటి జనవరిలోనే రూ.7.5 లక్షలకు పైగా డబ్బు జమ కావడం, గత నెలలో రూ.3.25 లక్షలు ఆ ఖాతాలోకి వెళ్లడంతో వర్సిటీ ఖాతాలు ఉన్న బ్యాంకు అధికారులు అనుమానంతో వర్సిటీ అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ ఉన్నతాధికారులు అకౌంట్స్ విభాగంలో తనిఖీచేసి రూ.30 లక్షలను వేతనం రూపంలో సదరు డేటాఎంట్రీ ఆపరేటర్ నిధులను మళ్లించినట్లు అంచనాకు వచ్చారు. ఉద్యోగుల వేతనాల బిల్లులను చేసే పని అతనిది. బిల్లులు చేసే క్రమంలో పేపరుపై అధికారుల ఆమోదం తీసుకునేప్పుడు, అకౌంట్స్ ఆఫీసర్‌కు,వర్సిటీ రిజిస్ట్రార్‌కు వెళ్లే ఫైలులో అన్ని సరిగ్గానే ప్రతిపాదిం చేవాడు. ఆ తర్వాత బ్యాంక్‌కు ఆన్లైన్ ద్వారా పంపించే సాఫ్ట్కాపీలో ఇతర ఉద్యోగులతోపాటు తన భార్య పేరును చేర్చి ఆమె ఖాతాలోకి లక్షల రూపాయలు జమ అయ్యేలా బ్యాంకు అధికారులకు పంపేవాడు. ఈ తతంగం ఏడాదిగా జరుగుతోంది. కచ్చితంగా ఏదోక సమయంలోగానీ, మార్చిలో చేసే ఆడిట్‌లోగానీ ఈ వ్యవహారం వర్సిటీ అకౌంట్స్ అధికారుల దృష్టికి వచ్చి ఉంటుందని, ఎందుకు వెలుగులోకి తేలేదని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీ వేశాం: ప్రొ.సీతారామారావు, వీసీ రాజేశ్వర్‌రావు మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు శాఖాపరంగా విచారణకు కమిటీనీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి విషయాన్ని నివేదించాం. డబ్బును మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది వాస్తవమే. అతన్ని సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించాం. గతంలోనూ ఫీజుల స్కాం.. సదరు ఉద్యోగి గతంలో ఫీజుల స్కాంలోనూ నిందితు డే నని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఫీజుల కోసం చెల్లించిన డీడీలను మాయం చేసేవాడు. తనకు డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులకు ఇతర విద్యార్థుల డీడీలను జత చేసిన విషయం వెలుగు చూడటంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. మూడేళ్ల కిందట ఎలాగోలా అతను అకౌంట్స్ విభాగంలో చేరాడు. రాజేశ్వర్రావుపై వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటయ్య ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజేశ్వర్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు
⇒ అప్పు చెల్లిస్తామన్న ఇంటిని వేలం వేసిన అధికారులు ⇒ ఇల్లు ఖాళీ చేయాలంటూ గేటుకు తాళం ⇒ రాత్రంతా ఆరుబయటే జమ్మికుంట: ఇంటి పేరిట బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం ఆ కుటుం బాన్ని రోడ్డున పడేసింది. సదరు కుటుంబానికి తెలపకుండానే బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేశారు. మార్కెట్ విలువ కంటే తక్కు వకు విక్రయించడం.. రుణం చెల్లిస్తామన్నా వినిపించుకోకుండా ఇంటికి తాళం వేయడం తో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిల వడంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు, పోలీసులు వెనకడుగు వేశారు. ఈ ఘటన మంగళవారం జమ్మికుంట లో చోటుచేసుకుంది. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాంపెల్లి కిషన్ ఇస్త్రీ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. 2013లో ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకు న్నాడు. దాదాపు రూ.2.10 లక్షల వరకు తిరిగి చెల్లించాడు. బ్యాంకు వడ్డీ, అసలు ఇప్పటి వరకు ఇంకా రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, డబ్బులు సమ కూరక పోవ డంతో కొద్ది నెలలుగా రుణం చెల్లించడంలేదు. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇంటిని వేలం వేస్తామంటూ గత డిసెంబర్లో నోటీసు లిచ్చారు. ఈ విషయం తమకు తెలియదని బాధితులు పేర్కొంటున్నారు. గత జనవరిలో వేలం పాట కోసం ప్రకటన జారీ చేశారు. వేలం పాటలో ఇల్లును ఓ వ్యక్తి రూ.11.77 లక్షలకు దక్కించుకున్నట్లు బ్యాంకు ఉద్యో గులు వెల్లడించారు. దాదాపు రూ.20 లక్షల కుపైగా విలువ చేసే ఇల్లును తక్కువ ధరకు దక్కించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తన ఇల్లు తనకు కావాలని, బ్యాంకు అధికా రులు వేలం వేయొద్దని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే పట్టించుకోలేదని పేర్కొ న్నారు. చివరికి ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో పోలీసు భద్రత మధ్య ఖాళీ చేయించాలని నాలుగు రోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం కిషన్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కిషన్ కుటుంబం చేసేదేమీ లేక రాత్రంతా ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. కిషన్ కుటుంబసభ్యులు ఆత్మహత్యకు యత్నించేందుకు సిద్ధపడగా వారి వద్ద నుంచి క్రిమిసంహారక మందును స్థానిక మహిళలు లాక్కున్నారు. తాము అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడ తామని హామీనిచ్చారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు కిషన్ ఇంటికి వచ్చి ఖాళీ చేయించేందుకు యత్నించగా బాధితులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కాలనీ వాసులు నిలిచారు. తమకు న్యాయం చేయా లని, ఇల్లు ఇప్పించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషన్ భార్య విజయ హెచ్చరించారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుకడుగు వేశారు. కొనుగోలు చేసిన వ్యక్తితో చర్చలు జరిపి బ్యాంకు అప్పు కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
డ్వాక్రా రుణం చెల్లించలేదని ఇంటికి తాళం!
బ్యాంకు అధికారుల తీరు వెంకటాపురం: జయశంకర్ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరంలో డ్వాక్రా రుణాలు రికవరీ చేయడానికి బ్యాంకు, సెర్ప్ అధికారులు శుక్రవారం పర్యటించారు. గ్రూపు సభ్యుల ఇళ్లకు వెళ్లి రుణా లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నాం కొంత సమ యం కావాలని వారు కోరగా.. అలా కుదరదంటూ నిర్మల, కళావతి ఇళ్లకు తాళాలు వేశారు. బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహించిన మహిళలు వీర భద్రవరం ప్రధాన రహదారిపై బైఠా యించి, రాస్తారోకో నిర్వహించారు. నాలుగైదేళ్లుగా పంటలు సరిగా పండ క ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు కట్టలేక పోయామని మహిళలు అన్నారు. నెలరోజులు గడువిస్తే చెల్లి స్తామన్నారు. దీంతో బ్యాంకు అధికా రులు వారికి కొంత సమయం ఇవ్వ డంతో ఆందోళన విరమించారు. -
ఇల్లు ఖాళీ చేయించడంలో ఉద్రిక్తత
బ్యాంకు వేలంలో ఇల్లు కొన్న ఎంపీ గల్లా జయదేవ్ పట్నంబజారు (గుంటూరు): గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రాబ్యాంకు వేలంలో కొనుగోలు చేసిన ఇంటిని అధికారులు ఖాళీ చేయించే విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో గుంటుపల్లి శ్రీనివాస్ వ్యాపారం నిమిత్తం ఆంధ్రాబ్యాంకులో రూ.2.50 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో గత జూన్‌లో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేశారు. అప్పటికే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎంపీ జయదేవ్ రూ.3.09 కోట్లకు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబాన్ని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించాలని అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా వారు ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బ్యాంకు అధికారులు.. పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ భార్య పద్మ తనకుమారుడు సమంత్‌తో పాటు రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని గదిలోకెళ్లి తలుపులు వేసుకు న్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని చెప్పారు.దీంతో అధికారులు ఆందోళన చెందారు. చివరకు శ్రీనివాస్ తండ్రి పూర్ణచంద్రరావు సర్దిచెప్పడంతో పద్మ బయటకు వచ్చారు. అధికారులు ఇంటిని సీజ్ చేశారు. -
కొత్తపల్లి గీత భర్తకు అరెస్టు వారెంట్
విచారణకు గైర్హాజరైన కోటేశ్వరరావు కిందికోర్టు తీర్పును సమర్థించిన నాంపల్లి కోర్టు సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామ కోటేశ్వరరావుకు నాంపల్లి ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసిన కేసులో ప్రత్యేక కోర్టు విధిం చిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. విచారణ సంద ర్భంగా కోటేశ్వరరావు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయ నపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతోపాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని నిర్ధారించింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా డైరెక్టర్‌గా ఉన్న కోటేశ్వరరావు పీఎన్బీ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతోపాటు చెల్లని చెక్కులు ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారిం చిన ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 2015లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. అయితే ఈ కేసులో కొత్తపల్లి గీతను కూడా నిందితురాలిగా చేర్చాలంటూ పీఎన్బీ చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
రైతు ఖాతాలో రూ. 1.84 కోట్లు జమ
- విచారణ చేపట్టిన బ్యాంకు అధికారులు - అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘటన పుట్లూరు: ఓ రైతు అకౌంట్లో రూ. 1.84 కోట్లు జమ అయిన సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే 24 గంటలు గడవకముందే జమ అయిన మొత్తం ఖాతాలో కనిపించకుండా పోయింది. పుట్లూరు మండలం కోమటికుం ట్లకు చెందిన శ్రీనివాసులనాయుడు అనే రైతుకు తాడిపత్రిలోని ఆంధ్రా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఇందులో ఈ నెల 16న రూ. 960 మాత్రమే ఉండటంతో కనీస బ్యాలెన్స్ రూ. 1,000 ఉండటానికి వీలుగా బ్యాంకుమిత్రగా పనిచేస్తున్న అతని భార్య సుజాత రూ. 40 బదిలీ చేసింది. వెంటనే అకౌంట్లో బ్యాలెన్స్ రూ. 1.84 కోట్లు ఉన్నట్లు మేసేజ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాసులనాయుడు బ్యాంకు అధికారులకు విషయం చెప్పేందుకు శనివారం ఉదయమే ఆ బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడ రద్దీగా ఉండటంతో వెనక్కు తిరిగి వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి అతని అకౌంట్లో కేవలం రూ. 130 మాత్రమే ఉన్నట్లు మరోమారు మెసేజ్ వచ్చినట్లు రైతు శ్రీనివాసులనాయుడు తెలిపారు. తనకు తెలియకుండా డబ్బు జమ కావడంతో పాటు తన అకౌంట్లోని రూ. 870 తగ్గిపోవడంపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీనివాసులనాయుడు విలేకరులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు కర్నూలు నుంచి తమ సిబ్బందిని పంపి ఆదివారం శ్రీనివాసులనాయుడు అకౌంట్‌పై విచారణ చేపట్టినట్లు సమాచారం. మహిళా కూలీ ఖాతాలోకి కోటిన్నర టీనగర్(చెన్నై): కూలీనాలీ చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళ ఖాతాలోకి రూ. 1.5 కోట్లు జమైంది. దీంతో ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తేనిలో చోటుచేసుకుంది. తేని సమీప నాగలాపురానికి చెందిన మునియమ్మాళ్(60) కూలీ కార్మికురాలు. భర్తను కోల్పోయిన ఈమెకు వితంతు పింఛన్ అందుతోంది. ఈ నేపథ్యంలో మునియమ్మాళ్ పింఛన్ తీసుకునేందుకు శనివారం బ్యాంకుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు అందులో రూ. 1.5 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఐటీ అధికారులు సదరు బ్యాంకు అధికారుల వద్ద విచారణ చేపట్టారు. -
అరకు ఎంపీ భర్తపై వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పి.రామకోటేశ్వరరావుపై నాంపల్లి కోర్టు బుధవారం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కింది కోర్టు తీర్పును అప్పీల్ చేసుకున్న ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. రామకోటేశ్వరరావు విశ్వేశ్వర ఇన్ఫ్రా సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దీని కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో బ్యాంకు అధికారులు ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్ర రుుంచారు. ఈ అంశాన్ని నిర్ధారించిన న్యాయస్థానం రామకోటేశ్వర రావుకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రామకోటేశ్వరరావు నాంపల్లిలోని 8వ ఏఎంఎస్‌జే కోర్టులో పిటిషన్ వేశారు. దీని విచారణకు గైర్హాజరు అవుతుండటంతో కోర్టు బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’!
దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మహారాష్ట్రలోని ధసై - చిన్నా పెద్దా అన్ని దుకాణాల్లోనూ స్వైపింగ్ యంత్రాలు - వడాపావ్ తిన్నా కూడా డెబిట్/క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించొచ్చు - కొద్ది రోజులుగా గ్రామంలోనే మకాం వేసి కరెంట్ ఖాతాలు, - స్వైపింగ్ యంత్రాలు అందజేస్తున్న బ్యాంకు అధికారులు - వ్యాపారులకు ఓ స్వచ్ఛంద సంస్థ, పంచాయతీ సహకారం - ప్రత్యేక కార్యక్రమాలతో జనానికి అవగాహన కల్పిస్తున్న వైనం సాక్షి, ముంబై: అది మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాడ్ తాలూకా ధసై గ్రామం.. ఈ ఊళ్లో ఏది కొనాలన్నా డబ్బులు అవసరం లేదు.. టిఫిన్ చేయాలన్నా, వడాపావ్ తినాలన్నా సరే.. జస్ట్ క్రెడిట్ కార్డో, డెబిట్కార్డో ఉంటే చాలు.. ఎంత తక్కువ మొత్తమైనా సరే కార్డు స్వైప్ చేసి చెల్లించేయొచ్చు. నోట్ల రద్దుతో దేశమంతా విభిన్నమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ ‘క్యాష్ లెస్’ గ్రామం ఒక్కసారిగా చర్చల్లోకెక్కింది. దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత గ్రామంగా నిలిచింది. ధసై గ్రామంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇటీవల స్వైపింగ్ యంత్రాల సేవలు ప్రారంభించి.. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మారిందని ప్రకటించా రు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆ గ్రామంలో పర్యటించి.. ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను, నగదు రహిత సేవల వివరాలను తెలుసుకుంది. 10 వేల జనాభాతో.. మహారాష్ట్ర రాజధాని ముంబైకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధసై గ్రామ జనాభా సుమారు 10 వేలు. ఈ గ్రామం చుట్టూ మరో 40 గిరిజన, ఆదివాసీ పల్లెలు కూడా ఉన్నారుు. వారంతా కూడా నిత్యావసరాలు, ఇతర సామగ్రి కోసం ధసైకే వస్తుంటారు. ఇక్కడ చిన్నాపెద్దా కలిపి సుమారు 150కి పైగా దుకాణాలు ఉన్నారుు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి కూరగాయలు, మెడికల్, స్టేషనరీ, మాంసం దుకాణాలు తదితర వ్యాపారులంతా కలసి ‘ధసై గ్రామ వ్యాపారీ సంఘటన’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులోని సభ్యులందరూ ధసై గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరికి సావర్కర్ స్మారక్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ప్రతి దుకాణంలోనూ.. గ్రామంలోని ప్రతి దుకాణంలోనూ స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 37 దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలను వినియోగిస్తుండగా.. మిగతా వారంతా మెషీన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ బ్యాంకు అధికారులు స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో 10 రూపాయల తినుబండారాలు, సామగ్రి కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు కలుగనుంది. ఇలా నగదు రహిత కొనుగోళ్లకు ధసై గ్రామ ప్రజలు కూడా పూర్తి సానుకూలంగా ఉండడం గమనార్హం. అరుుతే ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహన కల్పించేందుకు సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థతోపాటు గ్రామ పంచాయతీ, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చిల్లర సమస్య తప్పింది.. ‘ధసై గ్రామంలో చాలా ఏళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాం. స్వైపింగ్ యంత్రంతో అమ్మకాలు మరింత సులభమయ్యారుు. ముఖ్యంగా చిల్లర సమస్య తప్పింది. ప్రస్తుతం నా వద్దకు వచ్చేవాళ్లలో సగానికిపైగా కార్డులతోనే చెల్లిస్తున్నారు..’’ - సల్మాన్ యూసుఫ్ సయ్యద్ ఇక నుంచి మేమూ వాడతాం.. ‘‘కిరాణా సమానులు కొనుక్కునేందుకు ధసైకి వచ్చాను. స్వైపింగ్ యంత్రం గురించి షాపు యజమాని చెబితే ఇప్పుడే తెలుసుకున్నా. మా వద్ద డెబిట్ కార్డు ఉన్నా ఎప్పుడూ వాడలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. ఇక నుంచి మేం కూడా కార్డు వాడేందుకు ప్రయత్నిస్తాం.’’ - మాధురి (ధసై శివారు పల్లెకు చెందిన మహిళ) వడాపావ్ బండి వద్దా స్వైపింగ్ మెషీన్ మన వద్ద కట్లీస్/కచోరీ బండ్లలాగానే మహారాష్ట్రలో ఎక్కడ చూసినా వడాపావ్ బండ్లు కనిపిస్తుంటారుు. ఇలా ధసై గ్రామంలోని ప్రధాన కూడలిలో తోపుడు బండిపై వడాపావ్ అమ్మే విజయ్ సురోషరుు.. తన బండి వద్ద స్వైపింగ్ యంత్రం ఏర్పాటు చేసుకున్నారు. రూ.7 విలువ చేసే ఈ వడాపావ్ తిన్నవారి నుంచి కూడా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని విజయ్ చెప్పారు. ‘‘ధసైను నగదు రహిత గ్రామంగా మార్చేందుకు నా వంతు సహకారం అందించేందుకే స్వైపింగ్ యంత్రం పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చేవారు దానిని చూసి కొంత ఆశ్చర్యపోరుునా.. తర్వాత కార్డుల ద్వారానే చెల్లిస్తున్నారు. దీంతో నాకు పెద్ద ఎత్తునప్రచారం కూడా లభించింది. రోజూ సుమారు 100 మంది డెబిట్/క్రెడిట్ కార్డులతో చెల్లిస్తున్నారు.’’ అని వివరించారు. అందరూ ఆసక్తి చూపుతున్నారు ‘‘స్వైపింగ్ యం త్రాలు అమర్చుకోవడంపై గ్రామంలోని వ్యాపారులంతా ఆ సక్తి కనబరుస్తున్నారు. చిన్నా చిత కా దుకాణాలన్నింటికీ గ్రామ పంచాయతీ నుంచి వ్యాపార ధ్రువపత్రం ఇప్పిస్తున్నాం. దానిద్వారా బ్యాంకులో కరెంట్ ఖాతా, స్వైపింగ్ యంత్రం అందించే ఏర్పాట్లు చేశాం. ధసైకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరల్గావ్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు, పంచాయతీ అధికారులు సహకరిస్తున్నారు..’’ - స్వప్నిల్ పాత్కర్, ధసై వ్యాపారీ సంఘటన అధ్యక్షుడు అవగాహన కల్పిస్తున్నాం.. ‘‘ధసై నగదు రహిత గ్రామంగా మారనున్నందుకు సంతోషంగా ఉంది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ధసైతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్వైపింగ్ యంత్రాలు, కార్డుల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా విద్యార్థులను జాగృతం చేస్తున్నాం...’’ - విక్రమ్ సావర్కర్, సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామంలోనే మకాం వేసి మెషీన్లు ఇస్తున్నాం ‘‘కరెంట్ ఖాతాలు తెరవడం, స్వైపింగ్ యంత్రాలు అందించడం, అమర్చడం కోసం కొద్ది రోజులుగా ధసై గ్రామంలోనే మకాం వేశాం. కావల్సిన కొన్ని పత్రాల విషయంగా ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ధసైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 స్వైపింగ్ యంత్రాలను అమర్చాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్నాం..’’ - శీలం నాగవరప్రసాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారి -
అవ్వకెంత కష్టం..!
2005 కంటే ముందటి 500 నోట్లు చెల్లవన్న బ్యాంకు అధికారులు కారేపల్లి: ఈ ఫొటోలో కనిపిస్తున్న అవ్వ పేరు బొమ్మసాని ఐలమ్మ.. 90 ఏళ్లకు పైబడి ఉంటాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి బస్టాండ్ సెంటర్‌కు చెందిన ఈ అవ్వకు పెద్ద నోట్లు చెల్లవనే విషయాన్ని ఇటీవలే ఎవరో చెవిలో వేశారు. ఉన్న డబ్బులను బ్యాంకులో వేసుకోవాలని చెప్పారు. కంగారు పడిన ఐలవ్వ పదేళ్ల నుంచి ఇనుపపెట్టేలో భద్రంగా దాచుకున్న రూ. 500 నోట్లు బయటకు తీసింది. మొత్తం 32 నోట్ల వరకు ఉన్నాయి. వాటిని పట్టుకొని తన ఖాతా ఉన్న కారేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లింది. వాటిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ ఇందులో సుమారు 22 నోట్లు 2005 కంటే ముందు ముద్రించినవని.. అవి చెల్లవని చెప్పారు. ఐలవ్వకు ఆరుగురు కుమార్తెలు కాగా, భర్త ముత్తిలింగయ్య నలభై ఏళ్ల క్రితమే చనిపోయాడు. బిడ్డల పెళ్లిళ్లు అరుుపోగా.. ఒక్కతే ఇంట్లో ఉంటూ తన పనులు తానే చేసుకుంటూ జీవిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి పోయే బిడ్డలు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో చిల్లర మాత్రమే ఖర్చు పెట్టుకొని.. రూ. 500 నోట్లు దాచుకుంది. అవి కాస్త బ్యాంక్ మేనేజర్ చెల్లవని చెప్పడంతో లబోదిబోమంటోంది. 2005 కంటే ముద్రించిన రూ.500 నోట్లను ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే రద్దు చేసిన విషయం తెలియని వృద్ధురాలు ఇప్పుడు కనబడిన వారినల్లా తన నోట్లు మార్చి ఇవ్వండని వేడుకుంటోంది. -
బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ కన్నెర్ర
-
బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ కన్నెర్ర
ముంబయి: బ్యాంకు ఉద్యోగులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత నోట్లను డిపాజిట్ చేసే సందర్భాల్లో బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి చర్యలు నిలువరించాలని కరెన్సీ మేనేజ్ మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని బ్యాంకుల్లో కొంతమంది బ్యాంకు అధికారులు కొంతమంది అపరాధులతో చేయి కలిపి డబ్బు మార్పిడి చేసే విషయంలో, డిపాజిట్ చేసే సమయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే బ్యాంకు అధికారులు అలాంటి పనులు ఆపివేయాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నగదు మార్పిడి, డిపాజిట్లలో బ్యాంకులకు జారీచేసిన సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే బ్యాంకులు సరియైన రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. కింద పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఆర్బీఐ బ్యాంకులకు తాజాగా జారీచేసిన సూచనలు.. 1. నవంబర్9 నుంచి ప్రతి ఖాతాలో డిపాజిట్ అయిన పాత, కొత్త నోట్ల సమాచారం, ఎస్బీఎన్(పెద్ద నోట్లు) కాని ఖాతాదారుడి డిపాజిట్ల సగటు విలువ లేదా రుణ కస్టమర్ అకౌంట్ వివరాలు నమోదుచేయాలి. 2. పాతనోట్ల మార్పిడికి బ్యాంకుకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు, ఇతర వ్యక్తుల వివరాల రికార్డులను బ్యాంకులు శాఖలు నిర్వహించాలి. -
డిపాజిట్ చేస్తే.. రుణం కింద రికవరీ
లింగంపేట: పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ప్రజలు తమ వద్దనున్న పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు వెళ్తే.. ఇదే అదనుగా బ్యాంకర్లు రుణాలను రికవరీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాదారులు తమ వద్దనున్న పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిట్ చేస్తున్న వారిలో చాలా మంది రైతులున్నారు. బ్యాంకు పరిధిలో సుమారు 2 వేల మంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు. వారి జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ క్రమంలో రైతులు డిపాజిట్ చేసిన సొమ్ములోంచి.. వారికి సంబంధించిన పంట రుణాన్ని బ్యాంకు అధికారులు మినహారుుంచుకుంటున్నారు. లింగంపేటకు చెందిన ఆవుల ప్రమీల, నాగేందర్ ఈనెల 13న రూ. 40 వేలు డిపాజిట్ చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈనెల 18న రూ. 35 వేలను పంట రుణం కింద రికవరీ చేసుకున్నారని నాగేందర్ తెలిపాడు. ఇలా ఒక్కొక్కరి ఖాతానుంచి రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు పంట రుణం కింద పట్టుకుంటున్నారని రైతులు తెలిపారు. రబీ పెట్టుబడులకు ఇప్పటికే తిప్పలు పడుతున్నామని, పంట రుణాల రికవరీని నిలిపివేయాలని కోరుతున్నారు. -
ప్రాణం తీస్తున్న నోట్ల మార్పిడి
- గుండెపోటుతో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ మృతి - క్యూలో నిల్చోలేక తనువు చాలించిన వృద్ధుడు నెల్లూరు(సెంట్రల్)/చాపాడు/తుమకూరు (కర్ణాటక): పెద్ద నోట్ల మార్పిడి వ్యవహా రం వృద్దులు, బ్యాంకు సిబ్బంది చావుకొచ్చింది. గంటల తరబడి క్యూలో నిల్చోలేక వృద్దులు ప్రాణాలు కోల్పోతుంటే మహిళలు అస్వస్థతకు గురవుతున్నారు. మరో వైపు పని భారం పెరగడంతో బ్యాంకు అధికారులు, సిబ్బంది తల్లడిల్లిపో తున్నారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎస్బీఐ డిప్యుటీ మేనేజర్, కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్బీఎం)లో ఓ వృద్దుడు గుండెపోటుతో మృతి చెందారు. వైఎస్సా ర్ జిల్లా చాపాడులో ఓ మహిళ సొమ్మసిల్లి కిందపడి పళ్లూడగొట్టుకుంది. ఈ ఒత్తిడి ఇంకెన్నాళ్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 1000. రూ.500 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులో పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యం లో శనివారం సాయం త్రం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపో వడంతో సిబ్బంది ఆయన్ను హుటాహుటి న హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. పెద్ద నోట్లు ప్రాణం తీశాయి కర్ణాటకలోని తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్బీఎం)లో నోట్ల మార్పిడికి శనివారం వృద్ధులకు అవకాశం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న సూలయ్యనపాళ్య గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప(68) రూ.500 నోట్లతో బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చున్నాడు. గంటల తరబడి నిలబడటంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా
- విజయ డెయిరీ ఖాతా నుంచి తీసిన వైనం... - పెద్దనోట్లు రద్దు చేసిన రెండు రోజులకే వ్యవహారం - కొత్త రూ.2 వేల నోట్లు, వందనోట్లు ఇచ్చిన ఎస్బీహెచ్ - నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు అందజేసిన వైనం - బ్యాంకు అధికారుల తీరుపై పలు అనుమానాలు సాక్షి, మెదక్: పెద్దనోట్ల రద్దుతో దేశం అంతా ఇబ్బందులు పడుతోంది. ఒక్కోవ్యక్తికి రూ.4 వేలు మార్చుకోవాలని, రూ.10 వేలకు మించి నగదు డ్రా చేయవద్దని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు మెదక్ పట్టణంలోని ఎస్‌బీహెచ్‌కు ఏమాత్రం పట్టలేదు. పెద్దనోట్లు రద్దు చేసి రెండురోజులు కూడా కాలేదు. బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు, అధికారులు, సిబ్బంది బిజీబిజీ. అపుడు మెదక్ ఎస్బీహెచ్ అధికారులు విజయ డెయిరీ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో రూ.1.20 కోట్ల డబ్బు డ్రా చేసుకునేందుకు అనుమతించిన విషయం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు తోసిరాజని రూ.1.20 కోట్లు అందజేత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయ డెయిరీ పాడిరైతుల నుంచి సేకరించిన పాలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయ డెయిరీ పాడి రైతులకు డబ్బుల చెల్లింపులు చేయలేదు. దీనికితోడు నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దని నిబంధనలను విధించారు. ప్రభుత్వ నిబంధనలను తోసిరాజని మెదక్ ఎస్బీహెచ్ అధికారులు 11వ తేదీన విజయ డెయిరీ ఖాతా (ఎండీటీఎస్డీడీసీఎఫ్ లిమిటెడ్- 0000006221219 2509) నుంచి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రాకు అనుతించారు. సుమారు 13 సొసైటీ చెక్కులతో ఒకేరోజు ఇంతమొత్తం డ్రా చేసినట్లు తెలుస్తోంది. రూ.1.20 కోట్లలో అధికమొత్తం కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు సమాచారం. 11వ తేదీన మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకులో ఖాతాదారులు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నోట్ల మార్పిడి కోసం గొడవలు పడుతున్నారు. అలాంటి సమయంలో సైతం ఎస్బీహెచ్ అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్ల నగదు విజయ డెయిరీ సొసైటీకి ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకు అధికారులు విజయ సొసైటీ సభ్యులకు అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతించలేదు. అయితే మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ మాత్రం ఒకేరోజు రూ.1.20 కోట్ల డబ్బులు డ్రా చేసేందుకు అనుమతించటంతోపాటు రూ.2 వేల నోట్లు పెద్దమొత్తంలో ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదిలా ఉంటే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన సొసైటీ సభ్యులు పాడి రైతులకు పూర్తిస్థాయలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. బ్యాంకు అధికారులు, విజయసొసైటీ సభ్యులు కుమ్మక్కై నల్లధనం తెలుపుగా మార్చారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్బీహెచ్ బ్యాంకు అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్లు నగదు ఇవ్వటంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. డబ్బులు డ్రా చేశాం మెదక్ ఎస్బీహెచ్ విజయ డెయిరీ ఖాతా నుంచి 11వతేదీన రూ.1.20 కోట్లు డబ్బులు డ్రా చేశాం. జారుుంట్ అకౌంట్ ఖాతా ఉన్నందున చెక్కులపై నా సంతకం, సొసైటీ చైర్మన్ల సంతకాలు చేసి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా చేశాం.కొత్త రూ.2వేల నోట్లు ఇచ్చారు.13 సొసైటీల్లోని పాడి రైతులకు ఇవ్వాల్సిన బకారుులు చెల్లించాం. - రంజిత్, విజయ డెయిరీ మేనేజర్ డ్రా చేయడం నిజమే విజయ డెయిరీ ఖాతా నుంచి 11 వతేదీన రూ.1.20 కోట్లు డ్రాకు అనుమతించింది నిజమే నని మెదక్ ఎస్బీహెచ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. డబ్బులు డ్రా చేసిన విజయ డెయిరీ సొసైటీ వారికి కొత్త రూ.2వేలనోట్లతోపాటు వందనోట్లు ఇచ్చాం. ప్రభుత్వం ఖాతాల నుంచి డబ్బులు డ్రాకు అనుమతించవద్దన్న నిబంధన మరుసటి రోజు తెలిసింది. అరుుతే ఒకేరోజు రూ.1.20కోట్లు ఒకే ట్రాన్జాక్షన్‌లో ఎలా అనుమతిస్తారన్న దానిపై ఆయన సమాధానం ఇవ్వలేదు. - శ్రీనివాస్‌రావు, ఎస్బీహెచ్ మేనేజర్ -
క్యూల్లోనే వారాంతం!
- మూడోరోజూ బారులు తీరిన ప్రజలు... పలుచోట్ల బ్యాంకు అధికారులతో వాగ్వాదం - మరో 8-10 రోజులు ఇదే పరిస్థితంటున్న బ్యాంకర్లు - గుజరాత్, కర్ణాటకల్లో లైన్లోనే కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు న్యూఢిల్లీ: పాతనోట్లను మార్చుకునేందుకు వరుసగా మూడోరోజూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరారు. వారాంతం కావటం, బ్యాంకులు అదనపు గంటలు పనిచేస్తుండటంతో శనివారం రద్దీ కాస్త ఎక్కువగా కనిపించింది. దీంతో గంటల తరబడి ప్రజలు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం వేచిచూశారు. కేరళ, గుజరాత్‌లలో క్యూలైన్లో వేచి ఉన్నవారికి బ్యాంకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చాలా బ్యాంకుల వద్ద పోలీసులతో బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బందోబస్తు కోసం 3,400 మంది పారామిలటరీ బలగాలు, 200 క్విక్ రెస్పాన్స టీమ్స్‌ను రంగంలోకి దించారు. అటు మధ్యప్రదేశ్‌లో చిల్లరలేక నిత్యావసర వస్తువులు అందకపోవటంతో ఆగ్రహించిన ప్రజలు ఓ రేషన్ షాపును కొల్లగొట్టినట్లు తెలిసింది. ముంబైలో పలు బ్యాంకులు ముఖ్యమైన కూడళ్లలో మొబైల్ ఏటీఎంలు అందుబాటులో ఉంచారు. కాగా, బ్యాంకులకు వస్తున్న రద్దీని, నోట్లు మార్చుకునేందుకు ప్రజల్లో ఉన్న ఆతృతను చూస్తుంటే.. మరో 8-10 రోజుల పాటు ఇదే పరిస్థితి తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. బ్యాంకుల వద్ద సరైన డబ్బుల్లేవని ప్రజలు అపోహపడుతున్నారన్నారు.కాగా, పింఛనుదారులు రూ. 10వేలకన్నా ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ (భువనేశ్వర్) స్పష్టం చేసింది. ఏటీఎంలు ఖాళీ వారాంతం వేడి ఏటీఎం వద్ద కూడా కనిపించింది. చాలా ఏటీఎంలను అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డబ్బులతో నింపారు. అరుుతే తెల్లారిన కాసేపటికే ఇవన్నీ ఖాళీ అరుుపోయారుు. అసలే డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే సాంకేతిక కారణాలతో ఏటీఎంలు పనిచేయకపోవటం జనాగ్రహానికి కారణమైంది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలుండగా.. అందులో సగానికి పైగా పనిచేయటం లేదని తెలిసింది. కాగా, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్లచాలా చోట్ల కొందరు లైన్లలోనే కుప్పకూలిపోయారు. శుక్రవారం మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ఇద్దరు చనిపోగా.. శనివారం గుజరాత్లో బర్కాత్ షేక్ అనే వృద్ధుడు లైన్లోనే గుండెపోటుతో కుప్పకూలాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ 93 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉండటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. తిరగబడ్డ జనం బ్యాంకుల్లో పాతనోట్లు మార్చుకునేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవటంతో.. కేరళలోని కొల్లాం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచ్ ఉద్యోగులు షెటర్లు మూసేసేందుకు ప్రయత్నిం చారు. దీంతో బ్యాంకు ఆవరణలో ఉన్న 200 మంది కోపంతో బ్యాంకు అద్దాలను పగులగొట్టారు. దీంతో బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు వాగ్వాదం ముదిరింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో పరిస్థితి సద్దుమణిగింది. గుజరాత్‌లోనూ పలుచోట్ల బ్యాంకు అధికారులు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాణస్కంఠ, కచ్ జిల్లాల్లో అధికారులు నోట్ల మార్పిడికి తిరస్కరించటంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో చిల్లర నోట్లు లేక ఎదురవుతున్న సమస్యలతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరిగిపోయారుు. బర్దాహా అనే గ్రామంలో స్థానికులు పౌరసరఫరాల దుకాణాన్ని కొల్లగొట్టి తమకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. -
అప్పు పుట్టని ‘అరక’
- అన్నదాతలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా - రుణమాఫీ సొమ్ము రాలేదంటూ కొర్రీలు - బ్యాంకు రుణాలకు నోచుకోని 30 లక్షల మంది రైతులు - బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన - ఇప్పటివరకు 6.16 లక్షల మందికే అందజేత - వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు - రూ. 2, రూ. 3 మిత్తికి అప్పులు చేస్తూ తిప్పలు - ఖరీఫ్ రుణ లక్ష్యం.. రూ. 17,460 కోట్లు - ఇప్పటిదాకా ఇచ్చింది రూ. 3,761 కోట్లే! సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ‘‘బ్యాంకులకు పోతే లోన్లు ఇయ్యడానికి ఇంకా చానా రోజులైతదని చెబుతుండ్రు. ఎక్కడా అప్పు పుడుతలేదు. సేట్ల దగ్గరికి పోతే కాలమే సక్కగైతలేదు.. అప్పులెలా చెల్లిస్తావని అంటుండ్రు.. ఇగ ఏం విత్తనం ఎయ్యాలే? ఏం జేయాలే..? పూట గడుపుకోవడానికి కూలీకి పోతున్న’’ - మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు పోకల మల్లేశం ఆవేదన ఇది! ‘‘బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరిగినా ఫలితం లేదు. రెన్యువల్ చేయాలని అడిగినా రుణమాఫీ సొమ్ము రాలేదని వాయిదా వేశారు. చేసేది లేక ప్రైవేటుగా రూ.3 వడ్డీకి లక్ష అప్పు తెచ్చి 14 ఎకరాల్లో మొక్కజొన్న వేశా’’ మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన రాంరెడ్డి వ్యథ ఇది!! ..ఇలా ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలో లక్షల మంది రైతులది ఇదే గోస. గత రెండేళ్లతో పోలిస్తే వానలు కాస్తోకూస్తో బాగానే పడుతున్నా చేలలో గింజ వేసేందుకు రైతన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. అప్పు కోసం కాళ్లరిగేలా తిరిగినా నానా కొర్రీలు పెడుతూ మొండిచేయి చూపుతున్నాయి. దీంతో గత్యంతరం లేక చాలా మంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బంగారం కుదువపెట్టి బ్యాంకుల్లో, షావుకార్ల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. కాస్త పెద్ద రైతులు సొంతంగా పెట్టుబడులు పెడుతున్నా.. చిన్న, సన్నకారు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర దాటినా పంట రుణాలు అనుకున్న స్థాయిలో ఇవ్వడం లేదు. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రూ.29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు కేవలం రూ.3,761 కోట్లు ఇచ్చారు. సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 55.53 లక్షల మంది రైతుల్లో.. 36 లక్షల మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు కేవలం 6.16 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. దాదాపు 30 లక్షల మంది రైతులు రుణాలకు దూరంగా ఉన్నారు. రుణమాఫీనే బూచీగా చూపుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి అర్హులుగా 35.82 లక్షల రైతులను గుర్తించింది. మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్ల మాఫీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీని గతేడాది రెండు విడతలుగా విడుదల చేసింది. ఇంకా రెండు విడతల సొమ్ము రూ.8 వేల కోట్లకుపైగా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాది మూడో విడత సొమ్ముకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. మూడు, నాలుగో విడత సొమ్ము ఒకేసారి చెల్లించాలని ప్రతిపక్షాలు, బ్యాంకులు కోరాయి. కానీ సర్కారు మూడో విడతకే పరిమితమైంది. మూడో విడతలోనూ రూ.2,020 కోట్లే ఇస్తానని చెప్పింది. చివరకు ఆ సొమ్మును కూడా రెండు విడతలుగా విడుదల చేసింది. ఇప్పటికీ రుణమాఫీ సొమ్మును సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు పూర్తిస్థాయిలో పంట రుణాలు ఇవ్వడంలేదు. రుణమాఫీతో రైతులకు సంబంధం లేదని, అది ప్రభుత్వానికి, బ్యాంకులకు సంబంధించిన వ్యవహారమేనని సర్కారు పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం రుణమాఫీ వ్యవహారాన్నే ముందుకు తెస్తూ రుణాలివ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. రైతులకు బ్యాంకు రుణాలు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. మచ్చుకు జిల్లాకో గ్రామాన్ని ఎంచుకొని ఆ ఊళ్లో రైతుల పరిస్థితిని తెలుసుకుంది. ఇందు లో చాలా మంది బ్యాంకు రుణాలు అందడం లేదని, ఫలితంగా ప్రైవేటుగా రూ.3 వడ్డీకి అప్పులు చేయా ల్సి వస్తోందని గోడు వెల్లబోసుకున్నారు. - ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తరశాలలో సుమారు 110 మంది రైతులు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 25 మందికి మాత్రమే రుణాలు అందాయి. మిగతావారంతా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.22.50 లక్షల మేర అప్పులు చేశారు. - కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లిలో 1,038 మంది రైతులుంటే.. వారిలో 400 మందికి రుణాలు అందాయి. మరో 252 మంది ప్రైవేటుగా రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టారు. మిగతావారిలో బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు కుదవపెట్టి కొందరు, డ్వాక్రా సంఘాల నుంచి కొందరు రుణాలు తీసుకున్నారు. - మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో 852 మంది రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి 40 మందికి మాత్రమే రూ.25 లక్షల మేర రుణాలందాయి. 350కి పైగా రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల అప్పులు చేశారు. - నల్లగొండ జిల్లా చిలుకూరు మండలంలోని చిలుకూరులో 1,322 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో కొత్తగా 16 మందికి రూ.9 లక్షల మేర మాత్రమే రుణాలిచ్చారు. ప్రాథమిక సహకార సంఘం నుంచి 1,024 మంది రైతులకు రూ.1.14 కోట్ల రుణాలను రెన్యూవల్ చేసినా కొత్త రుణాలు మాత్రం ఇవ్వలేదు. - వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో 789 మంది రైతులు ఉండగా.. 266 మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చాయి. మిగిలిన 523 మంది రైతులు ప్రైవేటు, ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకున్నారు. - ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గౌరారంలో 356 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో 12 మందికి పలు బ్యాంకులు రుణాల రెన్యూవల్ జరిగింది. రుణాలందకపోవడంతో దాదాపు 200 మంది ప్రైవేటు అప్పులు చేశారు. - మెదక్ జిల్లా వర్గల్ మండలం తున్కిఖాల్సాలో 1,978 మంది రైతులు ఉండగా.. వారిలో 100 మందికే బ్యాంకు రుణాలందాయి. దాదాపు 1,500 మంది ప్రైవేటు అప్పులు చేశారు. మిగతావారు సొంతంగా పెట్టుబడులు పెట్టారు. - నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లిలో 365 మంది రైతులు ఉండగా.. వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి 284 మంది రుణాలు తీసుకున్నారు. 40 మంది ప్రైవేటు అప్పులు చేయగా.. బంగారం తాకట్టు పెట్టి 60 మంది రుణాలు పొందారు. - రంగారెడ్డి జిల్లా పరిగి మండ లం మిట్టకోడూరులో 750 మంది రైతులు ఉండగా.. 10 మందికే రుణాలందాయి. 550 మంది ప్రైవేటు అప్పులు చేశారు. బంగారం కుదువ పెట్టా.. ఆంధ్రాబ్యాంక్‌లో పోయిన ఏడాది రూ.30 వేల రుణం ఇచ్చిండ్రు. ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న పంట ఏసిన. కాగితాల్లో మార్పులు చేసినమని చెప్పిండ్రు. రుణం మాత్రం ఇంక ఇయ్యలే. బంగారం కుదువ పెట్టి అప్పు తెచ్చుకుని సాగు చేసుకున్న. -ఎగుర్ల లచ్చయ్య, గొల్లపల్లి, కరీంనగర్ కొత్త వారికి రుణం ఇవ్వరట! ఈయన పేరు సింగతి బాపు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి. ఈ రైతుకు మూడెకరాల భూమి ఉంది. పంట రుణం కోసం బెల్లంపల్లి కో-ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్తే కొత్త వారికి ఇవ్వడం కుదరదని వెనక్కి పంపేశారు. చేసేది లేక సమీపం బంధువు వద్ద రూ.2 వడ్డీ చొప్పున రూ.లక్ష అప్పు తీసుకొని రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ అప్పుకు ఏడాదికి అసలుతో పాటు వడ్డీ రూ.24 వేలు చెల్లించాలి. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయా.. నేను రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.35 వేలు రుణం తీసుకున్నా. అది మాఫీ అయ్యిందా? లేదా అన్నది బ్యాంకు వారు చెప్పడం లేదు. కొత్త రుణం ఇవ్వడం లేదు. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయాను. పొలాన్ని బీడు పెట్టడం ఇష్టం లేక పంట పండిన తర్వాత ధాన్యం విక్రయిస్తానని చెప్పి అప్పు తెచ్చుకొని పంట వేశా. -యాపచెట్టు చిన్న చెంద్రాయడు, గోపాల్పేట, మహబూబ్‌నగర్ -
'కేటాయింపులు శాస్త్రీయంగా జరగాలి'
విజయవాడ: బ్యాంకు అధికారులతో గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2016- 17 సంవత్సరానికి గానూ రూ. 1,65,538 కోట్లతో యాక్షన్ ప్లాన్‌పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బ్యాంకర్ల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకే రంగానికి కేటాయించిన నిధులు వేరే రంగానికి మరలుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా జరగాలన్నారు. లేకుంటే లక్ష్యం సాధించలేమని ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకు అధికారులకు సూచించారు. -
బడుగు రైతుపై మరో పిడుగు
- నిర్బంధ రుణ వసూళ్లకు డీసీసీబీ బరితెగింపు - బకాయిదారులకు నోటీసులు - ఆస్తులు జప్తు చేసి,వేలం వేస్తామంటూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నవ తెలంగాణలో పాత జమానా మొదలైంది. పటేల్, పట్వారీల నాటి పరిస్థితి మళ్లీ వచ్చింది. తలుపులు, కంచం, మంచం గుంజుకుపోయిన పాడురోజులు మళ్లీ రానేవచ్చాయి. అప్పులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తామని హెచ్చరిస్తూ అన్నదాతలకు నోటీసులు జారీ చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అన్నంత పని చేయబోతోంది. ఈ నెల 20న మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఐదుగురు రైతులకు చెందిన భూములను జప్తు చేసి వేలం వేయడానికి సిద్ధమైంది. కాలం లేదు.. కనికరించండని కాళ్లు పట్టుకున్నా బ్యాంకోళ్లకు మనసు రాలేదు. జిల్లాలో రెండు వేలమంది రైతులను గుర్తించి ఈ ఏడాది కనీసం 800 మంది నుంచి బకాయిలు వసూలు చేయడమో..! లేదా భూములు వేలం వేయడమో చేయాలని డీసీసీబీ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రమంతటికి విస్తరించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. రైతులు బిక్కుబిక్కు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 24 శాఖలు ఉన్నాయి. వీటి నుంచి సగటున ఏడాదికి రూ.250 కోట్లకుపైగా పంట రుణాలు ఇస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 60 వేల మంది రైతులు సుమారు రూ.450 కోట్ల పంట రుణ సహాయం పొందారు. డీసీసీబీ నివేదికల ప్రకారం రెండువేల మంది రైతులు దీర్ఘకాలంగా బకాయిలు పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అధికారులు ఎప్పుడొచ్చి ఇళ్ల మీద పడుతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20న రంగంపేటలో వేలానికి సిద్ధం.. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి గతంలో రుణాలు తీసుకొని బకాయిలు పడిన ఐదుగురు రైతుల భూములను జప్తు చేసుకొని ఈనెల 20న వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సమీప గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన పురం అంజిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని అమ్ముకుని సహకార సంఘం అప్పు చెల్లించాడు. కానీ, సంఘపోళ్లు అప్పులు కట్టమని బెదిరిస్తున్నారు. లేకపోతే ఇంటి దర్వాజలు పీకేస్తామని హెచ్చరించి కాయితం ఇచ్చారని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన పాపోల్ల కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
బీవోబీ కేసులో ఆరుగురి అరెస్టు
ఇద్దరు బ్యాంక్ అధికారులు కూడా న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) అక్రమ రెమిటెన్సుల కేసుకు సంబంధించి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఆరుగురిని అరెస్టు చేశాయి. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ బీవోబీ శాఖలో ఏజీఎం ఎస్కే గర్గ్, విదేశీ మారక విభాగం హెడ్ జైనీష్ దూబేని క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి చట్టాల కింద అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి కమల్ కల్రాతో పాటు చందన్ భాటియా, గురుచరణ్ సింగ్ ధావన్, సంజయ్ అగర్వాల్‌లను ఈడీ అరెస్టు చేసింది. వీరిని సుదీర్ఘ సమయం పాటు ప్రశ్నించిన ఏజెన్సీలు ఆ తర్వాత అరెస్టు చేశాయి. ఇందులో అరెస్ట్ చేసిన వారంతా దాదాపు 15 నకిలీ కంపెనీల మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. బీవోబీకి చెందిన కొందరు అధికారులు 59 మంది ఖాతాదారులతో కుమ్మక్కై విదేశాలకు(ముఖ్యంగా హాంకాంగ్‌కు) రూ.6,000 కోట్ల పైచిలుకు రెమిటెన్సులు అక్రమంగా పంపారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రెండేళ్ల క్రితమే ఫారెక్స్ కార్యకలాపాలకు అనుమతి పొందిన బీవోబీ అశోక్ విహార్ బ్రాంచీ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. 2014 జూలై-2015 జూలై మధ్య నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చింది. ఈ కేసులో అవినీతి కోణంలో సీబీఐ... మనీ లాండరింగ్, హవాలా కోణంలో ఈడీ విచారణ జరుపుతున్నాయి. నకిలీ కంపెనీలు ఏర్పాటు చేయడం, ఎగుమతుల విలువను ఎక్కువ చేసి చూపించి ఆ తర్వాత సుంకాలపరమైన ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడంలో కల్రా, భాటియా, ధావన్, అగర్వాల్ కుమ్మక్కై వ్యవహరించారని ఈడీ వర్గాలు తెలిపాయి. డాలరుకు 30-50 పైసల కమీషన్ మాట్లాడుకుని భాటియా, అగర్వాల్.. బీవోబీ ద్వారా రెమిటెన్సులు పంపేలా కల్రా వెసులుబాటు కల్పించినట్లు వివరించాయి. -
రుణం.. భారమై..!!
- బోర్లు.. పంట సాగుకోసం రూ.2లక్షల మేర అప్పు - రుణమాఫీ మొత్తాన్ని వడ్డీకిందికి జమకట్టుకున్న బ్యాంక్ అధికారులు - దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతన్న - శాలిపేటలో విషాదం చిన్నశంకరంపేట: సాగును వదులుకోలేక అప్పు తెచ్చిమరీ బోర్లు వేశాడు కానీ, ఎందులోనూ చుక్క నీరు రాలేదు. సరేలే అని మొక్కజొన్న సాగుచేశాడు.. వర్షం లేక అదీ ఎండిపోయింది. మరోవైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు.. దీంతో కలత చెందిన ఓ రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన భల్యాల ఎల్లం(34) తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల్లో వరిసాగు కోసం రూ.60వేలు అప్పు తెచ్చి ఆరు నెలల క్రితం రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీరు రాలే దు. దీంతో వరి సాగును విరమించుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కానీ, వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోతుంది. పంట చేతికొచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. మరో వైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు. అలాగే భూమి కంటే ఎక్కువ రుణం పొంది నట్లు పేర్కొంటూ బ్యాంక్‌లోని రూ.8 వేల ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా కలుపుకున్నారు. రెండో విడత రుణమాఫీ మొత్తాన్ని కూడా వారే పట్టుకున్నారు. దీంతో పంట సాగు కోసం మరో రూ.50వేలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చాడు. బ్యాంక్ రుణంతో కలిపి రూ.2లక్షలకు అప్పులు చేరుకున్నా యి. సాగుచేసిన పంట కూడా ఎండిపోతుండడంతో కలత చెందిన రైతు ఎల్లం సోమవారం ఉదయం తల్లి, భార్య మొక్కజొన్న చేను వద్దకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృ తుడి భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నగేష్ పేర్కొన్నారు. -
ఏపీజీవీబీ ఎదుట రైతుల ధర్నా
- కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ చిందులు - అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వెల్దుర్తి : పంట రుణమాఫీ వర్తింపజేయడంలో బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొం టూ సోమవారం వెల్దుర్తిలోని ఏపీజీవీబీ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భరత్‌కుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రుణాల కోసం బ్యాంకుకు వచ్చే రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత పంట రుణమాఫీ డబ్బుల నుంచి వడ్డీ, బీమా డబ్బులతో పాటు ఆ కుటుంబంలో మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను సైతం వసూలు చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే రుణమాఫీ ద్వారా వచ్చే మొత్తం నుంచి వెయ్యికి రూ.5 నుంచి రూ.10 వరకు సిబ్బంది కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల ధర్నా విషయం తెలుసుకుని బ్యాంకుకు వెళ్లిన విలేకరులపై ఫీల్డ్ ఆఫీసర్ భరత్‌కుమార్ చిందులు తొక్కాడు. నా ఇష్టం.. నా లెక్క నాది.. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి.. రైతుల ధర్నాకు బెదిరేది లేదు.. ఇక్కడ కాకపోతే మరో బ్యాంకుకు వెళ్తా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సదరు అధికారిపై చర్యలు తీసుకునే వరకు బ్యాంకుకు రామని, ప్రతి రోజు బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించి వెనుదిరిగారు. -
బ్యాంక్ ఖాతా నుంచి నగదు చోరీ
అచ్చంపేట : ‘మేము మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం... మీ ఖాతా వివరాలు తెలపండి’ అని సమాచారం తెలుసుకుని ఒక వ్యక్తి ఖాతా నుంచి అగంతకులు నగదును డ్రా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక టెలిఫోన్ ఎక్ఛేంజి కార్యాలయంలో ఖాశిం సైదులు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో 91358 54613 నంబరు నుంచి సైదులుకు ఫోన్ వచ్చింది. నేను మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను... గుంటూరులో ఉన్న మీ బ్యాంకు అకౌంటు ఖాతా నంబరు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు. ముందుగా ఆధార్ నంబర్ చెప్పాలని కోరాడు. సైదులు ఆ నంబర్ చెప్పగా, అనంతరం బ్యాంకు ఏటీఎం కార్డుపై ఉండే 16 అంకెల నంబర్ చెప్పాలని కోరాడు. ఆ నంబర్ కూడా చెప్పాడు. దీంతో మీ ఫోనుకు ఒక నంబర్ వస్తుంది అది చెప్పాలని అవతలి వ్యక్తి కోరాడు. అనంతరం సెల్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ నంబర్‌ను సైదులు ఫోన్ చేసిన అవతలివైపు వ్యక్తికి తెలిపాడు. ఆ తరువాత అవతలివైపు వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆ తరువాత కొద్ది సేపటికి సైదులు సెల్‌కు తన అకౌంట్ నుంచి రూ.41 వేలు డ్రా అయినట్టు సమాచారం వచ్చింది. కంగారుపడ్డ సైదులు వెంటనే బ్యాంకుకు వెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. బీహార్‌లోని ఏటీఎం సర్వీసింగ్ సెంటర్ నుంచి రూ.41 వేలకు 6 వస్తువులను కొనుగోలు చేసినట్టు ప్రింట్ తీసి బాధితుడు సైదులుకు ఇచ్చారు. తాను అసలు బీహారు వెళ్లలేదని, ఇదెలా సాధ్యమని బ్యాంకు అధికారుల వద్ద వాపోయాడు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఖాతా వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని ఎన్నోసార్లు సెల్ మెసేజ్‌లు ఇస్తున్నామని, అయినా వివరాలు తెలియజేయడం మీ తప్పే అని సైదులుకు తెలియజేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని సమాధానం ఇచ్చారు. అనంతరం బాధితుడు సైదులు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది ఇది సైబర్ నేరం కిందకు వస్తుందని తెలిపారు. గుంటూరులో ప్రతి సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో సైబర్ నేరాలపై గ్రీవెన్స్ నిర్వహిస్తారని, అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. తనకు వచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించగా అది ఏటీఎం సర్వీస్ సెంటర్‌ది అని తేలిందన్నారు. తన భార్య చనిపోతే ఎల్ఐసీ క్రింద ఆ డబ్బు వచ్చిందని, తనకు న్యాయం చేయాలని సైదులు వాపోయాడు. -
బంగారం వేలం బాటలో బ్యాంకులు
నెల్లూరు(అగ్రికల్చర్) : బంగారం ధర రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో జిల్లాలోని బ్యాంకులన్నీ వరుస పెట్టి వేలం పాటలకు తెరలేపాయి. తమ వద్ద బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ధర మరింత తగ్గితే వసూళ్లు తగ్గిపోతాయని భావించడమే వాకాడుకు చెందిన మహిళా రైతు పనబాక ముత్యాలమ్మ బంగారు సరుడు, నల్లపూసల దండను బ్యాంకులో పెట్టి రూ.72వేలు రుణం తీసుకుని 2013లో పంటను సాగు చేసింది. ప్రకృతి అనుకూలించకపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు. బంగారును వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. వేలం వేస్తున్నట్లు పేపరులో ప్రకటన కూడా ఇచ్చారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికవడ్డీకి అప్పు చేసి ఒక సంవత్సరం వడ్డీ మాత్రం కట్టగలిగింది. ఈ ఏడాది కూడా పకృతి కరుణించకపోవడంతో అప్పుల భారం పెరిగింది. బంగారుపై తీసుకున్న అప్పు, ఈ ఏడాది వడ్డీ మిగిలింది. అసలు, వడ్డీ చెల్లించాలని, లేకుంటే బంగారు వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తుండడంతో ఆ మహిళా రైతు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాపితంగా 35 బ్యాంకుల పరిధిలో సుమారు 400 బ్రాంచిలు నడుస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు ఉన్నాయి. అధిక వడ్డీ చెల్లించలేక రైతులు, ప్రజలు తమ అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం పొందడం పరిపాటి. ఇలా రుణాలు పొందే వారిలో అత్యధిక శాతం రైతులే ఉన్నారు. సాధారణంగా రుణం తీసుకుంటే 90 పైసలు ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉండగా రైతులు 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ అవసరాలకు రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. ఈ ప్రకారం అన్ని బ్యాంకుల్లో రైతులు పెద్ద మొత్తాల్లో రుణాలు పొందారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికార పీఠం అధిష్టించాక మాట మార్చిన బాబు చివరకు అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. అదికూడా ఐదు విడతలగా ఐదేళ్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక విడత రుణమాఫీ డబ్బు మాత్రమే అరకొరగా ఇవ్వడంతో ఆభరణాలు చాలా వరకు బ్యాంకుల్లో ఉండిపోయాయి. పరిస్థితిని బట్టి విడిపించుకోవచ్చనే యోచనలో చాలా మంది రైతులు ఉన్నారు. బంగారం ధర తగ్గుదలతో వేలం ప్రకటనలు సాధారణంగా బ్యాంకుల్లో గ్రాము ప్రకారం బంగారు నగలకు రుణం ఇస్తారు. బ్యాంకర్ల నిబంధనల ప్రకారం ఆభరణాలను బట్టి 75 శాతం వరకు రుణం ఇచ్చే పరిస్థితి ఉంది. బంగారు 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అనే విషయాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. గతంలో 10 గ్రాముల బంగారు ధర రూ.31 వేలు ఉండగా క్రమేణ తగ్గుతూ వస్తోంది. మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 23,420, 24 క్యారెట్ల ధర రూ.25,250గా నమోదైంది. పక్షం రోజులుగా రోజురోజుకు ధరలు తగ్గుతున్నాయి. మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో బ్యాంకర్లలో కూడా ఆందోళన మొదలైంది. గతంలో గ్రాము బంగారుకు రూ.2,100 వరకు రుణం ఇచ్చిన వారు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ.1600 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా గతంలో బంగారు నగలు ఉంచి రుణం తీసుకున్నవారి బంగారం రుణం ఇంచుమించు సరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు వస్తాయని భావించిన బ్యాంకర్లు వరుసగా వేలం పాటలు నిర్వహించేందుకు ప్రకటనలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది వరకు బ్యాంకులు కాలపరిమితి విధించి బంగారంపై రుణాలు ఇస్తాయి. గడువుదాటిన తరువాత వీటిని ఎప్పుడైనా వేలం వేసే అధికారం బ్యాంకులకు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేసి వేలం పాటకే మొగ్గు చూపుతున్నారు. లేకుంటే తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
బ్యాంకు అధికారులపై రైతుల ఆగ్రహం!
-
బ్యాంకు అధికారుల జబర్దస్త్..
అప్పు తీర్చలేదని ఇంటికి తాళం.. మరో ఇంట్లో సామగ్రిని తీసుకెళ్లిన వైనం దౌల్తాబాద్/దేవరకద్ర: రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ ఇంటికి తాళం వేయడంతోపాటు, మరోఇంట్లో సామగ్రిని బలవంతంగా తీసుకెళ్లారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ రెండు సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ కు చెందిన చాకలి సాయన్న, సొండె చిన్నసాయప్ప కొడంగల్ సహకార బ్యాంకులో 2012లో రుణం తీసుకున్నారు. సాయన్న రూ.53 వేలు,, సొండె చిన్నసాయప్ప రూ.61వేల అప్పు ఉన్నాడు. బకాయిలను చెల్లించాలని నాలుగేళ్లుగా నోటీసులు పంపుతన్నా స్పందించకపోవడంతో శనివారం బ్యాంకు అధికారులు వారి ఇంట్లో ఉన్న టీవీ, ఇతర సామగ్రిని తమ వాహనంలో తీసుకెళ్లారు. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన బైండ్ల రాములు, మల్లేశ్వరి దంపతులు 2011లో ఇంటి నిర్మాణం కోసం స్థానిక గ్రామీణ బ్యాంకులో రూ. 3 లక్షల రుణం తీసుకున్నారు. అయితే కేవలం 4 నెలల రుణం బకాయిలు చెల్లించినందున బ్యాంకు అధికారులు ఇంటిని సీజ్‌చేసి వెళ్లారు. -
సెంట్రల్ బ్యాంకులో చోరీ
కంచనపల్లి (రఘునాథపల్లి) : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులు సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఈ సంఘటన కంచనపల్లి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోవర్దనగిరికి చెందిన సంపతి మాధవరెడ్డి తన కూతురు అనిత పెళ్లి మే 1న కుదుర్చుకున్నాడు. పెళ్లి కోసం తండ్రి ధర్మారెడ్డి, తన పేరుపై పాలసీల పట్టాలపై రుణంకోసం జనగామ ఎల్ఐసీ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి, కొడుకులు కంచనపల్లి సెంట్రల్ బ్యాంకులో ఖాతాలు ఉండటంతో ఈ ఖాతా నంబర్లు అందించారు. రుణానికి సంబంధిం చిన డబ్బులు బ్యాంకులో జమ కాగా.. డ్రా చేసేందు కు తండ్రి ధర్మారెడ్డి, భార్య పద్మ, తల్లి లక్ష్మితో కలిసి సెంట్రల్ బ్యాంకుకు వెళ్లాడు. ధర్మారెడ్డి పేరున రూ44,750, మాధవరెడ్డి పేర రూ80,470 మొత్తం రూ1,25, 220 డ్రా చేసి కవర్లో ఉంచి తండ్రికి అప్పజెప్పాడు. భార్య పద్మ ఖాతాలో కొన్ని డబ్బులు ఉం డగా.. మాధవరెడ్డి విత్ డ్రా చేస్తుండగా ధర్మారెడ్డి బల్ల పై డబ్బుల కవర్ పెట్టి ఏమరు పాటుగా ఉన్న సమయంలో గుర్తు తెలియని 14 ఏళ్ల బాలుడు కవర్‌ను తీసుకొని పారిపోయాడు. తండ్రి వద్దకు కొడుకువచ్చి డబ్బులు ఏవనిఅడుగగా.. బిత్తర చూపులు చూస్తూ దొంగలించినట్లు గుర్తిం చిలబోదిబోమని మొత్తుకున్నారు.దీంతో తాము డ్రా చేసిన డబ్బులు అపహరిం చారని బ్యాంకు మేనేజర్ మనోజ్‌కు వివరించగా.. తాము ఏం చేసిది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ రూరల్ సీఐ వాసాల సతీష్, ఎస్సై సత్యనారాయణ బ్యాంకు వద్దకు చేరుకొని సీసీ కెమెరాల పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బయట ఇద్దరు దుండగులు 14 ఏళ్ల బాలుడితో చర్చించి బ్యాంకులోకి పంపి డబ్బులు అపహరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అపహరించిన డబ్బులతో బాలుడు బయటకు వెళ్లాక దుండగులను కలిసినట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. బ్యాంకు ముందు కొద్ది దూరంలో ఉన్న ఓ వాహనంలో పారిపోవడం సీసీ కెమెరాలో దృశ్యాలు బంధించి ఉన్నారుు. అయితే దుండగుల ముఖాలు సీసీ కెమెరాల్లో గుర్తించకపోవడం సాధ్యం కాకపోవడంతో సీసీ దృశ్యాలను పోలీసులు తమ వె ంట తీసుకెళ్లారు. భద్రతలో నిర్లక్ష్యం బ్యాంకు అధికారులు ఎలాంటి సెక్యూరిటీని నియమించకపోవడంతో దుండగులకు బ్యాంకు లో చోరీ సులభమైంది.చోరీలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను బట్టి తెలుస్తోంది. వారిని ఎలాగైనా పట్టుకుంటామని ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. -
ప్రత్తిపాటికి శనగ సెగ!
పంటకు మద్దతు ధర కోసం ఏపీలో అన్నదాతల కన్నెర్ర మంత్రి నివాసం ముట్టడి చిలకలూరిపేట: ‘ఆదుకుంటామంటూ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక మా సమస్యలు పట్టించుకోవటం లేదు. బ్యాంకు అధికారులు శనగలను వేలం వేస్తామంటున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ ఏపీలో శనగ రైతులు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం చిలకలూరిపేటలోని మంత్రి ఇంటిని ముట్టడించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.3,100 మద్దతు ధర లభిస్తోందని, ఈ ధరకు అమ్మితే రైతులు దివాళా తీస్తారని ఆక్రోశించారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక ప్రకాశం జిల్లాలోనే 17 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. బ్యాంకులు ఈనెల 24నుంచి వీటిని వేలం వేయటానికి సిద్ధమైనట్లు చెప్పారు. రైతువద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వేలం వేయటాన్ని నిలుపుదల చేయాలని డిమాం డ్ చేశారు. దీనిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. 25న రాస్తారోకోలు... మంత్రి హామీతో సంతృప్తి చెందని రైతులు శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25 తేదీన గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని శనగ రైతులు కార్యాచరణను రూపొందించారు. -
రుణమాఫీపై నోరు మెదపరేం
గణపవరం : ‘అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకులకు ఒక్క పైసా కూడా కట్టొద్దన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక దీనిపై నోరు మెదపడం లేదు’ అంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా శాఖ అధ్యక్షురాలు ఎ.అజయకుమారి ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయూలంటూ గణపవరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు బుధవారం ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా అజయకుమారి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని నాలుగు మాసాలుగా డ్వాక్రా రుణాలకు సంబంధించి వాయిదాలను మహిళలు ఎవరూ చెల్లించలేదన్నారు. దీంతో అప్పులు పేరుకుపోయూయని, ఆ మొత్తాలను వెంటనే కట్టాలంటూ బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఆమె వాపోయూరు. దీనివల్ల మహిళలు కంటిమీద కునుకులేకుండా ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయూలంటూ తహసిల్దార్ షేక్ ఇస్మాయిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు గారపాటి విమల, చెరుకువాడ గంగ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం నాయకుడు కవల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పంట రుణాలు రూ.3,811 కోట్లు
లెక్కతేల్చిన బ్యాంకులు రైతు రుణాలు.. రూ. 2,314.91 కోట్లు కాలపరిమితి రుణాలు..రూ. 1,496.78 కోట్లు లబ్ధి పొందనున్న రైతులు 95,455 మంది రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు పంటరుణాల లెక్క తేలింది. మొత్తం పంట రుణాలు రూ.3,811 కోట్లు ఉందని లీడ్ బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక రుణ మాఫీ ద్వారా జిల్లాలో 95,455 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతులు తీసుకున్న రుణాల్లో లక్షలోపు రుణమొత్తాన్ని మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో యంత్రాంగం.. సుధీర్ఘ మదింపు తర్వాత రుణాల లెక్కలు తేల్చింది. ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. రుణ మాఫీకి సంబంధించి జిల్లాలవారీగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆనా టి నుంచి బ్యాంకర్లు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బ్యాంకు అధికారులు రుణాల లెక్కలు సమర్పించినప్పటికీ.. జిల్లాలో మాత్రం లెక్కల్లో స్పష్టత రావడానికి చాలా సమయమే పట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి 95,455 మంది రైతులు వివిధ కేటగిరీల కింద రూ.3811.69కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 77,387 మంది రైతులు పంట ఉత్పత్తులకోసం రూ.2314.91 కోట్లు ణంగా తీసుకున్నారు. అదేవిధంగా కాలపరిమితి కేటగిరీలో 18,068 మంది రైతులు రూ.1,496.78 కోట్లు రుణంగా తీసుకున్నారు. మాఫీ రూ.లక్షలోపే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతు తీసుకున్న పంట రుణంపై గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనుంది. అయితే బ్యాంకర్లు తయారుచేసిన జాబితా ప్రకారం అన్ని రకాల రుణాలను పేర్కొంటూ నివేదిక రూపొందించారు.ఇందులో కనిష్టం, గరి ష్టం అంటూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. సగటు రూ.లక్షలోపు రుణం పొందిన రైతులందరికీ పూర్తిగా మాఫీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి గరిష్ట మాఫీ వర్తించనుంది. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఏ మేరకు లబ్ధి చేకూరనుందనే అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం రైతు రుణాలను పంట రుణాలు, కాలపరిమిత రుణాలుగా విభజించారు. అయితే బంగారంపై తీసుకున్న ఇతర రుణాలను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. జిల్లాలోని బ్యాంకుల పరిధిలో అన్ని రకాల రుణాలు కలుపుకుంటే రూ.13,199.98 కోట్లుగా ఉన్నాయి. -
రైతు మెడపై కత్తి !
ఖరీఫ్ ముంచుకొస్తోంది.. పంట వేసుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక..అప్పు పుట్టే దారి తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న మెడపై బకాయిల కత్తి వేలాడుతోంది. అధికారంలోకొస్తే పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా గద్దెనెక్కాక హామీల అమలుకు కాలయాపన చేస్తున్నారు. రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసి రైతన్నకు మొండిచేయి చూపారు. మాఫీ సంగతి దేవుడెరుగు గడువు మీరిన బకాయిలు కట్టి తీరాల్సిందేనని బ్యాంక ర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. చీమకుర్తి: ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని కమిటీ వేసి ఉంటే దాని రిపోర్ట్ రాకముందే బ్యాంకు అధికారులు గడువు మీరిన బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చీమకుర్తి ఆంధ్రాబ్యాంకు పరిధిలో వ్యవసాయ ఆధారంగా అన్ని రకాల రుణాలు తీసుకున్న రైతులు 2,823 మంది ఉండగా..వారంతా రూ.29 కోట్ల బకాయిలున్నారు. ఈనెల 12న రూ.80 లక్షల విలువైన బకాయిలు చెల్లించాలని 119 మంది రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పంట రుణాలకు చెందిన రైతులు 63 మంది, సీసీఏటీఎల్ రుణాలున్న రైతులు 33 మంది, వ్యవసాయ ట్రాక్టర్ రుణాలు తీసుకున్న వారు పది మంది, వ్యవసాయ బంగారం రుణాలున్న వారు 40 మంది రైతులున్నట్లు తెలిసింది. ఆ నోటీసులు శనివారం కొంత మంది రైతులకు, సోమవారం మరికొంత మందికి చేరాయి. రుణమాఫీ చేయబోతున్న తరుణంలో నోటీసులిచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని బ్యాంకు అధికారులను ఁసాక్షి* ప్రశ్నించగా గడువు మీరిన రుణాలు చెల్లించాలని బ్యాంకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశామని చెప్పారు. రుణమాఫీ కాకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్న కారణంగానే బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారని రైతులు వాపోతున్నారు. -
బ్యాంక్ ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న తమకు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారీ నిరాశ ఎదురైందని కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోయారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ గురువారం వారు రాజమండ్రి లోని ఇన్నీసుపేట స్టేట్‌బ్యాంక్ శాఖ ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 38 ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆరు నెలలుగా జీతాలు అందడంలేదు. దీంతో వారు పలు ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక నెల జీతాలను ప్రభుత్వం బ్యాంక్ డీడీల రూపంలో విడుదల చేశారు. ఈ సొమ్ము తీసుకునేందుకు డీడీలతో ఇన్నీసుపేట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇన్నీసుపేట బ్రాంచ్)కు వెళ్లిన 47 మంది కాంట్రాక్ట్ లెక్చర ర్లకు చుక్కెదురైంది. ఈ డీడీలు తప్పులతో జారీ అయ్యాయని, ఇవి చెల్లవని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. ఆరు నెలలుగా అప్పులతో బతుకీడుస్తున్న తాము ఒక్కనెల జీతమైనా వస్తుందని ఆశతో వస్తే తప్పుడు డీడీలతో మోసం చేశారని కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గోకవరం కళాశాలకు సంబంధించిన డీడీని కోరుకొండ అడ్రస్‌తో, కాకినాడ కళాశాల డీడీని సామర్లకోట అడ్రస్‌తో ఇచ్చారని వాపోయారు. జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రాజాచౌదరి, ఇతర జిల్లా యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బ్యాంక్ సిబ్బందిని లెక్చరర్లు నిలదీశారు. 47 డీడీల లోని తప్పులను సవరించి మళ్లీ జారీ చేస్తామని బ్యాంకు సిబ్బంది సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.