బ్యాంకు ఉద్యోగులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత నోట్లను డిపాజిట్ చేసే సందర్భాల్లో బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి చర్యలు నిలువరించాలని కరెన్సీ మేనేజ్ మెంట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.