fraudulent practices
-
నమ్మి పార్టీకీ వెళ్లావా.. టోపీ ఖాయం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రధానంగా మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటారు. పరిచయస్తుల ద్వారా ఎర వేస్తారు..ఖరీదైన హోటళ్లు, రిసార్ట్‌ల్లో పార్టీలు ఇస్తారు..ఇలా తమ డాబు ప్రదర్శించి, అధిక వడ్డీ ఆశ చూపి అందినకాడికి వసూలు చేస్తారు.. ఒకటి–రెండు నెలలు లాభమంటూ కొంత మొత్తం ఇచ్చి ఆపై చేతులెత్తేస్తారు..ఈ పంథాలో ఏడాదికి కాలంలో రూ.13 కోట్ల వసూలు చేసిన భార్యాభర్తల్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన భార్యాభర్తలు పీత పద్మజ అలియాస్ పద్మిని, వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డారు. గతంలో సైబరాబాద్ పరిధిలోని కార్యకలాపాలు సాగించిన స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పని చేశారు. ఈ సంస్థపై ఇటీవలే మాదాపూర్ పోలీసులు రూ.156 కోట్ల స్కామ్‌కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే ఆ సంస్థలో మానేసిన భార్యాభర్తలు శ్రీనగర్‌కాలనీలో రణధీర ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో కార్యాలయం తెరిచారు. దీని ముసుగులో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నారు. (చదవండి: కరోనాలోను రియల్ ఎస్టేట్ దూకుడు: సర్వే) తాము సినిమాలకు, ప్రాజెక్టులకు ఫైనాన్స్ ఇస్తూ ఉంటామని ఎర వేశారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 5 నుంచి 10 శాతం వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికారు. ఆసక్తి చూపిన వారికి ఖరీదైన పార్టీలు ఇచ్చి మరింత ఆకర్షించేవాళ్లు. ఇలా డిపాజిట్ చేసిన వారికి ఒకటి–రెండు నెలలు సక్రమంగానే వడ్డీ చెల్లించే వారు. ఆ తర్వాత చేతులు ఎత్తేసి మోసం చేసేవాళ్లు. ఒకరి ద్వారా మరొకరిని పరిచయం చేసుకుంటూ తమ దందా కొనసాగించారు. చివరకు లాక్డౌన్ టైమ్‌లోనూ వీరి ‘వ్యాపారం’ ఆగలేదు. ఇలా గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు రూ.13 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసి మోసం చేశారు. వీరి చేతిలో దాదాపు 20 మంది మోసపోయారు. బాధితుల్లో ఒకరైన సోమాజిగూడకు చెందిన బి.విజయలక్ష్మి ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు శుక్రవారం భార్యభర్తల్ని అరెస్టు చేసింది. (చదవండి: రూ.156 కోట్ల ‘రియల్’ మోసం) -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు..
-
బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ కన్నెర్ర
-
బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ కన్నెర్ర
ముంబయి: బ్యాంకు ఉద్యోగులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత నోట్లను డిపాజిట్ చేసే సందర్భాల్లో బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి చర్యలు నిలువరించాలని కరెన్సీ మేనేజ్ మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని బ్యాంకుల్లో కొంతమంది బ్యాంకు అధికారులు కొంతమంది అపరాధులతో చేయి కలిపి డబ్బు మార్పిడి చేసే విషయంలో, డిపాజిట్ చేసే సమయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే బ్యాంకు అధికారులు అలాంటి పనులు ఆపివేయాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నగదు మార్పిడి, డిపాజిట్లలో బ్యాంకులకు జారీచేసిన సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే బ్యాంకులు సరియైన రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. కింద పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఆర్బీఐ బ్యాంకులకు తాజాగా జారీచేసిన సూచనలు.. 1. నవంబర్9 నుంచి ప్రతి ఖాతాలో డిపాజిట్ అయిన పాత, కొత్త నోట్ల సమాచారం, ఎస్బీఎన్(పెద్ద నోట్లు) కాని ఖాతాదారుడి డిపాజిట్ల సగటు విలువ లేదా రుణ కస్టమర్ అకౌంట్ వివరాలు నమోదుచేయాలి. 2. పాతనోట్ల మార్పిడికి బ్యాంకుకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు, ఇతర వ్యక్తుల వివరాల రికార్డులను బ్యాంకులు శాఖలు నిర్వహించాలి.