బ్యాంకు ఉద్యోగులపై ఆర్బీఐ కన్నెర్ర
కొన్ని ప్రాంతాల్లో, కొన్ని బ్యాంకుల్లో కొంతమంది బ్యాంకు అధికారులు కొంతమంది అపరాధులతో చేయి కలిపి డబ్బు మార్పిడి చేసే విషయంలో, డిపాజిట్ చేసే సమయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే బ్యాంకు అధికారులు అలాంటి పనులు ఆపివేయాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నగదు మార్పిడి, డిపాజిట్లలో బ్యాంకులకు జారీచేసిన సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే బ్యాంకులు సరియైన రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. కింద పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన బ్యాంకులకు సూచించారు.
2. పాతనోట్ల మార్పిడికి బ్యాంకుకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు, ఇతర వ్యక్తుల వివరాల రికార్డులను బ్యాంకులు శాఖలు నిర్వహించాలి.