నగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్‌లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి.
సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. 2022 ఆర్ధిక సంవత్సరంలో 89 శాతం లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది జీడీపీలో 12 శాతం. ఉచిత ఏటీఎం లావాదేవీలపై ఆర్‌బీఐ నిబంధనలు, ఇంటర్ ఆపరేబిలిటీ, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు వంటి అంశాలు ఏటీఎం పెట్టుబడులను నిరుత్సాహపరిచాయి. దీనితో పాటు ఏటీఎంలను వినియోగించేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.
బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నందున.. భారతదేశం ఒక్కో శాఖకు రెండు ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఆన్-సైట్, మరొకటి ఆఫ్-సైట్ మోడల్ ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment