ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’! | All cash less in this Village | Sakshi
Sakshi News home page

ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’!

Published Sun, Dec 4 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’!

ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’!

దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మహారాష్ట్రలోని ధసై
- చిన్నా పెద్దా అన్ని దుకాణాల్లోనూ స్వైపింగ్ యంత్రాలు
- వడాపావ్ తిన్నా కూడా డెబిట్/క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించొచ్చు
- కొద్ది రోజులుగా గ్రామంలోనే మకాం వేసి కరెంట్ ఖాతాలు,
- స్వైపింగ్ యంత్రాలు అందజేస్తున్న బ్యాంకు అధికారులు
- వ్యాపారులకు ఓ స్వచ్ఛంద సంస్థ, పంచాయతీ సహకారం
- ప్రత్యేక కార్యక్రమాలతో జనానికి అవగాహన కల్పిస్తున్న వైనం
 
 సాక్షి, ముంబై: అది మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాడ్ తాలూకా ధసై గ్రామం.. ఈ ఊళ్లో ఏది కొనాలన్నా డబ్బులు అవసరం లేదు.. టిఫిన్ చేయాలన్నా, వడాపావ్ తినాలన్నా సరే.. జస్ట్ క్రెడిట్ కార్డో, డెబిట్‌కార్డో ఉంటే చాలు.. ఎంత తక్కువ మొత్తమైనా సరే కార్డు స్వైప్ చేసి చెల్లించేయొచ్చు. నోట్ల రద్దుతో దేశమంతా విభిన్నమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ ‘క్యాష్ లెస్’ గ్రామం ఒక్కసారిగా చర్చల్లోకెక్కింది. దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత గ్రామంగా నిలిచింది. ధసై గ్రామంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇటీవల స్వైపింగ్ యంత్రాల సేవలు ప్రారంభించి.. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మారిందని ప్రకటించా రు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆ గ్రామంలో పర్యటించి.. ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను, నగదు రహిత సేవల వివరాలను తెలుసుకుంది.

10 వేల జనాభాతో..
మహారాష్ట్ర రాజధాని ముంబైకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధసై గ్రామ జనాభా సుమారు 10 వేలు. ఈ గ్రామం చుట్టూ మరో 40 గిరిజన, ఆదివాసీ పల్లెలు కూడా ఉన్నారుు. వారంతా కూడా నిత్యావసరాలు, ఇతర సామగ్రి కోసం ధసైకే వస్తుంటారు. ఇక్కడ చిన్నాపెద్దా కలిపి సుమారు 150కి పైగా దుకాణాలు ఉన్నారుు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి కూరగాయలు, మెడికల్, స్టేషనరీ, మాంసం దుకాణాలు తదితర వ్యాపారులంతా కలసి ‘ధసై గ్రామ వ్యాపారీ సంఘటన’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులోని సభ్యులందరూ ధసై గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరికి సావర్కర్ స్మారక్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.

ప్రతి దుకాణంలోనూ..
గ్రామంలోని ప్రతి దుకాణంలోనూ స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 37 దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలను వినియోగిస్తుండగా.. మిగతా వారంతా మెషీన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ బ్యాంకు అధికారులు స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో 10 రూపాయల తినుబండారాలు, సామగ్రి కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు కలుగనుంది. ఇలా నగదు రహిత కొనుగోళ్లకు ధసై గ్రామ ప్రజలు కూడా పూర్తి సానుకూలంగా ఉండడం గమనార్హం. అరుుతే ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహన కల్పించేందుకు సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థతోపాటు గ్రామ పంచాయతీ, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
చిల్లర సమస్య తప్పింది..
‘ధసై గ్రామంలో చాలా ఏళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాం. స్వైపింగ్ యంత్రంతో అమ్మకాలు మరింత సులభమయ్యారుు. ముఖ్యంగా చిల్లర సమస్య తప్పింది. ప్రస్తుతం నా వద్దకు వచ్చేవాళ్లలో సగానికిపైగా కార్డులతోనే చెల్లిస్తున్నారు..’’
 - సల్మాన్ యూసుఫ్ సయ్యద్
 
ఇక నుంచి మేమూ వాడతాం..
‘‘కిరాణా సమానులు కొనుక్కునేందుకు ధసైకి వచ్చాను. స్వైపింగ్ యంత్రం గురించి షాపు యజమాని చెబితే ఇప్పుడే తెలుసుకున్నా. మా వద్ద డెబిట్ కార్డు ఉన్నా ఎప్పుడూ వాడలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. ఇక నుంచి మేం కూడా కార్డు వాడేందుకు ప్రయత్నిస్తాం.’’
 - మాధురి (ధసై శివారు పల్లెకు చెందిన మహిళ)
 
వడాపావ్ బండి వద్దా స్వైపింగ్ మెషీన్
మన వద్ద కట్లీస్/కచోరీ బండ్లలాగానే మహారాష్ట్రలో ఎక్కడ చూసినా వడాపావ్ బండ్లు కనిపిస్తుంటారుు. ఇలా ధసై గ్రామంలోని ప్రధాన కూడలిలో తోపుడు బండిపై వడాపావ్ అమ్మే విజయ్ సురోషరుు.. తన బండి వద్ద స్వైపింగ్ యంత్రం ఏర్పాటు చేసుకున్నారు. రూ.7 విలువ చేసే ఈ వడాపావ్ తిన్నవారి నుంచి కూడా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని విజయ్ చెప్పారు. ‘‘ధసైను నగదు రహిత గ్రామంగా మార్చేందుకు నా వంతు సహకారం అందించేందుకే స్వైపింగ్ యంత్రం పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చేవారు దానిని చూసి కొంత ఆశ్చర్యపోరుునా.. తర్వాత కార్డుల ద్వారానే చెల్లిస్తున్నారు. దీంతో నాకు పెద్ద ఎత్తునప్రచారం కూడా లభించింది. రోజూ సుమారు 100 మంది డెబిట్/క్రెడిట్ కార్డులతో చెల్లిస్తున్నారు.’’ అని వివరించారు.
 
అందరూ ఆసక్తి చూపుతున్నారు
‘‘స్వైపింగ్ యం త్రాలు అమర్చుకోవడంపై గ్రామంలోని వ్యాపారులంతా ఆ సక్తి కనబరుస్తున్నారు. చిన్నా చిత కా దుకాణాలన్నింటికీ గ్రామ పంచాయతీ నుంచి వ్యాపార ధ్రువపత్రం ఇప్పిస్తున్నాం. దానిద్వారా బ్యాంకులో కరెంట్ ఖాతా, స్వైపింగ్ యంత్రం అందించే ఏర్పాట్లు చేశాం. ధసైకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరల్‌గావ్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు, పంచాయతీ అధికారులు సహకరిస్తున్నారు..’’
 - స్వప్నిల్ పాత్కర్, ధసై వ్యాపారీ సంఘటన అధ్యక్షుడు
 
అవగాహన కల్పిస్తున్నాం..
‘‘ధసై నగదు రహిత గ్రామంగా మారనున్నందుకు సంతోషంగా ఉంది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ధసైతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్వైపింగ్ యంత్రాలు, కార్డుల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా విద్యార్థులను జాగృతం చేస్తున్నాం...’’
 - విక్రమ్ సావర్కర్, సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
 
 గ్రామంలోనే మకాం వేసి మెషీన్లు ఇస్తున్నాం
 ‘‘కరెంట్ ఖాతాలు తెరవడం, స్వైపింగ్ యంత్రాలు అందించడం, అమర్చడం కోసం కొద్ది రోజులుగా ధసై గ్రామంలోనే మకాం వేశాం. కావల్సిన కొన్ని పత్రాల విషయంగా ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ధసైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 స్వైపింగ్ యంత్రాలను అమర్చాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్నాం..’’
 - శీలం నాగవరప్రసాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement