సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులే ఉన్నాయని, ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు లేదని చెప్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్య ప్రజల కష్టాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసి మురిసిపోయిన మోడీ నేడు ముఖం చాటేయడం దారుణమన్నారు. నగదు లావాదేవీలను పెంచడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ డిమాండ్ చేస్తుందని బుధవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment