డ్వాక్రా రుణం చెల్లించలేదని ఇంటికి తాళం!
బ్యాంకు అధికారుల తీరు
వెంకటాపురం: జయశంకర్ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరంలో డ్వాక్రా రుణాలు రికవరీ చేయడానికి బ్యాంకు, సెర్ప్ అధికారులు శుక్రవారం పర్యటించారు. గ్రూపు సభ్యుల ఇళ్లకు వెళ్లి రుణా లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నాం కొంత సమ యం కావాలని వారు కోరగా.. అలా కుదరదంటూ నిర్మల, కళావతి ఇళ్లకు తాళాలు వేశారు.
బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహించిన మహిళలు వీర భద్రవరం ప్రధాన రహదారిపై బైఠా యించి, రాస్తారోకో నిర్వహించారు. నాలుగైదేళ్లుగా పంటలు సరిగా పండ క ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు కట్టలేక పోయామని మహిళలు అన్నారు. నెలరోజులు గడువిస్తే చెల్లి స్తామన్నారు. దీంతో బ్యాంకు అధికా రులు వారికి కొంత సమయం ఇవ్వ డంతో ఆందోళన విరమించారు.