Serp officials
-
ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి: ఠంఛన్‌గా సెప్టెంబర్ ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 52,70,915 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు రూ.1,451.41 కోట్ల పింఛన్ డబ్బులు అందాయి. ఈ నెల 1 నుంచి మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం గురువారమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఇందులో 1,49,875 మందికి ఈ నెలలోనే ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు... లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మొత్తం పింఛన్‌దారుల్లో 82.30 శాతం మందికి తొలిరోజే డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. -
Fact Check: పింఛన్ల పైనా ‘పిచ్చి’ ఏడుపు.. లెక్కలు కనిపించడం లేదా బాబూ!
బాబుగారి ఘనకార్యం 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రాష్ట్రంలో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య: 43.11 లక్షలు. 2018 ఫిబ్రవరి నెలలో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 44.44 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో కేవలం 39.38 లక్షల మందికి రూ. 447.26 కోట్లను మాత్రమే పంపిణీ చేసింది. 2019 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి కేవలం నెల ముందు 2019 జనవరిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛన్ల మొత్తం రూ. 514 కోట్లు మాత్రమే. సీఎం జగన్ ఘనత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఏడాది లోపే రాష్ట్రంలో పింఛన్‌దారుల సంఖ్య ఏకంగా 61 లక్షలకు పైగా పెరిగిపోయింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రతి నెలా 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తోంది. ఈ నెలలో 62.69 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో 62.02 లక్షల మందికి రూ.1,577.07 కోట్లు పంపిణీ చేసింది. కొత్తగా మరో 2,31,989 మందికి పింఛన్లు మంజూరు చేసింది. వీరిలో 83 వేల మందికి పైగా వృద్ధులు, 75 వేల మంది వితంతువులు, 37 వేల మందికి పైగా దివ్యాంగులు, 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో పాటు మరికొన్ని కేటగిరీల్లో మరికొందరు ఉన్నారు. వీటితో కలిపి జనవరి ఒకటో తేదీ నుంచి పింఛన్లు అందుకొనే వారి సంఖ్య ఏకంగా 64,45,226కు పెరిగిపోయింది. ఈ పింఛన్లకు ప్రభుత్వం చేసే నెలవారీ ఖర్చు రూ. 1,775.85 కోట్లు. ఇది వారి ఏడుపు అయినా తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీ, వాటికి మద్దతిచ్చే కొన్ని పత్రికలు ప్రభుత్వం పింఛన్లు రద్దు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అందులోనూ కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పుడల్లా వాటి ఏడుపు మరింత తీవ్రంగా ఉంటుంది. చంద్రబాబు సీఎం కావాలన్న ‘పిచ్చే’ వారి ఏడుపుకు కారణం. –సాక్షి, అమరావతి జగన్ ప్రభుత్వం రికార్డు జగన్ సీఎం అయిన నాటి నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే సామాజిక పింఛన్లు రికార్డు స్థాయికి పెరిగాయి. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది. తాజాగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ మూడున్నరేళ్లలో మొత్తం 22.31 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక వృద్ధాప్య పింఛన్లకు కనీస వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. తద్వారా కొత్తగా అర్హత సాధించిన వారితో కలిపి 2020 జనవరి నెలలో ఒకేసారి 6.12 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ మరుసటి నెలలో మరో 1.31 లక్షల మందికి, 2020 జూన్‌లో మరో విడత 1.16 లక్షలు, 2020 జూలైలో ఇంకొకసారి 2.42 లక్షల మంది, 2021 సెప్టెంబరులో మరొకసారి 2.20 లక్షల మంది.. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది. పింఛనుదారుల్లో ఎక్కువ మంది వృద్ధులే కావడం వల్ల మరణాలూ ఉంటాయి. గత 8, 10 సంవత్సరాల సరాసరి చూసినా మరణాల కారణంగా ప్రతి నెలా పింఛనుదారుల సంఖ్య తగ్గుతుంది. మరోపక్క అర్హత లేని వాళ్లు పింఛన్లు పొందుతున్నారా అన్న దానిపైన కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆరు నెలలకు సోషల్ ఆడిట్ చేపడుతోంది. ఏన్నో ఏళ్లుగా ఉన్న నిబంధనల ప్రకారమే.. అనర్హులుగా గుర్తించిన వారికి నేరుగా పింఛన్లు రద్దు చేయకుండా, నోటీసు ఇస్తోంది. వారి అర్హతను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 64 లక్షల మంది లబ్ధిదారుల్లో అతి కొద్ది మంది అనర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకొనేందుకు అధికారులు చేపట్టే చర్యలను, మరణాలను సాకుగా చూపి ప్రభుత్వం లక్షల సంఖ్యలో పింఛన్లను రద్దు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. -
97.86% పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. మొత్తంమ్మీద గత నాలుగు రోజులుగా 60,98,340 మంది లబ్ధిదారులకు రూ.1,550.59 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 97.86 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని సెర్ప్ అధికారులు ఆదివారం తెలిపారు. మిగతా వారి కోసం సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
స్కూళ్లలో బాలలపై లైంగిక వేధింపులకు చెక్
సాక్షి అమరావతి: సుప్రీంకోర్టు, హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదేశాల మేరకు సూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పోస్టర్లు, ఫిర్యాదు పెట్టెలు ఉంచాలని తెలిపింది. విద్యార్థులందరికీ కనిపించేలా పోస్టర్లు ఉంచాలని, తగిన పరిమాణంలో తగిన మెటీరియల్‌తో కూడిన ఫిర్యాదు పెట్టె హెడ్మాస్టర్ గది వెలుపల ఉంచాలని సూచించింది. ఫిర్యాదులను ఈ పెట్టెలో వేయవచ్చు. ఇతర ప్రధాన సూచనలు పోస్టర్లలో ఏకరూపత ఉండాలి. పోస్టర్ల ముద్రణ, ఫిర్యాదు పెట్టె కోసం పాఠశాల నిర్వహణ గ్రాంట్ నుండి నిధులు తీసుకోవచ్చు. తాళం ఉండే ఏదైనా చిన్న పెట్టెను ఫిర్యాదు పెట్టెగా ఉపయోగించవచ్చు మండల విద్యాధికారి, ఇతర విభాగాల అధికారుల సమక్షంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్, ఏఎన్ఎం 15 రోజులకు ఒకసారి ఫిర్యాదు పెట్టెను తెరిచి, అందులో ఉన్న ఫిర్యాదులను చదవాలి ఫిర్యాదుపై అవసరమైన చర్యలకు వారు సంబంధిత శాఖకు తెలపాలి ఏ విధంగానూ, ఏ సమయంలోనూ ఫిర్యాదుదారు వివరాలను బహిర్గతం చేయకూడదు. అత్యంత గోప్యంగా ఉంచాలి. ఎంఈవోలు డీఈవోలకు రెగ్యులర్ రిపోర్టును పంపాలి డీఈవో ప్రతి నెలా 1, 15 తేదీల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కి నివేదిక పంపాలి (చదవండి: ‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ) -
61.03 లక్షల మందికి రూ.1,551 కోట్లు పింఛన్లు పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.1,551.70 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. బుధవారం సాయంత్రం వరకు 61,03,930 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని.. సోమ, మంగళ, బుధవారాల్లో కలిపి ఇప్పటిదాకా 97.20 శాతం మందికి పంపిణీ చేసినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం మరో రెండు రోజుల పాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వలంటీర్లు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా.. పొదలకూరు/ఒంగోలు సబర్బన్: సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రభుత్వం కులం, మతం, రాజకీయం చూడదని సీఎం వైఎస్ జగన్ ప్రకటన పదే పదే వందల వేల ఘటనల్లో నిరూపితమవుతూనే ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు సమీపంలోని మర్రిపల్లికి చెందిన వెంపులూరు పుల్లయ్యగౌడ్(80) పాతికేళ్లు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మండలపార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కార్యవర్గసభ్యునిగా పనిచేశారు. వృద్ధాప్య కారణాల రీత్యా ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఆయన సతీమణి రమణమ్మ(75) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు. గ్రామ వైఎస్సార్సీపీ నేతలు వారి ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వృద్ధాప్య పింఛన్‌ను డయాలసిస్ పింఛన్‌గా మార్పించారు. బుధవారం ఆమెకు రూ.10 వేలు అందజేశారు. అలాగే, టీడీపీ మహిళా నేతకు వితంతు పింఛన్ అందించిన ఘటన ఒంగోలులో జరిగింది. ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 31వ డివిజన్లో టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వల్లెపు తిరుపతమ్మకు ఆమెపై పోటీచేసి విజయం సాధించిన వైఎస్సార్సీపీకి చెందిన నాగజ్యోతి నాగేశ్వరరావు పింఛన్ అర్హత కార్డుతో పాటు రూ.2,500 పింఛన్‌ను అందజేశారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతనంగా పింఛన్లు పొందిన వారికి నగదు అందజేశారు. -
1వ తేదీనే రూ.1,335.78 కోట్ల పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారులకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 52,61,143 మందికి రూ. 1,335.78 కోట్లను అందజేశారు. మొదటిరోజే 86.92% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో మరో నాలుగు రోజులు పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా తారువలో వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ కడప రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు పింఛను అందజేశారు వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన వలంటీరు గాయత్రి. కడప నగరంలోని ఎస్ఎఫ్సీ స్ట్రీట్‌కు చెందిన శ్రీదేవి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు గాయత్రి ఆస్పత్రికి వెళ్లి శ్రీదేవికి పింఛను అందజేశారు. దీంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన శ్రీదేవి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుయాలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి.. చంద్రగిరి: చంద్రగిరి మండలం ఐతేపల్లికి చెందిన వృద్ధుడు నాగయ్య అనారోగ్యంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ ఫాజిలా, వలంటీర్ స్వర్ణ రుయా ఆస్పత్రికి వెళ్లి నాగయ్యకు పింఛను డబ్బు అందజేశారు. -
96.11 శాతం మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 60.75 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 58,39,005 మందికి రూ.1484.77 కోట్లు పంపిణీ చేశారు. 96.11% మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు.. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
96.35 శాతం మందికి అందిన పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండురోజుల్లో ప్రభుత్వం 96.35% మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పూర్తిచేసింది. 58,65,578 మందికి వలంటీర్లు రూ.1,490.58 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలకు మొత్తం 60,87,942 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,547.17 కోట్లు విడుదలకాగా.. ఆదివారమే 53.26 లక్షల మందికి పంపిణీ పూర్తిచేసిన విషయం తెలిసిందే. మరో మూడురోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి డబ్బులు పంపిణీచేసే కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. రాయచూర్ వెళ్లి పింఛను పంపిణీ ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బృందావనం తండాకు చెందిన వలంటీర్ రామావత్ రమేష్‌నాయక్ తన క్లస్టర్ పరిధిలోని ఇద్దరు పెన్షన్‌దారులకు సోమవారం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వెళ్లి పెన్షన్ అందించారు. బృందావనం తండాకు చెందిన బాణావత్ ప్రసాద్‌నాయక్, పాత్లావత్ ఠాగూర్‌నాయక్ పట్టాలు అద్దెకు ఇచ్చి జీవనం సాగించేందుకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు వెళ్లారు. దీంతో 2నెలల నుంచి వారికి వస్తున్న వృద్ధాప్య పింఛన్ తీసుకోలేకపోయారు. వృద్ధాప్యం కారణంగా వారు రాలేకపోయారన్న విషయం తెలుసుకున్న వలంటీర్ రమేష్‌నాయక్ రాయచూర్ వెళ్లి పింఛన్ అందజేశారు. -
మండుటెండలోనూ ఠంచనుగా పింఛను
సాక్షి, అమరావతి: మండుటెండలు.. మేడే.. ఆదివారం సెలవు.. అయినా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 53,26,151 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. తొలిరోజునే రూ.1353.14 కోట్లు లబ్ధిదారులకు అందాయి. మొత్తం 60,87,942 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ నెల పింఛన్లు మంజూరు చేయగా.. అందులో 87.49 శాతం మందికి ఆదివారమే పంపిణీ పూర్తయినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఒంగోలులో దివ్యాంగుడు వెంకట తరుణ్‌కు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ వెంకట రమణ -
52.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు బుధవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 52,68,975 మందికి రూ.1,339.71 కోట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో 86.04 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మరో మూడురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. కేజీహెచ్‌లో అందజేత విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు విజయానంద్ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. గ్రామ వలంటీరు గొంప ఉమా కేజీహెచ్‌కు వెళ్లి విజయానంద్‌కు పింఛన్ సొమ్ము అందజేశారు. – విజయనగరం ఆస్పత్రికి వెళ్లి.. పింఛను అందించి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటకు చెందిన గోవిందయ్య అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న వార్డు వలంటీర్ సాయిచరణ్ తన సొంత ఖర్చులతో బుధవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గోవిందయ్యకు పింఛన్ నగదు అందజేశారు. – వెంకటగిరి చికిత్స పొందుతున్న వ్యక్తికి.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం రామచంద్రాపురం పంచాయతీ పొన్నాంపేట గ్రామానికి చెందిన చల్లా రామారావు అనారోగ్యంతో శ్రీకాకుళం జెమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ కోటేశ్వరమ్మ బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. – ఆమదాలవలస రూరల్ -
పండుగైనా, సెలవైనా పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: ఈ నెల మొదటి తేదీ మహాశివరాత్రి పర్వదినం. అదీగాక మంగళవారం ప్రభుత్వ సెలవు దినం. అయినా అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,25,228 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,557.06 కోట్లు విడుదల చేసింది. సోమవారం సాయంత్రానికే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేసే కార్యక్రమం పూర్తయినట్టు సెర్ప్ అధికారులు చెప్పారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్ అందించే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
శరవేగంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా 60,87,399 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారికి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ చేసింది. రూ.1,547.63 కోట్ల మొత్తాన్ని వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెలలో 61.51 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.75 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 99 శాతం మందికి పంపిణీ పూర్తి చేశారు. గరిష్టంగా కర్నూలు జిల్లాలో 99.2 శాతం మందికి పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం లోహరిజోలకు చెందిన వృద్ధురాలు పల్లి మిన్నమ్మ ఒడిశా రాష్ట్రం ఖండవ గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి రాలేకపోవడంతో వలంటీర్ గోర్జన శేషగిరిరావు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి మిన్నమ్మకు పింఛన్ అందించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్‌కుమార్ కిడ్నీ సమస్యతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పింఛనుదారులైన అతని భార్య, తల్లి కూడా అతనికి సాయంగా అక్కడికి వెళ్లారు. ఆ ముగ్గురికీ సచివాలయ ఉద్యోగి లోకేశ్ తిరుపతి వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశాడు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు బీఎస్ కండ్రిగకు చెందిన కుమారి దామోదరం అనే వృద్ధుడు చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ పాకం సాయికృష్ణ అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశాడు. అనంతపురం జిల్లా చీకలగురికికి చెందిన వృద్ధురాలు గంగమ్మ కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా... వలంటీర్ మారుతి శనివారం 170 కి.మీ. దూరం ప్రయాణించి గంగమ్మకు పింఛన్ అందజేశాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నిడిగుంట గ్రామానికి చెందిన రామమూర్తి ఆపరేషన్ నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చేరాడు. వలంటీర్ యమున శనివారం అక్కడికే వెళ్లి పింఛన్ అందించింది. -
57.04 లక్షల మందికి రూ.1450.75 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కొనసాగింది. మంగళ, బుధవారాల్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 57,04,996 మంది లబ్ధిదారులకు రూ.1450.75 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 61,51,660 మందికి ప్రభుత్వం రూ.1563.73 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 92.78 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదిరక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 94.85 శాతం పంపిణీ పూర్తయింది. -
82 శాతం లబ్ధిదారులకు పింఛన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ శరవేగంతో జరుగుతోంది. అవ్వాతాతలు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు 82.04 శాతం లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ అందజేశారు. మొత్తం 50,65,597 మందికి రూ.1,288.86 కోట్ల మొత్తాన్ని అందజేశారు. జనవరి ఒకటో తేదీన 25 లక్షల మందికి పంపిణీ జరగ్గా, రెండో రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, పలుచోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. పాలాభిషేకంతో సీఎం జగన్‌కు అవ్వాతాతల దీవెన పింఛను రూ. 2,500కు పెంచడంపై అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు ఆదివారం వివిధ రూపాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల అవ్వాతాతలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ దీవెనలందించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు, పెరిగిన పింఛన్ డబ్బులు అందుకున్న పలువురు ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రొంపిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో రూ.2,500 పెన్షన్‌ను వృద్ధురాలైన వేపూరి దుర్గాంబకు అందజేస్తున్న వలంటీర్ ► శ్రీకాకుళం జిల్లా పొలకి మండలంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించి, సీఎం జగన్ రాసిన లేఖ ప్రతులను అందజేశారు. సంతకవిటి మండలంలో పింఛన్ల పెంపు కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు పాల్గొన్నారు. ► విజయవాడ నగరం 52వ వార్డులో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. కృష్ణా జిల్లా నూజివీడు రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో మండల పరిషత్ పాఠశాలలో సమావేశమయ్యారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ► నెల్లూరు జిల్లా వాకాడులో సర్పంచ్ వెంకట రత్నం, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సచివాలయ కార్యదర్శి ఉమామహేశ్వర రావు, ఇతర సిబ్బంది కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా... పింఛన్ పెంపుపై ఓ వృద్ధురాలి మనోగతం.. సోషల్ మీడియాలో వైరల్ పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నడుపల్లిలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పింఛనుదారులు ఇచ్చిన మాట నెరవేర్చే నాయకుడు జగన్ పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల హర్షం.. వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులుపెరవలి: ఇచ్చిన మాటను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ పింఛన్ సొమ్మును పెంచడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామంలోని వృద్ధులు ఆదివారం వైఎస్సార్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కిందటి వరకు ఓట్ల కోసం మోసపు హామీలిచ్చిన నాయకులను చూశామన్నారు. గతంలో పింఛన్ మంజూరు చేసేందుకు లంచాలు తీసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా మొదటి తేదీనాడే పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటికే పింఛన్ పంపిస్తున్న మహానుభావుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సర్పంచ్ బీరా సత్యవతి రాజు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా కడప రవీంద్రనగర్‌లో రహిమూన్కు వితంతు పెన్షన్ అందిస్తున్న వలంటీర్ -
పింఛన్.. ఏపీలోనే మించెన్
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.2,250 అందిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51.44 లక్షల మంది లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అందుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సెర్ప్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మన రాష్ట్రంలో 24 రకాల కేటగిరీ పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఆయా లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ కనిష్టంగా రూ.2,250 నుంచి గరిష్టంగా రూ.10 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 13,412 మందికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పింఛన్‌ను అందజేస్తోంది. అవ్వాతాతలు, వితంతువులకు ఇప్పటిదాకా రూ.2,250 చొప్పున ఇస్తుండగా వచ్చే జనవరి నుంచి ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచాలని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. -
Andhra Pradesh: రూ. 1,394 కోట్ల పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: డిసెంబర్ నెలకుగాను రాష్ట్రంలో 59,80,510 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసింది. మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు రూ. 1,411.42 కోట్ల మేర ప్రభుత్వం నిధుల విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి 98.78 శాతం మందికి రూ.1,394.83 కోట్లు పంపిణీ చేశారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 99 శాతానికి పైగా, మిగిలిన 10 జిల్లాల్లో 98 శాతానికి పైగా పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
నేటి నుంచి రెండో విడత ఆసరా
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆసరా’ పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది. ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పది రోజుల పాటు పంపిణీ 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చే ఇంత పెద్ద కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ పరిధిలో రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల లబ్ధిదారుల చొప్పున పది రోజుల పాటు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని 83,026 సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేస్తారు. ప్రతి రోజు పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మంత్రులు కూడా ప్రతి రోజూ తమ జిల్లా పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం సీఎం జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ జిల్లాలో పంపిణీకి ఆటంకాలు.. బద్వేలు ఉప ఎన్నిక కారణంగా వైఎస్సార్ జిల్లాలో పంపిణీ వాయిదా పడే అవకాశం ఉందని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం గత ఏడాది నుంచే ఆసరా పథకం అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు.. ఈ దృష్ట్యా అక్కడ కూడా పంపిణీకి అనుమతి ఇవ్వాలని అధికారులు కోరినట్టు తెలిసింది. ఎన్నికల సంఘం అనుమతి తెలిపిన తర్వాత, లేదంటే ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జిల్లాలో పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం ఒంగోలు పర్యటన ఇలా.. గురువారం ఉదయం 9.55 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలుకు బయలుదేరతారు. 11 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తన ప్రసంగం అనంతరం వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. నాడు బాబు మోసం.. నేడు జగన్ వరం 2014లో ఎన్నికల ముందు.. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ డ్వాక్రా రుణం చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. దీంతో మహిళలు ఆ రుణాలు చెల్లించలేదు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. దీంతో మహిళల అప్పు.. వడ్డీతో కలిపి చెల్లించలేనంతగా పెరిగిపోయింది. ఈ కారణంగా అప్పట్లో పొదుపు సంఘాలు పూర్తిగా ఛిన్నాభిన్నమై ‘ఎ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సి’, ‘డి’ కేటగిరీలోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద కూడా రుణాలను ఇవ్వడాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సొమ్మును విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం తమకు నిజంగా వరం అని రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏ నెల పింఛను ఆ నెలలోనే..
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు దర్జాగా వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. లబ్ధిదారులు ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి అన్ని నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే. బకాయిలు కూడా చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరుచేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం ఏపీలో అసలు నివాసమే ఉండకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే శాశ్వతంగా నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో పింఛను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారు మూడు నెలలకోసారి వారి ఊరికి వచ్చి బకాయిలతో కలిపి ఒకేసారి డబ్బులు తీసుకెళ్తుతున్నారు. వాస్తవానికి ఇలాంటి వారిలో దాదాపు అందరూ అర్హత లేకపోయినా అక్రమంగా పింఛను పొందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. రెండు లక్షల మందికి పైగానే అలాంటి వారు.. రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. వీరిలో పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు కారుల్లో ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టారు. అసలైన అర్హులకు ఇబ్బంది ఉండదు ఇక రాష్ట్రంలో నివాసం ఉంటున్న అర్హులైన పింఛనుదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టంచేశారు. వలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారని.. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వారికి ఇప్పటికే తెలియజేసినట్లు వారు చెప్పారు. -
48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్లు సెలవు రోజు అయినా.. ఆదివారం తెల్లవారుజాము నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. ఠంచన్‌గా ఒకటో తేదీ తెల్లవారకముందే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. రాత్రి 8 గంటల సమయానికి 48,63,732 మందికి రూ.1,157.74 కోట్లు పంపిణీ చేశారు. రాత్రి వేళ కూడా ఇంకా పంపిణీ కొనసాగుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 60.50 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,455 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పాక్షిక మొత్తంలో డబ్బులు చేరినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.90 కోట్లు సకాలంలో క్షేత్రస్థాయికి చేరలేదని గుర్తించినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. ఆయా వార్డుల్లో కూడా ఆదివారం పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు చెప్పారు. సెలవు రోజు అయినా, కొన్నిచోట్లకు సకాలంలో పూర్తి డబ్బు చేరకపోయినా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 80.4 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు తెలిపారు. పింఛన్ల పంపిణీ తీరును సెర్ప్ సీఈవో ఇంతియాజ్ స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ, మంగళవారాల్లో ఈ పంపిణీ కొనసాగనుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ పేషెంట్‌కు.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషెంట్ వద్దకు వలంటీర్లు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఖాజీగూడేనికి చెందిన డయాలసిస్ పేషెంట్ కుమ్మరి శ్యాంసన్‌రాజు డయాలసిస్ పేషెంట్ కావడంతో ప్రభుత్వం రూ.10 వేల పింఛను మంజూరు చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొందిన అతడికి తరువాత బ్లాక్‌ఫంగస్ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. గత రెండునెలలు పింఛను తీసుకోకపోవడంతో ఈసారి తీసుకోకపోతే పింఛను రద్దయ్యే ప్రమాదముందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు అక్కినేని రాజశేఖర్ వలంటీర్లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ వెళ్లి అతడికి పింఛను ఇచ్చి రావాలని సూచించి, ప్రయాణ ఖర్చులకు తన సొంత సొమ్ము ఇచ్చారు. దీంతో వలంటీర్లు హైదరాబాద్ వెళ్లి 3 నెలల పింఛన్ సొమ్ము రూ.30 వేలు శ్యాంసన్‌రాజుకు అందజేశారు. – పెదపాడు (దెందులూరు), పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరంలో చికిత్స పొందుతున్న రాబంద గ్రామానికి చెందిన వృద్ధుడికి పింఛన్ ఇస్తున్న వలంటీర్ నిర్మల జిల్లా సరిహద్దులు దాటి.. అనారోగ్యంతో బాధపడుతున్న పింఛను లబ్ధిదారుకు జిల్లా దాటివెళ్లి మరీ పింఛను అందజేశారు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వలంటీరు. కడప నగరం నకాష్ వీధికి చెందిన పీరాన్ బీ (85) అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని ఆమె ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురంలో కుమార్తె ఇంటివద్ద ఉంటోంది. రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయిన ఆమె పరిస్థితిని తెలుసుకున్న వలంటీరు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆదివారం సీతారాంపురం వెళ్లి పింఛను మొత్తాన్ని అందజేశారు. – కడప కార్పొరేషన్ -
ఊరికో ‘పోషకాహార నిపుణురాలు’
సాక్షి, అమరావతి: పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచేలా వారిలో ఓ మహిళను ‘పౌష్టికాహార నిఫుణురాలి’గా ఎంపిక చేస్తారు. ఇలా గ్రామ సమైఖ్య (వీవో)కు ఒకరి చొప్పున నియమిస్తారు. ఆ పౌష్టికాహార నిపుణురాలి ద్వారా ఆ గ్రామ సమైఖ్య పరిధిలోని అన్ని పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలందరికీ పౌష్టికాహారం అవసరం ఏమిటి, పౌష్టికాహారం సమకూరాలంటే ఏ ఆహారం తీసుకోవాలి, వాటి తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో గ్రామ పౌష్టికాహార నిపుణురాలితో పాటు ఏఎన్ఎం కూడా పాల్గొంటారు. పొదుపు సంఘాల వారీగా మహిళలు ప్రతినెలా నిర్వహించుకునే సంఘ సమావేశాల్లో పోషకార నిపుణురాలు, ఏఎన్ఎం పాల్గొని పౌష్టికాహారంపై కొద్దిసేపు అవగాహన కలిగిస్తారు. గ్రామంలోని గర్భిణులు, చిన్న పిల్లల తల్లులతో పౌష్టికాహార నిపుణురాలు, ఏఎన్ఎం ప్రతి నెలా 5, 25వ తేదీల్లో గ్రామ సమైఖ్య ద్వారా సమావేశపరిచి వేర్వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలకు ఒక విడత ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో ప్రతి కుటుంబానికి దీనిపై అవగాహన పెంచవచ్చని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉండే వాటితోనే.. గ్రామాల్లో అతి తక్కువ ధరకు దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే వివిధ రకాల ఆహార దినుసుల్లో వేటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. ఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. వాటివల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న అంశాలపై గ్రామాల్లోని మహిళలందరికీ తెలియజేస్తారు. విటమిన్లు, పోషకాలు గల కూరగాయలతో పాటు సజ్జలు, రాగులు వంటి వాటిని వినియోగించాల్సిన ఆవశ్యకతను చెబుతారు. వీలును బట్టి వాటిని ఇంటి పెరట్లోనే పండించుకునేలా ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో సంబంధిత విత్తనాలు, మొక్కలను అందించేలా తోడ్పాటునిస్తారు. గర్భిణికి తొమ్మిది నెలలు, ఆ తర్వాత 6 నెలల పాటు బాలింతగా, ఆ తర్వాత పసి పిల్లల తల్లిగా మొత్తం 1,000 రోజుల కాలంలో తల్లీ, బిడ్డ తొలి రెండున్నర ఏళ్ల కాలంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్నది ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు చేపడతారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని ఒకే విడతలో అమలు చేసేలా చర్యలు చేపడతారు. అయితే పౌష్టికాహారం తక్కువ తీసుకుంటున్నట్టు నిర్ధారించిన 218 మండలాల్లో ఫలితాల ప్రాతిపదికన ప్రత్యేకంగా దృష్టి పెడతారు. తొలి ఏడాది 218 మండలాల్లో.. అందులోనూ ప్రత్యేకించి 52 మండలాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. మరుసటి ఏడాది మరో వంద మండలాల్లో, మూడో ఏడాది మిగిలిన మండలాల్లో కార్యక్రమం ఫలితాల ప్రాతిపదికన ఫోకస్డ్గా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
సుదూర ప్రాంతాల్లో పింఛన్లు
చీరాల/వెలిగండ్ల: అనారోగ్యంతో బాధపడుతూ పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు కూడా వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు వెళ్లి నేరుగా పింఛన్ అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల 21వ వార్డు బోస్‌నగర్‌కు చెందిన ఎ.నాగేశ్వరరావు వృద్ధాప్య ఫించన్ లబ్ధిదారుడు. ఆయన కొద్ది నెలలుగా క్యాన్సర్‌తో భాదపడుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు పింఛన్ ఇచ్చేందుకు వలంటీర్ ఎస్.కె.నాగూర్‌బాబు, వెల్ఫేర్ సెక్రటరీ తోట పూర్ణచంద్రరావు సోమవారం చీరాల నుంచి 60 కి.మీ. మంగళగిరి వెళ్లి ఆస్పత్రిలో నాగేశ్వరరావుకు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ రూ.4,500 అందించారు. కాగా, వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పరిధిలోని పద్మాపురం వలంటీర్ జి.చిట్టిబాబు తన సొంత ఖర్చులతో 360 కి.మీ. దూరంలో ఉన్న చెన్నై వెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించుకున్న ఓ వృద్ధుడికి వృద్ధాప్య పింఛన్ అందజేశాడు. పద్మాపురం గ్రామానికి చెందిన గూడూరి నర్సయ్య షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పద్మాపురం వలంటీర్ చిట్టిబాబు సోమవారం చెన్నై వెళ్లి నర్సయ్యకు వృద్ధాప్య పింఛన్ అందజేశాడు. 93.67 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి సాక్షి, అమరావతి: వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ సోమవారం కూడా కొనసాగింది. మార్చి నెలకు సంబంధించి సోమవారం రాత్రి 8 గంటల వరకు 55,07,098 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. రూ.1,476.38 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆది, సోమవారాల్లో కలిపి 93.67 శాతం పంపిణీ పూర్తయింది. ఒకే రోజు 51.50 లక్షలు ఒక్క రోజులో 51.50 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం మీడియాకు తెలిపారు. ప్రభుత్వం 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోందని, గత ప్రభుత్వం కంటే ఇది ఎన్నో లక్షలు ఎక్కువని తెలిపారు. గతంలో కంటే లక్షలాది మంది కొత్తవారికి పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తుంటే.. ఈ ప్రభుత్వం తగ్గించేస్తోందని లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కొత్తగా 22 వేల మందికి ‘ఆసరా’
నవంబర్, డిసెంబర్లలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం కొత్త లబ్ధిదారులకు జనవరి నుంచి పింఛన్ సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం కింద సామాజిక పింఛన్ల కోసం గత నవంబర్, డిసెంబర్‌ల్లో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులకు మోక్షం లభించింది. అర్హులైన 22,001 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేసి నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. తాజాగా మంజూరైన వాటితో లబ్ధిదారుల సంఖ్య 35,95,778కి చేరింది. కొత్తగా మంజూరైన పింఛన్లలో 6,204 వృద్ధాప్య, 10 వేల వితంతు, 2,998 వికలాంగ, 335 గీత కార్మిక, 156 చేనేత, 2,308 హెచ్ఐవీ బాధితులకు(ఆర్థిక భృతి) ఉన్నాయి. కొత్త పింఛన్లను జనవరి నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. అర్హుౖలందరికీ ఆసరా పింఛన్ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసరా పింఛన్లకు రూ.396 కోట్లు రాష్ట్రంలో సుమారు 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం శుక్రవారం రూ.396 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఆర్థికశాఖ నుంచి సెర్ప్ ఖాతాకు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో నిధులు అందినందున ఈ నెల 13 నుంచి లబ్ధిదారుల బ్యాంక్, పోస్టాఫీసు ఖాతాలకు సొమ్మును జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 45% మందికి పింఛన్ సొమ్మును బ్యాంకు ఖాతాలకు, 55% మందికి వారి పోస్టాఫీసు ఖాతాలకు జమ చేస్తున్నారు. కేవలం 300 మంది లెప్రసీ వ్యాధిగ్రస్తులకు సొమ్మును స్థానిక సంస్థల సిబ్బంది వారి చేతికి అందజేస్తున్నారు. ఆసరా పింఛన్ పంపిణీ చేసే సమాచారాన్ని లబ్ధిదారుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపే విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెర్ప్ అధికారులు పేర్కొన్నారు. -
డ్వాక్రా రుణం చెల్లించలేదని ఇంటికి తాళం!
బ్యాంకు అధికారుల తీరు వెంకటాపురం: జయశంకర్ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరంలో డ్వాక్రా రుణాలు రికవరీ చేయడానికి బ్యాంకు, సెర్ప్ అధికారులు శుక్రవారం పర్యటించారు. గ్రూపు సభ్యుల ఇళ్లకు వెళ్లి రుణా లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నాం కొంత సమ యం కావాలని వారు కోరగా.. అలా కుదరదంటూ నిర్మల, కళావతి ఇళ్లకు తాళాలు వేశారు. బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహించిన మహిళలు వీర భద్రవరం ప్రధాన రహదారిపై బైఠా యించి, రాస్తారోకో నిర్వహించారు. నాలుగైదేళ్లుగా పంటలు సరిగా పండ క ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు కట్టలేక పోయామని మహిళలు అన్నారు. నెలరోజులు గడువిస్తే చెల్లి స్తామన్నారు. దీంతో బ్యాంకు అధికా రులు వారికి కొంత సమయం ఇవ్వ డంతో ఆందోళన విరమించారు. -
సెర్ప్‌లో ‘వేతన వేదన’పైసర్కారు సీరియస్
పంచాయతీరాజ్ శాఖను వివరణ కోరిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపోతుండటంపై సర్కారు సీరియస్ అయింది. ‘సెర్ప్ ఉద్యోగులకు వేతన వేదన’ శీర్షికన ఈనెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించారు. వేలాది మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోతుండటం, ఆగస్టు 1 నుంచి వేతన పెంపు అమలు కాకపోవడం తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈనెల 20న నోటీసు జారీ చేశారు. అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాచారం అందకపోవడంపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ అదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ శ్రీధర్ ..సెర్ప్ అధికారులకు 21న మెమో జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవారం వరకు సెర్ప్ అధికారుల నుంచి తనకు సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సెర్ప్ ఇంచార్జి సీఈవో అనితా రాంచంద్రన్, సీఎస్ నోటీసుకు వివరణ పంపించామని ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులకు వేతన పెంపు విషయమై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా వేతనాలు అందజేస్తామని పేర్కొన్నారు.