సాక్షి, అమరావతి: ఠంఛన్‌గా సెప్టెంబర్ ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 52,70,915 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు రూ.1,451.41 కోట్ల పింఛన్ డబ్బులు అందాయి. ఈ నెల 1 నుంచి మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం గురువారమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
ఇందులో 1,49,875 మందికి ఈ నెలలోనే ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు... లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మొత్తం పింఛన్‌దారుల్లో 82.30 శాతం మందికి తొలిరోజే డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment