సాక్షి, అమరావతి: మండుటెండలు.. మేడే.. ఆదివారం సెలవు.. అయినా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 53,26,151 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. తొలిరోజునే రూ.1353.14 కోట్లు లబ్ధిదారులకు అందాయి.
మొత్తం 60,87,942 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ నెల పింఛన్లు మంజూరు చేయగా.. అందులో 87.49 శాతం మందికి ఆదివారమే పంపిణీ పూర్తయినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు.
ఒంగోలులో దివ్యాంగుడు వెంకట తరుణ్‌కు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ వెంకట రమణ
Comments
Please login to add a commentAdd a comment