
సాక్షి, అమరావతి: డిసెంబర్ నెలకుగాను రాష్ట్రంలో 59,80,510 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసింది. మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు రూ. 1,411.42 కోట్ల మేర ప్రభుత్వం నిధుల విడుదల చేసింది.
డిసెంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి 98.78 శాతం మందికి రూ.1,394.83 కోట్లు పంపిణీ చేశారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 99 శాతానికి పైగా, మిగిలిన 10 జిల్లాల్లో 98 శాతానికి పైగా పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment