
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అనకాపల్లి వేల్పులవీధికి చెందిన ఎర్రయ్యమ్మకు పింఛన్ అందిస్తున్న వలంటీర్ దుర్గామల్లేశ్వరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 60.75 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 58,39,005 మందికి రూ.1484.77 కోట్లు పంపిణీ చేశారు. 96.11% మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు.. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment