Pensions
-
పెన్షన్‌దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్‌దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్‌దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్‌దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్‌దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్.. తుంచెన్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య తగ్గిపోతోంది. గత ఆర్నెళ్లలో ఏకంగా 1.57 లక్షల పింఛన్లకు కోత పెట్టిన కూటమి సర్కారు మరో 3 లక్షల పెన్షన్ల తొలగింపుపై గురి పెట్టినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పైలెట్ సర్వే పేరుతో 10,958 మందిని తనిఖీ చేసి 563 మందిపై.. అంటే దాదాపు 5శాతం మందిపై అనర్హులుగా ముద్ర వేసింది. అంటే రాష్ట్రంలోని మొత్తం పెన్షన్లను తనిఖీ చేసి అందులో 5శాతం.. అంటే దాదాపు 3 లక్షలకుపైగా పింఛన్లపై అనర్హత ముద్ర వేసి తొలగించబోతున్నట్లు అర్ధమౌతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. అంటే దాదాపు 6 లక్షల మంది పెన్షన్లను తొలగించే దిశగా సర్కారు సన్నద్ధమైనట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో 65.49 లక్షల మందికి ఫించన్లు ఇవ్వగా ఈ డిసెంబర్ నాటికి 63.92 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేసి వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసి కక్ష పూరితంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం పింఛన్లకు ఎడాపెడా కోతలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేత పేరుతో గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై గురి పెట్టింది. సంబంధిత సచివాలయంతో అసలు సంబంధమే లేని ఉద్యోగులను లబ్ధిదారుల ఇళ్లకు పంపి తనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కొత్తవి మంజూరు కాకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. దినదిన గండంగా.. గత ఐదేళ్లూ నిశ్చింతగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే టంచన్‌గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్దిదారులు ఇప్పుడు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారిని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనర్హత నోటీసుల పేరుతో కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. అనర్హుల పేరిట మరో విడత పింఛను నోటీసులు జారీ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలకు మెమో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ఆర్నెళ్లలో పింఛన్లు 1,57,162 తగ్గిపోయాయి. ఎడాపెడా కోతలు విధిస్తూ ఫైలెట్ సర్వే, స్పెషల్ డ్రెవ్ అంటూ రకరకాల కార్యక్రమాలకు ప్రభుత్వం తెర తీసింది. రాజకీయంగా గిట్టని వారి పింఛన్లను లబ్దిదారులకు తెలియకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 63,92,702 మందికి పింఛన్ల డబ్బులు విడుదలైనా అందులో ఐదారు లక్షల పెన్షన్లకు కోత పెట్టే యోచన ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అనర్హులంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం వారం క్రితం అన్ని జిల్లాలో ఒక్కో గ్రామ / వార్డు సచివాలయాన్ని ఎంపిక చేసుకొని మొత్తం 10,958 మంది లబ్దిదారుల పింఛన్లను తనిఖీ చేసి 563 మంది అనర్హులుగా ఉన్నారని గుర్తించింది. అంటే ఐదు శాతం పైగానేనన్న మాట. 11 వేల మందిని తనిఖీ చేసి 5శాతం మందిని అనర్హులుగా తేల్చారంటే మొత్తం 65.49 లక్షల మందిని తనిఖీ చేస్తే...అందులో 5శాతం అంటే... దాదాపు 3 లక్షల మందికి పైగా అనర్హులుగా తేల్చబోతున్నారని పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగులు టార్గెట్‌గా.. దివ్యాంగ పింఛన్ల లబ్దిదారులకు సైతం కూటమి ప్రభుత్వం ఎడాపెడా నోటీసులు జారీ చేస్తోంది. అధికారంలో వచ్చిన నెల తిరగక ముందే జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్ లబ్దిదారులకు పలు నిబంధనలతో నోటీసులు ఇచి్చంది. దీర్ఘకాలం క్రితం శరీర వైఫల్య సర్టిఫికెట్లు పొంది ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న వారిని సైతం 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెటు అధికారులకు అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు “సదరం’లో పేర్లు నమోదు చేసుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది 15 రోజుల్లో ఆన్లైన్లో రీ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని అర్హత నిరూపించుకోవాలని మానవత్వం లేకుండా నోటీసులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సుదూర ప్రాంతాలకు బదిలీ.. నెల నెలా పింఛన్లు కావాలంటే మా వద్దకు రావాల్సిందే..! అధికార పార్టీలో చేరాల్సిందే! ఎవరికి చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉండదు!! ఇదీ పచ్చ నేతల బెదిరింపులు! ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన పింఛన్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చాలు.. సుదూర ప్రాంతాలకు పెన్షన్లు బదిలీ చేస్తున్నారు. పింఛన్ల కోసం అంతదూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లలేక లబ్దిదారులు ఆశలు వదులుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో బాపట్ల జిల్లాలో పలువురు వృద్ధుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బదిలీ చేశారు. పండుటాకులని కూడా చూడకుండా కూటమి సర్కారు దారుణంగా వ్యవహరించింది.563 మందికే కాదు.. మిగిలిన వారికీ నోటీసులు పైలెట్ సర్వేలో గుర్తించిన 563 మంది లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేయాలని సెర్ప్ సీఈవో తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే సెర్ప్ కార్యాలయం నుంచి అధికారులకు పంపిన ఫోన్ సందేశాల్లో మాత్రం ఫైలెట్ సర్వే నిర్వహించిన సచివాలయాలతో పాటు ఇతర గ్రామ, వార్డు సచివాలయాలలోనూ అనర్హులుగా పేర్కొంటూ ఎంపీడీవో లాగిన్‌లో ఉన్నవారికి కూడా నోటీసులు జారీ చేయాలని సమాచారం ఇచ్చారు. ఎవరైనా నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తే వారి పింఛన్లను ఎంపీడీవోలు అప్పటికప్పుడే హోల్డ్ (తాత్కాలికంగా నిలుపుదల) చేయాలని సెర్ప్ సీఈవో ఆదేశాల్లో పేర్కొన్నారు. -
మొదలైంది.. బాబు మార్కు ఏరివేత
సాక్షి, అమరావతి: చంద్రబాబు మార్క్ ఏరివేత మొదలైంది. ఇప్పటికే పెన్షనర్ల సంఖ్య నెలనెలా తగ్గుతున్న విషయం తెలిసిందే. సామాజిక పెన్షన్ల సంఖ్య మరింత తగ్గించేందుకు ఆయన నడుంబిగించారు. పెన్షన్లు పొందుతున్న అనర్హుల నుంచి పెన్షన్ సొమ్మును రెవెన్యూ రికవరీ చట్టం కింద వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది. దివ్యాంగుల పేరిట తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారని పలువురు కలెక్టర్లు చెప్పగా.. ఎన్నికల ముందు అనర్హులైన 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ.. 3 నెలల్లో పెన్షన్లన్నీ రీ–వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగించాలని ఆదేశించారు.సర్టిఫికెట్ల జారీలో లోపాలున్నాయట..అనర్హులను దివ్యాంగులుగా గుర్తిస్తూ సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రాసిక్యూట్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీ మార్గదర్శకాల్లో లోపాల కారణంగానే తప్పుడు సర్టిఫికెట్లు పొందుతున్నారని, లోపాలు లేకుండా మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు ఆ మార్గదర్శకాల మేరకు వైద్యులు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందన్నారు. కాగా.. ప్రమాదాల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు. గ్రామ పంచాయతీలపై కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు, మంచినీటి వనరుల నిర్వహణ బాధ్యత పంచాయతీలదేనన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరిశ్రమలు–ఐటీ రంగాలపై సమీక్షిస్తూ.. రాజధాని అమరావతి తరహాలోనే పారిశ్రామిక పార్కుల భూసేకరణలో రైతులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. విశాఖలోని మధురవాడ, కాపులుప్పాడ, మంగళగిరిలో ఐటీ పార్కులు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి, తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ సంస్కరణలతో ‘పవర్’ పోగొట్టుకున్నావిద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి 2004లో పవర్ (అధికారం) పోగొట్టుకున్నానని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో విద్యుత్ రంగంపై మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాజధాని అమరావతిపై సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే ప్రజా రాజధానిగా అమరావతి ఉండాలన్నారు. అమరావతి పరిధిలోని ఆర్–5 జోన్లో గత ప్రభుత్వం 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా.. వారికి అమరావతి పరిధిలో కాకుండా సంబంధిత జిల్లాల్లోనే ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా విద్యలో భవిష్యత్‌కు అనుగుణంగా కరిక్యులమ్ మార్చాలన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలన్నారు. వైద్యశాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఏపీలో జనన, మరణాలను 100 శాతం నమోదు చేస్తూ, ప్రతి రికార్డు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలని, జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ సమస్యలపైౖ జాయింట్ టాస్క్ఫోర్స్రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో 50 శాతం రెవెన్యూ విభాగానికి సంబంధించినవే వస్తున్నాయన్నారు. వాటి పరిష్కారానికి ప్రతి జిల్లాలో కలెక్టర్–ఎస్పీ, ఆర్డీఓ–డీఎస్పీతో రెండు స్థాయిల్లో జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్లను వెరిఫికేషన్ చేసి అనర్హులుంటే రద్దు చేసి కొత్త వారికి ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం‘రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం?!‘గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం. ఇంటికొకటి పెట్టాలా. మీరు ఆస్పత్రులు పెడతా ఉండండి.. మేం ఎక్కడెక్కడకో పోతా ఉంటాం అంటే ఎలా’ అంటూ సీఎం చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరి శిఖర గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరగా సీఎం చిర్రుబుర్రులాడారు. ‘పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు కొండల్ని చదును చేసుకుంటూ వెళ్లిపోయి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కోచోట పది ఇళ్లు కూడా ఉండవు. ఒక గ్రామం కలిసి ఉండదు, అందర్నీ కలిసి ఒకచోట ఉండమని చెప్పండి’ అని అన్నారు. గంజాయి, సెల్ఫోన్ల వల్లే అత్యాచారాలుగంజాయి, సెల్ఫోన్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో హోమ్, ఎక్సైజ్, గనుల శాఖల సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ విభాగానికి ఏటా నిధులు కేటాయిస్తామన్నారు.డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేసి అందులో నిపుణులైన వైద్యులు, మానసిక వైద్యులను నియమిస్తామన్నారు. ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్ వంటిచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ టీవీ కవరేజీ లేనిచోట్ల డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. నేరస్తుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు.యాక్సిడెంట్ల హాట్ స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కట్టడి చేయాలన్నారు. సీనరేజి రద్దు చేశాం కాబట్టి ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నియంత్రించాలన్నారు. -
సర్కారు ఏడిపింఛన్!
రెండు కాళ్లూ దెబ్బ తిన్నా పింఛన్ ఇవ్వట్లేదురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బ తిని పనిచేయడం లేదు. రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి పోతున్నాను. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడంలేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతా. – ప్రభాకర్, కల్యాణపురం ఎస్టీ కాలనీ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా.. వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే.. సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై ప్రభుత్వం వెరిఫికేషన్‌ను చేపట్టనుంది. సంబంధిత సచివాలయాలనికి గానీ, అసలు మండలానికే సంబంధమే లేని.. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేపడతారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్దిదారుల చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయ పరిధిలో ఉండే మొత్తం పింఛను దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో 7 నుంచి 13 బృందాలను ఇప్పటికే ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యక్తి పేరు సీపాన ఆనందరావు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామానికి చెందిన ఇతను అంధుడు. 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతని పింఛన్ నిలుపుదల చేశారు.రిమ్స్ నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే మూడు నెలలు పూర్తయ్యాయి. పింఛన్ రద్దయింది. ఎంతగా వేడుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదు. ఒక్క టిక్‌తో అంతా తారుమారువెరిఫికేషన్కు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్‌లో అన్ని పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలనే పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు వెరిఫికేషన్ చేసే ఉద్యోగి ‘అవును’/ ‘కాదు..లేదు’ అని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ‘మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘అవును’/ ‘లేదు’ అని స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క ‘టిక్’తో పేద పింఛన్ లబ్ధిదారుల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగి అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి.1. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉందా?2. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?3. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?4. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా?5. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా?6. కుటుంబానికి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?7. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా?8. కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా?9. మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? రాజకీయ పైరవీలకు చోటు గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే సమయంలో దరఖాస్తుదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్ణయించేవారు. ఆపై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్) జరిపేవారు. ఆ తర్వాత పింఛన్ మంజూరు చేసేవారు. అయితే, ఇప్పుడు వెరిఫికేషన్‌లో ఆ లబి్ధదారుడు పింఛను మంజూరు అర్హత నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది వెరిఫికేషన్ ఉద్యోగి నిర్ణయిస్తారు. ప్రభుత్వం అనర్హుల గుర్తింపు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలోనే ఏదో మతలబు ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ప్రస్తుత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులపై ఆయా ప్రాంతాల్లో అధికార కూటమి పార్టీల నేతల ప్రభావం, ఒత్తిడి ఉంటుందని.. దీంతో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో 1.57 లక్షల పింఛన్లు తగ్గుదలరాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకూ తగ్గిపోతోంది. ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, డిసెంబర్ నెలకు వచ్చే సరికి 63,92,702 మంది లబ్దిదారులకు మాత్రమే పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయాయి. సెపె్టంబర్లో 22,601, అక్టోబర్‌లో 24,710, నవంబర్‌లో 21,472.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 పింఛన్లు తగ్గిపోయాయి. 2 లక్షల మంది వెయిటింగ్.. కొత్తగా దరఖాస్తులకు అవకాశమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పింఛన్ల మంజూరు కోసం కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో.. అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలు పని చేయడం లేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కొత్త పింఛన్లే మంజూరు కాలేదు. గత ఐదేళ్ల కాలంలో పింఛన్ల పంపిణీ అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అప్పటి దాకా కొత్తగా గుర్తించిన పింఛన్ లబ్దిదారులందరికీ పింఛన్ల డబ్బుల పంపిణీ మొదలు కాగా.. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వరకు ‘ఏపీ సేవ’ అనే ఆన్లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఆ సమయంలో దాదాపు రెండు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దయలేకుండా తొలగించారయ్యా.. దివ్యాంగుడని కూడా చూడకుండా నా పింఛన్ తొలగించారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. మూడు నెలల క్రితం నా పింఛన్ తొలగించారు. ఈ కుట్ర ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. దివ్యాంగుడైన నాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. నేను ఎలాంటి పనులు చేయలేను. నాకొచ్చే పింఛన్ సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. పింఛన్ ఆపేయడంతో తినడానికి కూడా కష్టంగా ఉంది. నాకు జరిగిన అన్యాయంపై ఇటీవల శ్రీరంగరాజపురం మండల కార్యాలయం వద్ద కుటుంబంతో నిరసన తెలిపాను. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విన్నవించినా పట్టించుకోలేదు. నాకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హేమాద్రి, దివ్యాంగుడు, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా పింఛన్ ఇప్పించండి సారూ.. మా బిడ్డ హరీష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మేము మా బిడ్డ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నాం. మా బిడ్డకు పింఛన్ మంజూరు చేయండి. – ఏ.హరీష్ తల్లిదండ్రులు, కల్యాణపురం ఎస్టీకాలనీ, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లాఅర్హత ఉన్నా అందని పింఛన్ వైజాగ్ జీవీఎంసీ 47వ వార్డు కంచరపాలెం కొండవాలు ప్రాంతం జయప్రకాష్ నగర్లో టి.సునీత అనే మూగ–వినికిడి లోపం గల మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. జీవీఎంసీ జోన్–5 పరిధిలో యూసీడీ అధికారులకు ఎన్నోసార్లు పింఛన్ కోసం విన్నవించగా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసి కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదని సునీత సైగలా ద్వారా వాపోతోంది. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
జీతాలు, పెన్షన్ల కోసం పడిగాపులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. తొలి నెల మినహా తరువాత నెలల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. గత నెల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 10వ తేదీ వచ్చే వరకు జీతాలను చెల్లించలేదు. ఈ నెల కూడా అలాగే చేస్తారనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.రాష్ట్ర సచివాలయంతోపాటు శాఖాధిపతులు కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు వారి ఖాతాల్లో పడలేదు. ఈఎంఐలు చెల్లించాల్సిన ఉద్యోగులు జీతాల మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల ఫాఠశాల్లో పనిచేసే ఉద్యోగులు, గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలివ్వడం లేదు. మంగళవారం కూటమి ప్రభుత్వం మరో రూ.4,237 కోట్ల అప్పు చేస్తోంది. ఆ నిధులు ఖజానాకు చేరిన తరువాతనైనా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జీతాల కోసం చకోర పక్షుల్లా..!
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. నవంబర్ మూడో వారం వచ్చినా..నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలుప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది. అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్‌ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
ఏపీలో ప్రతినెలా తగ్గిపోతున్న పెన్షన్లు
-
ఏపీలో నెలనెలా తగ్గిపోతున్న పెన్షన్లు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. నెల నెల పెన్షన్లలో కోతలు విధిస్తోంది ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడుతోంది.గత నెల కంటే ఈ నెల పెన్షన్లు మళ్లీ తగ్గాయి. అక్టోబర్ నెలకి 64,38,884కు పెన్షన్లను తగ్గించింది ప్రభుత్వం. సెప్టెంబర్‌లో 64,61,485 మందికి పెంషన్లు మంజూరు చేయగా.. ఈ నెల 64,38,884కే పెన్షన్లు అందించింది. ఈ ఏడాది మేలో 65,49,864 పెన్షన్లు ఉండగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 11 వేలు మంది పెన్షన్లను తొలగించేసింది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకుండా ఉన్నవాటిని ప్రభుత్వం తగ్గిస్తుండటంపై పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అనుభవంతో అధికారంలోకి వచ్చా
చీమకుర్తి: అనుభవాన్నంతా ఉపయోగించా.. అందుకే 93 శాతం సీట్లను గెలిపించుకున్నా అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కూటమి 21 ఎంపీ సీట్లు కూడా గెలవటంతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడటంతో ఆకస్మికంగా ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని శాఖల్లో సర్వే చేసి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశానన్నారు. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని, వాటికి ఏటా రూ. 1 లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. అందుకోసం సంపద సృష్టించి గాడితప్పిన పాలనను గాడిలో పెడుతున్నానన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పారు. దగ్గరలోనున్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లేక ఎడ్ల బండ్లపైన లేక నెత్తిమీద పెట్టుకోనైనా తెచ్చుకోవచ్చని అన్నారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వం నాసిరకం నెయ్యితో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టమంటారా? అంటూ ప్రశ్నించారు. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మాజీ చైర్మన్ ఈ జిల్లాలోనే ఉన్నాడని, ఆయన పేరు తాను చెప్పనని అన్నారు (మనం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు ఎవరైనా తిన్నారా తమ్ముళ్లూ అని రెండు సార్లు అడిగినా.. జనం నుంచి స్పందన లేదు). ఇక నుంచి ప్రతి నెలా 1న ‘పేదల సేవలో’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ అంతా ప్రతి గ్రామంలో ఇలాంటి సభలే ఏర్పాటు చేసి నిజమైన అర్హులకు కొత్త పెన్షన్లు అందజేస్తామని, అదే సభలో దొంగ పెన్షన్లపై విచారణ చేస్తామన్నారు. మగవాళ్లూ... అర్థమైందా.. జనాభా తగ్గుతోందని, పిల్లలను పుట్టించకపోతే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని, అందుకే ఆడవారికి పనులు చెప్పటం తగ్గించి మగవారు ఆ పనిలో ఉండండి అంటూ చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘మగవారికి అర్థమైందా...?’’ అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్ల క్రితం తానే జనాభా నియంత్రణ మార్గాలను అమలు చేశానన్నారు. దాని వలన జనాభా తగ్గిందన్నారు. రాబోయే ఐదేళ్లలో జనాభాను పెంచేందుకు పాప్యులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా సర్పంచ్‌ని గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనాభా పెంచేందుకు అవగాహన కల్పించాలంటూ సీఎం సూచించారు. కార్యక్రమం తర్వాత కొంతమంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు మాట్లాడారు. -
పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అనర్హులను గర్తింపు, వారికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించడానికి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై గురువారం సీఎం సమీక్షించారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అర్హులకే పింఛన్లు ఇస్తామని, అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పింఛన్ల మంజూరు ప్రక్రియలో లోపాలున్నాయని, వాటిని కూడా మంత్రుల సబ్ కమిటీ సరిచేస్తుందన్నారు. 50 ఏళ్లకే పింఛన్, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో వాటిపై కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు దాదాపు రూ.80 వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా, అందులో రూ. 54 వేల కోట్లను మాత్రమే మహిళలు ఉపాధిని పెంచుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. మిగిలిన వారు తీసుకునే రుణాలను కూడా ఉపాధి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతామన్నారు. స్త్రీనిధికి సంబంధించి రూ. 950 కోట్ల మేర వేరే బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని, ఆ మొత్తాలను ప్రభుత్వ నిధులకు మళ్లించారని, ఈ కారణంగా స్త్రీనిధి కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులొచ్చాయని చెప్పారు. పది జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆ జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్‌లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సర్వేచేసి పింఛన్లు తొలగిస్తాం
టెక్కలి : ‘గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారులతో సర్వే చేయించి అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’.. అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శనివారం గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ ఇవ్వాలంటే తమ దగ్గర అక్షయపాత్ర లేదని.. చెట్లకు డబ్బులు పండడంలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా ఉందని.. సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రావివలస ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తాం :స్పీకర్ అయ్యన్నపాత్రుడునర్సీపట్నం: అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శనివారం ఆయన వృద్ధాప్య, వితంతు పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అక్టోబర్2 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. -
పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు
-
పింఛన్ కోసం సచివాలయానికి రండి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పినప్పటికీ.. ఆచరణలో మాత్రం అది కనిపించడంలేదు. మెజార్టీ లబ్దిదారులను స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పిలిపించుకొని పింఛన్ల పంపిణీ చేశారు. కొన్ని చోట్ల చెట్ల కింద, రచ్చబండల వద్ద, ప్రైవేటు స్థలాల్లో పంపిణీ చేశారు. గతంలో రాజకీయాలకతీతంగా పింఛన్ల పంపిణీ జరిగితే.. ప్రస్తుతం అ«ధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పింఛన్ల పంపిణీ జరిగింది. పింఛన్ల పండుగ పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ నేతల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల బహిరంగసభలు నిర్వహించి వృద్ధులను ఇబ్బంది పెట్టారు. కక్షగట్టి పింఛన్లు ఆపేసిన ఘటన పలుచోట్ల జరిగింది. కాగా, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 64,82,052 మంది పింఛన్‌దారులకు పంపిణీ చేసేందుకు రూ. 2,737 కోట్లు విడుదల చేశారు. గురువారం తొలి రోజు 63,18,881 మందికి రూ. 2,668.28 కోట్లు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజే 97.48 శాతం పింఛన్‌దారులకు పంపిణీ పూర్తి చేశామని వెల్లడించింది. పింఛన్ల పంపిణీలో నేతలు తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలో సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లకుండా గాం«దీవీధిలోని ఓ ఇంటి వద్దకు అందరినీ రమ్మని అక్కడే పింఛన్లు ఇచ్చారు. తిరుపతి కేవీబీపురం మండలంలోని రాయపేటు గ్రామ సచివాలయ పరిధిలో వగత్తూరు గ్రామంలో టీడీపీ నేతలు గోపాల్, సురేష్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రశ్నించాడని సాక్షి విలేకరి తల్లి పింఛన్ ఆపేశారు పంచాయతీలకు రావాల్సిన నిధులు ఎందుకు పక్కదారి పడుతున్నాయని ప్రశ్నించినందుకు సాక్షి విలేకరి తల్లి పింఛన్‌ను నిలిపివేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలాకి మండలంలోని బెలమరపాలవలస పంచాయతీలో చేపల చెరువుకు బుధవారం వేలం జరిగింది. ఈ వేలంపాటలో వ చ్చిన సొమ్ములు స్థానిక సర్పంచ్‌కు కాకుండా అధికార పార్టీ నేతల వద్ద ఉంచటాన్ని అదే గ్రామానికి చెందిన ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి టీడీపీ నేతలు చేరవేశారు. దీంతో నేరుగా ఎమ్మెల్యే.. ఎంపీడీవో ఉషశ్రీకి ఫోన్ చేసి విలేకరి తల్లి అయిన చింతు రమణమ్మ వితంతు పింఛన్ ఆపేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ప్రశ్నించే గొంతును నొక్కే చర్యలకు పాల్పడటం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుతుందని అన్నారు. నరసన్నపేట ప్రెస్‌క్లబ్ దీన్ని ఖండించింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ అన్నారు. కష్టాన్ని కొని తెచ్చుకున్నాం మొన్నటి వరకు తెల్లవారక ముందే వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ అందించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆధార్ కార్డు పట్టుకుని పింఛన్ ఎక్కడ ఇస్తారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరైతే సచివాలయంలో పింఛన్ల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ‘ఎంతటి కష్టాన్ని కొనితెచ్చుకున్నాంరా నాయనా’ అంటూ వృద్ధులు బాధపడుతున్నారు. ఏలూరు నగరంలో గురువారం పలు డివిజన్లలో పింఛన్‌దారులు అవస్థలు పడుతూ కనిపించారు. ఇదేం పింఛన్ల పంపిణీ ‘స్వామి’! రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల పల్లెపాలెంలో పెన్షన్లను బహిరంగ సభకు పిలిచి ఇవ్వడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం వృద్ధులను ఇలా బాధపెట్టడం ఏంటని మంత్రి తీరును పలువురు తప్పుబట్టారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించడంపై మండిపడ్డారు. -
ఓట్లు వేయలేదని పింఛన్ల నిలిపివేత
పుంగనూరు: టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంగా వృద్ధ దళిత మహిళలకు పింఛన్లు ఆపేశారు. ఇదేమని నిలదీసినందుకు కులం పేరుతో దూషించడమేగాక వారిపై దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మీర్జేపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్జేపల్లికి చెందిన చెన్నమ్మ, రామయ్య, అమరక్క, మునెమ్మ, గంగమ్మ, సరస్వతి అనే దళిత మహిళలకు గురువారం పింఛన్ నిలిపివేశారు. దీంతో వారంతా కలసి పంచాయతీకి వెళ్లి పింఛను చెల్లించాలని కార్యదర్శిని కోరారు. దీంతో టీడీపీకి చెందిన నాగరాజు, గిరి తదితరులు వారిని కులం పేరుతో దూషించి.. మా ఇష్టం వచ్చిన వారికే పెన్షన్ ఇస్తాం. మీరు మా పార్టీకి ఓట్లు వేశారా అంటూ దాడి చేసి కొట్టడమే కాకుండా మీ అంతు చూస్తామని బెదిరించారని వృద్ధ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఓట్లు వేయలేదనే కారణంతో మీర్జేపల్లి నుంచి నాయకురాళ్లపల్లి, బసివినాయునిపల్లె తదితర బీసీ కులస్తులు ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్డుకు గత నెలలో గొయ్యి తవ్వించి రాకపోకల్ని ఆపేసిన విషయం విదితమే.దళిత నేతల ఆగ్రహంమీర్జేపల్లిలో పెన్షన్ అడిగిన దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులో మీడియాతో విలేకరులతో మాట్లాడుతూ మీర్జేపల్లిలో దళితులను, బీసీలను తిరగనివ్వకుండా రోడ్లను తవ్వేసి అడ్డగిస్తున్నారని, పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.పింఛన్ నిలిపేయడంతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నంవేధించిన టీడీపీ నాయకులుగత నెలలో 3 రోజులు తిప్పించుకుని పింఛన్ ఇవ్వని వైనంఈ నెల జాబితాలోనూ పేరు లేదన్న టీడీపీ నేతలుమనస్తాపంతో విషం తాగిన బాధితుడు.. పరిస్థితి విషమంకంబదూరు: పింఛన్ నిలిపివేయడంతో ఓ దివ్యాంగుడు పురుగు మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.కుర్లపల్లికి చెందిన వడ్డే శ్రీనివాసులు దివ్యాంగుడు. భార్య గోవిందమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులుకు 86 శాతం వైకల్యం ఉండటంతో ఏ పనీ చేయలేడు. దీంతో భార్య గోవిందమ్మ కంకర కొట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి పరిస్థితి గుర్తించిన ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రీనివాసులుకు పింఛన్ అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక టీడీపీ నాయకులు కమ్మ కిష్టయ్య, కమ్మ కృష్ట తదితరులు దివ్యాంగుడైన శ్రీనివాసులుపై వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న ముద్రవేసి కక్షగట్టారు. జూలై నెలలో పెంచిన పింఛన్ శ్రీనివాసులుకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాసులు టీడీపీ నాయకుల్ని సంప్రదించగా.. మూడు రోజులు తిప్పించుకుని అర్హుల జాబితాలో పేరు లేదని జూలై నెలకు సంబంధించిన పింఛన్ ఎగ్గొట్టారు. తాజాగా గురువారం కూడా ఆగస్టు నెల పింఛన్ కోసం వెళితే జాబితాలో పేరు లేదని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ ఆధారం లేని తనపై కక్ష గట్టడం తగదని, పింఛన్ సొమ్ము ఇవ్వాలని శ్రీనివాసులు ప్రాథేయపడినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో సచివాలయ సిబ్బంది హడావుడిగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లి ఆగస్టు నెల పింఛన్ సొమ్మును అందజేశారు. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడెలా పింఛన్ ఇచ్చారని శ్రీనివాసులు భార్య గోవిందమ్మ ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.వలంటీర్‌పై కక్ష సాధింపు.. పూరి గుడిసె కూల్చివేతపల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ దురాగతంసత్తెనపల్లి : తెల్లారకముందే ఇంటికి వచ్చిమరీ పింఛన్ ఇచ్చిన వలంటీర్‌పై కూటమి నేతలు కక్షగట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వలంటీర్ పూడిగుడిసెను కూల్చివేసి భార్యాబిడ్డలకు నిలువనీడ లేకుండా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటూ బ్రహ్మయ్య గ్రామంలోని పోరంబోకు స్థలంలో పూరి గుడిసె వేసుకుని చిన్నపాటి టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. వలంటీర్‌గా పార్టీలకతీతంగా సేవలందించిన బ్రహ్మయ్యను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు గతంలో కోరారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామ టీడీపీ నాయకులు ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లో లేని సమయంలో 20 ట్రాక్టర్ల మట్టి పోసి ఇంట్లోకి దారి లేకుండా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎన్టీఆర్ విగ్రహం పున:ప్రతిష్ట చేసి ఇక్కడ పార్కుగా అభివృద్ధి చేయదల్చుకున్నామని తక్షణమే ఇంటిని కూల్చివేయమన్నారు. కనీసం నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కోరగా పట్టించుకోకపోగా, స్థానిక టీడీపీ నేతలు బుధవారం ఇన్చార్జి తహసీల్దార్ ప్రసాద్‌ను కలిసి బ్రహ్మయ్య ఇల్లు ఖాళీ చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆగమేఘాల మీద బుధవారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు పూరి గుడిసెను తొలగింపజేశారు. గ్రామస్తులు అక్కడ గుమికూడి టీడీపీ చర్యలపై ముక్కున వేలేసుకున్నా పూరి గుడిసె కూల్చేసే వారి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. దీంతో వలంటీర్ బ్రహ్మయ్య, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు వీధినపడ్డారు. -
ఏపీలో పెన్షనర్లకు కూటమి సర్కార్ షాక్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట ఇవాళ రెండో నెల జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది. కూటమి పాలనలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో 67,812 పెన్షనర్లు తగ్గిపోయారు. అలాగే గత నెల కంటే ఈనెల(ఈరోజు జరిగిన పంపిణీ) భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది. ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052గా ఉంది. జులై కంటే ఆగష్టులో 79, 455 పెన్షన్లు తగ్గించి ప్రభుత్వం. జగన్ హయాంలో ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని నిలదీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
‘డబుల్’ పెన్షన్‌పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్‌ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
TG: 'ఆసరా' పక్కదారి..
సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్‌ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది. -
పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. -
టీడీపీ నేతల బరితెగింపు
కుందుర్పి/దెందులూరు/సాక్షి, టాస్క్‌ఫోర్స్/కాశీబుగ్గ: టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులు, వితంతువులపైనా తమ దర్పం చూపుతున్నారు. మంజూరైన పింఛన్ కూడా పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పాజిపాళ్యంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు మంజూరైన వృద్ధాప్య, వితంతు పింఛన్లను పంపిణీ చేయకుండా ఆ గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.పింఛన్ పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఐదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఇప్పుడు టీడీపీ నాయకులు అడ్డుచెప్పడం బాగోలేదని వృద్ధులు హనుమయ్య, అప్పాజప్ప, వితంతువు రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గురువారం జంబుగుంపల సచివాలయం ముందు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం వేలిముద్రలు కూడా వేయించుకున్న సచివాలయ ఉద్యోగులు.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో డబ్బులివ్వడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఫకృద్దీన్‌ను వివరణకోరగా, ‘వృద్ధులతో వేలిముద్రలు వేయించాం... రెండు రోజుల్లో పింఛన్ డబ్బులు ఇస్తాం’ అని సమాధానమిచ్చారు.పింఛను సొమ్ము వచ్చినా ఇవ్వడం లేదు..తమకు పింఛను సొమ్ము మంజూరైనప్పటికీ నగదు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన పింఛనుదారులు తాత మాణిక్యాలరావు, కాగితాల రమేష్, తాత రమాదేవి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను నగదు ఇప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మానసిక వికలాంగురాలనే దయ కూడా లేకుండా..అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు ఓ మానసిక వికలాంగురాలి పింఛన్‌ను నిలిపివేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. దీనికి కారణం ఆమె తండ్రి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడమేనని తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలో బొమ్మవరపు గోఖునేషు కుమార్తె మార్తమ్మ గత కొన్నేళ్లుగా పింఛన్ అందుకుంటోంది. అయితే ఈ నెల ఆమెకు పింఛన్ అందలేదు. దీనిపై ఆమె తండ్రి గోఖునేషు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడి ప్రోద్బలంతోనే తన కుమార్తె పింఛను నిలిపివేశారని వాపోయారు.బతికుండగానే చంపేశారు..ఓ కిడ్నీ వ్యాధి బాధితుడు బతికుండగానే చనిపోయాడని నిర్ధారించుకుని పింఛన్ ఆపేíÜన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. 5వ వార్డు ఉప్పరపేటలో ఉమ్మడిశెట్టి రామయ్య (73)కు పింఛనే జీవనాధారం. ఈ నెల అందరికీ రూ.7వేలు పింఛన్ ఇచ్చి ఆయనకు ఇవ్వలేదు. దీంతో సచివాలయ సిబ్బందిని సంప్రదించినా లాభం లేకపోయింది. మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఆయన మరణించినట్లు సచివాలయంలో రికార్డుల్లో ఉంది. అందుకే రెండు నెలలుగా పింఛన్ అందడం లేదని తెలిసింది. దీంతో రామయ్య నిశ్చేషు్టలయ్యారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్‌ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్‌ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్‌కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్‌ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్‌దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్‌చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
పింఛన్ హామీ తప్పెన్
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. – జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
ఏపీలో పెన్షన్ల పంపిణీ