సాక్షి, అమరావతి: కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ, వివిధ బహిరంగ సభల్లోనూ హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఆక్షేపించింది.
ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించి, ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకుండా వివక్ష చూపుతోందని సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్ల జీతాల చెల్లింపులో వివక్ష చూపడం ఎందుకని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment