government teachers
-
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
-
టీచర్ల జీతాల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష
సాక్షి, అమరావతి: కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ, వివిధ బహిరంగ సభల్లోనూ హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఆక్షేపించింది.ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించి, ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకుండా వివక్ష చూపుతోందని సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్ల జీతాల చెల్లింపులో వివక్ష చూపడం ఎందుకని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..
బతకలేక బడిపంతులు అనే నానుడి పోయింది.. బతకనేర్చిన బడిపంతులు అనే అపవాదును మోయాల్సి వచ్చింది.. కానీ ఇప్పుడు.. బతుకు నేర్పుతున్న బడిపంతులుగా ఆ బాధ్యతను సమాజం పూజించే స్థాయికి తీసుకెళ్లారు కొందరు ప్రభుత్వోపాధ్యాయులు!కాన్వెంట్లు, ఇంటర్నేషనల్ కరిక్యులమ్‌తో కార్పొరేట్ స్కూళ్లు.. పల్లెలు, టౌన్లు, సిటీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఉద్యోగ భద్రత కోసమే సర్కారు బడి, భవిష్యత్తుపై భరోసాకు మాత్రం ప్రైవేట్ స్కూలే సరి అనేది ప్రాక్టిస్లోకొచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలుసుకోవడం కన్నా కంఠస్థమే ఫస్ట్ వస్తోంది. నైతికవిలువల కన్నా ద్రవ్య విలువకే ఇంపార్టెన్స్ అందుతోంది. ఇంత మార్పులో కూడా తన ముద్రను ప్రస్ఫుటంగా చూపించుకుంటోంది ప్రభుత్వ పాఠశాల. గత వైభవాన్ని ప్రేరణగా మలచుకుంటోంది.రామాయణ, భారత, భాగవతాల కథలతో రామకృష్ణులను, కౌరవపాండవ పాత్రలను కళ్లముందు నిలబెట్టే గురువులు, ఇంగ్లిష్ అంటే ఇష్టమున్నా కన్ఫ్యూజ్ చేసే టెన్సెస్తో భయపెట్టే ఆ భాషను సింపుల్‌గా బుర్రకెక్కించి.. అయ్యో ఇది ఎంత వీజీ అనుకునేలా చేసే టీచర్లు, అమ్మో లెక్కలా.. గొట్టు అనుకునే పిల్లల లాజిక్ సెన్స్‌కు రెక్కలు తొడిగి.. లెక్కల మీద మోజును పెంచే మాష్టార్లు, సైన్స్ అంటే పళ్లు తోముకోవడం, సైన్స్ అంటే ఏడ్వడం, నవ్వడం, ఆకలవడం, పరుగెత్తడం, గెంతడం, అలసిపోవడటం, ఉత్సాహపడటం, నిద్రపోవడమే.. ఒక్కమాటలో ‘సైన్స్ అంటే బతుకురా’ అంటూ తేల్చేసి ఆ కొండను పిండి చేయించే సార్లు, ఊరి సర్పంచ్ ఎవరు, వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తాడు?, గాంధీ తాతా చాటిందేంటి?, చాచా నెహ్రూ చెప్పిందేంటి.. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సాంఘిక శాస్త్రం అంటూ లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ పెంచిన నాటి బోధకులు.. నేటి ప్రభుత్వోపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాతలవుతున్నారు. నిజమే! తెలివిడితనాన్నే ప్రోగ్రెస్‌గా పరిగణిస్తున్న గురువులతో ప్రభుత్వ పాఠశాలలు పాఠాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఇదిగో ఈ టీచర్లున్నారు. వాళ్లు అందుకుంటున్న గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలను చదవాల్సిందే!సొంత డబ్బుతో ప్రొజెక్టర్‌ను అమర్చిన టీచర్..రామగిరి దిలీప్ కుమార్ సెకండరీ గ్రేడ్ టీచర్. ఆసిఫాబాద్ జిల్లాలోని కోపుగూడ ప్రభుత్వ పాఠశాలలో బోధన వృత్తిని ప్రారంభించారు. తర్వాత మంచిర్యాల జిల్లా, కొమ్ముగూడేనికి బదిలీ అయ్యారు. తర్వాత పదమూడేళ్లు మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట, క్లబ్ రోడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ప్రతిచోట తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం నుంచి స్కూల్లో సౌకర్యాల పెంపునకు కృషి, సొంత డబ్బుతో ప్రొజెక్టర్లను తెచ్చి డిజిటల్ బోధన వరకు చదువు మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. స్కూల్‌కు ఒక గంట ముందే వెళ్లి, ఒక గంట ఆలస్యంగా వస్తుంటారు.4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు చెబుతూ గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతను ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. 11 మందే విద్యార్థులున్న స్కూళ్లను 250 మంది విద్యార్థుల స్ట్రెంత్‌కి చేరుస్తోంది. గత జూలైలో ఆయన లక్సెట్టిపేట నుంచి ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. ‘సారు వెంటే మేమ’ంటూ 105 మంది విద్యార్థులు అంతకుముందు స్కూల్లోంచి టీసీ తీసుకుని ముల్కల్లగూడ స్కూల్లో చేరారు. దూరభారాన్ని లెక్కచేయక ఆటోలో వెళ్తున్నారు."ఫీజులు కట్టలేని ఎంతోమంది విద్యార్థులు సర్కారు బడిని ఎంచుకుంటున్నారు. వారికి సరైన బోధన అందిస్తే, బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు. వాళ్లను పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్ లేకుండా చేసినవాళ్లమవుతాం. టీచింగ్ అనేది ఉన్నతమైన వృత్తి. నిబద్ధతతో ఉంటూ నేను చేయగలిగినంత చేయాలనేదే నా తాపత్రయం!" – రామగిరి దిలీప్ కుమార్.బదిలీ రద్దుకై పిల్లలు ధర్నాకు దిగేంత ప్రభావం చూపిన సార్లు.."కాతలే గంగారాం.. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆ బడిలో ఆయనది తొమ్మిదేళ్ల సర్వీస్. అంకితభావంతో పనిచేసి పిల్లలు, పెద్దల మనసులను గెలుచుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాళ్లకు ప్రత్యేకంగా మరోసారి క్లాసులు తీసుకుంటారు. ఆ కర్తవ్యదీక్ష పిల్లలకు ఆయన మీద గౌరవాభిమానాలను పెంచింది. అందువల్లేమో మొన్న జూలైలో.. తమ సర్కి బదిలీ అవుతోందని తెలిసి.. ఆ స్కూల్ పిల్లలంతా రోడ్డు మీద ధర్నాకు దిగారు సర్ బదిలీ రద్దు చేయాలని కోరుతూ! ఊరి పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతెందుకు స్వయానా గంగారాం సర్ వచ్చి చెప్పినా ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పితే ధర్నా విరమించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో విషయంలో చురుకుదనాన్ని, ఆసక్తిని, ఉత్సుకతను చూపిస్తూంటారు. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఎవరికి ఏ విషయంలో ప్రోత్సాహం అవసరమో గ్రహించి అందించాలి. కోపం, కరుకుదనంతో కాకుండా వాత్సల్యంతో వాళ్లను దారిలో పెట్టాలి. పిల్లలు ఉన్నతంగా ఎదగాలనేది మా ప్రయత్నం!" – కాతలే గంగారాం.మంచిర్యాల జిల్లా, పొనకల్లో ప్రధానోపాధ్యాయుడైన జాజల శ్రీనివాస్ మీద కూడా ఆయన విద్యార్థులకు గౌరవాభిమానాలు మెండు. పొనకల్ స్కూల్‌తో ఆయనది 12 ఏళ్ల అనుబంధం. గత జూ¯Œ లో శ్రీనివాస్ సర్కి అక్కపల్లిగూడకు బదిలీ అయింది. వెంటనే పొనకల్ స్కూల్లోని 141 మంది పిల్లలు అక్కపల్లిగూడ బడిలో చేరిపోయారు. అప్పటి వరకు 11 మందే ఉన్న ఆ స్కూల్లో శ్రీనివాస్ రాకతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, 4, 5వ తరగతి విద్యార్థులకు గురుకుల, నవోదయ ప్రవేశం దొరికేలా బోధించడంతో శ్రీనివాస్ సర్ ఉన్న చోటే చేరాలని పట్టుబట్టి మరీ ఆ స్కూల్లో చేరారు పిల్లలు.వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌తో పాఠాలు చెబుతున్న స్టార్లు..ముద్దాడ బాలరాజు.. నల్లగొండ జిల్లా, వావికొల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయుత అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు ఉచితంగా టై, బెల్ట్, షూస్‌ని పంపిణీ చేస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి కావల్సిన సౌకర్యాలను కల్పిస్తూ వావికోల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మనసుల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ఇటీవల కొత్తతండాకు బదిలీ కావడంతో తమ స్కూల్‌ని వదలి వెళ్లద్దంటూ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.జీనుగపల్లి సుధాకర్, రామగిరి సందీప్‌లకు వీరబోయనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పదకొండేళ్ల అనుబంధం. ఆ ఇద్దరూ సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారంతో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించారు. డిజిటల్ బోధనాసౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల 50 మంది విద్యార్థులతో ఉన్న ఆ బడి 150 మందికి చేరుకుంది. అయితే ఇటీవల ఈ ఇద్దరు కూడా వరుసగా వావికోల్కు, నల్లగొండకు ట్రాన్స్ఫర్ కావడంతో ‘మాష్టార్లూ.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ఇద్దరు టీచర్లు అందించిన సేవలను విద్యార్థుల తల్లిదండ్రులే కాదు గ్రామస్థులూ కొనియాడారు.కట్టెబోయిన సైదులు.. శిల్గాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆకవరపు శివప్రసాద్ కూడా అదే స్కూల్లో టీచర్. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టక ముందే.. ఆ ఇద్దరూ సొంత ఖర్చులతో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు కొని, తమ స్కూల్లో ఇంగ్లిష్‌లో బోధన మొదలుపెట్టారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక ఆ ఊర్లో ఏ విద్యార్థీ ప్రైవేట్ స్కూల్ మెట్లెక్కని శుభపరిణామం చోటుచేసుకుంది. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ టీచర్లిద్దరూ పూర్వ విద్యార్థుల సహకారంతో వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. ఆ గురుద్వయం కృషి వల్ల అయిదేళ్లుగా ఆ స్కూల్ గురుకుల పాఠశాల పోటీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ఈ కీర్తి శిల్గాపురం చుట్టుపక్కల ఊళ్లకూ వ్యాపించి అక్కడి పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరికీ వరుసగా పెద్దమునిగల్, రామడుగులకు బదిలీ అయింది. ఊరు ఊరంతా ఆ ఇద్దరికీ కన్నీటి వీడ్కోలు పలికింది. వాయిద్యాలతో సాగనంపి.. ఆ టీచర్ల మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంది.గురిజ మహేశ్.. పదమూడేళ్లుగా టీచర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఏ బడిలో ఉన్నా దాని మౌలిక వసతుల కల్పనకై శ్రమిస్తారు. అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తారు. విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టిపెడ్తారు. పిల్లలు బడి ఎగ్గొట్టి బావులు, పొలాల చుట్టూ తిరుగుతుంటే వెళ్లి వాళ్లను తన బైక్ మీద ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకొస్తారు. చదువు ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఆయన దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ బడికి ఆయన 2023లో డిప్యుటేషన్‌పై వచ్చారు. ఇటీవల జరిగిన బదీలీల్లోనూ ఆయన అదే బడిలో కొనసాగుతున్నారు. వృత్తిని ప్రేమిస్తూ, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతూ.. బోధన గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న గురువులు అందరికీ వందనాలు! - సాక్షి నెట్వర్క్ -
మీ చేతుల్లోనే రాష్ట్ర భవిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని.. వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించా రు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30వేల మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నా.. హామీల అమలు దృష్ట్యా 7.3% నిధులే ఇవ్వగలిగాం. స్కూళ్లలో దారుణ పరిస్థితులు.. గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ స్కూళ్లుంటే వాటిలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లు 10వేలు ఉంటే వాటిలో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లలో గొప్ప టీచర్లున్నారా? టెన్త్, ఇంటర్ ఫెయిలైన వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఎక్కడో లోపం ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలూ కారణమే. మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రైవేటుబాట పడుతున్నారు.మహిళా టీచర్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా టాయిలెట్లు లేవు. కొన్నిచోట్ల స్కూళ్లలో పశువులను కట్టేసే పరిస్థితి. మేం పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం. పారిశుధ్య కారి్మకులను నియమిస్తాం. మీరే అంబాసిడర్లు.. తెలంగాణ సాధనలో టీచర్ల పాత్ర కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. టీచర్లతో పెట్టుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ వారిలో విశ్వాసం నింపుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల భవిత టీచర్ల చేతుల్లోనే ఉంది. గత ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు 2 లక్షల మేర తగ్గాయి. అందువల్ల టీచర్లు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా భావించే పరిస్థితి తేవాలి..’’అని సీఎం రేవంత్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. పేరుకేనా ముఖాముఖి: టీచర్ల అసంతృప్తి ప్రమోషన్లు పొందిన వారితో సీఎం ముఖాముఖి అని చెప్పి అధికారులు తమను తీసుకొచ్చారని.. కానీ ఒక్కరికైనా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సమావేశం అనంతరం టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీచర్లు ఏమేం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నారు.కనీసం జిల్లాకు ఒకరినైనా సీఎంతో మాట్లాడిస్తారని భావించామని.. కానీ సమావేశం కేవలం ప్రసంగాలకే పరిమితమైందని టీచర్లు పేర్కొన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచి్చన సీఎంకు పీఆరీ్టయూటీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. -
బాబొస్తే ఇంగ్లిష్ మీడియం రద్దే..!
సాక్షి, అమరావతి: తన పాలనలో అన్ని రంగాల్లో ‘ప్రైవేటు’కు పెద్దపీట వేసి ప్రభుత్వ రంగాన్ని నిండా ముంచిన చంద్రబాబు చివరకు పేదింటి పిల్లలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలనూ విడిచిపెట్టలేదు. తన జమానాలో కార్పొరేట్ విద్యా సంస్థలైన ‘చై–నా’లకే ఆయన పెద్దపీట వేయడం ఇందుకు నిదర్శనం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ఆరు వేల స్కూళ్లను మూసేసి వాటికి మంగళం పాడేశారు. పేదల విద్య ప్రభుత్వ బాధ్యతే కాదని ప్రకటించిందీ కూడా ఆయనే. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అసలు నైపుణ్యం ఉండదనేది చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. నారాయణ స్కూళ్ల సిబ్బందితో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ ఇప్పించిన తెంపరితనం ఆయనది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి పిల్లల చదువులకు పెద్దపీట వేసింది. దేశంలో కనివినీ ఎరుగని స్థాయిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. పేద విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తోంది. దీన్ని చంద్రబాబు, ఆయన ముఠా జీర్ణించుకోలేకపోతోంది. పేద పిల్లలు ఇంగ్లిష్‌లో నిష్ణాతులైతే ఎక్కడ తమ పెత్తందారుల పిల్లలకు పోటీ వస్తారోనని ఇంగ్లిష్ మీడియం చదువులను తొలగించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ తాజా మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ విద్య రివ్యూ’ అనే అంశాన్ని చేర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పేద పిల్లల చదువుల ఆనందాన్ని తుంచేయాలనే..వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధనను అందిస్తుంటే తెలుగు మీడియం సరైందంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. ఇదే జరిగితే పేదింటి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను మా ఊళ్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను. ఈ సిలబస్ పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంది.. దీంతో చదవడం చాలా కష్టమైంది. ఎలాగోలా బట్టీపట్టి పరీక్షలు పాసయ్యాను గాని మంచి మార్కులు సాధించలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇంగ్లిష్‌లోనే చేస్తుండడంతో ప్రశ్నలను అర్థం చేసుకోలేక ఉద్యోగం సాధించలేకపోయాను. నన్ను ఉద్యోగిగా చూడాలన్న నా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. ఇదే పరిస్థితి నా ఇద్దరు పిల్లలకు రాకూడదని వారిని కాకినాడలో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించాను. ఇప్పుడు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అని కాకినాడ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్లడించారు. రాష్ట్రంలో అందరి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఇప్పటి లాగా తాము చదువుకున్నప్పుడు సరైన సదుపాయాలు ఉండి ఉంటే తాము మరింత ఉన్నతంగా ఉండేవారిమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీని వారంతా కీర్తిస్తున్నారు. తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు సీఎం జగన్ పుణ్యమాని నాణ్యమైన విద్య ఇన్నేళ్లకు అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పెత్తందారుల పిల్లలకు పేద పిల్లలు ఎక్కడ పోటీ వస్తారోనని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు విద్యను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.విద్య ప్రభుత్వం బాధ్యత కాదని కాడిపారేసిన బాబు.. పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని.. ప్రైవేటు బడులు బాగుంటాయని చెప్పిందీ ఆయనే కావడం గమనార్హం. డబ్బున్నవారు వాటిల్లో చదువుకుని మేధావులుగా తయారవుతారని.. పేద పిల్లలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేరాలని పిలుపునిచ్చిందీ చంద్రబాబే. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. వారి చదువులన్నా ఎంతటి చులకన భావం ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యను నామరూపాల్లేకుండా చేశారు. తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను చంద్రబాబు మూసివేశారు. అక్కడి విద్యార్థులను గాలికి వదిలేశారు. అంతకుముందు టీడీపీ పాలనలోనే మరో 4,300 ప్రభుత్వ పాఠశాలలను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించారు.ప్రభుత్వ ఉపాధ్యాయులను హేళన చేసి..పేదింటి పిల్లలనే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను సైతం చంద్రబాబు దారుణంగా అవమానించారు. వారిలో బోధనా నైపుణ్యాలు తక్కువగా ఉంటాయని గతంలో బహిరంగంగానే ప్రకటించిన చరిత్ర ఆయనది. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ స్కూళ్ల సిబ్బందితో శిక్షణ ఇప్పించే సాహసానికి కూడా ఒడిగట్టారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా, సదుపాయాలు కల్పించకుండా ఫలితాలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. ఎవరైనా ధైర్యం చేసి తమ స్కూళ్లకు సిబ్బందిని అడిగితే బహిరంగంగానే చంద్రబాబు సస్పెండ్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఎంతోమంది ఉపాధ్యాయులు అవమానభారంతో ప్రాణాలు వదిలిన ఘనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2000లో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచి మరీ అవమానించారు. ఆ సంవత్సరం 100 శాతం ఫలితాలు తేవాలని చంద్రబాబు ఆదేశించారు. తమ పాఠశాలకు సరిపడినంత మంది టీచర్లు లేరని ఆయన ఎదుటే చెబితే.. ఆగ్రహంతో రగిలిపోయిన బాబు అదే వేదికపై సదరు హెచ్ఎంను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2003లో బాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప గోరంట్ల జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని అనుచరులను రెచ్చగొట్టారు. ఇలా చంద్రబాబు పాలనలో ఉపాధ్యాయులకు అడుగడుగునా అవమానాలే దక్కాయి.చై–నాలపై ప్రేమ అందుకే..తన అనుకూలవర్గానికి చెందిన నారాయణ– చైతన్య విద్యా సంస్థలను తలదన్నేలా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తుంటే చంద్రబాబు ఈర‡్ష్యతో రగిలిపోతున్నారు. సర్కారు బడులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు. పేదలు ఎప్పుడూ అలాగే ఉండాలి, పైస్థాయికి వెళ్లగూడదన్న కక్షతో ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దంటున్నారు. పెత్తందారుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం, ఐబీ సిలబస్ బోధన ఉండాలని భావిస్తున్నారు. తద్వారా పేద పిల్లలను కూలీలుగా మార్చాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 45 వేల ప్రభుత్వ బడులను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం తప్పని, దీనివల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి నారాయణ, చైతన్యతో పాటు రాష్ట్రంలోని మొత్తం 15,784 ప్రైవేటు స్కూళ్లలోను ఇంగ్లిష్ మీడియంలోనే బోధన సాగుతోంది. మరి అక్కడ లేని ఇంగ్లిష్ ఇబ్బంది ప్రభుత్వ బడుల విషయంలోకి వచ్చేసరికి ఏమొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. సర్కారు బడులను నాశనం చేసి, నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచడమే ఆయన ఎత్తుగడల ఉద్దేశమని అంటున్నారు.పేద పిల్లలు తినే అన్నంలో మన్నుదాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చంద్రబాబు ప్రభుత్వం అర్ధాకలితో అలమటించేలా చేశారు. బడికి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం పెట్టే భోజనంలోనూ చంద్రబాబు కక్తుర్తి పడ్డారు. రోజూ ముద్దయిపోయిన అన్నం, నీళ్ల సాంబారు ఇదొక్కటే మెనూ. ఈ అన్నం తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లలు ఆకలితో అలమటించారు. తిన్నవారికి కడుపునొప్పి సర్వసాధారణంగా మారింది. ఇక కౌమార దశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచ్చిన పిల్లల్లో గరిష్టంగా 30 శాతం మంది ఈ నాసిరకం మధ్యాహ్న భోజనం చేయలేకపోయేవారు. రక్తహీనతతో ఆస్పత్రి పాలైన విద్యార్థులు కోకొల్లలు. ప్రభుత్వ బడుల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబుకు భుజం కాసే ఎల్లో మీడియా ఏనాడూ బడి పిల్లల ఆకలి కేకలను విననట్టే నటించింది. పేదల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాదని బహిరంగంగానే ప్రకటించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే సర్కారు బడులను నిర్వీర్యం చేసేందుకు మధ్యాహ్న భోజనంలో కోత పెట్టారు. ఏటా సగటున రూ.450 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. ఈ నిధులను సైతం సరుకు సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో చెల్లించిందీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యేదాకా సర్కారు బడి పిల్లలను పట్టించుకున్న వారే కరువయ్యారు.పాఠశాల భవనాలకు బీటలు.. బెంచీలకు చెదలుచంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ బడికి భవనాన్ని నిర్మించిన పాపాన పోలేదు. ఏనాడూ అవి ఎలా ఉన్నాయో చూసింది లేదు. బాబు 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలో బడుల రూపురేఖలు మార్చడం, హైస్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం, ప్రతి స్కూల్లోనూ బాల, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు వంటి హామీలు ఇచ్చారు. కానీ 2019లో జగన్ సీఎం అయ్యేనాటికి దాదాపు 6 వేల స్కూళ్లను చంద్రబాబు మూసివేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపు మూతపడ్డాయి. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట 1,725 స్కూళ్లకు తాళాలు వేసేశారు. 2019 మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు ఇవే అంశాలను పొందుపరిచారు. చివరకు బడిలో సుద్దముక్కలు, పిల్లలు, ఉపాధ్యాయులకు బెంచీలు లేని పరిస్థితిని తెచ్చారు. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలమైపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. గత్యంతరం లేక వేల స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోవడం, అవకాశం లేనివారు బడి మానేసే దుస్థితి బాబు జమానాలోనే సంభవించాయి.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో దోపిడీఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. వీటికే ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌గా చంద్రబాబు పేరు మార్చారు. కేవలం 33 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన అనుకూలవర్గాల చేతుల్లోని 383 ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దండుకున్నారు.నేడు అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలుటీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. 43 లక్షల మంది పిల్లలకు సమాన అవకాశాలు అందించారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1,958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023లోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు.నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులువిద్యా సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ రూ.73 వేల కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 సౌకర్యాల కల్పనకు మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరంతరం నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధమైన తాగునీరు, భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించారు. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది.భాషపై పట్టుకోసం టోఫెల్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు వీలుగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. భాషపై పట్టు సాధించేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేంపదుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇస్తోంది. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించింది. ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైస్కూళ్లల్లో నియమించింది.సీబీఎస్ఈ బోధన పేదింటి పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా మొదటి విడతలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విద్యార్థులు పదోతరగతి పరీక్షలను సీబీఎస్ఈ సిలబస్‌లో రాయనున్నారు.బాలికల కోసం జూనియర్ కాలేజీహైస్కూల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ బాలికలకు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చి రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు.ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది.పేదలకు ‘ఐబీ’ విద్యపేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి దాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ అమల్లో ఉంది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. -
డుమ్మా టీచర్లపై నజర్!
సాక్షి, హైదరాబాద్: ఫలానా పాఠశాలలో.. ఫలానా టీచర్.. రికార్డుల్లో వివరాలు ఉంటాయి. బడిలో చూస్తే ఆ టీచర్ ఉండరు. నెలలకు నెలలుగా బడి మొహమే చూడరు. ఏమయ్యారంటే.. ప్రధానోపాధ్యాయుడికీ తెలియదు, మండల విద్యాధికారికీ తెలియదు.. ఆపై అధికారులకు అసలు సమాచారమే ఉండదు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఐదు వేల మందికిపైనే ప్రభుత్వ టీచర్లు సుదీర్ఘకాలం నుంచి పాఠశాలలకు రావడం లేదని అంచనా. లెక్కల్లో మాత్రం ఆయా స్కూళ్లలో సదరు టీచర్లు పనిచేస్తున్నట్టు ఉంటుంది. విద్యార్థులకు మాత్రం చదువు అందదు. ఇలాంటి టీచర్లు రాజీనామా చేస్తేనో, ప్రభుత్వమే తొలగిస్తేనో, మరోచోటికి బదిలీ చేస్తేనో తప్ప.. ఆ స్కూల్‌కు మరో టీచర్‌ను నియమించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలం నుంచి విధులకు రాని ఉపాధ్యాయులపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. ‘డుమ్మా’టీచర్ల వివరాలు ఇవ్వాలని తాజాగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ప్రత్యేక వెబ్సైట్లో వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల వరకు ప్రభుత్వ స్కూళ్లుండగా.. వాటిలో ప్రస్తుతం 1.05 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఐదు వేల మందికిపైగా విధులకు రావడం లేదని పాఠశాల విద్య డైరెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. వీరిలో చాలా మంది తొలుత సెలవు పెట్టి, ఆ గడువు ముగిసినా హాజరవడం లేదు. ఇంకొందరైతే సెలవులు కూడా పెట్టకుండానే గైర్హాజరు అవుతున్నారని అంటున్నారు. అలాంటివారి వివరాలన్నీ తక్షణమే ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తాజాగా ఆదేశించింది. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. టీచర్లకు సంబంధించిన ఏడాది డేటాను ఈ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించింది. ఏదో ఓ కారణం చెప్తూ.. కొందరు టీచర్లు విదేశాల పర్యటనలకు వెళ్తున్నారు. కొందరు మహిళా టీచర్లు.. వారి భర్త, పిల్లలు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్లాలంటూ సెలవులు పెడుతున్నారు. కానీ ముందుగా తీసుకునే సెలవు నెలా రెండు నెలలు మాత్రమే అయితే.. గడువు తీరినా అక్కడే ఉండటమో, తిరిగి వచ్చినా.. బడులకు గైర్హాజరు కావడమో చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి అనుమతి తీసుకుంటున్నారని.. కానీ తర్వాత సెలవులు పొడిగించాలంటూ తమకు మెసేజీలు, మెయిల్స్ పెడుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. కానీ నిబంధనల మేరకు వాటిని తాము అనుమతించలేక పోతున్నామని అంటున్నారు. అలాంటి టీచర్లంతా అనధికారికంగా గైర్హాజరైనట్టు రికార్డుల్లో నమోదవుతోంది. ఈ సమాచారం డైరెక్టరేట్, డీఈవో పరిధిలో ఉండటం లేదు. మరికొందరు టీచర్లు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నట్టు విద్యాశాఖ దృష్టికొచ్చింది. అలాంటి వారు అనారోగ్య కారణాలతో సెలవులు పెడుతున్నారని.. ఆ తర్వాత అయినా సరైన పత్రాలతో సెలవుల పొడిగింపునకు ప్రయత్నించడం లేదని అధికారులు చెప్తున్నారు. వారు కూడా అనధికారికంగా గైర్హాజరవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఉన్న పలువురు టీచర్లు.. వారికి బదులు ఎవరికో కొంత డబ్బులిచ్చి బడుల్లో బోధించేలా చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ‘డుమ్మా’మాస్టార్ల లెక్క ఎందుకు లేదు? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లపై చాలా ఏళ్లుగా సరైన పర్యవేక్షణ లేదని.. డీఈవోలు, ఎంఈవోల కొరత దీనికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్ హెచ్ఎంలకు ఏడెనిమిది మండలాలను అప్పగించి.. ఇన్చార్జి ఎంఈవో బాధ్యతలు నిర్వర్తింపజేస్తున్న పరిస్థితి ఉంది. స్కూళ్లలో అటెండర్లు, క్లర్కుల కొరతతో హెచ్‌ఎంలపై పని ఒత్తిడి పెరిగింది. దీనికితోడు ఇప్పటివరకు ఆన్లైన్ హాజరు విధానం లేకపోవడంతో ఉపాధ్యాయుల అటెండెన్స్ రాష్ట్ర కార్యాలయం పరిధిలోకి రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నారు. టీచర్ల సెలవులు, ఎన్ని రోజులకు అనుమతి తీసుకున్నారు? ఎన్ని రోజుల నుంచి గైర్హాజరు అవుతున్నారు? అనే వివరాలను అందులో అప్లోడ్ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా బడి ఎగ్గొట్టే టీచర్ల బండారం బయటపడుతుందని, వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుందని పాఠశాల విద్య డైరెక్టరేట్ వర్గాలు చెప్తున్నాయి. సెలవుల అనుమతి ఎలా..? ► సాధారణంగా ఉపాధ్యాయులు వివిధ రకాలుగా సెలవులు పెట్టే వీలుంది. క్యాజువల్ లీవ్ పెట్టేందుకు గరిష్టంగా 10 రోజులకు అనుమతి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో మెడికల్ లీవ్ పెట్టడానికి ఎలాంటి కాలపరిమితి ఉండదు. తగిన ధ్రువపత్రాలు, వైద్యుల సిఫార్సులను చూపించాల్సి ఉంటుంది. ► ఇవి కాకుండా 180 వరకు ఈఎల్స్ (ఎర్న్డ్ లీవ్స్) ఉంటాయి. వీటిని పైఅధికారి అనుమతితో వాడుకోవచ్చు. ► సెలవుల మంజూరుకు సంబంధించి 2009లో తెచ్చిన జీవో 70యే ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం టీచర్లకు నాలుగు నెలల వరకు సెలవు ఇచ్చేందుకు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అధికారం ఉంటుంది. 4–12 నెలల వరకూ డీఈవో అనుమతి తీసుకోవాలి. ఏడాది నుంచి 4 ఏళ్ల వరకూ లీవ్ తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టర్ అనుమతి తీసుకోవాలి. అంతకు మించి సెలవు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. డుమ్మాలపై చర్యలు ఎలా? ► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అనుమతి లేకుండా సెలవును పొడిగిస్తే దాన్ని గైర్హాజరుగానే పరిగణిస్తారు. ఇలా చేసినప్పుడు నిబంధనల ప్రకారం.. సదరు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ► ఉద్యోగి గైర్హాజరైన కాలాన్ని సర్వీస్ నుంచి తొలగించాలి. సస్పెండ్ చేయవచ్చు. అనధికార గైర్హాజరు ఎక్కువగా ఏళ్లకేళ్లు ఉంటే నోటీసు ఇచ్చి సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఐదేళ్లు దాటి గైర్హాజరైతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్టుగానే భావించి చర్యలు తీసుకోవచ్చు. ► అనుమతి లేకుండా సెలవులను పొడిగించినా, గైర్హాజరైనా ఆ కాలానికి ఎలాంటి వేతనం ఇవ్వరు. పూర్తిగా లాస్ ఆఫ్ పే గానే పరిగణిస్తారు. సస్పెండ్ చేస్తే మాత్రం సగం వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏళ్లకేళ్లు రాకున్నా మళ్లీ విధుల్లోకి.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నిబంధనలు సరిగా అమలుకాని పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏళ్లకేళ్లు విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి విధుల్లో చేర్చుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ► జగిత్యాల జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ఏకంగా 12 ఏళ్లపాటు విధులకు రాకున్నా.. తిరిగి జాయిన్ చేసుకున్నారు. ► మరో జిల్లాలో మూడేళ్ల పాటు డుమ్మా కొట్టిన టీచర్‌ను విధుల్లోకి తీసుకున్నారు. అంతకాలం గైర్హాజరైనవారిని తిరిగి జాయిన్ చేసుకునే అధికారం డీఈవోకు లేకున్నా తీసుకోవడం విశేషం. పర్యవేక్షణ లోపమే అసలు కారణం డుమ్మా కొట్టే టీచర్ల వివరాలు ఇప్పటికీ డైరెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులో లేవంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఈవోలు 16 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవోల ఖాళీలు భారీగా ఉన్నాయి. డీఈవోలు 16 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ డైట్ కాలేజీల లెక్చరర్లు, ఇతర అధికారులను ఇన్చార్జులుగా పెట్టి నడిపిస్తున్నారు. దీంతో బడులపై పర్యవేక్షణ లోపించింది. టీచర్లు ఇష్టానుసారం అనుమతి లేకుండా డుమ్మా కొట్టడం సహించరాని నేరమే. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం' 7 వేల ఎస్జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్‌లో నియమించనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు. కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన -
ఉపాధ్యాయ బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీవో 317తో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు. జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 59వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ ధరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. చదవండి: హైదరాబాద్‌కు మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి -
మాకూ బదిలీలు, పదోన్నతులు.... గురుకుల సిబ్బంది డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పుడు బదిలీలు, పదోన్నతుల మంత్రాన్ని జపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తమ విషయంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తయి ఐదేళ్లు కావస్తోంది. మరోవైపు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చాలామంది గురుకుల టీచర్లకు స్థానచలనం కలిగినప్పటికీ వారింకా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీలు నిర్వహిస్తే తమకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందనే భావన వారిలో ఉంది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో తాజాగా బదిలీలు నిర్వహిస్తే కోరిన చోట పోస్టింగ్ వస్తుందని వారు ఆశిస్తున్నారు. 20వేల మందికి అవకాశం...! మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో 30 శాతం గురుకుల విద్యా సంస్థలు గత నాలుగేళ్లలో ఏర్పాటు చేసినవే. కొత్త గురుకులాల్లో మెజార్టీ టీచర్లు డిప్యుటేషన్ పద్ధతిలో కొనసాగుతుండగా, మరికొందరు కాంట్రాక్టు/తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. ఈ క్రమంలో గురుకులాల్లో బదిలీలు చేపడితే అర్హత ఉన్న టీచర్లకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు గురుకుల ఉద్యోగ సంఘాలు వరుసగా వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో బదిలీల ప్రక్రియ చేపడితే దాదాపు 20 వేల మందికి అవకాశం దక్కుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగులపై పని ఒత్తిడి కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా గురుకులాల్లోనూ బదిలీలు నిర్వహించాలి. అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లకు కూడా పదోన్నతులు కల్పించాలి. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
కలిసి చదివి.. ఒకేచోట ఉద్యోగం
రంగారెడ్డి: ఆ ముగ్గురు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చదువులు ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మళ్లీ ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాల కలిపింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా ఒక్కరు పాఠశాల సబార్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన అస్కాని శ్రీనివాససాగర్, సుజాత, శంకరయ్యలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 1985–86వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకరు సబార్డినేటగా ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓలో గద్వాల జిల్లా నుంచి సుజాత, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శంకరయ్య మండల పరిధిలోని కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చారు. అప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అస్కాని శ్రీనివాససాగర్తో కలిసి ఇదే పాఠశాలలో మిగతా ఇద్దరు చేరారు. బాల్య మిత్రులు మళ్లీ ఒకే పాఠశాలలో కలుసుకోవడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్కే
సాక్షి, అమరావతి: విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా కార్యక్రమాలకే పరిమితం చేస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ (పాఠశాల విద్య) జీవో 185 జారీ చేశారు. రాష్ట్ర ఉచిత, నిర్బంధ విద్యాహక్కు 2010 చట్టాన్ని సవరిస్తూ ఈ ఉత్తర్వులు వెలువరించారు. తాజా ఉత్తర్వులతో బోధనాభ్యసన ప్రక్రియ, విద్యా సంబంధిత కార్యక్రమాలు సమగ్రంగా కొనసాగి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాల బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా అసిస్టెంట్లకు ఇప్పటికే అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మెరుగైన నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటోంది. తద్వారా టీచర్లు ఇకపై పూర్తిగా బోధనపైనే దృష్టి కేంద్రీకరించేలా చేసి వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించింది. విద్యా సంస్కరణలతో.. విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో మూడేళ్లుగా పరిస్థితులు సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. విద్యాదీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి, ఫౌండేషన్ స్కూళ్లు, ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులకు సర్కారు భరోసా కల్పిస్తోంది. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.24 వేల వ్యయంతో స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్ల వ్యయంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12 వేల విలువ చేసే ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది. 4 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్‌ను ప్రత్యేక యాప్ ద్వారా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు తరగతి గదుల్లో టీవీలు, డిస్ప్లే బోర్డుల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా గ్రహించేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లీష్ ల్యాబ్‌లను నెలకొల్పి 11 వేల స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లను దశలవారీగా సీబీఎస్ఈతో అనుసంధానిస్తోంది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపట్టడంతోపాటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బై లింగ్యువల్) అందచేస్తోంది. మనబడి నాడు – నేడు ద్వారా 56,572 ప్రభుత్వ విద్యా సంస్థల్లో రూ.16,450 కోట్ల వ్యయంతో దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తీర్చిదిద్దుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఈ పనుల్లో నాణ్యత పరిశీలన బాధ్యతలను అప్పగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ బడులు, కళాశాలల్లో టాయ్‌లెట్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు తొలిసారి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత మన రాష్ట్రానిదే. రాష్ట్రవ్యాప్తంగా 44,472 ప్రభుత్వ స్కూళ్లలో 45,313 మంది ఆయాలను నియమించి గౌరవ వేతనం చెల్లిస్తోంది. నాడు – నేడు స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక స్తోమత కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. జగనన్న విద్యాకానుక కింద బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్కులు, వర్కు బుక్కులు, బ్యాగు, 3 జతల యూనిఫారం, షూ, సాక్సులతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి విద్యతో పాటు మంచి పౌష్టికాహారం కూడా ఎంతో అవసరం. దీన్ని గుర్తించి జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పోషక విలువలున్న ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కారాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది. ఏ అవసరం వచ్చినా.. టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుండటం వల్ల బోధనాభ్యసన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఏ అవసరం వచ్చినా టీచర్లకే బాధ్యతలు కేటాయించడం వల్ల పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుండా పోతున్నారు. కొంతమంది టీచర్లు ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్ల పీఏలుగా కూడా టీచర్లు పనిచేసిన పరిస్థితి గతంలో నెలకొంది. ఇలా మొత్తం టీచర్లలో 5 శాతం మంది పాఠశాలలకు దూరం కావడం బోధనపై ప్రభావం చూపుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని, ఇతర విధుల్లో ఉంటున్న వారిని వెంటనే వెనక్కు రప్పించాలని గడువు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని వెనక్కు రప్పించి పాఠశాలల్లో బోధనకు వీలుగా పునర్నియామకం చేసింది. ఇన్నాళ్లకు.. తమకు విద్యేతర కార్యక్రమాలు అప్పగించవద్దని టీచర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో లక్ష్యాల మేరకు బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించలేకపోతున్నామని నివేదించినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రయోజనం ఇలా.. ప్రతి విద్యార్థిపైనా దృష్టి టీచర్లు పాఠశాలల్లో పూర్తిగా విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల విద్యార్ధులకు పూర్తిస్థాయిలో బోధన అందుతుంది. టీచర్లు తమ బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించడానికి వీలుంటుంది. తరగతిలో ఒక్కో విద్యార్థి అభ్యసనం ఎలా ఉంది? లోపాలు ఏమిటి? అనే అంశాలపై దృష్టి సారించి లోపాలను సరిదిద్దడంపై టీచర్లు దృష్టి సారించగలుగుతారు. ఉన్నత ప్రమాణాలు... పాఠశాలల్లో బోధనాభ్యసన కార్యక్రమాలు మెరుగుపడటం ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు దారి తీస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఫౌండేషనల్ స్కూళ్ల విధానం తెచ్చిన విషయం తెలిసిందే. స్కూళ్ల మ్యాపింగ్ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడానికి వీలుగా ఫౌండేషన్ విద్యతో సహా ఆరంచెల స్కూళ్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 3, 4 5 తరగతులను కిలోమీటర్ పరిధిలోని ప్రీ–హైస్కూళ్లు, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో బోధించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 4,943 ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను 3,557 ప్రీ–హైస్కూల్, ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశారు. జీవో నెంబర్ 117 ప్రకారం ఇలా మ్యాపింగ్ అయిన హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో 7,928 మంది సబ్జెక్ట్ టీచర్లు అదనంగా అవసరమని గుర్తించారు. ఈ మేరకు సబ్జెక్టు టీచర్ల నియామకానికి వీలుగా 3,095 ఇతర సబ్జెక్టు పోస్టులను అవసరమైన సబ్జెక్టు పోస్టులుగా మార్పు చేశారు. ఇవే కాకుండా 3,993 పోస్టులను సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంటు పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటిలో 287 స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టులుగా, 3,706 ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇలా సబ్జెక్టు టీచర్ పోస్టులుగా కన్వర్ట్ అయిన, అప్‌గ్రేడ్ చేసిన పోస్టులలో టీచర్లను నియమిస్తున్నారు. మ్యాపింగ్‌తో మిగులు టీచర్ల సర్దుబాటు 3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానంతో మిగులు టీచర్లను మ్యాపింగ్ అయిన స్కూళ్లలో నియమించడం ద్వారా విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. స్కూళ్ల పునర్విభజన కసరత్తు తర్వాత ఫౌండేషన్ ప్లస్, ప్రీ–హైస్కూల్, హైస్కూల్లో మిగులు ఉన్నట్లు గుర్తిస్తే తాత్కాలికంగా అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తోంది. పదోన్నతులు, ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఆర్టీఈ నిబంధనల ప్రకారం స్కూల్ కాంప్లెక్స్‌లో లేదా అదే మండలంలో సర్దుబాటు చేస్తున్నారు. దీని ప్రకారం ఇప్పటికే 3,726 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను తాత్కాలికంగా అవసరమైన ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారు. దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ పలుచోట్ల సరిగా అమలు చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు విద్యాశాఖ గుర్తించి దృష్టి సారించింది. బోధనకు వెళ్లకుంటే చర్యలు తప్పవు బోధనకు ఎక్కడా ఆటంకం లేకుండా ఉండాలని ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కొన్ని చోట్ల బోధనకు టీచర్లు విముఖత చూపుతున్నారని, కొన్ని చోట్ల సమన్వయం లోపం వంటి సమస్యలతో బోధన అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. మంగళవారం దీనిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్జేడీలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. పలు హైస్కూళ్లలో అవసరమైన సంఖ్యలో టీచర్లను నియమించినా బోధన చేయడం లేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ హైస్కూలులో 3నుంచి 10వ తరగతి వరకు 19 మంది టీచర్లను నియమించినా కింది తరగతులకు బోధన చేపట్టడం లేదని ఆర్జేడీ వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణ, ఉపపట్టణ ప్రాంతాల్లో మిగులుగా ఉన్న టీచర్లను మారుమూల ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. హైస్కూలు, మ్యాపింగ్ హైస్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లలో ఎక్కడా టీచర్ల కొరత అనేదే ఉండరాదని, ఆ దిశగా డీఈఓలు సర్దుబాటు చేయాలని సూచించారు. కర్నూలుకు 1,876 పోస్టుల మంజూరు కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా తీవ్ర సమస్యగా మారిన టీచర్ల కొరతను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం అదనపు టీచర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాకు ఏకంగా వివిధ కేటగిరీలలో 1,876 పోస్టులను కేటాయించింది. ఇతర జిల్లాల్లో మిగులు పోస్టులను ఈ జిల్లాకు మళ్లించడం ద్వారా సమస్యను పరిష్కరించింది. రాష్ట్ర విద్యాహక్కు చట్టం 2010లో అదనపు అంశాలు ఉపాధ్యాయులకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించకుండా ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని అంశాలను జోడించింది. ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 మార్చి 3న విడుదలైన జీవో 20లో వీటిని చేర్చింది. ఆ జీవోలో ప్రస్తుతం 29 రూల్స్ ఉండగా 30వ రూల్‌గా ‘డిప్లాయ్‌మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్’ (టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో నియమించడం) కింద దీన్ని పొందుపరిచింది. ► తరగతి గదిలో పిల్లల విద్యా సంబంధిత సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఉపాధ్యాయులు బోధన కార్యకలాపాల్లో తమ సమయాన్ని పూర్తిగా కేంద్రీకరించాలి. ఉత్తమ బోధనకు అంకితం కావాలి. ► ఉపాధ్యాయులు సాధ్యమైనంత వరకు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలు మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇతర విధుల్లో వారిని నియమించరాదు. ► ఏదైనా అనివార్య పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరినీ మోహరించిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో నియమించాలి. ► సెక్షన్ 27 నిబంధనలకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం మరింత బలోపేతం -
ఏపీ: టీచర్లు ఇక విద్యా బోధనకు మాత్రమే!
సాక్షి, విజయవాడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివమెంట్ లెవెల్ పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. మంగళవారం వర్చువల్‌గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు.. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించగా ఇంకా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బోధనేతర విధులను అప్పగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలి: జీటీఏ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఐఓఎస్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని గురువారం కలిసిన సంఘం నేతలు ఈమేరకు వినతి పత్రం అందజేశారు. -
ఉద్రిక్తంగా ఉపాధ్యాయుల అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఉపాధ్యాయుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం ఉద్రిక్తతగా మారింది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ పిలుపు మేరకు మంగళవారం నలుమూలల నుంచి వందలాదిమంది ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయల్దేరి నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీ ఎదురుగా పోలీసు కంట్రోల్ రూమ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకోగానే పోలీసులు బారికేడ్లతో నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. చలో అసెంబ్లీ ర్యాలీకి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య, అశోక్‌కుమార్, రఘుశంకర్‌రెడ్డి, రవీందర్, లింగారెడ్డి, కొండయ్య, జాదవ్ వెంకట్రావు, మేడి చరణ్‌దాస్, యాదగిరి, సయ్యద్ షౌకత్ అలీ, విజయకుమార్, చావ రవి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆందోళన ప్రభుత్వ బడులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమన్నారు. -
Teachers Day 2022: బంగారు భవిష్యత్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతర పేద పిల్లలకు చదువే ఆస్తి. మన విద్యా విధానం ఆ ఆస్తిగా ఉందా? లేక భారంగా ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం పట్టా మాత్రమే పిల్లల చేతిలో పెట్టేలా మన చదువుల తీరు ఉందా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిస్థితులను మార్చి, మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఉండేలా దారి చూపాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే ఈ రంగంలో మార్పులుచేశాం తప్ప.. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడానికి ఎంతమాత్రం కాదు. ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడు. గ్రామంతో మొదలు పెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకు రాగలుగుతాడు. తన కన్న పిల్లల కోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలందరూ బాగు పడాలని టీచర్ ఆరాట పడతారు. పిల్లలకు కేవలం సబ్జెక్టు మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తారు. వివేకాన్ని పెంచుతారు. పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో జీవించడం నేర్పుతారు. బతకడం ఎలాగో టీచర్ నుంచే నేర్చుకుంటారు. తన కన్నా తన శిష్యులు గొప్ప వాళ్లు కావాలని ఆరాట పడతారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా బాటలు వేసేలా విద్యా రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ సంస్కరణలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని, ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినవి కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రభుత్వ టీచర్లకు నష్టం చేయడానికో, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడానికో ఈ చర్యలు తీసుకోలేదని చెప్పారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇప్పటి మన విద్యా విధానంతో పిల్లలకు ప్రయోజనం కలుగుతోందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోలన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇవి సత్ఫలితాలు ఇచ్చి పిల్లలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లేలా చేయడంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులదే కీలక భూమిక అన్నారు. ఈ దిశగా అందరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. ‘కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాలపాటు చదువులకు దూరంగా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు వారి మీద రుద్దిన చదువులను వేరే గత్యంతరం లేక చదువుకుంటున్నారు. వాటిని మార్చడంపై మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అత్యంత ప్రాధాన్యతా రంగంగా విద్యారంగాన్ని గుర్తించడంతో పాటు మూడేళ్ల కాలంలో అనేక అడుగులు ముందుకు వేశాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు గురువులందరికీ వందనం ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నా. ఉపాధ్యాయులు అందరికీ శిఖరం లాంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ► ‘నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ.. మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను’ అనేవి స్ఫూర్తిదాయకమైన మాటలు. ఇవి నేను చెప్పడమే కాదు.. ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన గొప్ప నాయకుడు అలెగ్జాండర్ కూడా చెప్పారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయి లాగే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే వారు మన ఉపాధ్యాయులు. గురుపూజోత్సవం కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు దేశంలోనే ముందుండాలని.. ► దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా.. మెరుగ్గా ఉండేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మన పిల్లలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అందుకే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తించాం. ఈ మూడేళ్లలో అనేక అడుగులు ముందుకు వేశాం. ► నేను ముఖ్యమంత్రి అయ్యాక విద్యా శాఖ మీద చేసిన రివ్యూలు బహుశా మరే శాఖ మీదా చేయలేదు. ఎందుకంటే.. మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాల తలరాతలను మార్చగలిగే ఒక అస్త్రం చదువు మాత్రమే. అందుకే విద్యా రంగంపై అంతగా దృష్టి పెట్టాను. గత ప్రభుత్వంలో మాదిరి విద్యా రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుని, కార్పొరేట్ వర్గాలకు ఈ రంగాన్ని అమ్మేసి.. పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఈ సంస్కరణలు తీసుకురాలేదు. పెద్ద చదువులకు, మంచి చదువులకు.. పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతో తెచ్చిన మార్పులివి. గతంలో మాదిరి కార్పొరేట్ రంగంతో కుమ్మక్కై ఇంగ్లిష్ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు దూరంచేసే మార్పులు కావు. ప్రభుత్వ టీచర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేవి కావు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేవి అంతకంటే కావు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ బడికి ఘన వైభవం ► గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యానికి గురైన విద్యా సంస్థలను అభివృద్ధి పరిచి, వాటికి ఘన వైభవం చేకూర్చే తపనతో ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేదలు దశాబ్దాలుగా ఆశించిన ఫలితాల కోసం చేపట్టిన మార్పులు ఇవి. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు తల్లులకు మద్దతుగా ఉండేందుకు తెచ్చిన మార్పులివి. ప్రభుత్వ బడి కార్పొరేట్ బడికన్నా బాగుండాలని చేసిన మార్పులివి. టీచర్లు తమ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలన్న మంచి సంకల్పంతో తీసుకొస్తున్న మార్పులివి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా? లిటరసీని పెంచడం ఎలా? నాణ్యమైన విద్యను అందించడం ఎలా? అను ప్రశ్నలకు సమాధానంగా తీసుకొస్తున్న మార్పులు ఇవి. ► ఉన్నత విద్యలో కనీసంగా 70 శాతం జీఈఆర్ రేషియో ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్నాం. ఇవన్నీ బాగుండాలంటే, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే.. మనం అంతా ఒక్కటిగా ముందుకు సాగితేనే సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో కార్పొరేట్‌కు అందలం ► గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ స్కూళ్లకు, ఆస్పత్రులకు, చివరకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్ట్ అన్న రీతిలో వ్యవహారం సాగింది. తుదకు ఉద్యోగులను తీసేసే పరిస్థితిలోకి వెళ్లింది. ► మన ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఎంతో గౌరవిస్తోంది. ఎవరూ అడక్కపోయినా 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాం. ఎస్జీటీలను ఎస్ఏలుగా, ఎస్ఏలను గ్రేడ్–2 హెడ్మాస్టర్లుగా, హెడ్మాస్టర్లను ఎంఈఓలుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. విద్యా రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇవి అవసరం అని భావించి వెనక్కి ముందడుగు వేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.53 వేల కోట్లు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది. పేదలకు ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను, జీవితంలో వారు నిలదొక్కుకోవడానికి ఉపయోపడే విద్యను ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో చదువు చెప్పడం మాత్రమే కాకుండా, శిలలను శిల్పాలుగా చెక్కినట్లు.. వ్యక్తిత్వాన్ని సైతం మలిచే ఉపాధ్యాయులుగా మీ తోడ్పాటు చాలా ముఖ్యం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పెన్షన్ సమస్యకు పరిష్కారం.. ► ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో, వారికి మేలు చేసేలా అడుగులు వేస్తున్నాం. మంచి పరిష్కారం కోసం వెతుకుతున్న ప్రభుత్వం మనదే. ఇప్పుడున్న ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. వారికి మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ► కానీ ఇప్పుడు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగులకు చేస్తున్న మేలు గురించి, వారి పెన్షన్‌పై చేస్తున్న కృషికి సంబంధించి ఒక్క వాక్యం కూడా రాయని, చూపని ఎల్లో మీడియా.. ఇప్పుడు మనం పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తోంటే రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ► వీటన్నింటినీ గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర కలిగిన.. టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్లకు ఎన్నడూ లేని గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలి. -
Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. జూన్ 8న వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్, అతని సోదరుని మధ్య భూవివాదం ఉంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుకుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అన్నదమ్ములు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాలు గతంలో ఉన్నప్పటికీ తాజాగా ప్రతియేటా సమర్పించాలని ఆదేశించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరినీ దోషులుగా ఆపాదించడం కరెక్ట్ కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. చదవండి: ('48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్ షేర్ చేస్తా') -
బడిబాట పట్టలేం!
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, చదువుకు దూరమైన పిల్లలను బడిబాట పట్టించేందుకు ప్రభుత్వం జూన్ నెల మొత్తం యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అన్ని స్థాయిల ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. అయితే, ఉపాధ్యాయ వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నెల మొత్తం శాఖాపరమైన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు బడిబాట పేరుతో గ్రామాలు, వీధుల్లో తిరగడం ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఇప్పటికే పలు సంఘాల ప్రతినిధులు విద్యాశాఖను కోరారు. జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సమగ్ర శిక్షా విభాగం మాత్రం బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి తీరాలని మార్గదర్శకాలు జారీ చేసింది. తీరికేది? వాస్తవానికి స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత, మళ్లీ రీ ఓపెనింగ్ సమయంలో బడిబాట నిర్వహించడం గతంలో జరిగేది. కానీ రెండేళ్లుగా కోవిడ్ మూలంగా బడిబాట సరిగా జరగలేదు. దీంతోపాటే కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలైంది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈసారి మే 23 నుంచి జూన్ 1 వరకూ జరిగాయి. దీంతో టీచర్లు జూన్ మొదటి వారంలో టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియే ఈ నెలాఖరు వరకు సాగుతుందని టీచర్లు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో బడిబాటకు టీచర్లు వెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీనికితోడు ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష జరుగుతుంది. దీని నిర్వహణలోనూ ఉపాధ్యాయులే పాల్గొనాల్సి ఉంటుందనే వాదన తెరమీదకు తెచ్చారు. ఆంగ్ల బోధనకు తర్ఫీదూ అడ్డంకే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే 1–8 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టాలని నిర్ణయించింది. 26 వేల పాఠశాలల్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, మరికొంతమంది శిక్షణ తీసుకోవాల్సి ఉంది. బడులు తెరిచేలోగా పాఠ్యాంశాలు ముందుగా చదివి ఇంగ్లిష్ బోధనకు సిద్ధం కావాల్సి ఉంటుందని, బడిబాట పేరుతో బయటకెళ్లడం సాధ్యం కాదని వారు అంటున్నారు. బదిలీలు చేపడితే... జూన్‌లో టీచర్ల బదిలీలు చేపడతామని విద్యాశాఖ మంత్రి అనేకసార్లు చెప్పడాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రక్రియ చేపడితే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఆప్షన్లు ఇచ్చుకోవడం, బదిలీ అయ్యాక కొత్త ప్రాంతానికి వెళ్లి స్థిరపడటం వంటి ప్రక్రియలుంటాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇవన్నీ జూన్‌లోనే చేస్తామని చెబుతూ బడిబాట కార్యక్రమానికి షెడ్యూల్ ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాయిదా వేస్తే నష్టమేంటి? ఇంగ్లిష్ మీడియం విద్య సర్కారీ స్కూళ్లలో అందిస్తున్నారంటే ప్రతీ పేదవాడు తమ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపాలనే అనుకుంటాడు. మారుమూల పల్లెల్లో సైతం విద్యపై అవగాహన పెరిగింది. ఇప్పుడు టీచర్లను బడిబాట పేరుతో పరుగులు పెట్టించాల్సిన అవసరమే లేదు. పైగా టెన్త్ పేపర్ల మూల్యాంకనంతోపాటు అనేక ప్రభుత్వ విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. అందువల్ల బడిబాటను వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటి? జూలైలో నిర్వహిస్తే అందరికీ వెసులుబాటు ఉంటుంది. – మహ్మద్ అబ్దుల్లా, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు -
30 మంది టీచర్ల సస్పెన్షన్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం/పసుమర్రు (పామర్రు)/ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తదితర అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 44 మంది అరెస్ట్ అయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. వీరిలో 30 మంది ప్రభుత్వ టీచర్లను పాఠశాల విద్యా శాఖ సస్పెండ్ చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు.. పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం తనిఖీలు జరిపారు. ఉపాధ్యాయులు సీహెచ్ వెంకయ్యచౌదరి, వై.సురేష్, పి.గంగాధరం, కె.వరప్రసాద్, తిరుమలేష్, శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని డీఈవో తెలిపారు. వీరికి ఏలూరు జిల్లా కనుమోలు టీచర్ బి.రత్నకుమార్ సహకరించినట్లు గుర్తించామన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తాము కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ ప్రయత్నం భగ్నం.. ఏలూరులోని సత్రంపాడు విద్యా వికాస్ స్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం డిపార్ట్మెంటల్ అధికారి రామాంజనేయ వరప్రసాద్ మ్యాథ్స్ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు చెబుతుండగా.. అదనపు ఇన్విజిలేటర్ ప్రదీప్ తెల్ల కాగితం కింద రెండు కార్బన్ పేపర్లు పెట్టి రాస్తుండడాన్ని గుర్తించారు. ఇదంతా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే జరగడాన్ని గమనించి.. వెంటనే వారందరినీ ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిపార్ట్మెంటల్ అధికారిని, అదనపు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యా శాఖకు సిఫార్సు చేశారు. -
మాకు ఇదేం ‘శిక్ష’ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ మొదలైంది. జిల్లా, మండల స్థాయిల్లో కొద్దినెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి.. అన్ని స్థాయిల ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని విద్యా శాఖ ఆదేశించింది. ఈ శిక్షణ బాధ్యతలను అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి అప్పగించారు. యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో 20వేల మంది రిసోర్స్ పర్సన్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆదిలోనే అనాసక్తి.. శిక్షణ మొదలైన రోజే ఉపాధ్యాయుల నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. మండు వేసవిలో శిక్షణ ఇవ్వడం సరికాదని, సరిగా శిక్షణ పొందే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు శిక్షణ కోసం అవసరమైన కొద్దిపాటి ఖర్చు పెట్టుకోవ డానికి కూడా టీచర్లు అనాసక్తత కనబరుస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. లాంగ్ నోట్‌బుక్, పెన్ను, లంచ్ బాక్స్, మంచినీళ్లు వెంట తెచ్చు కోవాలని చెప్తే తప్పుపడుతున్నారని అంటున్నాయి. ఇక శిక్షణ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఫ్యాన్లు లేవని, మంచినీటి వసతి కూడా కల్పించలేదని డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు. వేసవి ఎండలు పెరిగిపోతున్నందున ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే శిక్షణ ఇవ్వాలని టీపీటీఎఫ్ నేతలు రమణ, మైస శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. 60 వేల మందికి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దాదాపు 60 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లోని ఒక్కో కేంద్రంలో దాదాపు 40 మందికి శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని, తొలి విడతగా ఐదు రోజులు కొనసాగుతుందని వివరించారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా శిక్షణ పూర్తి చేసి, టీచర్లను బోధనకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. -
ఉపాధ్యాయులకు ఉపకారమే
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానం అమల్లో భాగంగా చేపట్టిన ప్రభుత్వ స్కూళ్ల మ్యాపింగ్‌తో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. పాఠశాల విద్యలో ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా మ్యాపింగ్ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు. నూతనంగా ప్రవేశపెడుతున్న ఆరంచెల విద్యా విధానంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఏ ఒక్కటీ మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ పోస్టూ తగ్గకుండా అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫౌండేషన్ విద్యను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఉత్తమ బోధన అందేలా సబ్జెక్టు టీచర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇçప్పటికే ఒకే ప్రాంగణం లేదా 200 మీటర్ల దూరంలోని ప్రైమరీ పాఠశాలల్లో 3, 4, 5, తరగతులను హైస్కూళ్లకు అనుసంధానిస్తూ మ్యాపింగ్ పూర్తి చేసింది. ఇలా 2,682 హైస్కూళ్లకు సమీపంలోని ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను అనుసంధానించారు. తదుపరి దశలవారీగా హైస్కూల్‌కు 3 కిలోమీటర్ల లోపు ఉన్న 19,534 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 3 కిలోమీటర్లకు పైబడి దూరం ఉన్న 16,603 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల మ్యాపింగ్ చేపడుతోంది. సహజసిద్ధమైన, భౌగోళిక అడ్డంకులు లేని స్కూళ్లను మ్యాపింగ్ చేస్తోంది. విద్యార్థులకు ఎటువంటి సమస్యల్లేకుండా చర్యలు చేపట్టింది. 2023–24 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. 1, 2 తరగతులు యథాతథం మ్యాపింగ్ పూర్తై 3, 4, 5 తరగతులు సమీపంలోని హైస్కూల్‌కు మారినా ప్రస్తుతం ఉన్న ప్రైమరీ, ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 1, 2 తరగతులు అక్కడే కొనసాగుతాయి. వీటికి అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై పీపీ–1, పీపీ–2 విద్య అందుబాటులోకి వస్తుంది. మొదటి దశ కింద ఇప్పటికే 2,835 ప్రైమరీ స్కూళ్లకు అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. ఇక 1,640 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు వివిధ కారణాలతో మ్యాపింగ్‌కు వీలు కాలేదు. ఇవి యధాతథంగా కొనసాగుతాయి. అందువల్ల ఏ ఒక్క పాఠశాలా మూతపడదు. టీచర్ల తొలగింపూ ఉండదు. అన్ని వనరులతో అత్యుత్తమ బోధన మ్యాపింగ్ ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని వనరులు అందుబాటులోకి రావడంతోపాటు అత్యుత్తమ బోధన అందుతుంది. ఇప్పటివరకు అతీగతీ లేనట్లుగా మిగిలిన అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ విద్యా కేంద్రాలుగా మారనున్నాయి. ఇవి ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలల్లో కలవడం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన బోధన అందుతుంది. ఫౌండేషన్ స్కూళ్లలో ముగ్గురు అంగన్వాడీ వర్కర్లు, సహాయకులతోపాటు ఇద్దరు ఎస్జీటీ టీచర్లను నియమిస్తారు. హైస్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులుంటారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ఈ స్కూళ్లకు అనుసంధానమయ్యే ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద తరగతుల పిల్లలతో కలిసి ఉండటంవల్ల పై తరగతులకు వెళ్లేకొద్దీ ఆ వాతావరణానికి సులభంగా అలవాటు పడతారు. ప్రస్తుతం ప్రైమరీలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూలులో 6వ తరగతిలో చేరే సమయంలో ఒకింత బెరుకుగా ఉంటున్నారు. కొన్నిచోట్ల ఇది డ్రాపౌట్లకు దారితీస్తోంది. అంగన్వాడీల నుంచి ప్రైమరీలోకి వచ్చే పిల్లల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మ్యాపింగ్‌తో ఇలాంటి ఇబ్బందులు దూరం కానున్నాయి. ఆరంచెల విద్యా విధానమిలా.. ► అంగన్వాడీ కేంద్రాలు (సమీపంలో ఏ స్కూలు లేని) మాత్రమే ఉండే చోట వాటిలో ప్రీ ప్రైమరీ 1 , ప్రీ ప్రైమరీ 2 ( పీపీ 1 , పీపీ 2 )లను ప్రవేశ పెట్టి శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా కొనసాగిస్తారు. ► ప్రైమరీ పాఠశాలలు సమీపంలో ఉంటే అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పీపీ 1 , పీపీ 2లను 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లుగా నిర్వహిస్తారు. ► ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ 1 , పీపీ 2 లను, 1 నుంచి 5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లుగా నిర్వహిస్తారు ► సమీపంలో అప్పర్ ప్రైమరీ స్కూలు ఉంటే 3 నుంచి 5 తరగతుల పిల్లలను అనుసంధానించి 3 నుంచి 7 లేదా 8 వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా కొనసాగిస్తారు ► ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లుగా నిర్వహిస్తారు. ► 3 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్ (11 , 12 తరగతులు) కలిపి హైస్కూల్ ప్లస్ గా మారుస్తారు. టీచర్లకు ఎన్నో ప్రయోజనాలు మ్యాపింగ్ వల్ల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైమరీ పాఠశాలల్లో పాత విధానంలో 1 నుంచి 6 తరగతుల విద్యార్ధులకు మొత్తం 18 సబ్జెక్టులు బోధించేవారు. ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్న చోట్ల వారిపై విపరీతమైన పనిభారం ఉంది. విద్యార్ధులకు సరైన బోధనకు అవకాశం ఉండేది కాదు. కొత్త విధానంలో ప్రైమరీ స్కూళ్లలోని 1, 2 తరగతుల విద్యార్థులకు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీలను ప్రభుత్వం నియమించనుంది. వీరిపై పనిభారం చాలా తగ్గుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులు హైస్కూల్లో చేరడం వల్ల దాదాపు 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి. మరోపక్క ప్రతి మండలంలో రెండేసి హైస్కూళ్లలో జూనియర్ కాలేజీల ఏర్పా టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కళాశాలలు ఏర్పాటవుతాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు ఆయా జూనియర్ కాలేజీల్లో లెక్చరర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు రానున్నాయి. -
జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరు ద్ధంగా కోరుకున్న ప్రాంతానికి కాకుండా పిటిషనర్లను కేటాయించారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాలకు కేటాయించిన వారంతా విధుల్లో చేరారని ప్ర భుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. -
బదిలీలా.. ప్రాణాలా..?
-
భార్యాభర్తలను విడదీయొద్దు
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317పై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటాయింపుల్లో గందరగోళం చోటు చేసుకుందని మండిపడుతున్నారు. కనీసం తమ గోడు విన్పించుకునేందుకూ అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సోమవారం సుదూర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు తరలివచ్చారు. పరిస్థితిని గమనించిన అధికారులు భారీగా పోలీసులను దించారు. దీంతో మహిళలతోసహా టీచర్లను ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. కనీసం తమ విజ్ఞప్తులన్నా తీసుకోవాలంటూ మెయిన్ గేట్ దగ్గర గంటల తరబడి పడిగాపులు కాశారు. వాహనాల్లో లోనికి వెళ్తున్న అధికారులను ప్రాధేయపడేందుకు మహిళలు ప్రయత్నించారు. కానీ అక్కడున్న పోలీసులు వారిని వారించారు. కొంతమంది ఉపాధ్యా య సంఘాల నాయకుల అండతో ఆఫీసులోకెళ్లి అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అక్కడే కొంతసేపు ధర్నా చేశారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే’ అని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. 13 జిల్లాల్లో 2,500 మంది... 317 జీవోతో జరిగిన బదిలీల్లో భార్య, భర్తకు వేరు వేరు జిల్లాలు వచ్చాయంటూ బాధితులు నిరసన వ్యక్తంచేశారు. 13 జిల్లాల్లో 2,500 మంది భార్యాభర్తలు 100 నుంచి 250 కి.మీ. దూరంలో పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి కుటుంబాలను కలపాలని కోరారు. వారందరినీ ఒకే జిల్లాకు కేటాయించాలన్న కేసీఆర్ ఆదేశాలను 19 జిల్లాల్లోనే అమలుచేశారని, 13 జిల్లాల్లో అమలుచేయలేదని వాపోయారు. విద్యామంత్రి ఇంటి వద్ద ధర్నా ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు జీవో 317కు వ్యతిరేకంగా ఇంటర్ విద్య పరిరక్షణ జేఏసీ చైర్మన్ పి.మ ధుసూదన్రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ధర్నా చేశారు. జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తా నియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భార్య ఒక చోట... భర్త మరో చోట ఆయన హెచ్ఎం. మల్టీ జోన్ కిందకొస్తారు. నేను జిల్లా కేడర్. జిల్లా ఆప్షన్లు ఇచ్చేటప్పటికీ మల్టీ జోనల్ కేడర్ కేటాయింపులు కాలేదు. అలాంటప్పుడు కావల్సిన ఆప్షన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు స్పౌజ్ కేసు అంటే పట్టించుకోవడం లేదు. వనపర్తిలో ఒకరు. నాగర్‌కర్నూల్‌లో ఒకరు.. ఇదేం న్యాయం? – సందె వినీల, వెంకటరమణ(నాగర్‌కర్నూల్) పేర్లు మాయమయ్యాయి జిల్లా నుంచి వచ్చిన జాబితాలో నేను పెట్టుకున్న ఆప్షన్‌కు అంగీకరించారు. కానీ రాష్ట్ర కార్యాలయానికి రాగానే జాబితా మారింది. కామారెడ్డిలో సుదూర ప్రాంతానికి బదిలీ చేశారు. మా దగ్గర 8 మందికి ఇలాగే జరిగింది. – ప్రభాకర్ రెడ్డి (టీచర్, జగిత్యాల) స్పౌజ్ లిస్ట్ తారుమారు స్పౌజ్ అప్పీళ్లను సరిగా పరిష్కరించలే దు. భార్యాభర్తలను చెరొక చోటుకు పంపా రు. జిల్లా కేటాయింపుల్లో ఇద్దరి పేర్లూ ఉన్నా యి. కానీ, రాష్ట్రస్థాయి జాబితాలో ఎగరగొట్టారు. ప్రభుత్వం బ్లాక్ చెయ్యని జిల్లాల్లో అన్నీ ఇలాంటి పొరపాట్లే ఉన్నాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు. – సాయి రమేష్ (ఎస్జీటీ, నల్లగొండ) -
టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ టీచర్లలో సబ్జెక్టులపై మంచి పట్టు, ఆయా అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. టీచింగ్ మెథడాలజీపై అవగాహన కూడా ఉంది. కానీ విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు..’ ప్రభుత్వ టీచర్ల పరిస్థితిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి–ఎన్సీఈఆర్టీ) విశ్లేషణ ఇది. దీనికి అనేక కారణాలున్నా అంతిమంగా పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో నెలకొనాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఒనగూరడం లేదని తేల్చింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యప్రణాళికలు, సిలబస్ తీరుతెన్నులు, టీచర్ల నైపుణ్యాలు, విద్యార్థుల్లో సామర్థ్యాలు తదితర అనేక అంశాలపై ఎన్సీఈఆర్టీ విశ్లేషించింది. బోధన కంటెంట్ సమన్వయంలో సమస్యలు ఎన్సీఈఆర్టీ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ కరిక్యులమ్ స్టడీస్ విభాగం టీచింగ్‌లో నాణ్యతను పరిశోధించడంలో భాగంగా సైన్సు టీచింగ్‌లో నాలెడ్జి, బోధనాపరమైన కంటెంట్‌ను సమన్వయం చేసుకోవడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తరగతి గది బోధనను పరిశీలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లోని 30 మంది టీచర్లను ఎంపిక చేసుకుంది. అందులో వచ్చిన ఫలితాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ మేరకు.. ► టీచర్లలో ఎక్కువమందికి టీచింగ్ మెథడ్స్‌పై మంచి అవగాహన ఉంది. బోధన విధానం, సబ్జెక్టుఅంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం పరచుకుని బోధించడంలో వారు విఫలమవుతున్నారు. ► పాఠ్యప్రణాళికలను రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తేవడం మధ్య చాలా అంతరం ఉంది. ► టీచర్లు బోధించాలనుకున్న అంశాలకు, బోధించిన అంశాలకు మధ్య చాలా తేడా ఉంటోంది. చాలామంది టీచర్లు తాము బోధించిన అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని భావించి అంతటితో సరిపెడుతున్నారు. (అమ్మాయిల ఐఐఠీవి.. ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు) ► బోధన సమయంలో విద్యార్థులు బోధన కాన్సెప్టులను ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారన్న అంశాలను టీచర్లు పట్టించుకోవడం లేదు. ► తరగతి గదుల్లో టీచర్లు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. యాక్టివిటీ ఆధారిత విద్యావిధానం అమలవుతున్నప్పటికీ ఆ కాన్సెప్టును టీచర్లు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనుసరించే మార్గం కూడా అలాంటిదే అన్న భావనతో మూసపద్ధతిలో వెళుతున్నారు. విద్యార్థులకు సరిపోయే విధంగానే తాము బోధిస్తున్నామని భావిస్తున్నారు తప్ప వారికి ఏమేరకు అవగాహన అవుతోందో గమనించడం లేదు. ► అన్ని స్కూళ్లలోను ఆంగ్లమాధ్యమ బోధనతో భాషా సమస్య ఏర్పడి విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇంటరాక్షన్ (పరస్పర సందేహ నివృత్తి)లో అంతరం బాగా పెరిగింది. ► టీచర్లు చాలా నైపుణ్యం కలవారే అయినా క్షేత్రస్థాయిలో ఒకింత గందరగోళం వల్ల విద్యార్థులకు, వారికి మధ్య అనుసంధానం ఏర్పడక వారు చెప్పదల్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ► దీనిపై సవాళ్లను ఎదుర్కొంటున్న టీచర్లు.. విద్యార్థుల్లో అనాసక్తి, వనరులలేమి, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, ఫలితాలకోసం అధికారుల నుంచి ఒత్తిడి వంటి కారణాలను చెబుతున్నారు. (APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..) ఏపీలో సమర్థంగా డీఈడీ అమలు ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ/డీఈఎల్ఈడీ)ని సమర్థంగా అమలు చేస్తున్నారని ఎన్సీఈఆర్టీ తన నివేదికలో పేర్కొంది. డీఈడీ ఫస్టియర్, సెకండియర్‌లో వేర్వేరుగా వివిధ కోర్సులను ఎన్సీటీఈ ప్రవేశపెట్టగా ఏపీ దాన్ని మరింత పటిష్టం చేసి అమలు చేయిస్తోంది. పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో మార్పులుచేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని జోడించింది. స్కూల్ కల్చర్, లీడర్షిప్ వంటి అంశాలను పొందుపరిచింది. ఎలిమెంటరీ స్థాయిలో కూడా బోధన విధానాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మాతృభాష బోధన, చైల్డ్‌హుడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ పేపర్లను ప్రవేశపెట్టారని ఎన్సీఈఆర్టీ వివరించింది. -
బడికి తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
-
సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే ప్రభుత్వ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించారు. ఇలాంటి వారి పూర్తి వివరాలు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సోమవారం ఆమె ఆదేశించారు. ఈ ఏడాది జరిగే గురుపూజ దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించాలని సబిత భావిస్తున్నారు. ప్రస్తుతం చాలావరకు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అయితే దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉన్నతిని పెంచాలని తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారు. వారు ఆదర్శంగా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో ఇలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల ప్రభుత్వ బడుల ఉన్నతి మరింత పెరుగుతుందని సబిత భావిస్తున్నారు. -
విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లల హేతుబద్ధీకరణకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జారీ చేశారు. ఈ నెల 12నే ఉత్తర్వులు జారీ చేసినా వాటిని రహస్యంగా ఉంచడం గమనార్హం. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూ–డైస్) 2019–20 గణాంకాల ఆధారంగానే హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులుండేలా చర్యలు చేపట్టనున్నారు. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలకు బదలాయిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయుల నిష్పత్తిని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. హేతుబద్ధీకరణను సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా స్థాయిలో కమిటీ వేసింది. కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే ఈ కమిటీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల), జిల్లా పరిషత్ సీఈవో, ఐటీడీఏ పీవో, డీఈవో భాగస్వాములుగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సమస్యలుంటే హైదరాబాద్ డీఎస్సీకి పది రోజుల్లోగా అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో కొత్త పోస్టు సృష్టించడం, రద్దు చేయడం జరగదని స్పష్టం చేశారు. ఒకే ప్రాంగణంలో ఉండే పాఠశాలల విలీన విధానాన్ని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ బదిలీలో పాఠశాలలో సీనియారిటీ ఇన్ సర్వీస్‌ను కొలమానంగా తీసుకుంటారు. జూనియర్‌గా ఉన్న ఉపాధ్యాయుడినే మిగులుగా గుర్తిస్తారు. ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయుడు విముఖత వ్యక్తం చేస్తే జూనియర్‌కు అవకాశం దక్కుతుంది. హేతుబద్ధీకరణ ప్రక్రియపై విద్యాశాఖ కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. 150 దాటితేనే హెడ్ మాస్టర్... ప్రాథమిక పాఠశాలల్లో 151 మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. అయితే కనీస విద్యార్థుల సంఖ్య 19లోపు ఉన్నప్పటికీ ఆ స్కూల్లో ఎస్టీటీ పోస్టు మంజూరు చేస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో... ►ఆరు నుంచి 8వ తరగతి వరకూ వంద మంది విద్యార్థుల వరకూ గణితం, సైన్స్‌కు కలిపి ఒకరు, సోషల్ సైన్స్‌కు ఒకరు, లాంగ్వేజెస్‌కు ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ఉపాధ్యాయులుంటారు. సీనియర్ ఉపాధ్యాయుడు హెడ్మాస్టర్గా వ్యవహరిస్తారు. ►101–140 మంది విద్యార్థులుంటే ఇంగ్లిష్ టీచర్‌తోపాటు మొత్తం ఐదుగురు, 141–175 మంది ఉంటే సైన్స్, గణితానికి ఇద్దరు చొప్పున ఆరుగురు, 176–210 మంది విద్యార్థులకు సైన్స్, గణితం ముగ్గురుతోపాటు మొత్తం ఏడుగురు, 211–245 వరకూ 8 మంది, 246–280 వరకూ 9, 281–315 వరకూ 10, 316–350 మంది విద్యార్థులకు 11, ఆపైన 385 మంది వరకూ 12 మంది టీచర్లు ఉంటారు. ఉన్నత పాఠశాలలో.. ►220 మంది విద్యార్థుల వరకూ ఒక హెచ్‌ఎంతోపాటు 9 మంది ఉపాధ్యాయులంటారు. 400 మంది విద్యార్థుల సంఖ్య దాటితే క్రాఫ్ట్ లేదా డ్రాయింగ్ లేదా సంగీతం టీచర్‌ను కేటాయించాలి. గణితం, ఫిజికల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, ప్రథమ, ద్వితీయ భాషా పండితులు ప్రతి స్కూల్లోనూ ఉంటారు. విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ సబ్జెక్ట్ టీచర్లు పెరుగుతారు. 1,210 మంది విద్యార్థులుండే స్కూళ్లకు 45 మంది వరకూ ఉంటారు. ►ఆంగ్ల మాధ్యమం కోసం ఏర్పాటు చేసే అదనపు సెక్షన్లకు 50 మంది విద్యార్థుల వరకూ నలుగురు టీచర్లు ఉంటారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 420 వరకు ఉంటే 8 మంది దాకా టీచర్లు ఉంటారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అవసరాన్నిబట్టి బదలాయిస్తారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 50కి తక్కువగా ఉంటే దగ్గర్లోని స్కూళ్లలో వారిని చేరుస్తారు. ఇది హేతుబద్ధం కాదు... 2019–20 ఏడాది విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవడం అసంబద్ధం. కరోనాతో స్కూళ్లు నడవక, సంక్షేమ హాస్టళ్లు తెరవక అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేవు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల కేడర్ విభజన కొలిక్కి రాలేదు. అంతర్ జిల్లా, సాధారణ బదిలీలు, పదోన్నతులను పాత జిల్లాల ప్రకారం చేస్తామన్న హామీ నెరవేరకుండా రేషనలైజేషన్ సరికాదు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష జీవో ఇవ్వడమేంటి? ఈ ప్రక్రియను వాయిదా వేయాలి. – తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేతలు కె.జంగయ్య, రవి మార్గదర్శకాలు సవరించాలి : టీఎస్టీయూ పాఠశాల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను సవరించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులుంటే కనీసం ఇద్దరు టీచర్లు, ఆ పైన సంఖ్య ఉంటే, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 50 మందికన్నా ఎక్కువ ఉంటే హెచ్ఎం పోస్టు కేటాయించాలి. – తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ఈ విధానం హాస్యాస్పదం కొత్త జిల్లాలు, జోనల్ విధానంలో క్యాడర్ విభజన జరగకుండా రేషనలైజేషన్ చేపట్టడం హాస్యాస్పదం. గతేడాది సెప్టెంబర్ 30 నాటి విద్యార్ధుల సంఖ్యను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడం తప్పుడు నిర్ణయం. తాజా లెక్కలు తీసుకోవాలి. – తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి నాగనమోని చెన్నరాములు ప్రత్యక్ష బోధన తర్వాతే... ప్రాథమిక తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలైన తర్వాతే విద్యార్థుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేపట్టాలి. ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జీవో ఇవ్వాలి. ఉపాధ్యాయుల సాధారణ, అంతర్ జిల్లా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలి. –రాష్ట్ర సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకినేని మధుసూదన్‌రావు -
వారంలో పీజీ!.. లాడ్జీల్లో పరీక్షలు
సాక్షి,అనంతపురం: రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు వారం రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా?.. తాము తలచుకుంటే సాధ్యమేనని నిరూపించారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. పైగా ఆ సర్టిఫికెట్లతో పదోన్నతులు కూడా పొందారు. 2009 ఫిబ్రవరిలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఇలా నకిలీ పీజీ సర్టిఫికెట్లతోనే కథ నడిపించినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా ‘సాక్షి’ కథనాలు ప్రచురిస్తుండగా..అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడ్జీల్లో పరీక్షలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలన్నది నిబంధన. దీంతో కొందరు ఎస్జీటీలు అడ్డదారుల్లో సర్టిఫికెట్లు పుట్టించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులకు కాసులు సమర్పించారు. వారి సహకారంతో రాత్రిళ్లు లాడ్జీల్లో పరీక్షలు రాసేశారు. వారంలో సర్టిఫికెట్లు తెచ్చేసుకుని.. విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. ఇలా 77 మంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేని రాజస్థాన్‌లోని విహబ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందినట్లు సమాచారం. గుడ్డిగా పదోన్నతులిచ్చిన విద్యాశాఖ పదోన్నతి కోసం సదరు ఉపాధ్యాయులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవా..కావా అన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకోవాలి. ఇందుకోసం సదరు యూనివర్సిటీల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఎస్ఏ ఇంగ్లిష్ పోస్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్ల గురించి ఏ అధికారీ ఆరా తీయలేదు. అసలు సదరు యూనివర్సిటీ దేశంలో ఉందా..లేదా అని కూడా నిర్ధారించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ సెక్షన్, బీ సెక్షన్ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు. మరోవైపు వారం రోజుల్లోనే పీజీ సర్టిఫికెట్లు తెప్పించుకుని సర్వీసు రిజిష్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయించుకున్న కొందరు ఉపాధ్యాయులు.. ఈ వ్యవహారం రచ్చ కావడంతో అదే సబ్జెక్టుకు సంబంధించి మరో వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. తిరిగి ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఎస్‌ఆర్‌లో నమోదు చేయించుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తెరవెనుక భారీగానే మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. -
టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాల వారీగా అంతర్ జిల్లా బదిలీలు కోరుకునే వారికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించింది. బదిలీలు కోరుకునే అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత షెడ్యూల్లో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా జూన్ 30 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు.. ► ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు ► ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలో జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. ► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట పబ్లిక్ సెక్టార్ సంస్థలు, యూనివర్సిటీలు, హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్‌లో పనిచేస్తున్న వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ► మ్యూచువల్ కేటగిరీలో కేటగిరీ, మేనేజ్మెంట్ ఒక్కటే అయి ఉంటేనే అనుమతిస్తారు. ► మ్యూచువల్ బదిలీల్లో టీచర్ల సమ్మతి(కన్సెంట్)తో పాటు ఎంఈవో, డిప్యుటీ డీఈవో సమ్మతి ఇస్తూ కౌంటర్ సైన్ చేయాలి. ► ఒక టీచర్ ఒక టీచర్‌కు మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి. ► అనధికారిక గైర్హాజరు, సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కొంటున్న వారు, సస్పెన్షన్‌లో ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులు ► ఆన్లైన్ దరఖాస్తులనే స్వీకరిస్తారు. ఒకసారి దరఖాస్తు చేస్తే అదే అంతిమం అవుతుంది. గతంలో అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చేశాక వాటిని డౌన్లోడ్ చేసి ఎంఈవో సంతకానికి సమర్పించాలి. ఎంఈవో, హెచ్ఎం, డిప్యూటీ డీఈవోలు రికార్డులను పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరం డీఈవోలకు సమర్పించాలి. బదిలీల షెడ్యూల్ ఇలా ► ఆన్లైన్ దరఖాస్తు, ఎంఈవోకు సమర్పణ: జూన్ 30 నుంచి జూలై 6 వరకు ► పరిశీలించిన దరఖాస్తులను ఎంఈవో, డీఈవోలకు సమర్పణ: జూలై 7 నుంచి 11 వరకు ► డీఈవోలు దరఖాస్తుల పరిశీలన: జూలై 12 నుంచి జూలై 17 వరకు ► డీఈవోలు పాఠశాల విద్య కమిషనర్ పరిశీలనకు జాబితా సమర్పణ : జూలై 19 ► కమిషనర్ పరిశీలన అనంతరం తుది జాబితా : జూలై 20 నుంచి 26 వరకు ► ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనల సమర్పణ: జూలై 29 కమిషనర్ ప్రతిపాదనల సమర్పణ అనంతరం సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖల ఆమోదం అనంతరం టీచర్లకు అంతర్ జిల్లా బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తేదీలను తర్వాత వెల్లడిస్తారు -
Karnataka: ఉపాధ్యాయులపై కరోనా పంజా..90 మంది మృతి
బనశంకరి: కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో కోవిడ్ మొదటి దశలో 23 మంది, రెండోదశలో 20 మంది, ఇదే జిల్లా చిక్కోడి పరిధిలో మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది మృతిచెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ విధుల్లో పాల్గొన్నవారిలో 10 మంది ఉపాధ్యాయులను కరోనా బలిగొంది. ప్రస్తుతం 53 మంది పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. (చదవండి: విషాదం: కుటుంబంలోని నలుగురు మృతి) -
ఏపీలో టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా టీచర్ల బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. వెబ్‌కౌన్సిల్ ఆప్షన్ల ఆధారంగా బదిలీల ప్రక్రియ జరుగనుంది. టీచర్ల బదిలీల ఉత్తర్వుల పట్ల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు గత మూడేళ్లుగా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. (చదవండి: మా నాన్న మృతిపై రాజకీయాలు చేస్తావా?) -
ఏపీ: ఉపాధ్యాయులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈమేరకు సంబంధిత ఫైలుపై శనివారం ఆయన సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో బదిలీల అంశంపై ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు అని తెలిసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: టీడీపీ ధనిక వర్గాల పార్టీ: ఎమ్మెల్యే వాసుపల్లి) -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు
సాక్షి, మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఐడీ (గుర్తింపు కార్డులు) కార్డులు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆర్ఎఫ్ఐడీ కార్డులను ఇచ్చేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కసరత్తు చేస్తోంది. కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగానే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఈప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు సమగ్ర వివరాలను నివేదిస్తున్నారు. జిల్లాలోని 732 పాఠశాలల్లో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 2646 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా 117 మంది వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంది. వివరాల నమోదుకు అవకాశం 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం సేకరించగా డేటాఎంట్రీ ఆపరేటర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్ల ద్వారా యూడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్) నమూనాల్లో పొందుపరిచారు. ఉపాధ్యాయుల బ్లడ్‌గ్రూపు, నివాస సమాచారం జతచేయడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా తేడాలు ఉంటే వెబ్సైట్ ద్వారా వివరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా అలసత్వం చూపుతున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయుల వివరాల నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. కొన్ని జిల్లాలు వందశాతం నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 92.8శాతం మాత్రమే పూర్తయ్యింది. గుర్తింపుకార్డులో.. ఉపాధ్యాయులకు అందించే గుర్తింపుకార్డులో పూర్తి వివరాలు ఉండనున్నాయి. వారు ప్రధానంగా పనిచేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్కోడ్, హోదా, మొబైల్ నంబర్, ఎ క్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, నివాసం, ఉపాధ్యాయుడి కోడ్, పుట్టినతేదీ, రక్తం గ్రూపు, ఫొటో, తదితర వివరాలు గుర్తింపుకార్డులో పొందుపరుస్తారు. ఇదివరకు గుర్తింపు కార్డులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రభుత్వం మొదటి సారి గా గుర్తింపుకార్డులు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఆరు మండలాల్లో వందశాతం పూర్తి మంచిర్యాల జిల్లాలో 732 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. జన్నారం మండలంలో 65 పాఠశాలల్లో 245 మంది ఉపాధ్యాయులకు గాను 245 మంది వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి వందశాతం పూర్తి చేశారు. దండేపల్లి మండలంలోని 56 పాఠశాలల్లో 232 మంది, భీమినిలో 29 పాఠశాలల్లో 88 మంది, కన్నెపల్లిలో 36 పాఠశాలల్లో 107 మంది, వేమనపల్లిలో 32 పాఠశాలల్లో 85 మంది, నెన్నెలలో 33 పాఠశాలల్లో 141 మంది ఉపాధ్యాయులు వందశాతం తమ వివరాలు వెబ్సైట్లో నమోదు చేశారు. భీమారం, చెన్నూర్, మందమర్రి, మంచిర్యాల, హజీపూర్, లక్టెట్టిపేట్ మండలాల్లో పదిమందికి పైగా ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో ఉపాధ్యాయులు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సెక్టోరల్ అధికారి సప్థర్అలీ సూచించారు. -
పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య (జీరో ఎన్రోల్మెంట్) వందల్లో పెరిగింది. అలాగే విద్యార్థులు తగ్గిపోయిన స్కూళ్ల సంఖ్య కూడా పెరిగిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) పేర్కొంది. దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు సర్‌ప్లస్‌గా ఉన్నారని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వెంటనే పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాలని పీఏబీ స్పష్టం చేసింది. ఎస్ఎస్ఏ 2020–21 విద్యా సంవత్సరపు పీఏబీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన లెక్కలను బట్టి కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో 17,873 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. పీఏబీ లేవనెత్తిన అంశాలు.. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని ప్రాథమిక పాఠశాలల సంఖ్య 1,097 పెరిగింది. అలాగే ఒక్క విద్యార్థి లేని ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 315కు పెరిగింది. ప్రాథమిక స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 4,582 నుంచి 4,960కి పెరిగాయి. ప్రాథమికోన్నత స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 1,400 నుంచి 1,651కి పెరిగాయి. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 11,096కు పెరిగింది. ప్రాథమికోన్నత స్థాయిలో 30 మందిలోపే విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 2,809 నుంచి 3,085కు పెరిగాయి. ప్రాథమిక స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 4,372 నుంచి 4,448కి, ప్రాథమికోన్నత స్థాయిలో 127 నుంచి 168కి పెరిగాయి. దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు అదనంగా (సర్ప్లస్) ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517 టీచర్ పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 84 శాతం ఉన్నత పాఠశాలల్లో మాత్రమే అన్ని ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారు. భాషా సబ్జెక్టుల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 41 కాగా, సైన్స్‌లో ప్రతి 37 మందికి ఒక టీచర్, మేథమెటిక్స్‌లో ప్రతి 54 మందికి ఒక టీచర్, సోషల్ స్టడీస్‌లో ప్రతి 73 మందికి ఒక టీచర్ ఉన్నారు. ∙ వందల సంఖ్యలో పెరిగిపోయిన ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు ∙ తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్యలోనూ పెరుగుదల ∙ దీంతో ఆయా పాఠశాలల్లో 8 వేల మందికి పైగా సర్ప్లస్ టీచర్లు ∙ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు వెల్లడి -
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
వలస కూలీలకు అండగా ప్రభుత్వ టీచర్లు
ఆర్మూర్: లాక్డౌన్ వేళ పొట్ట చేత పట్టుకొని చిన్న పిల్లలను చంకన ఎత్తుకొని ఇతర రాష్ట్రాలలోని తమ స్వగ్రామాలకు కాలి నడకన వెళుతున్న వలస కార్మికులకు అండగా మేమున్నామంటూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఈ మూడు మండలాల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కొంత మొత్తాన్ని పోగు చేసుకున్నారు. గత నెల 16 నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారుతోపాటు ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తాల్లో వలస కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. దాతల సహకారంతో కొనుగోలు చేసిన వంట సామగ్రితో ముప్కాల్, మెండోర కేజీబీవీలలో అన్నం, కూరగాయలు వండిస్తున్నారు. అలాగే రొట్టెలను కూడా తయారు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ వంటకాలను మూడు కేంద్రాల్లోకి తరలించి.. మూడు షిఫ్టులుగా పనిచేస్తూ జాతీయ రహదారి వెంట కాలినడకన, లారీలు, ఇతర వాహనాల్లో వెళుతున్న వలస కార్మికులకు భోజనంతోపాటు చల్లని నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, పండ్లు అందిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 500 పైగా కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. పెర్కిట్ శివా రులోని అన్నదాన కేంద్రం నిర్వహణకు రూ.40 వేలు, ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తా కేంద్రాల్లో రూ.12 వేల చొప్పున ప్రతి రోజు ఖర్చవుతోంది. ఉపాధ్యాయుల సేవలను గుర్తించిన చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహదారిపై ఉంటూ వలస కార్మికుల కడుపులు నింపుతున్నారు. సమష్టి కృషితో సాధిస్తున్నాం.. బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దాతలు కూడా ముందుకు రావడం చాలా తోడ్పాటుగా ఉంది. ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనడం అభినందనీయం. కాలి నడకన వెళుతున్న కార్మికుల వెతలు చూడలేక మేము ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ 500 మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నాం. – బట్టు రాజేశ్వర్, ఎంఈవో, బాల్కొండ -
చదివింది ఎనిమిదే.. కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్!
భోపాల్: ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడో వ్యక్తి. అంతే కాదు నెలకు అక్షరాలా రూ. 4 వేల జీతం కూడా పొందుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు. మరి ఎలా టీచర్ ఉద్యోగం చేస్తున్నాడనుకుంటున్నారా..! వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ ఖర్గోనే జిల్లాలోని దేవ్లీ ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. (కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది) వీరు గత కొద్ది రోజులగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పాఠశాలలో ఉన్న 23 మంది పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 8వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉన్న దయాల్ సింగ్ అనే వ్యక్తిని టీచర్‌గా నియమించుకున్నారు. నెలకు రూ. 4 వేలు జీతం కూడా ఇస్తున్నారు. పదిహేను రోజులకో సారి వచ్చి ఆ ఇద్దరు టీచర్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి పోతున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆ పాఠశాలను జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాహుల్ చౌహన్ గురువారం సందర్శించారు. సమయానికి ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. దయాల్ సింగ్‌పై డిప్యూటీ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించగా అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న డిప్యూటీ కలెక్టర్ రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఆ ఇద్దరి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (పాఠశాల పిల్లగాడా.. పశులుగాసే పోరగాడా..) -
ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదులాట!
విజయనగరం, దత్తిరాజేరు: పిల్లలకు బుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమలో తామే ఢీ అంటే ఢీ అన్నారు. నువ్వెంతంటే... నువ్వెంత! అన్న రీతిన వాదులాటకు దిగారు. పలువురు వారించినా ఎవరి మాట వినలేదు. అదో సమావేశమన్న విషయం మరచి అందరి ముందరే కొట్టుకున్నంత పని చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దత్తిరాజేరు విద్యా శాఖ కార్యాలయంలో ఎంఈఓ అధ్యక్షతన ప్రధాన ఉపాధ్యాయులకు మంగళవారం వార్షిక ప్రణాళిక సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక యూనియన్‌కు చెందిన ఉపాధ్యాయుడు జీతాల విషయమై ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో మరో ఉపాధ్యాయుడు జోక్యం చేసుకున్నారు. ఇది కాస్త చినికిచినికి గాలివానలా మారి అక్కడ ఉన్న మిగతా ఉపాధ్యాయులు పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది. వీరి వివాదంలో పాత కాలం నాటి కొన్ని సంఘటనలు కారణంగా చెబుతున్నారు. గతంలో దాసుపేటలో ఉన్న ఉపాధ్యాయురాలిని అక్కడ హెచ్ఎంకు తెలియకుండా ఆకస్మికంగా బదిలీ చేయడం, అనారోగ్యం ఉన్న కె.కొత్తవలస ఉపాధ్యాయుడును దాసుపేటకు బదిలీ చేయడం వంటి విషయాల్లో వీరి మధ్య విబేధాలు నెలకొనడంతో వీరిద్దరి మధ్య రాయడానికి వీల్లేని భాషతో దుర్భాషలాడుకున్నారని అక్కడి వారు పేర్కొంటున్నారు. మరడాం ఉన్నత పాఠశాల హెచ్ఎం జోక్యం చేసుకొని వీరిని సముదాయించారని సమావేశంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఏమైనా వీరి మధ్య మాటల యుద్ధం రాయడానికి వీల్లేని భాషలో తిట్టుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
గిరిజనులకు మాతృభాషలో పాఠాలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పాఠాలు బోధించడం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లలో హాజరు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 920 పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ‘మాతృభాష ఆధారిత బహు భాషా విద్య’ (మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లింగ్విల్ ఎడ్యుకేషన్–ఎంటీఎంఎల్‌ఈ) పేరుతో ఇది అమలవుతోంది. ఒకటి, రెండు, మూడు తరగతుల్లోని దాదాపు 18,975 మంది గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలో పాఠాలు బోధిస్తున్నారు. సవర, కొండ, ఆదివాసీ, కోయ, సుగాలి పిల్లలు సొంత భాషలోనే పాఠాలు చదువుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సవర భాషలో.. విజయనగరం జిల్లాలో కొండ, కువి, ఆదివాసీ ఒడియా భాషల్లో.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోయభాషలో.. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సుగాలి, లంబాడి భాషల్లో బోధన జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల గిరిజన విద్యార్థులకు ఆయా భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ టీచర్లకు స్థానిక భాషల్లో బోధనకు సహకరించేందుకు మల్టీ లింగ్విల్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా(ఎంఎల్ఈ) ఆయా భాషలు వచ్చిన వారిని పాఠశాలల్లో నియమించారు. విద్యావంతులైన స్థానిక గిరిజన యువతనే ఎంఎల్‌ఈలుగా ఎంపిక చేశారు. ఎంఎల్‌ఈలుగా ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆయా గిరిజన భాషలు మాట్లాడగలిగే 1,027 మందిని ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల వరకు వేతనం ఇస్తున్నారు. గిరిజన భాషల్లో బోధనకు ప్రభుత్వం రూ.42 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తోంది. సంప్రదాయాలు, పొడుపు కథలు గిరిజన విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల్లో ఆయా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే అంశాలను, పొడుపు కథలను చేర్చారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. గిరిజన భాషల్లోనే బాలసాహిత్యాన్ని అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు ఒక్కో భాషకు రూ.13.33 లక్షల చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆరు గిరిజన భాషల్లో పొడుపు కథలు, బాలల కథలు, బొమ్మలతో కూడిన నిఘంటువులను, పదకోశాలను రూపొందిస్తున్నారు. సత్ఫలితాలు వస్తున్నాయి ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో బోధన సాగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే ఆయా భాషల్లో బాలసాహిత్యం, ఇతర అంశాలతో కూడిన పుస్తకాలు సిద్ధం చేస్తున్నాం’’ – వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు ‘‘గిరిజన విద్యార్థులకు వారి సొంత భాషలోనే పాఠాలు బోధించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. గతంలో వారికి ఆయా పాఠాలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు సులభంగా నేర్చుకుంటున్నారు. బిడ్డలకు తల్లిపాలు ఎంత ప్రయోజనకరమో తల్లిభాషతో బోధన కూడా అంతే ఉపయోగకరం. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో మార్పు గమనిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా మా పిల్లలకు ఎంతో మేలు ‘‘మా పిల్లలు గతంలో బడులకు వెళ్లినా పాఠాలు అర్థంకాక ఏమీ నేర్చుకోలేకపోయేవారు. తరగతులకు వెళ్లకుండా ఆటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు మా సవర భాషలోనే పాఠాలు చెబుతుండడంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్తున్నారు. మా సొంత భాషలోనే పాఠాలు చెబుతుండడంతో మా పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది’’ – పత్తిక సుశీల, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా -
సెల్ఫోన్లో ఫోటోలు తీసి వికృత చేష్టలు
సాక్షి, భీమిలి(విశాఖపట్నం) : పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చిన సంఘటన ఇది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే కామంతో కళ్లు మూసుకుపోయి పసి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. లేగ మొగ్గలపై వికృతంగా ప్రవర్తించారు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్రంగా దండిస్తామని బెదిరించారు. గత కొన్ని నెలలుగా తమ పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నా ఏమీ తెలియని ఆ పసి పిల్లలు మౌనంగానే భరించారు. ఉపాధ్యాయలకు భయపడి లోలోపలే దుఃఖించారు. మండలంలోని పెద్దిపాలెంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇన్నాళ్లకు ఆ ఉపాధ్యాయుల పాపం పండి వైద్యుల రూపంలో విషయం వెలుగులోకి వచ్చింది. నగ్నంగా సెల్ఫోన్లలో చిత్రీకరణ పెద్దిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అనాథ పిల్లలు కోసం స్థానికంగా హార్విస్ట్ అనే అనాథ శరణాలయాన్ని నడుపుతున్నారు. అందులో ఉన్న కొంతమంది పిల్లలు కూడా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు మహిళా ఉపాధ్యాయులతో పాటు గుడే వెంకటేశ్వరరావు (55 ఏళ్లు), సుంకి సుందరరావు (50 ఏళ్లు) అనే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వెంకటేశ్వరరావు, సుందరరావు మొదట నుంచి వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. తోటి ఉపాధ్యాయునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారికి అలవాటుగా మారింది. తరగతి గదిలో ఒంటరిగా ఉండే పిల్లలపై గత కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బాలికలను అర్ధనగ్నంగా ఉంచి సెల్ఫోన్లో ఫొటోలు తీయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ దుశ్చర్య గత కొంతకాలంగా సాగుతోంది. పాఠశాలలో విచారణ జరుపుతున్న డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవిశంకర్‌రెడ్డి పిల్లల ఏడుపు.. వైద్యుల ఆరా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు అలంకరిస్తున్నారు. ఇదే అదునుగా ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సుందరరావు 3,4 తరగతులు చదువుతున్న ఇద్దరు గిరిజన బాలికలను పాఠశాలపై అంతస్తులోకి తీసుకొని వెళ్లారు. అక్కడకు ఎవరూ రాకుండా ఇద్దరు మగ పిల్లలను మెట్లపై కాపలాగా ఉంచారు. తరగతి గది లోపల పిల్లలను అర్ధనగ్నంగా ఉంచి ఉపాధ్యాయులు లైంగికంగా హింసించడంతో పాటు సెల్ఫోన్లో తమ వికృత చేష్టలను రికార్డు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేయడానికి కేజీహెచ్ కేంద్రంగా నడుస్తున్న రాష్ట్రీయ శిశు సంరక్షణ కేంద్రం వైద్యులు మొబైల్ వ్యాన్‌తో పెద్దిపాలెం పాఠశాలకు వచ్చారు. వారు విద్యార్థినులను ఆరోగ్య తనిఖీలు చేస్తుండగా ఇద్దరు విద్యార్థినులు ఏడుస్తుండడంతో ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఆరా తీశారు. పిల్లలు చెప్పింది విని వారు నివ్వెరుపోయారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవిశంకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్–1 ఏసీపీ త్రినాథ్, సీఐ జి.శంకరరావు పాఠశాల వద్దకు చేరుకున్నారు. వేధింపులకు గురైన ఇద్దరు పిల్లలను రహస్యంగా విచారించి సంఘటన నిజమేనని నిర్ధారించుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు ప్రవర్తనపై తోటి ఉపాధ్యాయులను అడిగి వివరాలు రాబట్టారు. అనంతరం వెంకటేశ్వరరావు, సుందరరావులను అదుపులో కి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెక్షన్లు నమోదు పిల్లలపై లైంగిక వేధింపులు..వికృత చేష్టలకు పాల్పడిన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సుందరరావుపై పిల్లలిచ్చిన సమాచారం మేరకు 354ఎ, 354సీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్సీ, ఎస్టీ సెల్–1 ఏసీపీ త్రినాథ్ తెలిపారు. ఆరేళ్లుగా వెంటేశ్వరరావు ఇక్కడే తిష్ట పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వెంకటేశ్వరరావు ఆరేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. తగరపువలసలో నివాసం ఉంటున్న ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఇద్దరూ పెద్దిపాలెంలో పని చేసేవారు. ఆ సమయంలో తోటి ఉపాధ్యాయురాల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో వెంకటేశ్వరరావు భార్య ఆ ఉపాధ్యాయురాలిని బతిమాలి వివాదాన్ని పెద్దది కాకుండా చూసుకున్నట్టు సమాచారం. అయితే వెంకటేశ్వరరావు భార్య గతేడాది మరణించగా 55 ఏళ్ల వయసులోనూ అతను రెండో వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా సుందరరావు ఆరు నెలలు క్రితం విజయనగరం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇద్దరిదీ ఒకటే బుద్ధి కావడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. పాపం పండడంతో కటకటాలు వెనక్కి వెళ్లారు. -
స్కూల్ టైమ్‌లో ఫోన్ వాడితే కఠిన చర్యలు
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఫోన్‌ను వినియోగిస్తున్నారా.. జాగ్రత్త! ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటున్నా, మెసేజ్‌లు పంపించుకుంటున్నా, వీడియోలు చూస్తున్నా, నెట్లో చిట్చాట్లు చేసుకుంటున్నా ఇక నుండి వాటన్నింటికీ ఉపాధ్యాయులు స్వస్తి పలకాల్సిందే. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లను వినియోగించరాదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. మంత్రి ప్రకటనతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ సెల్ఫోన్లో గ్రూపులు పెట్టుకున్నాయి. ఆ గ్రూపుల ద్వారా వారికి సంబంధించిన సమాచారం చేరవేసేందుకు గ్రూపులో మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మంత్రి ప్రకటనతో ఆయా గ్రూపులకు చెందిన అడ్మిన్లు సమాచారం చేరవేస్తున్నారు. పాఠశాలల్లో తరగతులు చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేయరాదని, ఒకవేళ పోస్టు చేస్తే అడ్మిన్‌తో పాటు పోస్టు చేసిన వారు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. స్వాగతిస్తున్న విద్యారంగ నిపుణులు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ఫోన్లు వాడుతున్న వారిపై ప్రభుత్వం కొంతమేర కఠినంగా వ్యవహరించడాన్ని విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లు వాడరాదంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటనను స్వాగతిస్తూ ఉపాధ్యాయులు కూడా సమయాన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా తరగతి గదుల్లో సెల్ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టడం మంచి పరిణామమని విద్యారంగ నిపుణులతో పాటు అనేకమంది ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు. -
సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు
‘‘పాఠశాల సమయంలో టీచర్లు సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల ఆ ప్రభావం పిల్లల చదువుపై పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తరగతి గదిలో టీచరు చేతిలో సెల్‌ఫోన్ కనిపించకూడదు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. తరగతి గదిలో టీచరు సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఆయనతో పాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కూడా బాధ్యుడిని చేస్తా. ఇద్దరిపైనా చర్యలుంటాయి. ఎవరైనా టీచరు తరగతి గదిలో సెల్‌ఫోన్ పట్టుకున్నట్లు కనిపిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.’’ – శామ్యూల్, జిల్లా విద్యా శాఖ అధికారి నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో కలెక్టర్ సత్యనారాయణ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాలా స్కూళ్లలో ఐదో తరగతి పిల్లలకు కూడా రాయడం, చదవడం రాకపోవడం బాధాకరం. ప్రైమరీ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటా. ఇక ఉన్నత పాఠశాలల్లో ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనంత’ కరువుకు చిరునామా.. వ్యవసాయమే జీవనాధారం. పంటలు సరిగా పండవు. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలే అధికం. అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపుతారు. నూతన సర్కార్ కూడా విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 5.50 లక్షల మంది విద్యార్థుల భవిత, ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయ సంఘాల నేతల వ్యవహారం, డీఈఓ కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు తదితరాలపై ఇటీవలే జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కాగిత శామ్యూల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకోనున్న చర్యలు ఆయన మాటల్లోనే.. విద్యార్థుల సంఖ్యను పెంచుతాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కూడా ప్రాధాన్యతగా తీసు కుంటా. ఈ విద్యా సంవత్సరం ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 13 వేల మందికిపైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మరింతమంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టేలా చర్యలు తీసుకుంటాం. షెడ్యూలు ప్రకారం ఫార్మేటివ్ పరీక్షలు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రతి స్కూల్లోనూ ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి. టీచర్లు రిజిష్టర్లు పక్కాగా నిర్వహించాలి. టీచర్లు డైరీలు రాయాలి. లెసన్ ప్లాన్ తప్పకుండా రావాలి. ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు తరచూ తనిఖీలు నిర్వహించి ఈ అంశాలన్నీ పరిశీలించాలి. అవినీతి రహిత పాలన డీఈఓ కార్యాలయంలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తా. ప్రతి ఫైలుకూ ఒక రేటు ఫిక్స్ చేశారనే వార్తలు రావడం దారుణం. ఇప్పటిదాకా ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇకపై ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. పెండింగ్ ఫైళ్ల విషయమై బాధితులెవరైనా నన్ను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. బయోమెట్రిక్ పక్కాగా అమలు పది రోజులు గడువు పెట్టుకున్నా. జిల్లాలో అన్ని కేడర్ల టీచర్లు 18 వేలమంది దాకా ఉన్నారు. వారంతా వందశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే. కుంటిసాకులు చెబితే ఒప్పుకోను. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులుంటే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 1,700 డివైజ్‌లు కొత్తగా వచ్చాయి. అవసరమైన స్కూళ్లకు వాటిని అందజేస్తాం. అప్పటికీ అటెండెన్స్ శాతం పెరగకపోతే మాత్రం కఠినంగా వ్యవహరిస్తా. ‘నవ ప్రయాస్’కు నోటీసులు పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న ‘నవ ప్రయాస్’ ఏజెన్సీపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. భోజనం సరిగా లేకపోవడంతో మూడు మండలాల్లోని స్కూళ్లలో 50 శాతం మంది విద్యార్థులు కూడా భోజనం తినడం లేదు. దీనిపై ఏజెన్సీకి నోటీసులిచ్చాం. నవ ప్రయాస్ సంస్థ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యతపై ఆహారభద్రత అధికారులతో విచారణ చేయిస్తున్నాం. వారి నివేదిక రాగానే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. అందరూ సమానమే స్కూల్ పనివేళల్లో ప్రతి టీచరూ బడిలోనే ఉండాలి. ఈ విషయంలో సామాన్య టీచర్లయినా, ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా ఒకటే. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం... ఎవరినీ ఉపేక్షించను. పనివేళల్లో టీచర్లు ఎవరూ కూడా నన్ను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దు. వారంలో మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటా. ఏదైనా సమస్య ఉంటే ఆ సమయంలో నన్ను కలవవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొందరు టీచర్లపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. అలాంటి వారి భరతం పడతా. -
ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ
సాక్షి, పద్మనాభం (భీమిలి): మండలలంలోని చేరిఖండంలో ఇద్దరు ఉపాధ్యాయునుల ఇళ్లలో శనివారం చోరీ జరిగింది. 41.75 తులాల బంగారు అభరణాలు, రూ.2.60 లక్షలు నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి. చేరిఖండం గ్రామానికి చెందిన పల్లంటి రాణి దువ్వుపేట ప్రాథమిక పాఠశాలల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇంటిలో తగరపువలసకు చెందిన ఎన్.ఎం.సి మాధురి అద్దెకు ఉంటుం ది. మాధురి రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరు ఉదయం ఇళ్ల గేట్లకు తాళాలు వేసి విధులకు వెళ్లారు. వీరు ఇళ్ల వద్ద లేరని గమనించిన దుండగులు గేటు తాళం కప్పలు విరగొట్టి లోపలికి ప్రవేశించారు. మాధురి పాఠశాల నుంచి విధులు ముగించుకుని సాయంత్రం 4.45 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చే సరికి గేట్లు, లోపల ఉన్న బీరువాలు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసు, రెండు తులాల చిన్న చిన్న బంగారు అభరణాలు, రూ.30వేలు నగదు అపహరించినట్టు గుర్తించింది. రాణి పాఠశాల నుంచి రెడ్డిపల్లిలో ఉన్న అమ్మగారి ఇంటి వద్దకు వెళ్లింది. రాణి ఇంటిలో దొంగతనం జరిగిందని ఆమె తండ్రి ఆదినారాయణకు విద్యార్థుల ద్వారా మాధురి సమాచారం అందించింది. తండ్రి ఆదినారాయణ ఫోన్ చేసి ఈ విషయం రాణికి తెలిపారు. వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలో బీరువులో ఉన్న 36.75 తులాల బంగా>రు అభరణాలు, రూ.2.30లక్షలు నగదు అపహరించినట్టు గుర్తించారు. రాణి కుమారుడు తరుణ్‌తేజకు ఎంబీబీఎస్ ప్రవేశానికి ఫీజు కట్టడానికి ఈ నగదును శుక్రవారం తెచ్చి బీరువాలో ఉంచినట్టు పేర్కొన్నారు. తన ఇంటిలో దొంగతనం జరగడంతో రాణి బోరున విలపించింది. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. క్రైమ్ ఏడీసీపీ వి.సురేష్‌బాబు చోరీ జరిగిన సంఘటన ప్రాంతాలను పరిశీలించారు. ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్లు వర్సెస్ జూనియర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, వాటిల్లోని వైద్యుల విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపును సీనియర్ వైద్యులు ఆహ్వానిస్తుండగా, జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విరమణ వయస్సు పెంపుపై వైద్యుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు మాత్రం విరమణ వయస్సు పెంపుపై తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు... బోధనాసుపత్రుల్లోని వైద్యుల విరమణ వయస్సు పెంపుపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అధికారిక ప్రకటన చేయడంతో జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. 65 ఏళ్ల వయస్సు పెంచాలని సీనియర్ డాక్టర్లు, త్వరలో రిటైర్ కాబోయే వారు కోరుతున్నారు. దీన్ని కేవలం బోధనాసుపత్రుల్లోని వైద్యులకే కాకుండా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులందరికీ వర్తింపచేయాలని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు కూడా కోరుతున్నాయి. అన్నేళ్లు పనిచేయడం కష్టమని, ఆ వయస్సులో ఆపరేషన్ చేయాలంటే చేతులు వణుకుతాయని, కాబట్టి 61 ఏళ్లు చాలని ఇంకొందరు డాక్టర్లు అంటున్నారు. ఇక జూనియర్ డాక్టర్లేమో ఖాళీలను భర్తీ చేయకుండా ఇలా విరమణ వయస్సు పెంచితే తాము నిరుద్యోగులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లే ఇప్పుడు ప్రధానంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డాక్టర్ల నిరుద్యోగ సభ’మంగళవారం జరగబోతోంది. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించనున్నారు. బెంగాల్‌పై నిరసనలు... ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్లో వైద్యులపై దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోనూ పలుచోట్ల వైద్యులు నిరసనలు తెలిపారు. అనేక ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన ప్రదర్శనలు చేశారు. త్వరలో ఆర్డినెన్స్... వాస్తవంగా విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలిపింది. తర్వాత దానిపై వివిధ వర్గాల వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలపడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జీవోను సర్కారు విడుదల చేయలేకపోయింది. అయితే గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపినందున మరోసారి అవసరంలేదని, ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఆర్డినెన్స్ జారీచేసే అవకాశముందని వివరించారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే తక్షణమే అమలుకానుంది. దీంతో ఈ నెలలో విరమణ పొందే బోధనాసుపత్రుల్లోని డాక్టర్లు మరో ఏడేళ్ల వరకు పొడిగింపు పొందనున్నారు. -
ఎనిమిదేళ్లకు బడి తీశారు..!
కార్పొరేట్ హంగులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన ఓ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభం కాబోతోంది. పిల్లలు లేక తలుపులు మూతపడి బోసిపోయిన పాఠశాల మళ్లీ విద్యార్థులతో కళకళలాడనుంది. సాక్షి,ప్రకాశం : సంతమాగులూరు పరిధిలోని రామిరెడ్డిపాలెం గ్రామంలో 20 సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో 28 విద్యార్థులతో కొనసాగిన పాఠశాల... ప్రైవేట్ స్కూళ్ల దెబ్బకు ఏడాది ఏడాది పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో 2013 లో పాఠశాలను మూసివేశారు. అప్పటి నుంచి బోసిపోయిన పాఠశాల ఈ ఏడాది మళ్లీ తీస్తుండటంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 17 మంది విద్యార్థులు ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా చేరారని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదరించండి ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఖర్చు చేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రోత్సహించాలని ఎంఈవో అన్నారు. రెండు నెలల నుంచి ఈ పాఠశాలను మళ్లీ తెరవాలనే ఉద్దేశంతో ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఉపాధ్యాయులందరూ రామిరెడ్డిపాలెంలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తిరిగి పాఠశాలను తెరవాలని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. 17 మందితో మళ్లీ ప్రారంభం రామిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. తల్లిదండ్రులు కేవలం మంచి విద్యాబోధన ప్రైవేట్ పాఠశాలల్లో ఉందని అటు వైపు వెళ్లిన వారంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటంతో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలవైపే చొరవ చూపుతున్నారు. దీంతో ఈ సంవత్సరం 17 మంది విద్యార్థులు బడిలో చేరారు. 12వ తేదీ నుంచి ఈ పాఠశాలను తెరుస్తున్నామని ఒక ఉపాధ్యాయుడుతోపాటు వాలంటరీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎంఈవో తెలిపారు. ఫలించిన ఉపాధ్యాయుల కృషి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలనే లక్ష్యంతో రామిరెడ్డిపాలెం గ్రామంలో రెండు నెలల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈవో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో ఉపాధ్యాయుల కృషి ఫలించింది. -
నంద్యాలలొ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందని పోస్టర్ బ్యాలెట్లు
-
టీచర్లకు పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొనే టీచర్లకు మరో క్లిష్ట పరిస్థితి ఎదురుకానుంది. జనవరి 25న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులను ఏ అర్ధరాత్రికో పూర్తిచేసుకుని మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఉరుకులు, పరుగులతో పాఠశాలలకు చేరుకోడానికి నానా తిప్పలు పడిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితే టీచర్లకు మళ్లీ తలెత్తనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11న ఎన్నికల విధులు నిర్వహించాలి. మరుసటి రోజు ఉదయం 7.45 వరకే టీచర్లు స్కూళ్లల్లో విధిగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ 12వ తేదీ పాఠశాలల లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి. ఆ రోజు స్కూలుకు వెళ్లకపోతే వేసవి సెలవులకు సంబంధించిన వేతనం చెల్లించేది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ ఒకటి తర్వాతే. అదీ జూన్ ఒకటిన స్కూలుకు హాజరైతేనే. ఇటు ఏప్రిల్ 12వ తేదీన స్కూలుకు వెళ్లక, అటు జూన్ ఒకటిన పాఠశాలకు గైర్హాజరయ్యే అనివార్య పరిస్థితులు ఏర్పడి టీచర్లకు తీవ్ర నష్టం జరగనుంది. అలాంటి టీచర్లకు వేసవి సెలవులకు సంబంధించిన జీతం చెల్లించరు. లీవ్ మంజూరు చేయించుకుంటేనే వేతనం చెల్లిస్తారు. సెలవులు నిల్వలేని టీచర్లకు 49 రోజులు వేతనంలో కోతే! అయితే, ఎంపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లు ఏప్రిల్ 12న గైర్హాజరైతే దాన్ని జర్నీ పీరియడ్‌గా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే మాత్రం ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకోవచ్చు. -
పంతుళ్లకు పరీక్ష..!
సాక్షి, మహబూబాబాద్ : ఈ విద్యా సంవత్సరం గవర్నమెంట్ పంతుళ్లకు పరీక్ష కాలమని చెప్పొచ్చు. అదేమిటీ.. విద్యార్థులకు కదా పరీక్ష.. పంతుళ్లకెందుకు అనుకుంటున్నారా.. ఒక్కసారి వారి విధుల వివరాలు చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. విద్యార్థులకు చదువు చెప్పడం అట్లుంచితే.. ఎన్నికల విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కేటాయించిన ఎన్నికల విధులు విద్యార్థులకు శాపంగా మారుతోంది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు, వరుస ఎన్నికలతో నిత్యం విద్యాశాఖ సిబ్బందికి రెండు పడవలపై పయనం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. డిసెంబర్ చివరినాటికి అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తికావాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటకీ, ఇప్పటికీ జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాలేదు. అలాగే రానున్నది పరీక్షకాలం కావడంతో పదోతరగతిలో విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులకు ఆటంకం కలుగనుంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించడం వల్ల ఇప్పటికే విద్యార్థులకు నష్టం జరిగింది. ఇప్పుడు వరుసగా గ్రామపంచాయతీ, సహకార, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వల్ల విద్యార్థులకు మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లో మూడు దశల్లో 4,020 పోలింగ్ కేంద్రాల్లో ఈనెలాఖరు వరుకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 3,025మంది ఉపాధ్యాయులు ఉండగా, జిల్లావ్యాప్తంగా 44,703 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సుమారు 3,878మంది సిబ్బంది అవసరం ఉంది. దీంతో ఇన్చార్జి హెడ్మాస్టర్లతో పాటు, సీనియర్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా ఎన్నికల విధులు కేటాయించనున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన రెండు సంవత్సరాలుగా పదోతరగతి ఫలితాల్లో చివరిస్థానంలో నిలుస్తోంది. దీంతో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ఫలితాలపై మరోసారి పడనుందోననే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఆర్ఓలు, ఏఆర్ఓలుగా గెజిటెడ్ అధికారులను నియమించాలి. కానీ గెజిటెడ్ అధికారులు ఎక్కువగా లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్ఓ, ఏఆర్ఓలతో పాటు, ఇతర పోలింగ్ సిబ్బందిగా ఏదో రకమైన విధులను ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోంది. మూడు నాలుగు గ్రామపంచాయతీలకు కలిపి ఒక క్లస్టర్ చేసి ఆర్ఓ, ఏఆర్ఓలను నియమిస్తారు. వీళ్లు స్టేజ్–1లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మొదలు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, విత్‌డ్రా, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పనులు చేయాలి. స్టేజీ–2లో ఆర్వోలు ఎన్నికల పోలింగ్, ఓట్లు లెక్కింపు, విజేతల ప్రకటన, ఉపసర్పంచ్ నియామకం వంటి పనులు చేయాలి. ఇతర సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ, విధుల నిర్వహణ వంటి పనుల కోసం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇన్ని రోజులు బోధనా పనిదినాలు విద్యార్థులు నష్టపోతే, అది విద్యార్థుల సిలబస్ పూర్తిచేయడంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సిలబస్ పూర్తయ్యేనా..! మార్చి 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి, దానికనుగుణంగా డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి కావాలి. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ టీచర్లు పాల్గొన్నారు. నాలుగైదు రోజులు పనిదినాలు నష్టపోయాయి. ఇప్పుడేమో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం వందలాది మంది ఇన్చార్జి హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్ఓ, ఏఆర్ఓలుగా నియమించారు. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత వెంటాడుతోంది. సిలబస్ సమస్య ఎలా అధిగమించాలా అని ఉపాధ్యాయులు మదనపడుతుంటే మళ్లీ ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల రూపంలో మరోసారి ఉపాధ్యాయులపై భారం పడింది. ఈ సారి ఏకంగా స్కూల్ అసిస్టెంట్లకు సైతం బాధ్యతలు అప్పగిస్తుండడంతో ఏం చేయాలో తోచక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. -
‘బోధనేతర పనుల’పై భగ్గుమన్న ఉపాధ్యాయలోకం
విజయనగరంఅర్బన్ : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక్క ఎన్నికల విధులు మినహాయించి ఏ ఒక్క బోధనేతర కార్యక్రమాలూ అప్పగించరాదని సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ అంశంలో పలుమార్లు సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఉపాధ్యాయుల విధి విధానాల నూతన చట్టాన్ని రూపొందిస్తోంది. ఉపాధ్యాయ పరిపాలనా చట్టం (టీచర్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్), ఉపాధ్యాయ బదిలీ చట్టం (టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్) పేర్లతో వేర్వేరుగా ప్రత్యేక చట్టాలను తెస్తోంది. ముందుగా వాటి ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ ఇటీవల వెబ్సైట్లో పెట్టి టీచర్ల అభిప్రాయాలను కోరింది. విద్యాబోధన ప్రమాణాలపై తీవ్రంగా ప్రభావం చూపే ఈ చట్టాలను ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 14 వేల మంది ఉపాధ్యాయులు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. చట్టాల ముసాయిదాతోనే కథను ముగింప చేసే దిశగా ఉద్యమాలకు దిగాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలు జిల్లా స్థాయిలో రూపొందించేందుకు ఈ నెల 28న ముహూర్తం ఖరారు చేసింది. బోధనేతర పని తీరుకు పాయింట్లు టీచర్ అడ్మినిస్ట్రేషన్ యాక్టుకు సంబంధించి వారి పనితీరును అంచనా వేసేలా కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తున్నారు. అయితే, వృత్తిరీత్యా నిర్వహించే బోధన నైపుణ్యాలపై కాకుండా సంబంధంలేని బయోమెట్రిక్ అటెండెన్సు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం అప్పగించిన బోధనేతర పనుల తీరును అంచనా వేసేవి ఉండడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్యాహ్నభోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులతో సహా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి సమర్పించడం వంటి వాటిలో ఉపాధ్యాయుల పనితీరుకు ఇన్సెంటివ్, బదిలీలకు పాయింట్లు ఇవ్వడం వంటి అంశాలపై మండి పడుతున్నారు. బదిలీ హక్కులు హరించేవిగా.. టీచర్ల బదిలీ హక్కును హరించే విధంగా అనేక నిబంధనలను ప్రభుత్వం చట్టంలో పొందుపరుస్తోంది. ఇతర శాఖలకు లేని అనేక షరతులు, నిబంధనలు ఇందులో ఉన్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో స్కూళ్లను నాలుగు విభాగాలుగా విభజిస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ఈ చట్టాన్ని తెస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో ప్రమాణాలు సాధించడానికి ఆస్కారం ఎక్కడుందని ఉపాధ్యాయు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ప్రమాణాల మెరచలేకపోవడానికి విద్యార్థి కుటుంబ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు కారణాలు కాగా వాటికి ఉపాధ్యాయులను బాధ్యులను చేసేలా చట్టం చేవడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. నల్ల చట్టాలను రానీయం కానీయం.. ఉపాధ్యాయ హక్కులను హరించే నల్ల చట్టాలను తమిళనాడులో కూడా తీసుకొచ్చారు. అక్కడి ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇప్పటికే కార్మికులను బానిసులుగా చేసే చట్టాలను పరిశ్రమరంగంలో తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యారంగంలోని ఉపాధ్యాయులపై ప్రయోగించబోతున్నారు. ఆ చట్టాలను రానీయం. బిల్లుకానీయకుండానే అడ్డుకుంటాం. – బంకురు జోగినాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీటీఎఫ్ (257) కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా... ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే ఈ చట్టాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ విద్యను పటిష్టపరిచే ఆలోచనే ఉంటే బోధన రంగంలో వినూత్న ప్రయోగాలు చేయాలి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉపాధ్యాయుని హక్కులను ఎలా హరింపచేయాలో స్పష్టంగా పరిశీలించి చట్టాలను తెస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ దీనిని అడ్డుకోవాలి. – బంకపల్లి శిపప్రసాద్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జి, పీఆర్టీయూ కోర్టుపరిధి నుంచి తప్పించే ఆలోచన దుర్మార్గం ఉపాధ్యాయులు తప్పిదాలు చేస్తే వారిని సర్వీసు నుంచి తప్పించే అధికారం విద్యాశాఖకు ఉంటుందని అయితే దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కొత్త చట్టాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకునేందుకు వీల్లేదని నిబంధనలు పెట్టారు. ఈ ఆలోచన దుర్మార్గం. సీపీఎస్ రద్దు ఉద్యమం తారాస్థాయికి చేరుతున్న సమయంలో దాని నుంచి ఉపాధ్యాయుల దృష్టిని మరల్చేందుకు కొత్తచట్టాలను ప్రయోగిస్తున్నారు. – జేసీ రాజు, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏపీటీఎఫ్ -
రెగ్యులర్ ఉపాధ్యాయులేరి?
భైంసాటౌన్ ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న సర్కారు.. విద్యార్థులకు సరైన విద్య అందించడంపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రెగ్యులర్ ఉపాధ్యాయుల భర్తీపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో మొత్తం 510 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఖాళీల్లో విద్యావలంటీర్ల భర్తీతో సరిపెట్టనుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన టీఆర్టీలో మెరిట్ సాధించిన అభ్యర్థులు నియామకాల ప్రక్రియ జాప్యం అవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 764 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 764 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3047 ఉపాధ్యాయులు అవసరం ఉండగా, ప్రస్తుతం 2537 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 510 ఖాళీలున్నాయి. ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినా ఉపాధ్యాయులు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రవేశాలను పెంచుతున్నారు. సమస్యలతో సతమతం.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని నిరుద్యోగ యువత భావించింది. ప్రభుత్వం కూడా టీచర్ల భర్తీ అంటూ చాలాసార్లు ప్రకటనలు చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ నిర్వహించినా.. దానికి సంబంధించిన ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మూడేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్యాబోధన అందక ఇబ్బందులు పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన అందించడం కష్టంగా మారింది. అయోమయంలో టీఆర్టీ అభ్యర్థులు.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం విద్యావలంటీర్లతో భర్తీ చేయనుంది. 510 ఖాళీలుండగా, ప్రభుత్వం అన్ని చోట్ల టీచర్ల భర్తీకి వీవీ పోస్టులను మంజూరు చేసింది. ఈనెల 16వరకు దరఖాస్తుల స్వీకరించారు. ప్రస్తుతం డీఈవో కార్యాలయం నుంచి ప్రొవిజనల్ లిస్టు ఎంఈవో కార్యాలయాలకు చేరింది. ఏమైనా అభ్యంతరాలుంటే పరిశీలించిన అనంతరం తిరిగి డీఈవో కార్యాలయానికి లిస్టు పంపనున్నారు. అనంతరం అభ్యర్థులు తుది ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశముంది. దీంతో విద్యార్థులకు కొంతమేర ఇబ్బంది తొలగినా.. అది తాత్కాలికమేనని అనిపిస్తోంది. ఒకవేళ టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే వీవీల పరిస్థితి ఏమిటోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2600 దరఖాస్తులు జిల్లాకు 510 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరుకాగా, ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2600 దరఖాస్తులు వచ్చినట్లు డీఈవో తెలిపారు. దరఖాస్తులదారులకు సంబంధించి నిబంధనల మేరకు రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ఎంఈవో కార్యాలయాలకు అభ్యర్థుల లిస్టు పంపించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసి, అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక లిస్టు రానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశం ఉంది. రెగ్యులర్ టీచర్లను నియమించాలి మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు సరైన విద్యాబోధన అందకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడానికి ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. – బివి.రమణారావు,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
పోస్టు అక్కడ.. విధులు ఇక్కడ
ఆదిలాబాద్‌టౌన్ : విద్యాశాఖలో అధికారుల తీరు మారడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వారికి నచ్చినట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బోధన కోసం నియామకమైన ఉపాధ్యాయులు ఇతర పనుల్లో ఉండరాదని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది. వారు కేవలం వేతనం తీసుకుంటున్న పాఠశాలలోనే బోధన చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్ద పీఏలుగా ఉన్న వారు, ఇతరత్రా డెప్యూటేషన్లపై పని చేసిన వారిని గతేడాది తొలగించిన విషయం తెలిసిందే. అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్వీఎం సెక్టోరియల్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. వేతనం స్కూల్లో పొందుతూ డీఈవో కార్యాలయంలో ఈమె విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం డిప్యూటేషన్‌పై ఉండరాదు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు అక్రమ డెప్యూటేషన్లపై ఉండడంతో విద్యార్థులకు తీరని నష్టం కలుగుతోంది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఒకే పోస్టులో ఇద్దరు అధికారులు.. ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి పోస్టు ఫారన్ సర్వీస్‌లో ఉంటుంది. ఈ పోస్టుకు ఉపాధ్యాయులు పరీక్షరాసి ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే సెక్టోరియల్–3 అధికారి కేజీబీవీలను పరిశీలించేందుకు ఎస్పీడీ ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇవ్వకుండానే వారికి నచ్చిన వారికి ఆ పోస్టును అప్పజెప్పారనే ఆరోపణలున్నాయి. కాగా, జిల్లాలో వారం క్రితం వరకు ఇద్దరు సెక్టోరియల్ అధికారులు పని చేశారు. మూడో సెక్టోరియల్ అధికారిగా ఓ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై నియమించారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు కంది శ్రీనివాస్ సెక్టోరియల్ అధికారి–3గా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు సెక్టోరియల్ అధికారి–3 బాధ్యతలు నిర్వహిస్తున్న టీచర్‌ను రిలీవ్ చేసి పాఠశాలకు పంపించాల్సి ఉండగా ఒకే పోస్టులో ప్రస్తుతం ఇద్దరూ కొనసాగుతుండడం గమనార్హం. కలెక్టర్ అనుమతితో నియమించాం.. కలెక్టర్ దివ్యదేవరాజన్ అనుమతితో సెక్టోరియల్ అధికారి–3ని నియమించాం. కేజీబీవీలను పరిశీలించేందుకు మహిళా ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులు పని చేయవద్దనే ఆదేశాలు ఉన్నవి వాస్తవమే. సెక్టోరియల్ అధికారి–3 ఇటీవల బదిలీపై వచ్చారు. ఈ విషయంలో ఆలోచిస్తాం. జనార్దన్‌రావు, డీఈవో, ఆదిలాబాద్. -
‘సమ్మర్’ టీచర్లకు నిరాశ
ఆత్మకూరు(పరకాల) : జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది వేసవి సెలవుల్లో స్కూల్‌కు ఒకరి చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణ విధులకు హాజరయ్యారు. ఇందుకుగాను స్కూల్‌అసిస్టెంట్, హెచ్ఎం క్యాడర్ స్థాయి వారికి రోజుకు రూ.300, ఎస్జీటీలకు రూ.225 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా గౌరవ వేతనం, పీపీఎల్(సంపాదిత సెలవులు) జాడలేదు. మళ్లీ ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఇప్పటి వరకు హానరోరియం అందించకపోగా తాజాగా గౌరవ వేతనంలో భారీగా కోత పెడుతూ విద్యాశాఖ కమిషనర్ కిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.300లకు బదులు రూ.25, రూ.225కు బదులు రూ.18.75 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. మొదట ప్రకటించిన విధంగా హానరోరియమ్‌తో పాటు పీపీఎల్ సెలవులు మంజూరుచేస్తూ తిరిగి ఉత్తర్వులను జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిహారికకు అమెరికా ఫెలోషిప్
కాళోజీ సెంటర్: వరంగల్ రూరల్ గీసుకొండ మండలం గొర్రెకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తౌటం నిహారిక అమెరికా ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. అమెరికా ప్రభుత్వం 2011 నుంచి పుల్ బ్రైట్స్ కమిషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ అందజేస్తోంది. దేశవ్యాప్తంగా నలుగురు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి నిహారిక ఉన్నారు. ఫెలోషిప్ కింద జనవరి 3 నుంచి మే 14 వరకు నిహారికకు అమెరికాలో శిక్షణ ఇస్తారు. ఫెలోషిప్‌కు ఎంపికైన మిగిలిన వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాలని ఆమె కోరారు. -
ప్రభుత్వ టీచర్ల పిల్లలు.. ప్రభుత్వ బడిలోకే రావాలి..
పాఠాలు చెప్పేది సర్కారు బడిలో.. పిల్లల్ని పంపేది ప్రైవేటు స్కూళ్లకా? ఇదెక్కడి న్యాయం?: హోంమంత్రి నాయిని - మంత్రి వ్యాఖ్యలపై టీచర్ల నిరసన.. ముందు నేతల పిల్లల్ని పంపాలని ఫైర్ - గందరగోళంగా గురుపూజోత్సవం.. నాయిని క్షమాపణతో శాంతించిన టీచర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘నిరుపేదల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే.. ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రస్టుపట్టిస్తూ పరోక్షంగా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారు. విచ్చలవిడిగా సెలవులు వాడుకుంటూ ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నారు. ఈ దుస్థితి పోవాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. అప్పుడే ప్రభుత్వ విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి..’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికైన 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీచర్లు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. చాలామంది టీచర్లు, డాక్టర్లు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని, ఇలాంటి వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ టీచర్లు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవ హరిస్తే సమాజం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. మనలో సర్వేపల్లిలాంటి వారెందరు? సర్వేపల్లి రాధాకృష్ణలాంటి ఉపాధ్యాయులు మనలో ఎందరు ఉన్నారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 80 శాతానికిపైగా ఉండేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరు శాతమే కాదు చివరకు టీచర్ల హాజరు శాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోందన్నారు. మనకు మనమే విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. వారిలోని సృజనాత్మకతను గుర్తించి వెలికి తీసినప్పుడే గురువులపై గౌరవం పెరుగుతుందని, తాను ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నానంటే కారణం గురువులేనని చెప్పారు. ఉపాధ్యాయులకు యోగ్యత ఎంతో అవసరమని, అది లేకుంటే వృత్తికి న్యాయం చేయలేరని అన్నారు. ముందు మీరు చేర్పించండి..: టీచర్లు నాయిని వ్యాఖ్యలపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి, ఆ తర్వాత టీచర్లకు సూచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా తమకు నీతులు చెప్పడమేంటని హోంమంత్రిని ప్రశ్నించారు. దీంతో గురుపూజోత్సవ కార్యక్రమం కొంత గందరగోళంగా మారింది. చివరకు హోంమంత్రి క్షమాపణలు కోరడంతో టీచర్లు శాంతించారు. -
యోగి ఎఫెక్ట్: టీచర్లకు ఇక బడితపూజే!
ఇన్నాళ్లూ టీచర్ల చేతుల్లో పిల్లలకు బడితపూజ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని స్కూళ్లలో నాణ్యత మరీ నాసిగా ఉంటోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఇక వాళ్ల పని పట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సమయానికి రావడంతో పాటు బాగా చదువు చెప్పాలని ఆయనో కొత్త నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల ఫొటోలను స్కూలు గోడల మీద అతికించాలని ఆదేశించారు. ఆయా టీచర్లంతా సమయానికి స్కూళ్లకు వస్తున్నారో లేదో చెప్పాలని విద్యార్థులకు వివరిస్తున్నారు. తన సొంత ఊరైన గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్ల వరకు అన్నింటిలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, అప్పుడే టీచర్ల సమయపాలన గురించి విద్యార్థులను కూడా ప్రశ్నిస్తారని చెప్పారు. కొంతమంది టీచర్లు తమకు బదులుగా వేరేవాళ్లను తక్కువ జీతాలు ఇచ్చి స్కూళ్లకు పంపి, వాళ్లతో చదువు చెప్పిస్తున్నారని, వాళ్లు మాత్రం ఇళ్ల దగ్గర కూర్చోవడమో, వేరే వ్యాపారాలు చేసుకోవడమో జరుగుతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇలాంటిది ఇకమీదట కొనసాగేది లేదని, అందుకే టీచర్లందరి ఫొటోలను గోడమీద అతికించాలని చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో లేదో తెలుసుకోడానికి తాను ఏ సమయంలోనైనా వాళ్ల ల్యాండ్ లైన్లకు ఫోన్ చేస్తానని చెప్పారు. అలాగే లాండ్ మాఫియా పని పట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. -
ఆ టీచర్ల డిప్యుటేషన్లు ఇక రద్దు
హైదరాబాద్: ప్రజాప్రతినిధుల దగ్గర వ్యక్తిగత సహాయకులు(పీఏ), వ్యక్తిగత కార్యదర్శులు(పీఎస్)గా పనిచేస్తున్న టీచర్లందరి డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. వారిని తక్షణమే రిలీవై మాతృశాఖలో విద్యా బోధన కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పీఏలు, పీఎస్లుగా టీచర్లను డిప్యుటేషన్‌పై పంపడం ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధుల దగ్గర టీచర్లు విధులు నిర్వర్తిస్తున్న పక్షంలో వారిని తక్షణమే వెనక్కు పంపి విద్యాబోధన విధులకు వినియోగించాలి’ అని ఈనెల 13వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టీచర్ల డిప్యుటేషన్లను రద్దు చేసింది. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధుల దగ్గర పీఏలు, పీఎస్లుగా పనిచేస్తున్న టీచర్ల డిప్యుటేషన్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేశాం. తక్షణమే వారంతా అక్కడి నుంచి రిలీవై మాతశాఖలో చేరి విద్యా బోధన విధులు నిర్వర్తించాలి. ఈ దిశగా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలి’ అని లింగరాజ్ పాణిగ్రాహి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. టీచర్లను రిలీవ్ చేసిన ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ కేడర్‌లోని ఉద్యోగులను పీఏలుగా ఎంపిక చేసుకోవాలని అందులో సూచించారు. -
ప్రజాప్రతినిధులకు పీఏలుగా టీచర్లా?
-
ప్రజాప్రతినిధులకు పీఏలుగా టీచర్లా?
- ఇదేం పద్ధతి: సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు - టీచర్లు పీఏలు, పీఎస్లుగా ఉండరాదు - వారి డిప్యుటేషన్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం - పోస్టుల భర్తీకి, జీరో స్కూళ్లలో ప్రవేశాలకు ఏం చేస్తున్నారు? - నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇందుకు వీలు కల్పిస్తున్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపంపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వోపాధ్యాయులు డిప్యుటేషన్లపై బోధనేతర విధులు నిర్వర్తిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్లుగా పని చేస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ‘ఇదేం పద్ధతి? ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో కొనసాగడమేంటి?’ అని జస్టిస్ మిశ్రా తీవ్రంగా ప్రశ్నిం చారు. అలాంటి విధుల్లో ఉన్నవారిని గుర్తించి వెనక్కి రప్పించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది విశ్వనాథ్ శెట్టి ఇచ్చిన సమాధానంతో శ్రవణ్‌కుమార్ విభేదించారు. దాంతో, అలాంటి డిప్యుటేషన్లను రద్దు చేయాలని జస్టిస్ మిశ్రా ఆదేశించారు. అంతేగాక, ‘‘విద్యార్థులే లేని (జీరో ప్రవేశాలున్న) స్కూళ్లలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఏం చర్యలు చేపడుతున్నారు.. పర్యవేక్షక పోస్టులు, టీచర్ పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారు.. వీటిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని కూడా ఆదేశించారు. నివేదికతో ఏకీభవించబోం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ అశోక్ కుమార్ గుప్తా తెలంగాణలో పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితుల ను అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను కోర్టు కు అందించారు. వివరాలను చదివి వినిపించారు. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చది వించాలని ఆశించడమే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల లు మూతపడేందుకు కారణం. చిన్నారులను మూడేళ్లకే ఎల్కేజీలో చేర్పించాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల లో అందుకు అవకాశం లేదు. చిన్న ఆవాసాల్లో తగిన సంఖ్యలో విద్యార్థుల్లేక స్కూళ్లు మూతపడుతున్నాయి. తల్లిదండ్రులు సాయంత్రం దాకా కూలికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు త్వరగా ఇంటికొస్తారు. వారిని చూసుకునేందుకు ఎవరూ ఉండరనే కారణంతో కూడా ప్రైవేటు వైపు మొగ్గుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పని చేసేందుకు ప్రభుత్వోపాధ్యాయులూ సుముఖంగా ఉండట్లేదు. వాటికి కనీసం రవాణా సౌకర్యముండదు’’ అని విన్నవించారు. ఈ నివేదికతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఈ నివేదిక పట్టణ ప్రాంతాలను ఆధారంగా చేసుకుని రూపొందించినట్టుగా ఉంది. దీంతో మేం పూర్తిగా ఏకీభవించబోము’ అని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరేమిటని ప్రశ్నించారు. పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తామని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విడతలవారీగా అమలు చేస్తామని విశ్వనాథ్ శెట్టి వివరించారు. దీనిపైనా జస్టిస్ మిశ్రా అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ‘‘ప్రైవేట్ విద్యా వ్యయాన్ని అందరూ మోయలేరు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి. పటిష్టమైన విధానం రూపొందించాలి’’ అని నిర్దేశించారు. పర్యవేక్షణ కొరవడింది సుప్రీంకోర్టు జోక్యం తర్వాతే తెలంగాణలో విద్యావ్యవస్థలో మార్పులొచ్చాయని శ్రవణ్‌కుమార్ వివరించారు. ‘‘మూతపడిన వాటిలో 271 స్కూళ్లను తెరిచారు. వీటిలో 140 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు. అయితే తెలంగాణలో విద్యపై పర్యవేక్షణ లేదు. ఆ పని చేయాల్సిన ఎంఈవో, డిప్యూటీ డీఈవోలు, డీఈవో పోస్టులు 90 శాతం ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి’’ అన్నారు. టీచర్ల సర్వీసు నిబంధనల ఇబ్బందులే ఇందుకు కారణమని, సమస్యను పరిష్కరిస్తామని శెట్టి నివేదించారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించగా ఆయన సరిగా స్పందించలేదు. 2005 నుంచీ ఈ సమస్య ఇలాగే ఉందని శ్రవణ్‌కుమార్ చెప్పారు. తగిన పర్యవేక్షణ లేకుంటే పిల్లలకు సరైన విద్య అందదని జస్టిస్ మిశ్రా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన కార్యదర్శి కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ సమర్పిస్తారని శెట్టి చెప్పగా... ‘మీకెందుకు సిగ్గు? చేసింది చెప్పండి. ఇద్దరూ ప్రభుత్వ అధికారులేగా! సీఎస్‌నే దాఖలు చేయాలని చెప్పండి’ అని ఆదేశించారు. ఉపాధ్యాయ నియామకాల బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించామని, ఈ ప్రక్రియ అమలుకు సంస్థకు సమయం అవసరమని శెట్టి వివరించారు. సంబంధిత ప్రక్రియను కొనసాగించాలని సూచిస్తూ విచారణ ను సెప్టెంబరు 7కు జస్టిస్ మిశ్రా వాయిదా వేశారు. -
టెన్త్ ‘స్పాట్’కు టీచర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. అన్ని జిల్లాల్లోనూ పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. వరుస సెలవులు, ఎండల ప్రభావమో కానీ స్పాట్ కేంద్రాలకు ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత అరకొరగా వచ్చినా, దాదాపు అన్ని కేంద్రాల్లో ఉపాధ్యాయుల హాజరు 50 శాతానికి మించలేదు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఈ నెల 22లోగా వాల్యుయేషన్ పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మూల్యాంకనం కోసం జిల్లాకు 5 లక్షల చొప్పున వాల్యుయేషన్ కేంద్రాలకు పంపిణీ చేశారు. అయితే ఉపాధ్యాయుల హాజరుకాకపోవడంతో స్పాట్ కేంద్రాలకు క్యాంపు అధికారులుగా వ్యవహరిస్తున్న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలాగే ఉంటే గడువులోగా మూల్యాంకనం పూర్తిచేయడం సాధ్యం కాదని డీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ససేమిరా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే, ప్రైవేటు పాఠశాలలే అధికంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యలోనూ ప్రైవేటు స్కూళ్లదే సింహ భాగం కావడంతో, మూల్యాంకనానికి ప్రైవేటు పాఠశాలల టీచర్లపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. స్పాట్ వాల్యుయేషన్ కోసం టీచర్లను స్పాట్ కేంద్రాలకు పంపాలని విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఈ జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. తమ టీచర్లను పంపితే స్కూల్లో బోధన కుంటుపడుతుందని కొన్ని, తమవద్ద అనుభవజ్ఞులైన టీచర్లు లేరని మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాకులు చెబుతున్నాయి. ఎండలకు భయపడి వాల్యుయేషన్ నుంచి తప్పించుకునేందుకు టీచర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. స్పాట్‌కు రాకుంటే కఠిన చర్యలు ‘ఉత్తర్వులు అందుకున్న టీచర్లంతా స్పాట్ కేంద్రాల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ప్రభుత్వ టీచర్లకు కానీ ప్రైవేటు టీచర్లకు కానీ మినహాయింపు లేదు. విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపైనా, వారిని రిలీవ్ చేయకుంటే స్కూళ్ల యాజమాన్యాలపైనా చర్యలు తీసుకుంటాం. సకాలంలో స్పాట్‌ను పూర్తిచేసి అనుకున్న సమయానికి ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం’ -సురేందర్‌రెడ్డి. పరీక్షల విభాగం డెరైక్టర్ -
మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే...
- చదివిన చదువునూ మరచిపోతున్న ప్రభుత్వ టీచర్లు - సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ: ‘ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ గతంలో దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని వ్యాఖ్యానించారు. శనివారం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల గ్రామంలో డాక్టర్ కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. మన చుట్టూ మంచి వాతావరణం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయని అంటూ మురికివాడల్లో ఉండే పేదల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్యాలెస్‌లాగా వుందని, మంచి వాతావరణం, మంచి హిల్స్, వ్యాలీలో స్కూల్.. అందులో స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేశారని ప్రశంసించారు. ఇది లగ్జరీ అనాలో, అవసరమే అనాలో తనకు తెలియట్లేదని, కానీ ఇటువంటి స్కూల్లో తాను చదవలేకపోయినందుకు ఈర్ష్యగా ఉందని అన్నారు. ప్రభుత్వ టీచర్లపైనా చంద్రబాబు ఈ సందర్భంగా వాగ్బాణాలు సంధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వారు చదివిన చదువుల్నే మరిచిపోతున్నారని వ్యాఖానించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం రాణించట్లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు ప్రైవేటు పాఠశాలల్లో చేరి బోధన చేసి ఐఐటీ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నారన్నారు. 2018 జూన్‌కల్లా పోలవరం పూర్తి తొమ్మిది ప్రాజెక్టులకు డెడ్‌లైన్: సీఎం పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 2018 జూన్ కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు డెడ్‌లైన్ పెట్టుకున్నామని, ఆ ప్రకారం పనులు చేయిస్తామని తెలిపారు. ఆయన శనివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. వంశధార తొలి దశను 2017 జూన్ నాటికి, తోటపల్లిని 2016 జూన్‌కి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 2016 మార్చికి, పోలవరం కుడికాలువను 2016 జూన్‌కి, వెలిగొండను 2017 డిసెంబర్‌కి, గాలేరు-నగరి మొదటి దశను 2016 జూన్‌కి, హంద్రీ-నీవా ప్రాజెక్టును 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 11 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, 67 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సివుందన్నారు. ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొస్తామని తెలిపారు. -
బదిలీల్లో ఒప్పందాలు!
టీచర్ల ట్రాన్స్ఫర్లలో హెచ్ఆర్ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్ - టీచర్ల ట్రాన్స్ఫర్లలో హెచ్ఆర్ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ - జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్తకోణం వెలుగు చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనే దీర్ఘకాలం కొనసాగేందుకు కొందరు సరికొత్త ఎత్తుగడ వేశారు. వాస్తవానికి 30 శాతం హెచ్ఆర్ఏ లభించే పట్టణ ప్రాంతాల్లో ఒక ఉపాధ్యాయుడు గరిష్టంగా ఎనిమిదేళ్ల పాటు మాత్రమే కొనసాగాలి. ఈ నిబంధనను తొక్కిపెట్టి.. ఏళ్ల తరబడి అర్బన్ ప్రాంతాల్లోనే పలువురు టీచర్లు కొనసాగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు ‘పట్టణ యోగం’ కలగానే మిగిలిపోతోంది. ఇలా కుదుర్చుకుందాం.. ప్రస్తుతం రెండేళ్లు ఒకే చోట పనిచేసిన టీచరు బదిలీకి అర్హుడని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కొందరు టీచర్లు వారివారి సబ్జెక్టుల్లో సీనియర్ల తో మంతనాలు సాగిస్తున్నారు. వారిని గ్రామీణ ప్రాంతంలో ఉండేలా అభ్యర్థిస్తూ కొంత మొత్తాన్ని ఆఫర్ చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. అలా సీనియర్లలో కొంతవరకు కలుపుకొనిపోతే తక్కిన స్థానంలో ఉన్న పట్టణ ప్రాంత టీచర్లు వారు కోరుకున్న అర్బన్ ప్రాంతాల్లోనే కొనసాగేలా వ్యూహాన్ని రచించారు. ఈ మేరకు సోమవారం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పలువురు టీచర్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుని ‘సెటిల్’ చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ తంతులో ఉపాధ్యాయ సంఘం నేతలు ఒకరిద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖకు ఫిర్యాదులు.. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ సైతం నిఘా పెట్టింది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు టీచర్లు రహస్యంగా విద్యాశాఖకు వాయిస్ రికార్డింగుల రూపంలో ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ఇవి సమర్పించిన వారెవరనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వాటిని పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పట్టణల్లో పనిచేసే టీచర్ల బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం దృష్టిపెట్టాయి. అవకతవకలు జరిగితే వాటిపై ఉద్యమిస్తామని, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్ తదితర సంఘాలు ప్రకటించాయి. -
కరీంనగర్లో ఉపాధ్యాయుల ఆందోళన
కరీంనగర్ : ప్రాథమిక పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో నంబర్ 11ను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలే కాదు.. బాధ్యతలూ పెరిగాయి !
జోగిపేట: ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేసినా సర్కారు పనుల్లో సహాయపడినా అరకొర జీతాలే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే తమకు వేతనాలు పెరిగినందుకు ఆనంద పడాలో బాధ్యతలు పెరిగినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చేనెల నుంచి పెంచిన వేతనాలను అంగన్వాడీలకు అందజేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతాయుతంగా పనిచేయని అంగన్వాడీలను తొలగిస్తామనే హెచ్చరికలను కూడా ప్రభుత్వం జారీ చేసింది.అంగన్వాడీ కార్యకర్తలకు రూ.4200 నుంచి రూ.7వేలకు, మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు రూ.2200 నుంచి రూ.4500, ఆయాలకు రూ.2200 నుంచి రూ.4500 వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో 6768 మందికి లబ్ధి వేతనాల పెంపుతో జిల్లాలోని 6768 మంది అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు లబ్ధిపొందనున్నారు. జిల్లాలో 3009 ముఖ్య అంగన్వాడీ కేంద్రాలుండగా, 375 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జోగిపేట, నర్సాపూర్, గజ్వేల్, రామాయంపేట, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, పటాన్చెరు, సిద్దిపేట, దుబ్బాక సెక్టార్ల పరిధిలోని 3084 మంది ఆయాలు 3009 మంది కార్యకర్తలు, 375 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరందరికి ఈనెల నుంచే పెంచిన వేతనాలు వర్తిస్తాయి. పెరిగిన బాధ్యతలు.. అంగన్వాడీలకు పెరిగిన వేతనాలతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. ప్రతి కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా పనిచేయాలి. వేతనాలు పెరిగినందున కార్యకర్తలు, ఆయాలు మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. నీతీ నిజాయితీతో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. పనితీరు నివేదిక ఆధారంగానే వేతనాలను ప్రతినెలా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కార్యకర్తలకు, ఆయాలకు ప్రతి సంవత్సరం 12 సాధారణ సెలవులు, మే నెలలో 15 రోజుల సెలవులు ఉంటాయి. నిధుల దుర్వినియోగం, సరుకుల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు. 15 రోజుల పాటు విధులకు గైర్హాజరైతే వేటు తప్పదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లు కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కాసులడిగితే కేసులే : మహిళ, శిశు సంక్షేమశాఖ అధ్యక్షుడు జయరాం వేతనాలు పెపు తమ చలవేనని, తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే వేతనాలు పెరిగాయాంటూ కొందరు యూనియన్ల పేరుతో అంగన్వాడీ కార్యకర్తల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ అధ్యక్షుడు జయరాం అన్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ డబ్బుల కోసం వేధిస్తే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల పనితీరును గుర్తించి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. -
పనులన్నీ టీచర్లకే...
బోధనకు ఆటంకంగా బోధనేతర పనులు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలొస్తే వారే కావాలి.. సర్వేలూ వారే చేయాలి.. శిక్షణలకు హాజరుకావాలి.. మధ్యాహ్న భోజనం నుంచి విద్యార్థుల హాజరుదాకా లెక్కలు రాయాలి.. అనధికారిక పనుల నుంచి అధికారిక విధుల వరకూ అన్నీ చేయాలి.. నివేదికల మీద నివేదికలు రూపొందించాలి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. పాఠశాలలు ప్రారంభమైంది మొదలు వారికి సవాలక్ష పనులు, బోధనేతర కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు.. ఇలా ఇన్ని ఒత్తిళ్ల మధ్య, గుక్కతిప్పుకోలేని పరిస్థితిలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బోధనేతర కార్యక్రమాలతో ఏటా 35 నుంచి 45 రోజుల వరకు వృథా అవుతున్నా సిల బస్‌ను పూర్తిచేస్తూ.. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లకు వేరే బాదరబందీలేమీ ఉండవు. ఉదయం బడికి వెళ్లారంటే విద్యాబోధనపైనే దృష్టి. అయినా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫలి తాలను సాధిస్తున్నారు. అదే ప్రభుత్వ టీచర్లకు బోధనేతర పనులు అప్పగించకుండా ఉంటే.. మరింత అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయ సం ఘాలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ పాఠశాలలపై పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచవచ్చని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకుని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తే సర్కారీ విద్యను ఎదురులేని వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ టీచర్లకు తప్పని తిప్పలివి.. ⇒ పాఠశాల సంసిద్ధత కార్యక్రమం. ⇒ చదువుల పండుగ పేరిట వారం నుంచి 15 రోజుల వరకు కార్యక్రమాల నిర్వహణ, నివేదికల రూపకల్పన. ⇒ ఏటా గ్రామంలో బడి ఈడు పిల్లలు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది స్కూళ్లలో ఉన్నారు, డ్రాపవుట్స్ ఎంత, నమోదు కాని విద్యార్థులు ఎంత మంది అనే వివరాలు సేకరించడం. వెబ్‌పోర్టల్ నివేదికలు పొందుపరచడం. గ్రాంట్స్ ఎన్ని వచ్చాయి, ఎంత వాడుకున్నారు, ఎంత మిగిలిందనే వాటిపై నివేదికల రూపకల్పన. ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల వారీగా విద్యార్థులు రోజు ఎంత మంది పాఠశాలకు వస్తున్నారు, ఎంత మంది మధ్యాహ్న భోజనం చేశారు, వినియోగించిన బియ్యమెంత, ఖర్చయిందెంత? వంటి వివరాలపై రోజువారీ నివేదికలు రూపొందించడం. వాటితోపాటు బియ్యం నిల్వలపై నివేదికల రూపకల్పన, ఆన్లైన్లో నమోదు చేయడం. వీటిపై మళ్లీ 15 రోజులకోసారి, నెలకోసారి నివేదికలు అందజేయడం. ⇒ ఇక ఫిజికల్ డెరైక్టర్లు, పీఈటీలు లేని పాఠశాలల్లో పిల్లలతో డ్రిల్ పీరియడ్‌లో ఆటలు ఆడిపించడం టీచర్ల బాధ్యతే. ⇒ 75 శాతం స్కూళ్లలో క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు లేనందున జీతాల బిల్లులు, నివేదికల రూపకల్పన పనులు టీచర్లే నిర్వహిస్తున్నారు. ఏటా ఆగస్టు వచ్చిందంటే పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పనులు వారికే. ⇒ జిల్లా స్థాయిలో కంప్యూటర్లు పెట్టి 10 నుంచి 20 మంది సబ్జెక్టు టీచర్లతోనే డీఈవో కార్యాలయాల్లో నెలల తరబడి అనధికారిక పనులు చేయిస్తుంటారు. కౌమార విద్యపై వారం పదిరోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు. ⇒ సబ్జెక్టు రిసోర్స్ పర్సన్ల పేరుతో ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. వారు ఆ తరువాత కొన్ని మండలాల్లో శిక్షణలు ఇస్తారు. దీనికే ఏటా 20 రోజుల సమయం పోతోంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకు 15 మంది వరకు శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా ఇంగ్లిషు బోధనపై 15 నుంచి 25 రోజుల శిక్షణ. ఇలాంటి శిక్షణలన్నీ పాఠశాలలు కొనసాగే రోజుల్లోనే ఉంటాయి. ⇒ పరీక్షలకు ముందు ఎస్సెస్సీ పరీక్ష పేపర్లను జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్లకు, మండలాల పీఎస్‌లకు పంపించేందుకు రూట్ ఆఫీసర్, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ విధులు. పరీక్షలకు ముందు 20 రోజుల పాటు బార్ కోడింగ్ ఆఫీసర్ విధులకు వెళ్లడం. ⇒ 13 రోజుల పాటు ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలు. ⇒ వీటన్నింటికీ అదనంగా ఎన్నికల విధులు, సర్వేలు, ఓటర్ల జాబితా సవరణ పనులు.. వీటికి ముందుగా శిక్షణలు బోధనేతర పనులతో ఒత్తిడి టీచర్లకు బోధనేతర పనులను అప్పగించవద్దు. అలాంటివాటితో సమయం వృథా అవుతోంది. ఆ ఒత్తిడిలో పనిచేస్తూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అదే బోధనేతర పనులను తొలగిస్తే మరింత బాగా పని చేయగలుగుతారు. అద్భుత ఫలితాలు వస్తాయి. - వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు నివేదికలు తగ్గించాలి టీచర్లకు నివేదికలు రూపొందించడం వంటి పనులను అప్పగించడాన్ని తగ్గించాలి. వాటికే ఎక్కువ సమయం పోతోంది. తద్వారా బోధనలో సమస్యలు తలెత్తుతున్నాయి. బోధనేతర పనులను తగ్గిస్తే మరింత బాగా పనిచేస్తారు. మంచి ఫలితాలు వస్తాయి.. - నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు సెలవుల్లోనే శిక్షణ ఇవ్వాలి ఉపాధ్యాయులకు సెలవు రోజుల్లో మాత్రమే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. దానివల్ల బోధనకు ఆటంకం ఉండదు. పిల్లలకు నాణ్యమైన విద్య లభించాలంటే ఇదే మార్గం. లేకపోతే బోధనలో ఇబ్బందులు తప్పవు.. - అబ్దుల్లా, పండిత పరిషత్ అధ్యక్షుడు బోధనేతర పనులొద్దు.. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు రూపొందించడం, కంప్యూటరీకరించడం వంటి పనులకు వారిని వినియోగించొద్దు. పాఠశాల సమయంలో వారికి ఎలాంటి శిక్షణలు ఇవ్వొద్దు. - కొండల్‌రెడ్డి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు ‘ఇంటర్’ విధులకే 15 రోజులు పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలకు చాలా సమయం వృథా అవుతోంది. వీటికి అదనంగా ఇంటర్ పరీక్షల ఇన్విజిలే షన్ విధులకు 15 రోజుల సమయం పోతోంది. ఇంకా రకరకాల సర్వేలు, నివేదికల పేరుతో బోధనకు అవాంతరం కలుగుతోంది. వాటిన్నింటిని తగ్గించాలి.’’ - హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు బడిలో ఉంటేనే నమ్మకం టీచర్లు బడిలో ఉండి, రోజూ పాఠాలు చెబితేనే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది. శిక్షణలు, ఇతర పనుల పేరుతో బోధనకు దూరంగా ఉంచితే టీచర్లపై సదభిప్రాయం పోతోంది. ప్రభుత్వ విధానాలను సవరించాలి. అప్పుడే టీచర్లపై తల్లిదండ్రుల్లో మంచి అభిప్రాయం వస్తుంది.’’ - రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు -
హెల్త్‌కార్డుల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి
టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు పరిగి: ప్రభుత్వం ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల అమలుకు వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని తెలంగాణా టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు అన్నారు. ఆదివారం పరిగిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్క సత్తయ్య ఏడాది కాలంగా జిల్లాలో ఆ సంఘం నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించిన నివేదిక సమర్పించారు. సభ్యులందరూ దానికి ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచిన హెల్త్‌కార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు ఏ ఆస్పత్రికి వైద్యానికి వెళ్లినా నిరాకరిస్తున్నారని తెలిపారు. కేజీటూ పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ప్రభుత్వం తెలంగాణాలో కామన్‌స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం అమలు చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. ఇదే సమయంలో పాఠశాలల్లో రేషనలైజేషన్ విధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ‘మన ఊరు -మనబడి‘ అనే నినాదంలో బడులను బాగు చేసే కార్యక్రమం ఓ ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సత్తయ్య, ప్రకాష్‌రావ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ధశరథ్నాయక్, నజీర్, భీమయ్య, భాగ్యమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మదనాచారి, ఉపాధ్యక్షులుగా నజీర్, దశరథ్, హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మామూర్తి, కార్యదర్శులుగా భీమప్ప, భాగ్యమ్మ, సుధాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా భీమయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పంతుళ్లకూ పరీక్షలే!
దోమ: ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరిచి తద్వారా విద్యా ప్రమాణాల్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పరీక్షల ద్వారా కేవలం విద్యార్థుల ప్రగతిని మాత్రమే అంచనా వేసి దానికి తగినట్లుగా బోధనాభ్యసన వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేసేవారు. ఇకమీదట ఉపాధ్యాయుల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు సాధించిన ప్రగతిని కొలమానంగా తీసుకొని ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరంలో నాలుగుసార్లు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. తమ పనితీరును తామే బేరీజు వేసుకుని సంబంధిత ఉపాధ్యాయులే నిజాయతీగా నివేదికలు ఇచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే పాఠశాలలకు సైతం చేరవేశారు. వాటిని నింపడంపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ‘విద్యాహక్కు’ నిబంధనలకనుగుణంగా.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లలో పొందుపరిచిన అంశాల ఆధారంగా విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అభ్యసన అనుభవం, ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన ప్రగతి, అవగాహన స్థాయి, అభ్యసనకు అవలంబిస్తున్న విధానాలు, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, హెచ్ఎం, ఎస్ఎంసీ కమిటీ సభ్యులతో మమేకమైన తీరు, వృత్తిపర అభివృద్ధి, పాఠశాల అభివృద్దికి చేసిన కృషి, పాఠశాల హాజరు తదితర అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయడానికి చర్యలు చేపట్టారు. మొత్తం 7 విభాగాల్లో 54 అంశాల వారీగా ఉపాధ్యాయుల పనితీరును లెక్కించనున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు తమకు తామే పనితీరును అంచనా వేసుకునే విధంగా.. 1. నిర్దేశించిన అంశాల్లో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను... 2. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను... 3. లక్ష్యాన్ని చేరుకున్నాను... 4. లక్ష్యాన్ని దాటి ముందుకు వెళ్లాను. అనే ఆప్షన్లను ఇచ్చారు. వీటి ఆధారంగా సమర్పించే నివేదికను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలు పరిశీలించి ఉపాధ్యాయుడి పనితీరును అంచనా వేస్తారు. ఆన్లైన్లో వివరాల నమోదు.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమర్పించే నివేదికల సారాంశాన్ని అంతా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. దీని ఆధారంగా పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పార్ట్ ఎ, పార్ట్ బి, పార్ట్ సీలలో నమోదైన మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ పాఠశాలలో విద్యార్థులు ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నారు, కనీసం అభ్యసనా స్థాయిని చేరుకోలేని వారెందరు అనే విషయాలను తెలుసుకునే వీలుంటుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వారు తెలిపారు. -
పంతుళ్లకు పరీక్ష
ఖమ్మం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక గడ్డు పరిస్థితి ఎదుర్కొనే రోజులు వచ్చాయి. సక్రమంగా పాఠశాలకు వెళ్లకున్నా.. వెళ్లినా ఏమీ బోధించకుండా కాలం గడిపే పంతుళ్లకు ప్రభుత్వం ఇప్పుడు ‘పరీక్ష’ పెట్టింది. విద్యార్థులు సాధించిన ప్రగతే పనితీరుకు కొలమానంగా ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేలా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నడుం భిగించారు. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉపాధ్యాయుల పనితీరు మెరుగు పర్చి తద్వారా విద్యాప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోమారు అంటే సంవత్సరంలో నాగులు సార్లు విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసి రేటింగ్ ద్వారా ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తారు. ఇలా పాఠశాల మొత్తం విద్యార్థుల ప్రగతితో ప్రధానోపాధ్యాయుల పనితీరును కూడా లెక్కిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ప్రాధాన్యతా అంశాలు...: విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుడి పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా లెక్కించాలి. ఉపాధ్యాయులకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో అభ్యసన అనుభవ ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన జ్ఞానం, అవగాహన స్థాయి. అభ్యసనం కల్పించడం, అవలంభిస్తున్న విధానం, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమైన తీరు, వృత్తి పరమైన అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, పాఠశాలకు హాజరైన తీరు మొదలైన ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఒక్కో అంశంలో పలు ఉప అంశాలు పొందుపరిచారు. మొత్తం 54 అంశాల వారీగా ఉపాధ్యాయుడి పనితీరును లెక్కిస్తారు. ‘ఈ అంశాలలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాను.. నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాను.. లక్ష్యాన్ని మించి ఉన్నాను.’ అని ఉపాధ్యాయులకు ఒక్కో అంశానికి ఒక పారామీటరు పెట్టారు. దీనిని ఆసరాగా చేసుకొని ఉపాధ్యాయుడే తన ప్రగతి నివేదికను పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన పత్రాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీఈవోలు పరిశీలించాలి. సదరు ప్రధానోపాధ్యాయుడు, ఇతర అధికారుల పర్యవేక్షణలో తెలిసిన అంశాలతో సరిచూసి ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రగతి పత్రాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్లో నమోదు...: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును ప్రతి మూడునెలలకోమారు ఆన్లైన్లో నమోదు చేయాలి. దీనిని అధారంగా చేసుకొని పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పొందుపరిచిన పార్టు-ఏలో పాఠశాల స్థితిగతులు, పార్టు-బిలో ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరైన రోజులు, ప్రతిభ, గ్రేడిండ్, పార్టు -సీలో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు వివరాలు, రేటింగ్‌లో వచ్చిన మార్కులు మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. విద్యార్థులకు ఇచ్చిన ఐడీ నంబర్లు, ఉపాధ్యాయుడి వేతనం ఐడీ నంబర్ల ఆధారంగా ఏ పాఠశాలలో, ఏ పాఠ్యాంశంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారు.. కనీస అభ్యాసనా స్థాయిని కూడా చేరుకోలేక పోతున్నారా.. అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. విద్యార్థి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల వివరాలు, ఉపాధ్యాయుడి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల పేరు, సబ్జెక్టు తెలుస్తుందని, దీంతో ఉపాధ్యాయుల పనితీరు హైదరాబాద్ నుంచే అంచనా వేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదేశించారు. దీనికి తోడు కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవో, సర్వశిక్ష అభియాన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచితే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందుతుందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చేయడంతో ఉపాధ్యాయుల్లో అంకితభావం పెరగడంతో పాటు మెరుగైన ప్రమాణాలు సాధించే అవకాశం ఉందని విద్యా నిపుణులు చెపుతున్నారు. -
వేటు కొద్దిరోజులే!
►దారి తప్పిన గురువులపై చర్యలు అంతంతే ►కొద్దిరోజులకే తిరిగి విధుల్లోకి.. ►ఏడాదిలో అరడజను కేసులు ►కోర్టుకెళ్లి.. జరిమానాతో విడుదల ►అభాసుపాలవుతున్న విద్యాశాఖ సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవహార శైలి ఆ వృత్తికే మచ్చ తెస్తోంది. దేవాలయం వంటి బడిలో మద్యం తాగుతూ కొందరు.. తాగి తగువులాడుకుని ఇంకొందరు.. విద్యార్థినులతో ప్రేమాయణం సాగి స్తూ.. ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి తప్పులకు విద్యాశాఖ విధించే శిక్ష... కొన్నాళ్ల సస్పెన్షన్ మాత్ర మే. ఆ తర్వాత రీపోస్టింగ్తో మళ్లీ విధుల్లో చేరుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి సంఘటనలు విద్యాశాఖ.. ఉపాధ్యాయులనే కాదు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. దారి తప్పిన గురువులపై జిల్లా విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ వర్గాలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలో.. జిల్లాలో ఇలాంటి ఐదు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విద్యాశాఖ ఆ తర్వాత మళ్లీ విధుల్లో తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు యక్తమవుతున్నాయి. ఈ నెల 11న కరీంనగరలోని ధన్గర్వాడీలో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన డీఈవో.. వారికి రీపోస్టింగ్ ఆర్డర్లు త్వరలోనే ఇస్తారని విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కనీసం వీరి విషయంలోనైనా క ఠినంగా వ్యవహరించి.. సస్పెన్షన్ వేటును తొందరగా ముగించకుండా.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో తప్పుడు పని చేసే ఉపాధ్యాయులకు గుణపాఠంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జరిగిన సంఘటనలు మచ్చుకు కొన్ని.. ►ఈ నెల 11న ధన్గర్‌వాడీ పాఠశాలలో మద్యం సేవిస్తూ.. ఏడుగురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయంలో పని చేసే ఓ టైపిస్టు పోలీసులకు చిక్కారు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.250 జరిమానా విధించి వదిలిపెట్టింది. సదరు ఉపాధ్యాయులపై కేసు నమోదు కావడంతో డీఈవో లింగయ్య సస్పెండ్ చేశారు. ►గత విద్యా సంవత్సరం జూలపల్లి మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు అనుచిత ప్రదేశంలో మద్యం సేవిస్తూ.. పోలీసులకు పట్టుబట్టారు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.50 జరిమానా విధించి.. వదిలిపెట్టింది. ఈ విషయం ఇంత వరకు డీఈవో దృష్టికి రాలేదు. ►గత ఎన్నికల్లో గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లిన ఐదుగురు ఉపాధ్యాయులు పోలింగ్ కంటే ఒకరోజు ముందే తప్పతాగి చిందులేశారు. గ్రామస్తులు ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా.. స్కూలుకు వచ్చిన ఎంపీడీవో వారిని అదేరోజు రాత్రి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇతరులకు విధులు అప్పగించారు. స్కూళ్లో మద్యం తాగిన ఐదుగురు ఉపాధ్యాయులను డీఈవో సస్పెండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీపోస్టింగ్ ఇచ్చారు. ►గత విద్యా సంవత్సరం జమ్మికుంట మండల పరిధిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయడు తొమ్మిదో తరగతి విద్యార్థినితో ఫోన్లో మాట్లాడుతూ వారి తల్లిదండ్రులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు స్కూలుకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. దీంతో డీఈవో లింగయ్య ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లకు రీ పోస్టింగ్ ఇచ్చారు. ►మూడేళ్ల క్రితం.. కరీంనగర్‌లోని ఓ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మద్యం తాగి.. అదే పాఠశాలలో పని చేసే సహచర ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో అతను సస్పెండ్ కూడా అయ్యాడు. కొన్నాళ్లకు అతనికి రీపోస్టింగ్ ఇచ్చిన విద్యాశాఖ.. గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి కల్పించడం విశేషం. ►గతేడాది జరిగిన ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో రామడుగు మండలంలో పని చేసే ఓ ప్రధానోపాధ్యాయుడు తాగిన మైకంలో కరీంనగర్లో పని చేసే మరో హెచ్ఎంపై దాడి చేశాడు. వీరిపై విద్యాశాఖ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
గూడూరు టౌన్ : రాష్ర్ట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల్లో వసతులు కల్పిస్తోంది. చదువుతో పాటు యూనిఫాం, పుస్తకాలు అందజేయడంతో పాటు భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉంటోంది. అరకొర వసతులతో పాటు నైపుణ్యంలేని ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. తమ పిల్లలను ప్రయోజకులు చేయాలనే ఆకాంక్షను ఆసరాగా తీసుకున్న కార్పొరేట్ పాఠశాలలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకుని వారితో పాటు సిబ్బందిని ఇంటింటికి పంపుతున్నాయి. ‘మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించి తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అని వారి తో తల్లిదండ్రులకు చెబుతూ ఒప్పిస్తూ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీ పడకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బళ్లలో చేర్పిం చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాని అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే విషయాన్ని అనేక ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే... ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవ మర్యాదలతో పాటు వారి మాటలకు విలువ ఇస్తారు. వీరు తల్లిదండ్రులతో మాట్లాడితే వారి పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని అధికారులు, ఉపధ్యాయులు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. దీంతో సామాన్యులు కూడా అదే బాట పడుతున్నారు. ఉపాధ్యాయులే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తుంటే ఇక తమ పిల్లలను ఆ పాఠశాలల్లో ఎలా చదివించాలని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికైనా విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ఈ ఏడాది కూడా మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి.