రంగారెడ్డి: ఆ ముగ్గురు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చదువులు ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మళ్లీ ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాల కలిపింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా ఒక్కరు పాఠశాల సబార్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన అస్కాని శ్రీనివాససాగర్, సుజాత, శంకరయ్యలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 1985–86వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు.
అనంతరం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకరు సబార్డినేటగా ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓలో గద్వాల జిల్లా నుంచి సుజాత, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శంకరయ్య మండల పరిధిలోని కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చారు. అప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అస్కాని శ్రీనివాససాగర్‌తో కలిసి ఇదే పాఠశాలలో మిగతా ఇద్దరు చేరారు. బాల్య మిత్రులు మళ్లీ ఒకే పాఠశాలలో కలుసుకోవడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment