meet at old student
-
కలిసి చదివి.. ఒకేచోట ఉద్యోగం
రంగారెడ్డి: ఆ ముగ్గురు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చదువులు ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మళ్లీ ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాల కలిపింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా ఒక్కరు పాఠశాల సబార్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన అస్కాని శ్రీనివాససాగర్, సుజాత, శంకరయ్యలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 1985–86వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకరు సబార్డినేటగా ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓలో గద్వాల జిల్లా నుంచి సుజాత, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శంకరయ్య మండల పరిధిలోని కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చారు. అప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అస్కాని శ్రీనివాససాగర్తో కలిసి ఇదే పాఠశాలలో మిగతా ఇద్దరు చేరారు. బాల్య మిత్రులు మళ్లీ ఒకే పాఠశాలలో కలుసుకోవడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అ‘పూర్వ’ కలయిక
– 28 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు – గురువులను సన్మానించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి వడమాలపేట: తిరుపతి ఎస్వీ హైస్కూల్లో 1987–88 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 160 మంది ఆదివారం కలుసుకున్నారు. స్థానిక సీఎంఆర్ గార్డెన్లో సమావేశమైన వీరు అప్పటి గురువులను కుటుంబ సభ్యులతో కలపి సన్మానించి, గురుభక్తిని చాటుకున్నారు. అదేబ్యాచ్కు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తమకు చదువు చెప్పిన 20 మంది ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఘనంగా సన్మానించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తాము ఈ స్థితికి రావడానికి గురువులే కారణమని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్యనారాయణప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, రవియదవ్, రమేష్, రమణ, లక్ష్మీపతి, వెంకటరమణ, వెంకటమునియాదవ్, శ్రీనివాసులు, శివప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.