పూర్వ విద్యార్ధుల గ్రూప్‌ఫోటో.
– 28 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
– గురువులను సన్మానించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
వడమాలపేట: తిరుపతి ఎస్‌వీ హైస్కూల్‌లో 1987–88 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 160 మంది ఆదివారం కలుసుకున్నారు. స్థానిక సీఎంఆర్ గార్డెన్‌లో సమావేశమైన వీరు అప్పటి గురువులను కుటుంబ సభ్యులతో కలపి సన్మానించి, గురుభక్తిని చాటుకున్నారు. అదేబ్యాచ్‌కు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తమకు చదువు చెప్పిన 20 మంది ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఘనంగా సన్మానించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తాము ఈ స్థితికి రావడానికి గురువులే కారణమని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్యనారాయణప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, రవియదవ్, రమేష్, రమణ, లక్ష్మీపతి, వెంకటరమణ, వెంకటమునియాదవ్, శ్రీనివాసులు, శివప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.