ప్రజాప్రతినిధులకు పీఏలుగా టీచర్లా? | Teachers are PAs to the leaders? | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 14 2016 9:40 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇందుకు వీలు కల్పిస్తున్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపంపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వోపాధ్యాయులు డిప్యుటేషన్లపై బోధనేతర విధులు నిర్వర్తిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్‌లుగా పని చేస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ‘ఇదేం పద్ధతి? ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో కొనసాగడమేంటి?’ అని జస్టిస్ మిశ్రా తీవ్రంగా ప్రశ్నిం చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement