సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరు ద్ధంగా కోరుకున్న ప్రాంతానికి కాకుండా పిటిషనర్లను కేటాయించారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాలకు కేటాయించిన వారంతా విధుల్లో చేరారని ప్ర భుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment