Teacher transfers
-
సర్కారు చదువులు చతికిల!
సాక్షి, అమరావతి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి, లేని పాఠశాలల్లో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి.. 9,075 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు.అయితే, ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది.. ఎక్కడ మిగులు ఉన్నారు.. వారిని ఏం చేయాలి.. అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యా శాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3–8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, అక్కడున్న విద్యార్థుల బోధనను గాలికి వదిలేశారు. 502 హైస్కూల్ ప్లస్‌లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులే లేకుండాపోయారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లకు అనువుగా రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకు వర్తింపజేసి, అత్యంత జూనియర్ ఎస్జీటీలను హైస్కూళ్లకు.. ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు పంపించారు.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు » ఈ విద్యా సంవత్సరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. జూన్ చివరి వారంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దాంతో పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇలా రెండుసార్లు జరగడంతో సెపె్టంబర్ నెలాఖరు దాకా సర్దుబాటు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సర్దుబాటులో తమకు నష్టం జరిగిందని వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాఠశాల విద్య కమిషనరేట్‌కు వినతులు పంపుతున్నారు.» సర్దుబాటు మార్గదర్శకాల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మందికి మించి విద్యార్థులుంటే స్కూల్ అసిస్టెంట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే తక్కువ రోల్ ఉన్న స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, వారి స్థానంలో ఐదు లేదా ఆరుగురు ఎస్జీటీలను సర్దుబాటు చేస్తామన్నారు.» వాస్తవానికి ఆయా స్కూళ్లల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లను బదిలీ చేసినా, వారి స్థానంలో పాఠం చెప్పేందుకు ఒక్క టీచర్‌ను కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా యూపీ స్కూళ్లలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఉండడం గమనార్హం. స్కూళ్లల్లో మిగులుగా ఉన్న టీచర్లను లేనిచోటకు పంపించాల్సి ఉంది. అయితే మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో అక్కడ ఉన్న టీచర్లను స్థానికంగానే సర్దుబాటు చేశారు. మిగిలిన టీచర్లను సైతం విద్యార్థులు లేకున్నా అక్కడే ఉంచారు. టీచర్లు లేని చోటుకు పక్క మండలం నుంచి పంపాల్సి ఉన్నా పట్టించుకోలేదు. జీవో 117 రద్దుకు కూటమి సర్కారు చర్యలు » పలు సర్వేల అనంతరం విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ఒకే విధమైన విధానాలు అనుసరించాలని పేర్కొంది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలంది. » విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ–2020 సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో 117 జారీ చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. » 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధన ఒత్తిడి తగ్గించేందుకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని 1:20 ఉండేలా చర్యలు తీసుకున్నారు. » దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఏపీ మోడల్ విద్యా విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం నుంచి 1– 5 తరగతులను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడంతో పాటు ప్రస్తుతం హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ బోధన పొందుతున్న 3– 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనుంది. హైస్కూల్ స్థాయిలో (6–10) ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఐదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఆరో తరగతిని ఇంగ్లిష్ మీడియం ఎలా చదవగలరన్న కనీస అవగాహన లేకుండా మార్పులకు శ్రీకారం చుడుతోంది. మున్సిపల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌ల్లో బోధన గాలికి.. » బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి సమీపంలోనే జూనియర్ కాలేజీ ఉంటే మేలు జరుగుతుందన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో మండల స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలో 502 స్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా మార్చి, ఇంటర్ విద్యను ప్రారంభించారు. దీంతో గతేడాది 294 బాలికల జూనియర్ కాలేజీలు, మరో 208 కో ఎడ్యుకేషన్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి బోధనకు స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లను నియమించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటులో హైస్కూల్ ప్లస్‌లను మినహాయించడం, ఉన్న అధ్యాపకుల్లో కొందరు రిటైర్ అవ్వడంతో అక్కడ ఇంటర్ విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. » మున్సిపల్ హైస్కూళ్లల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో గత ప్రభుత్వంలో అర్హత ఉన్న సీనియర్ ఎస్జీటీలను కొరత ఉన్న హైస్కూళ్లకు డీఈవో కార్యాలయం ద్వారా సర్దుబాటు లేదా డెప్యుటేషన్‌పై నియమించి బోధన అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకూ వర్తింపజేయడంతో ఇప్పటి వరకు డెప్యుటేషన్‌పై వచ్చి హైస్కూళ్లల్లో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లల్లో అత్యంత జూనియర్ మిగులు ఉపాధ్యాయులను హైస్కూళ్లలో సర్దారు. దీంతో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గతంలో జిల్లా స్థాయిలోనే సర్దుబాటు» విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరం ఉన్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు. » విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో రాష్ట్ర టాపర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలవగా, ఈసారి ఆ పరిస్థితి ఉండేలా లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యా రంగం నాశనమైంది. బడుల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసింది. దాన్ని గాడిన పెట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి లేని చోటుకు సర్దుబాటు చేస్తున్నాం. – ఆగస్టులో విద్యా శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా తుని మండలంలో 58 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్టుగా విద్యా శాఖ గుర్తించింది. అయితే సర్దుబాటులో ఒక్కరు కూడా బదిలీ కాలేదు. ఈ మండలానికి పక్కనే ఉన్న రౌతులపూడిమండలంలోని ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను.. ఐదు స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను తొలగించారు. పైగా 20 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నా ఒక్కరినీ ఇవ్వలేదు. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్–విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. షెడ్యూల్ ప్ర కారం అక్టోబర్ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
TS: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్15న ఆన్లైన్లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు. అయితే, ముందుగా హెచ్ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. జనవరి షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్విస్ కటాఫ్ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెపె్టంబర్ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు. రిటైర్మెంట్కు 3 ఏళ్ళలోపు సర్వీస్ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్విస్‌ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్‌డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. సీనియారిటీ దగ్గరే తికమక ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్ఏల్లో ఫిజిక్స్, మేథ్స్.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్ఎం పోస్టులు మల్టీ జోనల్ అయినప్పుడు 14 జిల్లాల ఎస్ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై బుధవారం కోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలోనే టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను కోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్ అభినందన -
టీచర్ల బదిలీలు,పదోన్నతులకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు. ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మాస్టార్ల బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు? రగులుతున్న అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముందుకెళ్ళకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. ఏడాదిగా అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయ సంఘాలు తమతో ఆటలాడుతున్నాయని టీచర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. టీచర్ల సంఘాల నేతలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. న్యాయ పరమైన చిక్కులు తొలగించేందుకు విద్యాశాఖ ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నాన్–స్పౌజ్ పేరుతో న్యాయ వివాదం సృష్టించిన వ్యక్తుల వెనుక స్వార్థం ఉందని, దీన్ని న్యాయస్థానానికి సరిగా వివరించడంలో విద్యాశాఖ విఫలమైందంటున్నారు. హెచ్ఆర్ఏ కోసమేనా ఈ రగడ? భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే చోట ఉండేలా చూడాలనేది ప్రభుత్వ విధానం. ఈ నేపథ్యంలోనే బదిలీలు చేపడుతున్నారు. కానీ కొంతమంది నాన్–స్పౌజ్ పేరుతో కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. బదిలీ అయ్యే 80 వేల మంది టీచర్లలో 30 వేల మంది ఉపాధ్యాయులు స్పౌజ్ పాయింట్లు వాడుకుని 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వస్తున్నారనేది నాన్–స్పౌజ్‌ల వాదన. నిజానికి జిల్లా యూనిట్‌గానే టీచర్ల బదిలీలు ఉంటాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో స్పౌజ్ అనే అంశంతో సంబంధం లేకుండానే జిల్లాల్లోని అందరికీ ఒకే హెచ్ఆర్ఏ ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 5 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 3 మండలాలు తప్ప రాష్ట్రంలో మిగిలిన 30 జిల్లాలకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తించదు. స్పౌజ్ పాయింట్లు 8 ఏళ్ళకోసారి ఇస్తారు. అది కూడా దంపతుల్లో ఒకరికే వర్తిస్తుంది వాస్తవాలు గుర్తించరేం? వాస్తవాలు అలా ఉంటే నాన్ స్పౌజ్‌ల పేరుతో అభ్యంతరాలు లేవనెత్తే వ్యక్తులు అసత్య ప్రచారంతో నమ్మిస్తున్నారనేది మెజారిటీ టీచర్ల వాదన. స్పౌజ్‌లు అందరూ దీన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కోరుకుంటే, ఇలాంటి వాళ్ళు 60 వేల మంది వరకు ఉండాలి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ గుర్తించడం లేదని టీచర్లు అంటున్నారు. అసలు కోర్టులో వివాదం లేవనెత్తిన వాళ్ళల్లో ఎక్కువ మంది అధిక హెచ్ఆర్ఏ పొందుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇలా కేసులు వేసి, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది స్వార్థం కాదా? : జైపాల్ రెడ్డి (స్పౌజ్ ఉద్యోగుల నేత) వివాదం లేవనెత్తుతున్న నాన్ స్పౌజ్‌ల్లో 13 ఏళ్ళకుపైగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 8 మండలాల్లోనే పనిచేస్తున్నారు. వీరికి 24 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. ఇందులో చాలా మంది రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి ప్రయోజనం కోసం 80 వేల మంది టీచర్ల బదిలీల ప్రక్రియకు అడ్డం పడుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఇప్పటికైనా వివాదం వెనుక వాస్తవాలు గుర్తించి, బదిలీల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గతేడాది బదిలీల షెడ్యూల్ ఇచ్చినా.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గత ఏడాది షెడ్యూల్ ఇచ్చింది. అయితే టీచర్లు ఆప్షన్లు ఇచ్చే దశలోనే నాన్ స్పౌజ్‌లు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయుల బదిలీలు, సర్వీసుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించి గవర్నర్ ఆమోదంతో జారీ చేయాలని నాన్ స్పౌజ్‌లు వాదిస్తున్నారు. కానీ జీవో 5, శాసనసభ, గవర్నర్ ఆమోదం లేకుండా అధికారులే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 162, 163 (3) ప్రకారం గవర్నర్ ఇచ్చిన బిజినెస్ రూల్స్ ప్రకారం జారీ చేశారని, ఇది చట్టబద్ధం కాదని కోర్టుకు తెలిపారు. దీంతో బదిలీలు, పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. ఈ దశలో విద్యాశాఖ వాస్తవాలు చెప్పడంలో విఫలమైందనేది టీచర్ల ఆరోపణ. -
దశాబ్ది వేడుకల వేళనైనా.. కనికరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళనైనా తమపై కనికరించి బదిలీలకు మోక్షం కలిగించాలని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్ బదిలీలు జరిగినా, మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టారు. 18 నెలలు కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు బదిలీల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంత్రులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు గోడు వివరిస్తున్నప్పటికీ 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మాత్రం మార్గం సుగమం కావడం లేదు. జిల్లాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ... దాదాపు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో సుమారు 300 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కేవలం 5గురు మాత్రమ స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ అక్కడ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. స్పౌజ్ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. మిగిలిపోయిన 13 జిల్లాల్లోని స్పౌజ్ ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు. భర్త ఓ చోట... పిల్లలు మరోచోట స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణణాతీతం. భర్త ఒకచోట, భార్య మరో చోట.. చదువుల కోసం పిల్లలు హైదరాబాద్‌లోనో.. ఉండాల్సి రావడంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 18 నెలలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నారు. -
విద్యార్థులకు నష్టం లేకుండా ఉపాధ్యాయ బదిలీలు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా, విద్యా సంవత్సరానికి అంతరాయం రానీయకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారని, బదిలీలను పారదర్శకంగా టైం టు టైం చేపట్టేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో చర్చి0చి విధివిధానాలు ప్రకటిస్తామని, సాధ్యమైనంత వరకు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అలాగే విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15 వేలకు పైనే పోస్టులున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా త్వరలో చర్యలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా చట్ట ప్రకారం త్వరలో చర్యలు తీసుకుంటామని, దీనిపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని బొత్స వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని, కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాలల్లో రాగి జావ పంపిణీని ఎత్తివేసినట్టు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, ఇది అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఒంటిపూట తరగతులు, పరీక్షలు ఉన్నాయని, పైగా ఉదయం విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అల్పాహారం తీసుకుని వచ్చేవారికి వెంటనే రాగిజావ ఇస్తే మధ్యాహ్నం భోజనం చేయలేరన్నారు. అందువల్లే రాగిజావకు బదులు చక్కీ ఇస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నుంచి తిరిగి రాగిజావ అందిస్తామన్నారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ రాజధాని విషయంలో తమ విధానంలో మార్పు లేదని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ మారుతుందన్నారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. చంద్రబాబు రాజధానుల విషయమై పస లేని కామెంట్లు చేస్తున్నారని, మూడు రాజధానులైతే మూడు చోట్లా కాపురం చేయాలనడంపై ఆయన స్పందించారు. ‘గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్‌లో కాపురం చేశారు. ఆయనలా ఎవరూ చేయరు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ పాలసీ అని, అందుకే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. న్యాయపరమైన అంశాలు తేలగానే చట్టపరంగా మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గడచిన రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ముగ్గురు టీచర్లు ఆకస్మికంగా మరణించడం పట్ల బొత్స విచారం వ్యక్తం చేశారు. ఎండలను తట్టుకునేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్
-
తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. -
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు మంగళవారం మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. -
జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరు ద్ధంగా కోరుకున్న ప్రాంతానికి కాకుండా పిటిషనర్లను కేటాయించారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాలకు కేటాయించిన వారంతా విధుల్లో చేరారని ప్ర భుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. -
రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 18 తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. (చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశముందని, తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును రేపు ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) -
రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ గడువు ఈ నెల 15తో ముగియగా, ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల వినతి మేరకు మరో మూడ్రోజులు అంటే రేపటి వరకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అక్యూరల్ ఫర్మ్ పేరుతో ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్సూ్యరెన్స్ ప్రీమియం, రిస్క్‌లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం వరకు 71,947 మంది (సుమారు 95 శాతం) టీచర్లు వెబ్ ఆప్షన్‌ను వినియోగించుకున్నారన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తరవాతే బదిలీలకు సంబంధించి సవరించిన జీవో నెంబర్లు 53, 54, 59లను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టామని చెప్పారు. కేటగిరీ 4లోని పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులే విద్యనభ్యసిస్తుంటారని, అవి నిర్వీర్యమైపోకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనుమానాలను పెనుభూతాలుగా మార్చి, రాజకీయాలకు వాడుకోవద్దని విపక్ష నాయకులకు మంత్రి హితవు పలికారు. సీపీఎస్‌పై చిత్తశుద్ధితో ఉన్నాం.. సీపీఎస్ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై 2019 ఆగస్టులో మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. అందులో తాను కూడా ఉన్నానని, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు భేటీ కూడా అయ్యామని తెలిపారు. సీఎస్ అడ్వైజరీగా ఉండే ‘వర్కింగ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్’ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20 తేదీన జగనన్న అమ్మ ఒడి తుది జాబితా ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఉద్యోగులపై లాఠీచార్జి చేయించిన ఘనత చంద్రబాబుదే.. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరిన ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి వెళ్లి అరెస్టు చేశారని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు వీడియోలను మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అడిగిన ఉద్యోగులపై లాఠీచార్జీ చేయించడం, గుర్రాలతో తొక్కించడం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆయన హయాంలో అన్నీ అక్రమ బదిలీలేనని, అలాంటి వ్యక్తి ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు. -
టీచర్ల బదిలీలకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి. మార్గదర్శకాలు ఇలా.. – 2019–20 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్–2 హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. ఏడాదిలో సగం రోజులు పూర్తి చేసినా పూర్తి ఏడాదిగానే పరిగణిస్తారు. – అక్టోబర్ ఒకటి నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ఉండదు. – బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లకు బదిలీ తప్పనిసరి. – అంధులైన టీచర్లను బదిలీల నుంచి మినహాయించారు. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు. – టీచర్ల బదిలీలకు 85 ఎన్టైటిల్మెంట్ పాయింట్లను ఖరారు చేశారు. కామన్ పాయింట్ల కింద 55, స్పెషల్ పాయింట్ల కింద 25, రీ అపోర్షన్ పాయింట్ల కింద 5గా నిర్ణయించారు. – ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద దివ్యాంగులు, భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన వారికి ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియార్టీలో ప్రాధాన్యతనిస్తారు. – తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై.. వాటిని పరిశీలించకుండా కౌంటర్ సంతకం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. – ఉత్తర్వులు అందుకున్నాక ఎవరైనా అనధికారికంగా గైర్హాజరైతే వారికి నో వర్క్ నో పే అమలుచేస్తారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఇలా.. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కేటగిరీల వారీగా పిల్లల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. – ప్రాథమిక పాఠశాలల్లో 151–200 విద్యార్థులుంటే ఒక హెచ్ఎం, 5గురు ఎస్జీటీలు.. – 121–150 వరకు ఐదుగురు ఎస్జీటీలు.. – 91–120 వరకు నలుగురు ఎస్జీటీలు.. – 61–90 వరకు ముగ్గురు ఎస్జీటీలు.. – 60 వరకు అయితే ఇద్దరు ఎస్జీటీలు.. – 200పైన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని నియమిస్తారు. -
టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలపడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యలో విప్లవం
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్ (సంసిద్ధతా తరగతులు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే సరికే 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్న దృష్ట్యా మొదటి తరగతికి ముందే సంసిద్ధతా తరగతులను అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందన్నారు. దీనిని అనుసరిస్తూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021–22 నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగా 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జాతీయ నూతన విద్యా విధానంపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విద్యా విధానంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ బలమైన పునాదితో మంచి ఫలితాలు – విద్యార్థి రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. అది జరగాలంటే ఒకటవ తరగతికి రాకముందే చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండేలా చూడాలి. ఆట పాటలతో చిన్నారులు బడిబాట పట్టేలా చూడాలి. అందుకోసమే విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతూ అంగన్వాడీలలో పీపీ1, పీపీ2 ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత ప్రీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. విద్యార్థి ఒకటవ తరగతిలో చేరేసరికి చదువు పట్ల అవగాహన ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు సిలబస్ రూపొందించాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని 2021–22 నుంచే అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి. – విద్యా రంగంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలి. అందుకు తగిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) ఉండాలి. ప్రత్యేక యాప్ కూడా రూపొందించాలి. ప్రమాణాలు బావుండాలి – అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో? లేదో? ధ్రువపరుచుకోవాలి. తగిన ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసి వేయాలి. అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే తిరిగి ప్రారంభానికి అనుమతివ్వాలి. – ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పని తీరు, ఉపాధ్యాయ శిక్షణ కరిక్యులమ్‌పై కూడా తగిన శ్రద్ధ కనపర్చాలి. సక్రమంగా పని చేయని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిని తక్షణమే మూసి వేయాలి – వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్థలు, కాలేజీలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులుకు వివరించాలి. విద్యా సంస్థల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది విద్యార్థులేనని వారికి అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయుల బదిలీలు – విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు (రీ అపోర్షన్మెంట్) చేయాలి. – ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు అంశాలు అమలు – జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్నామని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు. – పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రాథమిక స్ధాయిలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించడం, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం 1,261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం 352 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ), దివ్యాంగుల కోసం 672 భవిత కేంద్రాలను ఏర్పాటయ్యాయి. – పాఠశాలల ప్రమాణాల పరిరక్షణ కోసం ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి రెండు వేర్వేరు కమిషన్లు పని చేస్తున్నాయి. – అంగన్వాడీ సిబ్బందిలో మరింత నైపుణ్యం పెంచడంలో భాగంగా ఇంటర్ అర్హత ఉన్న వారికి ఆరు నెలల డిప్లొమా కోర్సు, పదవ తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉంది. -
జూన్ నెలాఖరుకి కొత్త టీచర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టగా, పలు న్యాయ వివాదాల అనంతరం 7,414 పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మరో 1,378 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ముందుగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సి ఉండటంతో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. సీనియర్ టీచర్లకు కేటగిరీ–1 ప్రాంతాలైన పట్టణాలు, పరిసరాల్లోకి బదిలీలు చేసి, కొత్త టీచర్లకు కేటగిరీ–4 ప్రాంతాల్లో (గ్రామీణ ప్రాంతాల్లో) పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటం, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు తర్వాత పోస్టింగ్‌లకు సంబంధించిన వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనల్లో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి జూన్ మొదటి వారంలో రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియను చేపట్టి జూన్ నెలాఖరుకు కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉంది. అయితే హేతుబద్ధీకరణ చేయాలా? వద్దా? కేవలం బదిలీలు చేసి పోస్టింగ్‌లు త్వరగా ఇచ్చే డిమాండ్లు వచ్చినప్పటికీ రేషనలైజేషన్ చేయకుండా బదిలీలు, పోస్టింగ్ చేపడితే అవసరం లేని చోట టీచర్లు ఉండి.. అవసరం ఉన్న చోట టీచర్లు లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణతోపాటు బదిలీలు చేశాకే కొత్త నియామకాలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈలోగా కొత్త టీచర్ల నియామక మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
అక్రమార్కులకు అండదండలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పాఠశాల విద్యాశాఖ వెనక్కి తగ్గింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులతో సహా ప్రాంతీయ సంయుక్త సంచాలకులను తప్పు దోవ పట్టిస్తూ హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ఉత్తర్వులు విడుదల చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు ఇందులో ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఆ ముగ్గురు ఉద్యోగులైన సహాయ సంచాలకులు, సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగులు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతరం వారి నుంచి వివరణ తీసుకున్న ఆర్జేడీ ఆమేరకు ఫైలును పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయానికి పంపించారు. ఇక్కడి వరకు చర్యలు వేగవంతంగా జరిగినప్పటికీ...ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటువేసే క్రమంలో మాత్రం ఆ శాఖ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవకతవకలు జరిగిన తీరు, చర్యలు తీసుకోవాల్సిన విషయానికి సంబంధించిన ఫైలు విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయానికి చేరి 15 రోజులు కావస్తున్నా...ఆ ఫైలుకు మోక్షం కలగకపోవడం గమనార్హం. ఉన్నతాధికారిపై ఒత్తిడి... టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలు రుజువైనప్పటికీ...వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కలపై చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు ఆ శాఖలోని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి వస్తుండటంతోనే చర్యలకు సంబంధించిన ఫైలు పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలిన ముగ్గుర్లో ఒకరు ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో రిటైర్మెంట్కు ముందుగా శాఖపరమైన చర్యలు తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు ఇబ్బంది వస్తుందని, ఈ కారణంగానే వేటువేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీ ఉత్తర్వుల్లో అక్రమంగా పేర్లు చొప్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ రద్దు చేసింది. మొత్తం 37 మంది టీచర్ల పేర్లతో వచ్చిన ఉత్తర్వుల్లో దాదాపు ఇరవై వరకు సరైనవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా టీచర్లకు తిరిగి బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
‘అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం టీపీటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, వారంలోగా పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. బదిలీల వ్యవహారంలో చిన్న ఉద్యోగులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఝలక్’ ఇచ్చిన ఉద్యోగులకు షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేప ట్టింది. టీచర్ల వెబ్ కౌన్సెలింగ్‌లో జరిగిన పొరపాట్ల సర్దుబాటులో పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖ అప్పీళ్లు స్వీకరించింది. ఈ అప్పీళ్లను పరిశీలించి కొన్నింటికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచా ర్య ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో కొందరు ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఆమోదించిన అప్పీళ్లతోపాటు తిరస్కరించిన అప్పీళ్లనూ చొప్పి ంచారు. ఇలా దాదాపు 17 మంది టీచర్లకు అక్రమంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్నతాధికారులకు ఝలక్’అనే శీర్షికతో ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. ముగ్గురికి నోటీసులు..: బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌తోపాటు సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఈ క్రమ ంలో వారి నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ ఫైలును పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు డైరెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరస్కరించిన అప్పీళ్లకు ప్రాంతీయ కార్యాలయంలో ఎలా ఆమోదించారనే అంశాన్నీ విద్యా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తంగా దసరా తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్, లెక్చరర్స్ బదిలీల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖరాశారు. విద్యాబుద్దులు నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన విద్యాశాఖలో కూడా అవినీతి జరగడం దారుణమన్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్‌తో విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదన్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదు’ అన్నట్లుగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో సమాధానం చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా గెస్ట్ లెక్చరర్ల పేరిట కళాశాలలను నడుపుతున్నారని, ఇలా పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్ లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో చెప్పాలని నిలదీశారు. -
టీచర్ల బదిలీల పరిష్కరణలో జాప్యం’
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలపై వచ్చిన అప్పీళ్ల పరిష్కరణలో విద్యాశాఖ జాప్యం చేయడంపై పీఆర్టీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ టీచర్లు వినతులిచ్చి 15 రోజులు గడిచినా పరిష్కరించకపోవడాన్ని తప్పుబట్టింది. అప్పీళ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్యకు వినతిపత్రం అందజేశారు. ఉన్నత పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్లు ఉన్నచోట ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వడంతో అయోమయం నెలకొందని, ఎన్సీసీ యూనిట్లకు అధికారులను నియమించాలని కోరారు. టీచర్లు సమర్పించిన వినతులు పరిష్కరించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. -
టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. టీచర్ల బదిలీ ప్రక్రియ నిలిపి వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. బదిలీలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన 125 పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు.. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదించిన విషయం తెలిసిందే. ‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్జేడీలకు అప్పగించాం. పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యాజ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. గతంలో పలు దఫాలు వాయిదా పడగా.. బదిలీలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను నేడు కొట్టివేసిన ధర్మాసనం ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.