టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ | CM YS Jagan Green signal for transfers of teachers | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

Published Sun, Oct 11 2020 4:41 AM | Last Updated on Sun, Oct 11 2020 4:41 AM

CM YS Jagan Green signal for transfers of teachers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన  ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలపడంపై ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement