సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలపై వచ్చిన అప్పీళ్ల పరిష్కరణలో విద్యాశాఖ జాప్యం చేయడంపై పీఆర్టీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ టీచర్లు వినతులిచ్చి 15 రోజులు గడిచినా పరిష్కరించకపోవడాన్ని తప్పుబట్టింది. అప్పీళ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్యకు వినతిపత్రం అందజేశారు.
ఉన్నత పాఠశాలల్లో ఎన్‌సీసీ యూనిట్లు ఉన్నచోట ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వడంతో అయోమయం నెలకొందని, ఎన్‌సీసీ యూనిట్లకు అధికారులను నియమించాలని కోరారు. టీచర్లు సమర్పించిన వినతులు పరిష్కరించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment