టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ ఏ మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గౌరవం దక్కడం లేదన్నారు.
పక్క రాష్ట్రంలో 10వేల ఉద్యోగాలు నియామకాలు చేపడితే.. తెలంగాణలో 10 కూడా జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో డీఎస్సీ, టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు కష్టాలు తప్పడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment