
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా పేదలు పూర్తిగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో పేద కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. టెలీ స్కోపిక్ విధానం ద్వారా బిల్లులు ఇవ్వాలని, ఈ విధానంతో భారం తగ్గుతుందన్నారు. లాక్‌డౌన్‌లో బిల్లులు మూడింతలు వచ్చాయని,ఆ సమయంలో ఎలాంటి సహాయం చేయని ప్రభుత్వం.. బిల్లులైనా మాఫీ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబాల విద్యుత్ భారం ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సౌధకు నేరుగా వెళ్లి సీఎండీ ప్రభాకర్ రావు కి వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment