బీజేపీ నేతల హౌస్‌ అరెస్టులు | Telangana BJP Leaders House Arrest | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతల హౌస్‌ అరెస్టులు

Published Mon, Jun 15 2020 12:19 PM | Last Updated on Mon, Jun 15 2020 12:31 PM

Telangana BJP Leaders House Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నేతలు అరవింద్‌, రాజాసింగ్‌లను​ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముందస్తుగా ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ బిల్లులు రద్దు చేసేవరకు నిరసన సాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

బీజేపీ నేతలు అరెస్ట్‌..
వరంగల్‌: హన్మకొండ ఎంపీడీసీఎల్‌ భవనం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. పేదలపై 10 శాతం అధికంగా విద్యుత్‌ భారం మోపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్‌, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా, అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement